Sunday, 22 March 2026

Blog

రంగారెడ్డి

*అందెశ్రీ మరణం తెలంగాణ జాతికి తీరని లోటు – సంగిశెట్టి ధనుంజయ్ —అందెశ్రీ కి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : ప్రముఖ కవి రచయిత అందెశ్రీ సోమవారం ఉదయం మరణించాడని చెప్పడానికి మాటలు రావడం లేదు అందెశ్రీ అందని లోకాలకు వెళ్లాడని చింతిస్తున్నాను దుఃఖిస్తున్నాను బాధిస్తున్నాను శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాను అందెశ్రీ జననం, 18,7,1961, సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామంలో జన్మించిన ఆయన స్వస్థలం గతంలో వరంగల్ జిల్లా అందెశ్రీ అసలు పేరు ఎల్లన్న పాటలు పాడడం వలన అందెశ్రీగా పేరు పొందాడు అందెశ్రీ పాటలు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు తెలుగుజాతి మనది నిండుగ వెలుగు జాతి మనది మరియు తెలంగాణ జాతీయ గీతం ఆయననే రచించి పాడిన అందెశ్రీ గారు జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం తెలంగాణ రాష్ట్ర అధికార గీతం అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అందెశ్రీ అందుకున్న అవార్డులు, కాకతీయ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు, 2006లో గంగ సినిమాకి నంది పురస్కారం లభించింది, 2017లో దాశరథి సాహిత్య పురస్కారం లభించింది, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం లభించింది, 2024 లో దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం లోక్ నాయక్ పురస్కారం అందుకున్నారు తెలంగాణ సాహితి శిఖరం ప్రజల కవి అందెశ్రీ మరణం తీవ్ర దిగ్భ్రాంతిని ఆవేదనను కలిగించింది ఆయన మరణం సాహితీ లోకానికే కాదు మన అందరికీ తీరని లోటు తెలంగాణ ఉద్యమంలో తన అక్షరాన్ని ఇంధనం గా మార్చి ప్రజల గుండెల్లో నిత్య చైతన్యాన్ని జ్వలింపజేసిన గొప్ప యోధుడు అందెశ్రీ నిత్యం పేద ప్రజల పక్షాన గొంతుక వినిపించిన నిస్వార్థ తెలంగాణ మట్టి మనిషి అందెశ్రీ భౌతికంగా మన మధ్య లేకపోయినా తెలంగాణ రాష్ట్ర అధికార గీతమైన జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం గేయం నిత్యం ప్రజల గుండెల్లో నిలిచి ఉంటారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు సీనియర్ జర్నలిస్ట్ నందనవనం పద్మశాలి సంఘం అధ్యక్షులు సంగిశెట్టి ధనుంజయ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను

E-పేపర్

రెడ్ కోట వద్ద పేలుడు – ఢిల్లీలో హై అలర్ట్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 బ్రేకింగ్: రెడ్ కోట వద్ద పేలుడు – ఢిల్లీలో హై అలర్ట్ — ఢిల్లీలో రెడ్ కోట సమీపంలోని పార్క్ చేసిన కారు ఒకటిలో సోమవారం సాయంత్రం (నవంబర్ 10, 2025) జరిగిన భారీ పేలుడులో ఒక వ్యక్తి మరణించగా, శక్తివంతమైన ఆ విస్ఫోటనం వల్ల పలువురు వాహనాలు మంటల్లో కూరుకుపోయాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పలువురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఢిల్లీ అంతటా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ఘటనాస్థలికి ఏడు ఫైర్ టెండర్లు చేరుకుని, పోలీసు బలగాలు ప్రాంతాన్ని ముట్టడి చేశాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ పేర్కొంది. “రెడ్ కోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 సమీపంలో పార్క్ చేసిన కారులో పేలుడు జరిగింది. పేలుడు తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గాయాలు జరిగి ఉండొచ్చని అనుమానం,” అని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఘటన స్థలం నుంచి వచ్చిన దృశ్యాల్లో మంటల్లో కాలి పోతున్న కార్ల నుంచి ఎగసే అగ్ని జ్వాలలు కనిపించాయి. భారీ శబ్దంతో జరిగిన పేలుడు తర్వాత అక్కడి ప్రజల్లో భయాందోళనలు చెలరేగగా, అనేక వాహనాలు దెబ్బతిన్నట్లు కనిపించాయి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మాజీమంత్రి కాకాని ని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైసిపి యువ నాయకుడు పాలగిరి ముద్దుకృష్ణమరాజు

సీతారామపురం నవంబర్ 10 సూర్య న్యూస్ మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని హైదరాబాదులోని ఆయన నివాసంలో సోమవారం నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జునతో కలిసి కాకానికి పుట్టినరోజులు శుభాకాంక్షలను నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు తెలిపారు. ముందుగా కాకానిని శాలువాతో సత్కరించి పుట్టినరోజు కేకు కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పాలగిరి ముద్దుకృష్ణమరాజు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో 2029లో వైఎస్ఆర్సిపి జెండా ఎగురవేసేలా కష్టపడి, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించేలా కృషి చేయాలని కాకాని తెలిపారన్నారు. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో కల్లా వైఎస్ఆర్సిపి గెలుపు ముందు వరుసలో ఉదయగిరి నియోజకవర్గం ఉందని ఇదేవిధంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూ వైఎస్ఆర్సిపి పై ప్రజల్లో మరింత ఆధార అభిమానాలు నమ్మకం కలిగేలా కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారన్నారు. మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 12వ తేదీన నిర్వహించే నియోజకవర్గ కేంద్రాలలో నిర్వహించే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారన్నారు.

ఆంధ్రప్రదేశ్

స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం చిరస్మరణీయుడు . ఉక్కు కార్మిక సంఘాల ఘన నివాళి విశాఖపట్నం , నవంబర్ 10 (పున్నమి ప్రతినిధి). విశాఖపట్నం లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం పోరాడిన యోధుడు స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం అని విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలు కొనియాడారు . సోమ వారం ఉక్కు నగరం సెక్టార్ 9 తెన్నేటి పార్కులో స్వాతంత్ర్య సమర యోధుడు, మాజీ ఎంపీ స్వర్గీయ తెన్నేటి విశ్వనాథం 46 వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు కార్మిక సంఘాల నేతలు తెన్నేటి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం తెన్నేటి విశ్వనాథం చేసిన కృషి మరువ రాని దన్నారు . ఆయన చేసిన కృషి నీ ఉక్కు కార్మిక వర్గం ఎన్నటికీ మరువదని అన్నారు . ఈ కార్యక్రమం లో స్టీల్ ప్లాంట్ ఏ.ఐ.టి.యూ సి ప్రధాన కార్యదర్శి డి.ఆదినారాయణ , ఐ. ఎన్.టి.యూ సి అధ్యక్షులు పి.వి.రమణ మూర్తి , సి.ఐ.టి.యూ ప్రధాన కార్యదర్శి జె.అయోధ్య రామ్ , హెచ్.ఎం ఎస్ అధ్యక్షులు దొమ్మేటి అప్పారావు , నాయకులు టి.ఎస్. ఎన్. పుల్లా రావు తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

రంగారెడ్డి

సిజే పై దాడికి నిరసనగా నవంబర్ 17న ఛలో ఢిల్లీ. —కులవివక్షతను ఎదుర్కోవడానికే దళిత ఆత్మగౌరవ పోరాటం. –ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 10 : విశ్వాసాలు, ధర్మాల పేరుతో చట్టాలను రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించకుండా దాడులు చేస్తామంటే సహించేది లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగళ్ల ఉపేందర్ మాదిగ అన్నారు మహేశ్వరం మండలం కల్వకోల్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి బక్కని రవి మాదిగ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీజే పై దాడి చేసి దళితుల ఆత్మగౌరవాన్నే కాకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రతను, గౌరవాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశారని దీనికి వివక్షతనే ప్రధాన కారణమని ఆ వివక్షతను ఎదుర్కోవడానికే నవంబర్ 17న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని ఈ ఢిల్లీకి యువతరం సిద్ధమై ఆత్మగౌరవ పోరాటంలో భాగం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రాగళ్ల ఉపేందర్ మాదిగ పిలుపునిచ్చారు.భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బిఆర్ గవాయ్ మీద దాడి జరిగితే ఈ దేశ వ్యవస్థలన్ని ఎలాంటి చర్యలకు ఉపక్రమించకుండా మౌనం వహించి అంటరానితనాన్ని ప్రదర్శించాయని అన్నారు. ఈ దేశ చట్టపరమైన వ్యవస్థలకు కూడా దళితులు అంటరానివారయ్యారని మండిపడ్డారు. గవాయి దళితుడు కావడం వల్లనే వ్యవస్థలన్నీ మౌనం వహించాయని , కానీ అదే స్థానంలో ఉన్నత వర్గాలకు చెందిన న్యాయమూర్తి ఉంటే ఇప్పటికే స్పందించి శిక్షలు వేసే వారని అన్నారు.దేశానికి అత్యున్నతమైన న్యాయ వ్యవస్థ అధిపతిగా ఉన్నా కూడా ఇంత కులవివక్షత పాటించడం అత్యంత అమానుషం అని అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని..? ఇలాంటి పరిస్థితుల్లో రక్షణ ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దళితుల ఆత్మగౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ చట్టప్రకారం పని చేయాలని అన్నారు.దాడులకు పాల్పడ్డ వారు దాడులను సమర్థించుకుంటుంటే ,మళ్ళీ దాడులు చేస్తామని మాట్లాడుతున్న చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని గుర్తుచేశారు.విశ్వాసాల పేరుతో దాడులకు పాల్పడితే శిక్షలు వేయకపోవడం చట్టవిరుద్ధం అని విశ్వాసాల పేరుతో, ధర్మాల పేరుతో దళితుల మీద దాడికి పాల్పడితే కేసులు పెట్టరా ? శిక్షలు వేయారా? అరెస్టులు చేయరా ? ఇదేమి న్యాయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివక్షతను గట్టిగా ఎదుర్కోవడానికి ఈ నెల 17న మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఛలో డిల్లీకి పిలుపునిస్తున్నామని, రాజ్యాంగ రక్షణ కోసం ,దళితుల మీద దాడులు ఎదుర్కోవడం కోసం ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడే దేశానికే ఓ సంకేతనిద్దాం మన ఆస్తిత్వాన్ని, ఆత్మ గౌరవాన్ని, న్యాయాన్ని కాపాడుకోవడం కోసం నవంబర్ 17న ఛలో డిల్లీకి దళితులు, పీడిత వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు పెంటనోళ్ళ నరసింహ మాదిగ, మండల అధ్యక్షులు ఎర్ర గణేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బక్కని అశోక్ మాదిగ, అనిల్ మాదిగ, జోగు నాగభూషణం మాదిగ, కల్లేపల్లి బాలరాజు మాదిగ, సుమన్ మాదిగ, సిద్ధులు మాదిగ, వరుణ్ మాదిగ, ఎర్ర నవీన్ మాదిగ, సుదర్శన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఉదయగిరి, దుత్తలూరు సమస్యలపై కలెక్టర్ కి వినతి

ఉదయగిరి, దుత్తలూరు ప్రాంతంలో రోడ్ల అభివృద్ధి, పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆయా మండలాల బీజేపీ నాయకులు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. ప్రధానంగా నందవరం- ఉదయగిరి, సంగం-కలిగిరి, నర్రవాడ-వెంకన్నపాలెం, బండకింద పల్లి ఘాట్ రోడ్డు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని వారు కలెక్టర్ను కోరారు.

E-పేపర్

దయగలవారు నా బిడ్డ ప్రాణాలను కాపాడండి

దయగలవారు నా బిడ్డ ప్రాణాలను కాపాడండి రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు మండలం స్థానిక మంగంపేటలో నివాసం ఉంటున్న మోడి ప్రతిభ, మోడి పూర్ణిమ అయిన నా కుమార్తెకు హెపటైటీస్ వ్యాధి సోకి లివర్ చెడిపోయింది ఇందులకు వైద్యులు నా కుమార్తెకు లివర్ మార్పిడి అనగా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. నా లివర్ పాపకు సరిపోలేదని తెలిపారు నా తమ్ముడు లివర్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ఇందులకు 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని డబ్బులు సిద్ధం చేసుకోవాలని డాక్టర్ చెప్పారు. నేను నిరుపేదను నా బిడ్డ చికిత్స కోసం వారం రోజుల నుండి ఐసీయూ లో ఉన్నందున సుమారు ఇప్పటికి ఆరు లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టాను ఇప్పుడు చికిత్సకి కోలుకోలేదు లివర్ మార్చాలని వైధ్యులు తెలిపారు. కనుక నా బిడ్డ ప్రాణాలను కాపాడుకొనుటకు నా వద్ద డబ్బులు లేవు దాతలు ఎవరైనా ముందుకువచ్చి నాకు సహాయం చేసి నా బిడ్డ ప్రాణాలను కాపాడవలసినదిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను నాకు సహాయం ఫోన్ పే లో సహాయం చేయాలని అనుకున్న వారు నా నెంబర్ కు ఫోన్ పే చెయ్యాలని మనవి నా ఫోన్ పే నెంబర్ 7674922276 దాతలు దయగలవారు సహాయం చేయవలసిందిగా వేడుకొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత విజయ ప్రతాప్ రెడ్డి రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన సమస్యలపై అవగాహనా కార్యక్రమం

రేషన్ బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు (ఉదాహరణకు, బయోమెట్రిక్ థంబ్ పడకపోవడం) వస్తే, VR-A లేదా VR-O ద్వారా లేదా ఐరిష్ (Iris) స్కాన్ ద్వారా పంపిణీ చేయడానికి వేరే మార్గాలు (Rules) ఉన్నాయని ఆయన వివరిస్తున్నారు. యాప్ పనిచేయకపోయినా, ఇంకో సమస్య వచ్చినా, చివరికి లబ్ధిదారుడు (Beneficiary) తప్పకుండా బియ్యం పొందాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఫిర్యాదు నిరూపించబడితే, 125% ఫైన్ వేయబడుతుంది. దానికి సంబంధించిన అధికారుల జీతాల నుండి కట్ చేసి ఆ చట్టం (Act) ప్రకారం లబ్ధిదారుడికి ఇవ్వడం జరుగుతుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 (National Food Security Act-2013) అమలులో భాగంగా, రాష్ట్రంలోని ప్రతి లబ్ధిదారునికి ఆహార భద్రత హక్కు (Food Security Right) కల్పించడానికి మరియు వారికి అందవలసిన బియ్యం లేదా ఇతర రేషన్ సరుకులు సక్రమంగా అందకపోతే, ఆ సమస్యను పరిష్కరించడానికి మరియు బాధ్యులపై చర్య తీసుకోవడానికి ఈ ఫుడ్ కమిషన్ కృషి చేస్తోంది. ఫుడ్ కమిషన్ చైర్మన్ యొక్క ఈ ప్రకటన, ప్రభుత్వ ఉద్యోగులు/అధికారులు తప్పనిసరిగా రేషన్ సరుకులను పంపిణీ చేయాలని, లేకపోతే వారిపై అధిక జరిమానాలు మరియు పరిపాలనాపరమైన (Administrative) కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తూ, లబ్ధిదారుల హక్కులను బలంగా నొక్కి చెబుతోంది.

ఎన్ టి ఆర్ జిల్లా

యువ మేధలకు మద్దతుగా రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (RTIH) ప్రారంభం – స్టార్టప్‌ల కోసం కొత్త చొరవ

2025న రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్ (RTIH) ప్రారంభం జరిగింది. ఈ హబ్ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి, కొత్త ఆవిష్కరణలను సాధించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ మరియు జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కి సబ్ అధికారులతో కలిసి క‌లెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇగ్నైట్ సెల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఐదు స్టార్టప్‌ల వ్యాపార నమూనాలను ప్రదర్శించి, వాటి ప్రస్తుత స్థితిగతులను పరిశీలించారు. కలెక్టర్ డా.లక్ష్మీశ చెప్పారు, “హబ్ మరియు స్పోక్ మోడల్ ద్వారా కొత్త ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతోంది. ఇగ్నైట్ సెల్ ద్వారా ఈ హబ్ కార్యకలా పాలు, అందుబాటులో ఉన్న అవకాశాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి.” ఈ కార్యక్రమం ద్వారా యువత కు మార్గదర్శనం, స్టార్టప్‌లకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యం.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మానసరోజ పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం! మానవత్వానికి అద్భుతమైన ఉదాహరణ

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కేసనపల్లి పడమటపాలెం గ్రామానికి చెందిన మేడిది మానసరోజ తన పుట్టినరోజును విశిష్టంగా జరుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వేడుకలు జరుపుకోవడం బదులు ఆమె రాజోలు పట్టణ పరిసర ప్రాంతాల్లోని పేదలు, నిరుపేదలు, అనాధలకు భోజన పార్సిళ్లను అందించారు. ప్రతి పేద కుటుంబాన్ని స్వయంగా వెళ్ళి చూసి, వారికి స్నేహపూర్వకంగా ఆహారం పంచడం ద్వారా మానసరోజ తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో ఉన్న మానవీయ విలువలను గుర్తు చేస్తూ “స్వంత పుట్టినరోజు ఆనందాన్ని ఇతరులతో పంచుకోవడమే నిజమైన సంతోషం” అని మానసరోజ అన్నారు. పేదవారి కష్టాలను చూసి ఆవేదన వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలను తరచుగా కొనసాగిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులు ఆమె సేవా కార్యక్రమాన్ని అభినందిస్తూ, యువత ఇలాంటి ఆదర్శాలను అనుసరించాలని సూచించారు. మానసరోజ చేసిన ఈ స్ఫూర్తిదాయక చర్య సమాజంలో సేవాభావాన్ని పెంపొందించే దిశగా ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ఇది ఒక సామాజిక చైతన్యాన్ని పెంచే మానవీయ సేవా కార్యక్రమం — “జన్మదినం ఆనందం, పేదలతో పంచితేనే సార్థకం” అనే భావనకు మానసరోజ రూపం ఇచ్చారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.