Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
మేడ్చల్ – మల్కాజిగిరి

SIR-2026 ప్రక్రియలో ముందంజలో మూడు చింతలపల్లి మండలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
SIR-2026 ప్రక్రియలో ముందంజలో మూడు చింతలపల్లి మండలం

వార్త ముఖ్యాంశాలు

  • రికార్డు స్థాయిలో 88.10% నమోదు – తహసీల్దార్ ఇడ్రీస్‌కు భాజపా నాయకుల ఘన సత్కారం ​మేడ్చల్ (పున్నమి విలేకరి, సందీప్): మేడ్చల్ రూరల్ జిల్లాలో చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR)-2026 ప్రక్రియలో మూడు చింతలపల్లి మండలం విశేష ప్రతిభ కనబరిచింది.
  • రికార్డు స్థాయిలో 88.10% నమోదు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి గర్వకారణంగా మారింది.
  • ​ఈ సందర్భంగా, ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన మూడు చింతలపల్లి తహసీల్దార్ శ్రీ ఇడ్రీస్ గారిని మేడ్చల్ నియోజకవర్గ బిజెపి (MCP@BJP) అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్ తమ బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు.

రికార్డు స్థాయిలో 88.10% నమోదు – తహసీల్దార్ ఇడ్రీస్‌కు భాజపా నాయకుల ఘన సత్కారం

​మేడ్చల్ (పున్నమి విలేకరి, సందీప్):
మేడ్చల్ రూరల్ జిల్లాలో చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR)-2026 ప్రక్రియలో మూడు చింతలపల్లి మండలం విశేష ప్రతిభ కనబరిచింది. రికార్డు స్థాయిలో 88.10% నమోదు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచి గర్వకారణంగా మారింది.
​ఈ సందర్భంగా, ప్రక్రియను విజయవంతంగా నిర్వహించిన మూడు చింతలపల్లి తహసీల్దార్ శ్రీ ఇడ్రీస్ గారిని మేడ్చల్ నియోజకవర్గ బిజెపి (MCP@BJP) అధ్యక్షులు తప్పెట్ల నరేందర్ గౌడ్ తమ బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటరు జాబితా పారదర్శకతకు కృషి చేసిన తహసీల్దార్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
​”ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైన ఓటరు జాబితా రూపకల్పన అత్యంత కీలకమైనది. రికార్డు స్థాయిలో ఎస్‌ఐఆర్ నమోదు పూర్తి చేసిన అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక అభినందనలు.”
– తప్పెట్ల నరేందర్ గౌడ్ (మండల భాజపా అధ్యక్షులు)
​ఈ కార్యక్రమంలో భాజపా మండల ఇంచార్జ్ గాలి సంపత్ యాదవ్ మరియు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *