Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వార్తల విభాగం

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్ టి ఆర్ జిల్లా నుంచి మరిన్ని

తాజా కథనాలు

ఎన్ టి ఆర్ జిల్లా

*కొటికలపూడి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు గ్రేస్ మినిస్ట్రీస్ చొరవతో ల్యాప్‌టాప్ బహూకరణ:* ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1: భారత్ న్యూస్… ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యేనని, మారుతున్న కాలానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా కంప్యూటర్ మరియు సాంకేతిక పరిజ్ఞానంలో ముందంజలో ఉండాలని అమెరికా దేశ ప్రతినిధులు లిండ్సే, అలెక్స్ పేర్కొన్నారు. కొటికలపూడి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో (ZPHS) గురువారం కేతనకొండ గ్రేస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కంప్యూటర్ అవసరాల నిమిత్తం రూ. 40,000/- ల విలువ గల అత్యాధునిక ల్యాప్‌టాప్‌ను వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉపాధ్యాయులు, విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా అమెరికా దాతలు లిండ్సే, అలెక్స్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ఎదగాలని ఆకాంక్షించారు. నేటి డిజిటల్ యుగంలో టెక్నాలజీపై పట్టు సాధించడం ఎంతో అవసరమని సూచించారు. అనంతరం వారు విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించి, వారికి స్నాక్స్ పంపిణీ చేశారు. గ్రామీణ విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యం: గ్రేస్ మినిస్ట్రీస్ డైరెక్టర్ ఎలీషా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకునే పేద విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానాన్ని మరింత చేరువ చేయడమే తమ సంస్థ ముఖ్య ఉద్దేశమన్నారు. విద్యార్థులను నైపుణ్యం కలిగిన ఉత్తమ సమాజ సేవకులుగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ప్రతినిధులు రెండు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు స్ఫూర్తిని నింపారు. ఈ అభినందనీయ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి.వి. మాలిని, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, ఎస్ఎంసీ (SMC) చైర్మన్ జెస్సికా, గ్రేస్ మినిస్ట్రీస్ సెక్రటరీ సుమలతతో పాటు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పాఠశాలకు ల్యాప్‌టాప్ విరాళంగా అందించిన దాతలకు, గ్రేస్ మినిస్ట్రీస్ ప్రతినిధులకు హెచ్ఎం మాలిని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

*కొటికలపూడి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు గ్రేస్ మినిస్ట్రీస్ చొరవతో ల్యాప్‌టాప్ బహూకరణ:* ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 1: భారత్ న్యూస్… ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన…

Inkollu jamalayya2 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

లక్కిరెడ్డి అనిమిరెడ్డి గారిని అమెరికాలో రాష్ట్రంలో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి గారు

*💐💐🙏🙏గౌరవనీయులు, పెద్దలు, ప్రముఖ దాత డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారిని బుధవారం కాలిఫోర్నియాలోని మర్సిడ్‌లో ఉన్న ఆయన నివాసంలో యరమల రాంభూపాల్ రెడ్డి గారు…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం ఏసిపి గా పి రామచంద్ర రావు

**మైలవరం ఏసీపీ గా పి.రామచంద్రరావు* *ఇటీవల మైలవరం ఏసీపీ గా విధులు నిర్వహించిన వై.ప్రసాదరావు ప్రమోషన్ పై ఏలూరు జిల్లా బదిలీ పై వెళ్లారు.…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

ప్రేమ్ కుమార్ కి వైద్యం భరోసా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సహకారంతో సహకారంతో

ప్రేమ్‌కుమార్‌కు వైద్య ‘భరోసా’ సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా రూ.2.01 లక్షల ఆర్థిక సహాయం విజయవాడ రూరల్, గొల్లపూడి, అక్టోబర్ 1: అనారోగ్యంతో చికిత్స పొందుతున్న గొల్లపూడికి…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం దేవుని చెరువులో 35 మంది పేదలకు ఇల్లు పట్టాలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సహకారంతో

పేదలకు పట్టాభిషేకం మైలవరం దేవుని చెరువులో 35 మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కృషితో శాశ్వత హక్కులు…

Inkollu jamalayya2 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ పాఠశాల పార్టీ ఆఫీసుల వైసీపీ నాయకులు

*ప్రభుత్వ పాఠశాలలా కూటమి పార్టీ ఆఫీసులా…!!!* *పాఠశాలలను రాజకీయ కేంద్రాలుగా మార్చిన నాయకులు* *ఎస్ఎంసి ఎన్నికలలో అధికార పార్టీ నాయకుల జోక్యం దురదృష్టకరం…!* _వైసిపి…

Inkollu jamalayya1 నిమి పఠనం
ఎన్ టి ఆర్ జిల్లా

మైలవరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు యువజన నాయకుడు లంక నితీష్

*సామూహిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న….. లంకలితీష్…..* *ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం మైలవరంలోని పెద్ద హరిజనవాడ, దేవుని చెరువులోని పలు ఏరియాలలో జరిగిన…

Inkollu jamalayya1 నిమి పఠనం