Thursday, 1 October 2026

Tag: నిజామాబాద్

నిజామాబాద్

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నందిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ*

*ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూడ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో నందిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.* *ఈ సందర్భంగా దూడ వెంకటేష్ గారు మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. యువత, సాంకేతిక రంగం మరియు దేశ ప్రగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.* *ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళారపు తుక్కన్న, ద్యావతి లింగం, తమ్మల దేవేందర్, నర్సయ్య, అక్బర్, అజర్, విజయ్ రాజు, నసీర్, పవన్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నార… Uploaded Video: Uploaded Video:

నిజామాబాద్

*రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నందిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ*

*ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని నందిపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దూడ వెంకటేష్ ఆధ్వర్యంలో నందిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేయడం జరిగింది.* *ఈ సందర్భంగా దూడ వెంకటేష్ మాట్లాడుతూ, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దేశ అభివృద్ధికి, ఆధునిక భారత నిర్మాణానికి చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. యువత, సాంకేతిక రంగం మరియు దేశ ప్రగతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.* *ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంగళారపు తుక్కన్న, ద్యావతి లింగం, తమ్మల దేవేందర్, నర్సయ్య, అక్బర్, అజర్, విజయ్ రాజు, నసీర్, పవన్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

నిజామాబాద్

ఆర్మూర్ పట్టణంలోని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ స్కూల్ & జూనియర్ కళాశాల ని పరిశీలించిన వినయ్ కుమార్ రెడ్డి,

ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీ ముస్లిం వెల్ఫేర్ మైనారిటీ స్కూల్ & జూనియర్ కళాశాలని సందర్శించి వసతులని పరిశీలించిన ఆర్మూర్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి … ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ స్కూల్ కి ల్యాండ్ ప్రపోజల్స్ మరియు న్యూ బిల్డింగ్ ప్రపోజల్స్ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపి మంజూరు చేయిస్తానని అంతేకాకుండా స్కూలుకి వసతులు ప్రభుత్వం తరపున కల్పిస్తామని ప్రకటించారు….. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మూర్ పట్టణ మున్సిపల్ చైర్మన్ లహరి రఘు ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్,కౌన్సిలర్లు ప్రసాద్,నర్మే నవీన్,భూపేందర్ ఖాంధేశ్ శ్రీనివాస్ పీసీసీ మాజీ కార్యదర్శి కాంగ్రెస్ నాయకులు డిష్ రాము చిట్టి రెడ్డి , రాకేష్ రెడ్డి గసాయినాథ్, తదితరులు…

నిజామాబాద్

అయిలాపూర్ పద్మశాలి ముద్దు బిడ్డ,,

ఐలాపూర్ పద్మశాలి ముద్దు బిడ్డ ఐన టేలర్ భూమయ్య కుమారుడు జక్కుల విజయ్ కుమార్ కు 15 ఆగస్ట్ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ తరుపున ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ గారి చేతుల మీదుగా ప్రశంస పత్రము అందుకోవడం జరిగిన సందర్భంగా ఐలాపూర్ అవార్డు గ్రహీత ఐన విజయ్ తండ్రి టేలర్ భూమయ్య వారి మిత్ర బృందం తరపున జక్కుల విజయ్ కుమార్ కు శాలువ కప్పి సన్మానం చేశారు.ఐతే రాజీవ్ ఆర్యోగ శ్రీ విభాగం తరపున ఇది మూడో సారి రావటం జరిగింది ఈ కార్యక్రమంలో లోకం బ్యాంక్ నర్సయ్య, బిల్ల వెంకటేష్, అవధూత నర్సయ్య, పిస్క నారాయణ, పి.అశోక్, బండ మురళి, చిక్కెల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు…

నిజామాబాద్

నిజామాబాద్ పట్టణంలో జరిగిన ఎస్ ఐ ర్ 2శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వినయ్ కుమార్ రెడ్డి ……*

నిజమాబాద్ పట్టణంలోని ఎం కే గార్డెన్స్ లో జరిగిన నిజామాబాద్ జిల్లా ఎస్ ఐ ర్ 2 శిక్షణ కార్యక్రమంలో *నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ధన సరి అనసూయ సీతక్క , ఎస్సీ , ఎస్టీ , ఓ బి సి మరియు మైనారిటీ సంక్షేమ శాఖల ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ పిసిసి అధ్యక్షులుమహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ ) ఛైర్‌పర్సన్‌ ఈరవత్రి అనిల్ తో కలిసి పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి* ….. ఇంకా ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా నియోజకవర్గాల ఇన్చార్జిలు, నిజామాబాద్ జిల్లా మండలాల అధ్యక్షులు, కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు వివిధ బూత్ స్థాయి బిఎల్ఎ ఏజెంట్లు సూపర్వైజర్లు ఇన్చార్జిలు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు….

నిజామాబాద్

హెడ్ కానిస్టేబుల్ అంతాక్రియలకి హాజరైన ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్

ఆర్మూర్ పట్టణం జెమ్మన్ జెట్టి గల్లీలో తిరుపతి (పోలీస్ డిపార్ట్మెంట్) అంత్యక్రియలలో ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. తిరుపతి అన్న మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. తిరుపతితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మృతదేహనికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట ER ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ నర్సయ్య, అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కరాటే భోజన్న, విట్టోబ శేఖర్, దినేష్, ఇమ్రాన్, తదితరులు పాల్గొన్నారు.

నిజామాబాద్

జీవో 19 వెంటనే రద్దు చేయాలి,

నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి బస్టాండ్ ఆవరణ వరకు రాస్తారోకో చేసారు, రాష్ట్ర ప్రభుత్వం జీవో 19 ని వెంటనే రద్దు చేయాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ తెలిపారు, లేనిపక్షంలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని తెలిపారు, విద్యార్థుల భవిష్యత్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుకుంటుందని తెలిపారు….

నిజామాబాద్

పలు శుభ కార్యక్రమాలకు హాజరైన ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్,

*తేదీ: 16-08-2026* *తేదీ: 16-08-2026 ఆదివారం నాడు ER ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ ఆర్మూర్ పట్టణంలో పలు వివాహాది వేడుకలకు, శుభ కార్యక్రమాలకు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను కలిశారు. అనంతరం విజయ్ అగర్వాల్ గృహప్రవేశం మహోత్సవంలో పాల్గొన్నారు. ఆయన వెంట ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కేవీ రమణ, వినోద్, హైమద్, గంగా మోహన్, బ్యాంకు నవీన్, తదితరులు పాల్గొన్నారు.*

నిజామాబాద్

ఆలూరు మండలంలో టీ కొట్టు ముచ్చట్లు ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్,

*తేదీ: 16-08-2026 ఆదివారం నాడు ఆలూరు మండల కేంద్రంలో “టీ కొట్టు ముచ్చట్లు” కార్యక్రమంలో భాగంగా ఈ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ గారు ఆలూరు గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో మిత్రులు, శ్రేయోభిలాషులు, స్థానికులను పలకరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. ఆలూరు గ్రామం అంటే తనకు ఎంతో అభిమానమని చెప్పుకొచ్చారు. అలాగే స్థానిక చెరువును సందర్శించారు. చెరువును పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులను కోరారు. అనంతరం గ్రామంలో పలువురిని పలకరించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. యోగక్షేమాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట ఈ ఆర్ ఫౌండేషన్ సభ్యులు అర్గుల్ సురేష్, రామ్ చందర్, నూకల శేఖర్, కెవి రమణ, రజనీష్ కిరాడ్, హైమద్, తదితరులు పాల్గొన్నారు.*

నిజామాబాద్

డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణి,

నిజామాబాద్ జిల్లా లో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నూతన లబ్ధిదారులకు స్మార్ట్ కార్డ్ అందించారు, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ, రూలర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు, రేషన్ డీలర్లు గ్రామ సర్పంచులు ఉప సర్పంచ్లు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ప్రజలకు భారీ ఎత్తున ప్రజలు రావడంతో ఆనందం వ్యక్తం చేశారు…. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ ప్రాంతంలో లబ్ధిదారులకు అందాల్సిన బియ్యం అందించి లేనివారికి ఒక రెండు కిలోల బియ్యం ఎక్కువచ్చిన పర్వాలేదని సభ ముఖం మీద తెలిపారు, రైస్ మిల్లలో అవకతవకలు జరుగుతున్నాయని సుదర్శన్ రెడ్డికి పేర్కొన్నారు, ఎస్ ఐ ఆర్ సర్వేలో భాగంగా కొన్ని ఓట్లను తొలగించారు, మళ్లీ కొన్నిచోట్ల యాడ్ అయినట్లు తెలిసిందన్నారు ప్రభుత్వం వెంటనే తొలగించాలని సుదర్శన్ రెడ్డికి తెలిపారు….

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.