Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

శోంఠ్యం లో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం…. శ్రీ మరిడిమాంబ యూత్ ఆధ్వర్యంలో మండపం వద్ద రాట ఏర్పాటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శోంఠ్యం లో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం…. శ్రీ మరిడిమాంబ యూత్ ఆధ్వర్యంలో మండపం వద్ద రాట ఏర్పాటు

వార్త ముఖ్యాంశాలు

  • భక్తి..
  • ఐక్యత..
  • ఆధ్యాత్మిక ఉత్సాహం!

భక్తి.. ఐక్యత.. ఆధ్యాత్మిక ఉత్సాహం!

విశాఖపట్నం జిల్లా, ఆనందపురం, (పున్నమి ప్రతినిధి) అక్టోబర్ 1: శోంఠ్యం గ్రామంలో శ్రీ మరిడిమాంబ యూత్ ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ఘనంగా శ్రీకారం చుట్టారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి మండపం వద్ద రాటా ఏర్పాటు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

నవరాత్రి వేడుకలకు మొదలైన సందడి..

దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు యువత, స్థానికులు ఉత్సాహంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అమ్మవారి మండపాన్ని రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసేందుకు సన్నాహాలు చేపట్టారు. రాటా కార్యక్రమంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

యువత ఐక్యతకు.. భక్తిభావానికి ప్రతీక!
ప్రతి సంవత్సరం కూడా వీరి ఆధ్వర్యంలో దుర్గమ్మ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారని పలువురు వీరిని అభినందించారు
అమ్మవారి ఉత్సవాలను విజయవంతం చేసేందుకు యువత సమష్టిగా ముందుకు రావడం గ్రామంలో ఐక్యతా స్ఫూర్తిని చాటుతోంది. సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ, భక్తిశ్రద్ధలతో ఉత్సవ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు.

దుర్గమ్మ ఆశీస్సులతో గ్రామం సుభిక్షంగా ఉండాలని.. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భక్తులు ఆకాంక్షిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *