Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక చొరవ చూపాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక చొరవ చూపాలి

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక చొరవ చూపాలి

**మార్కాపురం, సెప్టెంబర్ 28:**

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆదేశించారు.

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యలను కేవలం నమోదు చేయకుండా, మూల కారణాలను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు.

రెవెన్యూ శాఖకు సంబంధించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఆదేశించారు.

కాగా, సోమవారం పీజీఆర్ఎస్‌లో మొత్తం 216 అర్జీలు అందగా, వాటిలో 134 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల సమస్యలపై 96 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ముంపు గ్రామాల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *