Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

తల్లీబిడ్డల ఆరోగ్యానికి పోషకాహారం కీలకం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తల్లీబిడ్డల ఆరోగ్యానికి పోషకాహారం కీలకం

(పున్నమి ప్రతినిధి)
వేముల మండలం, సెప్టెంబర్ 29: మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు సేవా సంకల్పం అభియాన్‌లో భాగంగా అంగన్వాడి ఉత్సవం, పోషణ మాసం సందర్భంగా చింతల జూటూరు 1, 2వ అంగన్వాడి కేంద్రాల్లో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ కే. హసీనా మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. ప్రోటీన్లు, పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు ఆహారంలో భాగం చేసుకోవాలన్నారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను అంగన్వాడి కేంద్రాల్లో నమోదు చేసి, పూర్వ ప్రాథమిక విద్య ప్రాముఖ్యతను తల్లిదండ్రులకు వివరించారు. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు భవాని, విజయమ్మ, సహాయకురాలు నాగమల్లేశ్వరి, సుభా, ఏఎన్‌ఎం జ్యోతి, గ్రామ సందర్శన కార్యకర్త రాధా, ఆశా కార్యకర్త పాల్గొన్నారు.

తల్లీబిడ్డల ఆరోగ్యానికి పోషకాహారం కీలకం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *