ఏఎఫ్ఎస్పీఏ మరో ఆరు నెలలు
కేంద్ర ప్రభుత్వం మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో Armed Forces Special Powers Act–AFSPA అమలును మరో ఆరు నెలలు పొడిగించింది. అక్టోబర్ 1 నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది. ముందుగా ఉపసంహరించకపోతే నిర్ణయం ఆరు నెలలపాటు కొనసాగుతుందని కేంద్ర నోటిఫికేషన్ పేర్కొంది. భద్రతా పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. సంబంధిత ప్రాంతాల్లో భద్రతా దళాలకు ప్రత్యేక అధికారాలు కొనసాగుతాయి.


