Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

MPTC ఖర్చు పరిమితి రూ.4 లక్షలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
MPTC ఖర్చు పరిమితి రూ.4 లక్షలు

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం(పున్నమి పీతినిధి) రాబోయే MPTC మరియు ZPTC ఎన్నికలకు సంబంధించిన డిపాజిట్ మొత్తాలు, అలాగే అభ్యర్థుల గరిష్ట వ్యయ (ఖర్చు) పరిమితి వివరాలను తూర్పు గోదావరి జిల్లా అధికారులు అధికారికంగా ఖరారు చేశారు.
  • MPTC అభ్యర్డులు: SC , ST, మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులకు డిపాజిట్ సొమ్ము రూ.1,500 గాను, ఇతర ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.3,000 గాను నిర్ణయించారు.
  • • ZPTC అభ్యర్థులు: SC, ST, మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులకు డిపాజిట్ సొమ్ము రూ.3,000 గాను, ఇతర ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.6,000 గాను నిర్దేశించారు.

తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం(పున్నమి పీతినిధి)
రాబోయే MPTC మరియు ZPTC ఎన్నికలకు సంబంధించిన డిపాజిట్ మొత్తాలు, అలాగే అభ్యర్థుల గరిష్ట వ్యయ (ఖర్చు) పరిమితి వివరాలను తూర్పు గోదావరి జిల్లా అధికారులు అధికారికంగా ఖరారు చేశారు.
MPTC అభ్యర్డులు:
SC , ST, మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులకు డిపాజిట్ సొమ్ము రూ.1,500 గాను, ఇతర ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.3,000 గాను నిర్ణయించారు.
• ZPTC అభ్యర్థులు: SC, ST, మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులకు డిపాజిట్ సొమ్ము రూ.3,000 గాను, ఇతర ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు రూ.6,000 గాను నిర్దేశించారు.
• వ్యయ (ఖర్చు) పరిమితి వివరాలు:
• MPTC ఎన్నికల ఖర్చు పరిమితి: ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం గరిష్టంగా రూ.4 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.
• ZPTC ఎన్నికల ఖర్చు పరిమితి: ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం గరిష్టంగా రూ.8 లక్షలు వరకు ఖర్చు చేసుకోవచ్చని ప్రకటించారు.
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ ఈ వ్యయ పరిమితులు మరియు ఎన్నికల నియమ నిబంధనలను విధిగా (తప్పనిసరిగా) పాటించాలని తూ.గో. జిల్లా అధికారులు స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *