Saturday, 11 April 2026

Blog

యాదాద్రి భువనగిరి

ప్రతి నెల చివరి ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

ఈరోజు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ గారు ఆదేశానుసారం … ప్రతి నెల చివరి ఆదివారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం 19 వ వార్డు. ఖిల్లా నగర్ లో జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మాజీ కౌన్సిలర్ వడిచర్లకృష్ణ యాదవ్. రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు…ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ చేయడం జరిగింది కార్యక్రమంలో మాట్లాడుతూ దేశంలో స్వాతంత్రం పోరాటంలోసేవాదళ్ ముఖ్య పాత్ర వహించినారు సేవాదళ్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ఎస్ హార్దికర్ స్వతంత్ర పోరాటంలో గ్రామ గ్రామాన కత్తి సామ్ కర్రసాము ఎన్నో విద్యలు నేర్పించి ప్రజలు చైతన్యపరిచి పోరాట పటిష్ట బ్రిటిష్ వారిని తరిమికొట్టే విధంగా ఊహలు రచించినారు కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి అభివృద్ధి పరచుటలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారు చేయుటలో సేవాదళ్ పాత్ర కీలకమైనది దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయుటలో సేవాదళ్ క్రియాశీలంగా పనిచేయాలి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గౌరవనీయులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంటు సభ్యుడు ప్రియతమ నాయకులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు డిసిసి అధ్యక్షులు సంజీవరెడ్డి గారు. నాయకత్వంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు ఉచిత రేషన్ కార్డులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పది లక్షల ఆరోగ్యశ్రీ రైతు రుణమాఫీ ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు అనేక రకాల సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేసులలో ముందుండి పనిచేయాలని అన్నారు రాబోయే రోజుల్లో ఎంపీటీసీ సర్పంచ్ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా సేవాదళ్ అధ్యక్షులు సామల రవీందర్ జిల్లా జనరల్ సెక్రెటరీ షేక్ వాజిద్ టౌన్ సేవాదళ్ అధ్యక్షులు డా కూరి ప్రకాష్ సిరికొండశివకుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాడూరినరసింహ ఎండి అఖిల్. మైనార్టీ సెల్ నాయకులు ఎండి అబ్బాస్ గుమ్మిడేల్లిరమేష్ కానుగంటి ప్రేమ్ కుమార్ శ్రీనివాస్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

యుద్ధం కాదు – మానవతా సమరమే నిజమైన పోరాటం: డా’ బి ఆర్ అంబేద్కర్ ఆలోచనల సందేశం

ఈ సందేశం నేటికీ 86 సంవత్సరాలు పూర్తి ! 1939 అక్టోబర్ 26 నాటి విషయం ! 1939 అక్టోబర్ 26న, మహాయుద్ధానికి సంబంధించిన తీర్మానంపై శాసనసభలో విశ్వరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన ప్రసంగం చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఆ ప్రసంగం రాజకీయ పరం కాదు — అది మానవతా దృక్పథంతో నిండిన ఆలోచనల వేదిక. యుద్ధం అనే పదానికి ఆయనే కొత్త అర్ధాన్ని ఇచ్చారు. ఆయన దృష్టిలో యుద్ధం అనేది శత్రువులను జయించడం కాదు, అన్యాయాన్ని, అసమానతను, అజ్ఞానాన్ని జయించడం. ఆయుధాలతో గెలవడం కంటే, మానవ హృదయాలను గెలవడం గొప్ప విజయం అని ఆయన పేర్కొన్నారు. ఆ ప్రసంగం 1939 అక్టోబర్ 28న ‘జనత’ పత్రికలో ప్రచురించబడింది. అంబేద్కర్ గారి ఆలోచనల్లో సమాజ మార్పు, సమానత్వం, స్వాతంత్ర్యం, న్యాయం వంటి విలువలు ప్రధానంగా కనిపిస్తాయి. ఆయన దృష్టిలో మానవ సమాజం అభివృ ఈద్ధి చెందాలంటే ముందు మనుషుల మనస్సులు మారాలి. యుద్ధాలు దేశాలను గెలిపిస్తాయి, కానీ మానవతా సమరమే మనసులను గెలిపిస్తుంది. “సత్యం, సమానత్వం, న్యాయం – ఇవే నిజమైన ఆయుధాలు,” అని ఆయన ఆ సమయంలో పేర్కొన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం, ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడడం, పేదవారికి, అణగారిన వారికి హక్కులు కల్పించడం — ఇవే ఆయన యుద్ధరంగం. ఈ సందేశం నేటికీ ప్రాసంగికమే. ప్రపంచం మళ్లీ విభజనల దారిలో సాగుతున్నప్పుడు, అంబేద్కర్ గారి మానవతా యుద్ధ స్ఫూర్తి మనందరికీ దారి చూపుతుంది. ఆయుధాలతో యుద్ధాలు మనిషిని నాశనం చేస్తాయి; కానీ మానవతా యుద్ధం మనిషిని మేల్కొలిపిస్తుంది. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు మనకు చెబుతున్నాయి — దేశాలు గెలవడం కంటే మనుషుల మనస్సులు గెలవడం పెద్ద విజయం! జై భీమ్ – జై భారత్ – జై భారత రాజ్యాంగం

కాకినాడ

పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో రైతులకు తీవ్ర అన్యాయం.

-76 సంవత్సరాలుగా రైతులు పేరు మీద ఉన్న భూమిని దేవస్థానం కు అప్పగింత.. -నవంబర్ 1న జరిగే వేలంపాటను అడ్డుకోండి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు రైతులకు పిలుపు. కాకినాడజిల్లా,కొత్తపల్లి : యు కొత్తపల్లి మండలం కొమరగిరి పంచాయతీకి సంబంధించిన సర్వేనెంబర్ 121 122 గల 20 ఎకరాల జురాయితీ భూమిని 1949 నుండి బలహీనవర్గాల కు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారని కానీ నేడు మూడు రోజుల క్రితం దేవస్థానం డిపార్ట్మెంట్ వారు బోర్డు పెట్టి జెండాలు పాతి ఇది మా భూమి అని చెప్పడం అన్యాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఇలాకాలో రైతులకు అన్యాయం జరగడం దారుణమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు ఆదివారం ఉదయం సిపిఐ జిల్లా కార్యదర్శి కే బోడకొండ సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పిఠాపురం నియోజకవర్గ కార్యదర్శి శాఖ రామకృష్ణ ఏపీ రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్క శ్రీనివాసరావు తదితరులతో కూడిన బృందం కొమరగిరి లో 20 ఎకరాల భూమిని పరిశీలించింది అక్కడ రైతుల ఆవేదనను ఆలకించింది ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వం నుండి అంటే సుమారు 90 సంవత్సరాలుగా పొజిషన్లో ఉండి లింక్ డాక్యుమెంట్లు , పాస్ పుస్తకాలు, పేరడంగల్ వన్ బి రికార్డు రెవిన్యూ పనులు రైతు భరోసా లోన్స్ ఇన్ని అర్హతలు ఉన్న భూమిని ఎండోమెంట్ అటాచ్మెంట్ చేసుకోవడం దారుణమన్నారు 2006 సంవత్సరం నుండి ఇది కోర్టులో ఉన్న ఇప్పటికి ఎండోమెంట్ వెనకాల కొంతమంది అధికార పార్టీ పెద్దల హస్తంతో ఈ కుట్ర జరిగిందన్నారు 2012 అప్పటి కలెక్టర్ ఆర్డిఓ స్థానిక తాసిల్దార్ ఇది ఎండోమెంట్ భూమి కాదని జరాయితి భూమిని పేపర్ ప్రకటన ఇచ్చిన అధికార పార్టీ అండదండలతో ఈ భూమిని ఆక్రమించుకున్నారని మధు విమర్శించారు ఇన్ని సంవత్సరాలగా ఏ ఎమ్మెల్యే ఏ అధికారులు ఈ భూమిపై కన్నెత్తి చూడలేదని కానీ నేడు స్థానిక ఎమ్మెల్యే ఇంచార్జ్ అండదండలతోనే ఇదంతా జరిగిందని రైతులు ఆవేదన చెందుతున్నారని మధు పేర్కొన్నారు నవంబర్ 1న గొర్స ప్రాంతంలో వేలంపేట పెట్టారని ఇలాంటి అన్యాయమైన వేలం పాటను చుట్టుపక్కల ఉన్న రైతులు వారికి అండగా వచ్చి అడ్డుకోవాలని అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజాసంఘాలు మద్దతు తెలపాలని మధు కోరారు దీనిపై పిఠాపురంలో రౌండ్ టేబుల్ వేసి భవిష్యత్తు కార్యచరణ ప్రకటిస్తామని మధు ప్రకటించారు ఈ కార్యక్రమంలో రైతులు సత్యనారాయణ సుబ్బారావు కృష్ణ బాపనయ్య దానయ్య తదితరలు పాల్గొన్నారు

హైదరాబాద్

నిజం చెప్పినందుకేనా..? 💔

తెలంగాణలో ఘోర ఘటన జరిగింది. వర్షిత అనే 10వ తరగతి విద్యార్థిని — వంగర ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుతోంది. వర్షిత స్కూల్ టాపర్, స్కూల్ కెప్టెన్, అద్భుతమైన విద్యార్థిని. ఇటీవల జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతిని కూడా అందుకుంది. దీపావళి సెలవుల తర్వాత హాస్టల్‌కి తిరిగి వచ్చిన వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి — “నన్ను వెంటనే తీసుకెళ్లండి, ప్రిన్సిపల్‌ మరియు వైస్ ప్రిన్సిపల్‌ నన్ను వేధిస్తున్నారు” అని తెలిపింది. వర్షిత, స్కూల్ సరఫరా సామగ్రి దుర్వినియోగం చేస్తున్నారని వారికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ కాల్ చేసిన గంటలోపే, వర్షిత హాస్టల్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఇందులో ఏది మరీ దారుణమో తెలియదు — వర్షిత మరణమా? లేక ఆమె శరీరాన్ని అంబులెన్స్‌లో కాకుండా ట్రాక్టర్‌లో తీసుకెళ్లడమా? ఇంతలో, ఆమెను వేధించినవారు మాత్రం యథావిధిగా ఉన్నారు… 💔 (ఈ ఘటన తెలంగాణలో జరిగింది.)

తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు -మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఇందిరమ్మ ఇండ్ల చెల్లింపుల్లో స్వల్ప మార్పులు -మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు నాలుగు విడతలుగా అందచేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐహెచ్ హెచ్ఎల్ ) పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని ఆయన తెలిపారు. కేవలం చెల్లింపుల షెడ్యూల్ లో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి తప్పితే, లబ్ధిదారులకు మంజూరు చేసే రూ. 5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్ మెంట్ వరకూ నిర్మాణం పూర్తి అయితే ఒక లక్ష రూపాయలు, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో లక్షరూపాయలు విడుదల చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తి అయిన తరువాత లబ్ధిదారులకు రూ.2 లక్షలను చెల్లిస్తున్నారు. ఉపాథి హామి పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రోజుల పనిదినాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుంది, ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొత్తాన్ని రూ.1.40 లక్షలుగా అందేచేయాలని ప్రభుత్వం నిర్ణయించనట్లు మంత్రి వివరించారు. ఇకపై శ్లాబ్ పూర్తి అయిన తరువాత రూ.1.40 లక్షలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని, మిగిలిన మొత్తాన్ని (రూ.60 వేలను) కూడా లబ్దిదారుల ఖాతాల్లో ఉపాథి హామీ పథకం కింద అందచేస్తారని తెలిపారు. అట్లాగే ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత మిగిలిన లక్ష రూపాయలను విడుదల చేస్తారు. పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ మార్పులు అనివార్యమయ్యాయని, లబ్ధిదారులు ఈ మార్పును గమనించి ప్రభుత్వంతో సహకరించాల్సిందిగా మంత్రి కోరారు.

తిరుపతి

మాజీ సర్పంచ్ కుమారుని మృతికి సంతాపం తెలిపిన బియ్యపు మధుసూదన్ రెడ్డి

తొట్టంబేడు మండలం, కొనతనేరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగయ్య కుమారుడు వెంకటేష్ ప్రమాదంలో మరణించడంతో గంగయ్య కుమారుడు పార్థివ దేహానికి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నం వాసుదేవ నాయుడు. రమణయ్య నాయుడు, వైకాపా మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

SIR 2025: రేపు దేశవ్యాప్తంగా SIR ప్రత్యేక సర్వేపై ఈసీ ప్రెస్‌మీట్ – కీలక ప్రకటనలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR 2025) తేదీలను ప్రకటించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) రేపు సోమవారం సాయంత్రం 4:15 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఈ సమావేశంలో పాల్గొంటారు. మొదటి దశలో 10 నుంచి 15 రాష్ట్రాలు కవర్ కానున్నాయి. ముఖ్యంగా 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు ఈ దశలో ఉన్నాయి. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, బదిలీలు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఓటర్ జాబితా లోపాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, ఈ సర్వేకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. డిజిటల్ టెక్నాలజీ ఆధారంగా BLOల ద్వారా సర్వేలు, ఫోటో ID అప్‌డేట్స్ జరగనున్నాయి.

తిరుపతి

ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డికి మంత్రి నాదెండ్ల కితాబు

శ్రీకాళహస్తి అక్టోబర్ 25, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవారి దర్శనార్థం విచ్చేశారు. ఈ ఆయనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆ యనకు ఘన స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల పత్యేక ప్రత్యెక దర్శనార్థ ఏర్పాట్లు చేయించి శ్రీ గురుమేద దక్షిణామూర్తి సన్న్ధిలో ఆలయ వేద పండితులచే ఆశీర్వచనం చేయించి అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి శ్రీ స్వామి, అమ్మ వార్ల చిత్రపటాలు, తీర్థ ప్రసాదాలు మంత్రి నాదెండ్లకు అందజేశారు. ఈ సందర్బంగా ఏపీ మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ…టిడిపి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి కూటమిలోని టిడిపి, బిజెపి, జనసేన, నాయకులను, కార్యకర్తలను, అటు పాలన పరంగాను ఇటు పదవుల పంపిణీ లోను అందరినీ ఏకతాటిపై నడిపిస్తూ ముందుకెళుతున్న విధానానికి ఏపీ మంత్రి నాదెండ్ల ఎమ్మెల్యే బొజ్జల పై ప్రశంసల జల్లు కురిపించారు..రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వివిధ ఆలయాలకు ధర్మకర్తలి మండలి నియమించిన విషయం తెలిసిందేనని అందులో భాగంగా ముక్కంటి ఆలయ పాలకమండలి సభ్యులు గా నియమితులైన టిడిపి, బిజెపి, జనసేన సభ్యుల ప్రమాణ స్వీకనానికి అన్నీ తానై నడిపించి పొత్తు ధర్మాన్ని పాటిస్తూ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్ల పాటు అధికారంలోకి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యమని మంత్రి పేర్కొన్నారు.

తెలంగాణ

కాలేజీలు బంద్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ 9640204826 నవంబరు 3 నుంచి కాలేజీలు బంద్ ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ పాటిస్తామని తెలిపిన తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కాలేజీలు నడిపే పరిస్థితుల్లో లేవని.. రూ.1200 కోట్ల బకాయిలు చెల్లిస్తామని కేవలం రూ.300 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపిన రమేష్ బాబు నవంబరు 1 లోపు రూ.900 కోట్లు విడుదల చేయకపోతే.. 3 నుంచి నిరవధిక బంద్ చేస్తామని ప్రకటన నవంబరు 10వ తేదీ లోపు 2లక్షల మందితో సమావేశం నిర్వహిస్తామని.. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని భయపెడితే ఊరుకునేది లేదని.. ఒక్క పోలీసును కూడా కాలేజీలోకి అనుమతించమని హెచ్చరించి తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్ రమేష్ బాబు

కాకినాడ

ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండండి.

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10 బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా పెద్దాపురం మండలంలోని ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వి మౌనిక పేర్కొన్నారు. ముఖ్యంగా ఏలేరు ప్రాజెక్టు పరిధిలోని కాలువలు ఆనుకొని నివాస ఉంటున్న ప్రజలు సురక్షిత మైన ప్రాంతాల్లో నివాసం ఉండేలాగా చర్యలు తీసుకోవాలన్నారు. కాలవల్లో కానీ, కాలువ అంచున చిన్నారులు యువకులు మహిళలు వెళ్ళకుండ జాగ్రత్తలు పాటించాలన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.