Tuesday, 29 September 2026

Tag: మాచర్ల

పల్నాడు

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీలో పాల్గొన్న మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. మానవహారంగా విద్యార్థులు, యువత

పున్నమి ప్రతినిధి మాచర్ల ఆగస్టు 14: పట్టణంలో శుక్రవారం నిర్వహించిన హర్‌ ఘర్‌ తిరంగా భారీ ర్యాలీలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు, విద్యాసంస్థల ప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సేవా సంస్థలు, అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక రింగ్‌ రోడ్డు సెంటర్‌ నుంచి మాచర్ల బస్టాండ్‌ వరకు భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. జై భారత్‌, భారత్‌ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి. అనంతరం పార్క్‌ సెంటర్‌లోని జాతీయ పిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. బస్టాండ్‌ సెంటర్‌లో భారీ మానవహారంగా ఏర్పడి జాతీయ సమైక్యత, దేశభక్తి, దేశాభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనతో ముందుకు సాగాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ వేణుబాబు, ఎమ్మెల్యే జూలకంటి తనయుడు గౌతమ్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్‌ డైరెక్టర్‌, పట్టణ అధ్యక్షులు కొమెరా దుర్గారావు, పల్నాడు జిల్లా పార్లమెంటు సెక్రటరీ షేక్‌ జానీ భాష, టీడీపీ సీనియర్‌ నాయకులు ఎనుముల కేశవరెడ్డి, వజ్రం నాయక్‌, పోలూరి నరసింహారావు, కంభంపాటి అనిల్‌కుమార్‌, సూరె యలమందతో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

పల్నాడు

మాచర్లలో రైతు బజార్ ఏర్పాటుకు ప్రతిపాదిత స్థల పరిశీలన

మాచర్ల పట్టణంలో రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించిన స్థలాన్ని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా, గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ బుధవారం పరిశీలించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు వీలుగా రైతు బజార్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదిత స్థలాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మాచర్ల పట్టణంలో రైతు బజార్ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలానికి జాయింట్ కలెక్టర్ సంజనా సిన్హా చేరుకుని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. స్థల విస్తీర్ణం, రైతు బజార్ ఏర్పాటుకు అనుకూలత, ప్రజలకు అందుబాటులో ఉండే విధానం, రహదారి సౌకర్యం, వాహనాల రాకపోకలు, అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, తహసీల్దార్ కిరణ్ కుమార్ తదితర అధికారులు ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను జాయింట్ కలెక్టర్‌కు వివరించారు. రైతు బజార్ ఏర్పాటుతో మాచర్ల పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు తమ పంటలను నేరుగా విక్రయించుకునే అవకాశం లభిస్తుందని అధికారులు తెలిపారు. రైతు బజార్ అందుబాటులోకి వస్తే రైతులకు మధ్యవర్తులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు, వినియోగదారులకు కూడా తాజా కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తులు సరసమైన ధరలకు లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతు బజార్ ఏర్పాటుకు అవసరమైన స్థల ఎంపిక, మౌలిక సదుపాయాలు, మార్కెట్ నిర్వహణకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించారు. ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన అనంతరం రైతు బజార్ ఏర్పాటుకు సంబంధించిన తదుపరి చర్యలపై అధికారులతో జాయింట్ కలెక్టర్ చర్చించారు. రైతులు, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా రైతు బజార్ ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.