Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

– ఏఐ, డిజిటల్ వనరులతో బోధనకు పదును

– విద్యార్థుల అభ్యసన ఫలితాలపై సమగ్ర సమీక్ష

చిట్వేల్ పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు సోఫియా అధ్యక్షతన సెప్టెంబర్ నెల క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య పాల్గొని విద్యా కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. విద్యార్థుల హాజరు, దీర్ఘకాలిక గైర్హాజరు విద్యార్థుల ట్రాకింగ్, ఎఫ్‌ఏ – 1 ఫలితాలు, సిలబస్ పూర్తి, ఫార్మేటివ్ అసెస్‌మెంట్, ఎఫ్‌ఎల్‌ఎన్ అంశాలపై చర్చించారు. డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ పసుపుల రాజశేఖర్ మాట్లాడుతూ ఆధునిక బోధనా పద్ధతులు, డిజిటల్ వనరులు, సమర్థవంతమైన మూల్యాంకన విధానాలను వినియోగించి అభ్యసన ఫలితాలు మెరుగుపరచాలని సూచించారు. పదో తరగతి మోడల్ పేపర్, ఎఫ్‌ఏ – 2 కార్యాచరణ, అక్టోబర్ పాఠ్య ప్రణాళిక, ఏఐ ఆధారిత బోధన, ప్రశస్ట్, పీఎం ఈ – విద్యపై చర్చించారు. సమావేశంలో రిసోర్స్ పర్సన్లు, సీఆర్‌పీతో పాటు చిట్వేల్, పెనగలూరు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

విద్యా ప్రమాణాలే లక్ష్యం.. బోధనలో సరికొత్త మార్పులకు శ్రీకారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *