Friday, 4 September 2026

Tag: తెలంగాణ జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం వరంగల్ పోలీస్

జనగాం

సముద్రాల గ్రామంలో మౌలిక వసతులు కల్పించాలి: సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్

​స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాల గ్రామంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో గ్రామ సమస్యలపై ప్రత్యేకంగా సర్వే నిర్వహించారు. ​ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన సమస్యలను పరిశీలించి మాట్లాడారు. గ్రామం నుండి వైకుంఠ ధామం (స్మశాన వాటిక) వెళ్లే రహదారిపై వర్షాలు పడితే పూర్తిగా బురదమయంగా మారుతుందని, అత్యవసర సమయాల్లోనూ వెళ్లలేని దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ఆ మార్గంలో సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు. అలాగే, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి మురుగునీరు నిలిచిపోతుండటంతో పిచ్చిమొక్కలు పెరిగి, దోమలు వ్యాపించి విషజ్వరాలు ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వెంటనే కాలువలను శుభ్రం చేసి సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని తెలిపారు. ​ఇంకా, గ్రామంలోని రెండో వార్డులో విద్యుత్ స్తంభాలు ఉన్నప్పటికీ వైరింగ్ లేకపోవడంతో వీధి దీపాలు వెలగక రాత్రివేళల్లో ప్రజలు, వృద్ధులు అంధకారంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ​ఈ కార్యక్రమంలో కత్తుల రాజు, మంద మహేందర్, ఓరిగంటి మల్లయ్య, తాటికొండ నాగరాజు, మేకల కొమురయ్య, బండి ఐలయ్య, తాడం రమేష్, తాటికొండ అశోక్, ఉప్పలయ్య, ఎండీ ఫక్రుద్దీన్, ఎండీ యాకూబ్, కోల అనిల్, చందు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

జనగాం

స్టేషన్ ఘన్‌పూర్ నూతన సీఐగా ఎస్.శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ.. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయమన్న సీఐ

​స్టేషన్ ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా సీఐ ఎస్.శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. అంతేకాకుండా, మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా ఉపేక్షించేది లేదని, వాటిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాస్ గట్టిగా హెచ్చరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.