Sunday, 5 April 2026

Blog

తెలంగాణ

*@వేలేరు మండలం 04.11.25* స్టే॥ఘనపూర్ నియోజక వర్గం,

*@వేలేరు మండలం 04.11.25* స్టే॥ఘనపూర్ నియోజక వర్గం, *గౌ॥ శ్రీ . స్టే॥ ఘనపూర్ నియోజక వర్గ MLA కడియం శ్రీహరి గారు ఇటీవల విడుదల అయిన నిధులనుండి త్వరలోనే వేలేరు మండల కేంద్రంలో రైతువేదిక వద్ద ఏర్పాటు చేయబోయే MRO MPDO కార్యాలయాల కోసం ఈ రోజు MLA గారితో కలిసి స్థల పరిశీలన చేయడం జరిగింది అదేవిధంగా BC కాలానికి అవసరమైన అంతర్గత CC రోడ్లు మరియు వేలేరు గ్రామంలోని ZPHS ప్రాథమిక పాఠశాలకు సైడ్ వాల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఎస్టిమేషన్ వారం రోజుల్లో తీసుకొని రావాలని MLA గారు అధికారులను ఆదేశించారు కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు…*

E-పేపర్

తెలంగాణాలో జాతకట్టిన రెండు పార్టీలు

తెలంగాణ రాష్టం లో జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సూచన మేరకు జూబ్లీహిల్స్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు జనసైనికులు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని కలిసి జనసేన పార్టీ తరుపున జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ కి మద్దత్తు ప్రకటిస్తూ సంతోషవక్తం చేసింది..

తెలంగాణ

సిద్దిపేట హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య లతో కలిసి నిర్వహించారు.

సిద్దిపేట హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె. హైమావతి సమీక్ష సమావేశం ఆర్డీవో రామ్మూర్తి, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య లతో కలిసి నిర్వహించారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అధికారులందరితో కలిసి కొత్త బట్టల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… అర్ అండ్ బి శాఖ హుస్నాబాద్ నుండి కొత్తపల్లి నాలుగు వరసల రోడ్ నిర్మాణ పనుల్లో 90 శాతం చెట్లు తొలగింపు పూర్తి, ఎలక్ట్రిక్ లైన్ తొలగించడం అన్ని జాగ్రత్తలు తీసుకుని తొలగించాలని ఆదేశించారు. కోహెడ నుండి సముద్రాల రోడ్ బి టి రోడ్ పనులు 15 రోజులు పూర్తి చెయ్యాలి. హుస్నాబాద్ నుండి రామవరం రోడ్ అక్కన్న పెట నుండి కొత్తకొండ రోడ్ పనులు మరియు ఇతర భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చెయ్యాలని అర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. పంచాయతీ రాజ్ ఇంజనీర్ శాఖలో ఏం జీ ఎన్ ఆర్ ఈ జీ ఎస్ కింద నిర్మాణం చేపడుతున్న గ్రామపంచాయతీ భవనాలు హుస్నాబాద్ మండలం లో కూచనపల్లి, మడత అక్కన్న పెట మండలంలో గొల్లపల్లి, గౌరవెల్లి, చౌటపల్లి, గుబ్బాలి, కట్కూరు, రేగొండ, శ్రీరామ్ తండా, పంతులు తండా, కుందన్వానీ పల్లి, రామవరం, మల్చెరువు తండా కోహెడ మండలంలో ధర్మారం, వరికోలు, నకిరేకొమ్ముల, పరివేద, నారాయణపూర్ గ్రామాల్లో గ్రామపంచాయతీ భవన పనులు జరుగుతున్నట్లు డిసెంబర్ చివరకల్ల నిర్మాణం పూర్తి చెయ్యాలి. గాంధీ నగర్, పొట్లపల్లి, బల్లునాయక్ తండా, మహమ్మదాపూర్, మీర్జాపూర్, బంజేరుపల్లి, చౌటాకుంట తండా, పెద్ద తండా, దుబ్బ తండాబత్తుని వాణి పల్లి భూమి కొరత భూమి కొరత భూమి కొరత ఉందని గ్రామాల్లో పాత జీ పి భవనం వేరొక స్థలం గూర్చి ఇంజనీర్ గ్రామపంచాయతీ అధికారులు పర్యవేక్షణ చెయ్యాలని ఆదేశించారు. అంగన్వాడి భవనాలు, కాంపౌండ్ వాల్ లు జనవరి లోపు పూర్తి అయ్యేలా పని చెయ్యాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఎస్ డి ఎఫ్ కింద చేపట్టిన పనులు, పి ఎచ్ సి, సబ్సంటర్ భవన నిర్మాణాలు మరియు పి ఎచ్ సి, సబ్సంటర్ మేజర్ మైనర్ రిపేర్లు పనులను యుద్ధప్రాతిపదకన పూర్తి చెయ్యాలి. మున్సిపల్ లో జంక్షన్ డెవలప్మెంట్, ఎల్లమ్మచెరువు వెళ్ళేందుకు రోడ్ నిర్మాణం మరియు సుందరీకరణ పనులు ఇతరత్ర పనులు నిర్ణిత కాలం లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ ఉపకేంద్ర పనులు పురోగతిలో ఉన్నవి పూర్తి చెయ్యాలని పూర్తి అయిన వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ మండలాల్లో తాగు నీరు అందించే పనులు సైతం చేపట్టిన పనులు పూర్తి చెయ్యాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగులో వేగం పెంచాలని వరి కోతలు పూర్తి అవుతున్నాయి కావున ఇప్పుడే మంచి సమయం రైతులను కలిసి ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహించాలని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు.

భక్తి

కార్తీక పౌర్ణమి దీపాల వెలిగింపుకు శుభ సమయం

పున్నమి ప్రతి నిధి. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడానికి శుభప్రదమైన సమయం గురించి ఎన్నోమంది వేచిచూస్తూ ఉంటారు. ఈసారి కార్తీక పౌర్ణమి రోజున దీపం పెట్టడానికి శుభ సమయం సాయంత్రం 5:15 నిమిషాల నుండి 7:50 నిమిషాల వరకు ఉంది. ఈ సమయములో దీపాలు వెలిగించడం అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు. స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగించి దీపం వెలిగించడం మంచిదిగా పరిగణిస్తారు. దీపం వెలిగించేటప్పుడు ‘ఓం నమో నారాయణాయ’, ‘ఓం నమశ్శివాయ’ మంత్రాలు జపించడం శ్రేయస్కరం.

ములుగు

లక్ష్మీదేవి పేట పాఠశాలకు డ్యూయల్ డెస్క్ దీనికి ముఖ్యఅతిథిగా 5th బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ బి సీతారాం

స్వచ్చంద సంస్థ వారు లక్ష్మీదేవి పేట పాఠశాలకు విద్యార్థుల అవసరాల గురించి మంగళవారం రోజున ఎనిమిదవ తరగతి విద్యార్థులకు డ్యూయల్ డేస్కులు అందించారు పాఠశాల అభివృద్ధికి గత సంవత్సరం నుండి ఏదో ఒక వస్తువు రూపేన అందిస్తున్న జదవపూర్ పూర్వ విద్యార్థుల అసోసియేషన్ హైదరాబాద్ ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్ నాగరాజుకు లక్ష్మీదేవి పేట పాఠశాల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు ఇట్టి ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా 5th బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ బి సీతారాం చేతుల మీదుగా జరిగింది

ఆంధ్రప్రదేశ్

కనిగిరి నుండి ప్రత్యేక బస్సులు

కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం కనిగిరి ఆర్టీసీ డిపో నుండి శ్రీశైలం, భైరవకోన, పాకల కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రతి అరగంటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని భక్తులు ఈ అవకాశం చేసుకోవాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్

కనిగిరి నుండి ప్రత్యేక బస్సులు

కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని బుధవారం కనిగిరి ఆర్టీసీ డిపో నుండి శ్రీశైలం, భైరవకోన, పాకల కు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ సయనా బేగం తెలిపారు. మంగళవారం మాట్లాడుతూ బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి ప్రతి అరగంటకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని భక్తులు ఈ అవకాశం చేసుకోవాలని కోరారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బిషప్ గా అభిషేకం

*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, మలికిపురం మండలం, లక్కవరం గ్రామంలో మట్టా వారి గ్రూపులో ఈరోజు దైవజనులు రెవ” నల్లి కృపావరం గారిని బిషప్ గా అభిషేకం చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొని, వారిని శాలువా, పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీమంత్రి, నియోజకవర్గ Ycp ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యా రావు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కార్యదర్శి కటకంశెట్టి ఆదిత్య, జిల్లా ఆక్టివిటీ కార్యదర్శి మోకా సురేష్, నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు గుర్రం జాషువా, మలికిపురం మండల ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షులు గెడ్డం ఫిలిప్ రాజు గార్లు పాల్గొన్నారు.*

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు

*అంతర్వేదిపాలెం గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం: రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు అంతర్వేదిపాలెం గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు నల్లి త్రిమూర్తులు ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంతర్వేదిపాలెం గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో Mpp వీరా మల్లిబాబు, సర్పంచ్ నల్లి లీలావతి సురేంద్ర, రాష్ట్ర నాయకులు కటకంశెట్టి ఆదిత్య, తాడి సహదేవ్, జిల్లా ఆర్టిఐ అధ్యక్షులు తోటే జాన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదా రవి రెడ్డి, మోకా సురేష్, గుర్రం జాషువా గార్లు. స్థానిక గ్రామ నాయకులు: Mptc రత్నం సత్యనారాయణ, Ex Mptc మోకా యేసు రాజు, పంచాయతీ మెంబర్ కమిడి చిట్టిబాబు, సికిలే షైనీ పంచాయతీ మెంబర్, అల్లూరి సుబ్బరాజు, బర్రె వెంకట రాజు, వీర ఎర్రబాబు, దుండి వసంత, నల్లి దేవి, గంట రత్నకుమారి, చొప్పల అబ్రహం, గంటా దానియేలు, నల్లి శామ్యూల్ రాజు, చొప్పల చంద్రశేఖర్, కలిగితి వరహాల రాజు, నల్లి వరప్రసాద్, నల్లి జితేంద్ర రావు గార్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు….🙏🏻

తెలంగాణ

నల్లగొండ జిల్లా టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి పర్యటన….

నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీని సందర్శించి, విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్న *తెలంగాన రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ తీన్మార్ మల్లన్న గారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సుదగాని హరిశంకర్ గౌడ్ గారు,రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీ బందారపు నర్సయ్య గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ వట్టె జానయ్య యాదవ్ గారు,శ్రీ సంగెం సూర్య రావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎలబోయిన ఓదేలు యాదవ్ గారు, రాష్ట్ర మేధావుల మరియు నిపుణుల సమన్వయ కమిటీ చైర్మన్ శ్రీ శివార్చక విజయ్ కుమార్ గారు,ఉప కోశాధికారి శ్రీ కొక్కలకొండ మనోజ్ గారు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కొమ్ముల ప్రవీణ్ రాజ్ గారు,నాయకులు శ్రీ తిరుమని నాగరాజు గౌడ్ గారు, శ్రీ గట్టు మొగలయ్య గారు మరియు టిఆర్పి నాయకులు , యూనివర్సిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.