Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

తిరుగుడుమెట్టను చుట్టుముట్టిన వరదనీరు.. రాకపోకలు బంద్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తిరుగుడుమెట్టను చుట్టుముట్టిన వరదనీరు.. రాకపోకలు బంద్

వార్త ముఖ్యాంశాలు

  • తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం (పున్నమి ప్రతినిధి) తాళ్లపూడి మండలంలోని తిరుగుడుమెట్ట గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టింది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గ్రామ పరిసర ప్రాంతాల్లోకి పెద్దఎత్తున నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • వరద ఉద్ధృతి పెరగడంతో గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులు నీటమునిగాయి.
  • దీంతో గ్రామానికి వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది.

తూర్పుగోదావరి జిల్లా, తాళ్లపూడి మండలం (పున్నమి ప్రతినిధి)
తాళ్లపూడి మండలంలోని తిరుగుడుమెట్ట గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టింది.ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గ్రామ పరిసర ప్రాంతాల్లోకి పెద్దఎత్తున నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వరద ఉద్ధృతి పెరగడంతో గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారులు నీటమునిగాయి. దీంతో గ్రామానికి వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సిన గ్రామస్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వెంకటాయపాలెం వైపు నుంచి వచ్చే వరదనీరు వేగంగా చేరడంతో వేగేశ్వరపురం పంట రహదారితో పాటు ప్రధాన మార్గాలు కూడా నీటమునిగిపోవుట వలన తిరుగుడుమెట్ట గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

భారీ వర్షాల కారణంగా ఇప్పటికే తాళ్లపూడి మండలంలోని పలు గ్రామాలు, వ్యవసాయ ప్రాంతాల్లో నీరు నిలిచి పోయిఉన్నవని తెలియవచ్చినది.

వరదనీరు మరింత పెరిగితే గ్రామంలో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు పడే అవకాశం ఉందని గ్రామస్థుల ఆందోళన చెందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *