వార్త ముఖ్యాంశాలు
- పెనగలూరు: మండలంలోని తూర్పుపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించనున్న శ్రీరాములస్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
- దేవాదాయశాఖ నిధులతో చేపట్టనున్న ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.
- ఆలయ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరింత వేదిక ఏర్పడనుంది.
పెనగలూరు: మండలంలోని తూర్పుపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించనున్న శ్రీరాములస్వామి ఆలయానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాదాయశాఖ నిధులతో చేపట్టనున్న ఆలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు. ఆలయ నిర్మాణంతో గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మరింత వేదిక ఏర్పడనుంది.
గ్రామ ప్రజలు చాలాకాలంగా కోరుకుంటున్న ఆలయ నిర్మాణం కార్యరూపం దాల్చడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణం పూర్తయిన అనంతరం భక్తులకు పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.