Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

P4 టీమ్ ఆధ్వర్యంలో జూన్–జులై నెలల న్యూస్‌లెటర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
P4 టీమ్ ఆధ్వర్యంలో జూన్–జులై నెలల న్యూస్‌లెటర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

రెడ్డి సత్య సుబ్రహ్మణ్య శర్మ.
సీనియర్ రిపోర్టర్ పున్నమి
9989086083

పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో P4 టీమ్ ఆధ్వర్యంలో రూపొందించిన జూన్–జులై నెలల న్యూస్‌లెటర్‌ను గౌరవ పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిర్రి బాలరాజు గారు మంగళవారం బర్రింకలపాడు గ్రామంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.

పోలవరం నియోజకవర్గంలో జూన్ – జులై లో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ముఖ్యాంశాలను ఈ న్యూస్‌లెటర్‌లో పొందుపరిచారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ, పోలవరం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో న్యూస్‌లెటర్‌ను రూపొందించడం జరిగిందని తెలిపారు.

నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో P4 యంగ్ ప్రొఫెషనల్ జగదీశ్వరరావు, టీమ్ సభ్యుడు సాయి తదితరులు పాల్గొన్నారు.

END.

P4 టీమ్ ఆధ్వర్యంలో జూన్–జులై నెలల న్యూస్‌లెటర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *