Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఆపరేషన్‌ త్రిశూల్‌.. ప్రజల్లో చైతన్యమే లక్ష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆపరేషన్‌ త్రిశూల్‌.. ప్రజల్లో చైతన్యమే లక్ష్యం

వార్త ముఖ్యాంశాలు

  • డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టి, మహిళలు, బాలికలకు భద్రత కల్పించడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఆపరేషన్‌ త్రిశూల్‌ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా నిర్వహించారు.
  • తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌.
  • సుబ్బరాయుడు, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై.

డ్రగ్స్‌ మహమ్మారిని అరికట్టి, మహిళలు, బాలికలకు భద్రత కల్పించడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఆపరేషన్‌ త్రిశూల్‌ కార్యక్రమాన్ని పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు, రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో కోడూరు రూరల్‌ సర్కిల్‌ పరిధిలోని పుల్లంపేట, పెనగలూరు, ఓబుళవారిపల్లి, చిట్వేల్‌ మండలాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద త్రిశూల్‌ పోస్టర్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.

కోడూరు రూరల్‌ సీఐ డి. శ్రీనివాసులు పుల్లంపేట మండలం శ్రీరాములమిట్ట, చిట్వేల్‌ మండలం కేఎస్‌ అగ్రహారం గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. డ్రగ్స్‌కు యువత దూరంగా ఉండాలని, మహిళలు, బాలికల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. డ్రగ్స్‌ విక్రయాలు, రవాణా, వినియోగంపై సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ 1972కు తెలియజేయాలని, డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి పోలీసులకు ప్రజలు సహకరించాలని సీఐ పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *