Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ

కొత్తపేట: విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని మేకల సత్యనారాయణ అన్నారు. కొత్తపేట గ్రామపంచాయతీ మాజీ వార్డు సభ్యుడు, మోహన్‌నగర్ అభివృద్ధి కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి మేకల చిత్తయ్య, మేకల చిలుకమ్మ వర్ధంతి సందర్భంగా శ్రీ మేకల చిలుకమ్మ–చిత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం మోహన్‌నగర్ ప్రభుత్వ ప్రీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు భోజన ప్లేట్లు పంపిణీ చేశారు.
ట్రస్ట్ చైర్మన్, మోహన్‌నగర్ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కట్టా ఆంజనేయులు చేతుల మీదుగా విద్యార్థులకు భోజన ప్లేట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తమవంతు కృషి చేస్తామని తెలిపారు. విద్యార్థుల చదువుతో పాటు వారి సౌకర్యాలపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా భోజన ప్లేట్లను అందించడం ద్వారా మేకల చిలుకమ్మ–చిత్తయ్య జ్ఞాపకాలను కొనసాగించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ట్రస్ట్ కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సునీత, సంధ్య, శైలజ, ఐశ్వర్య, సునీతతో పాటు నాయకులు పార్శపు శ్రీధర్, సంగిపేట నరేష్, మురళీధర్, చిరంజీవి, నితిన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు భోజన ప్లేట్ల పంపిణీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *