Sunday, 22 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు హైవేలో లారీ బిబస్తం ముగురు మృతి

Nellore nh16 hiway ntr nagar హైవేలో లారీ అదుపూ థాపి రోడ్డులో పాకన కంకులు ఆముకుంటూ వునవారి పైకి దూసుకెళ్లింది.ఆముకుంటూ వునావాలు బైక్ లో వెల్తు అగి కొనగోలు చేస్తున్నవాలు అందరు ప్రమాదంలో పాడారు. ముగురు స్పాట్లోనే మరనిచగా మిగిలిన వాలనీ ధగరా లోనీ మెడికోవర్ హాస్పిటల్ కి తరలించారు. పోలీస్ లు సంగటన స్థలానికి చేరుకోనీ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

రంగారెడ్డి

భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీలంకల దీపక్ రెడ్డి తో కలిసి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

పున్నమి: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ రోజు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి శ్రీలంకల దీపక్ రెడ్డి తో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ప్రతి బూత్ వద్ద పోలింగ్ శాంతియుతంగా జరుగుతున్న విధానాన్ని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్యమని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించడం ద్వారా మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవచ్చని తెలిపారు.ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం మందకొడిగా కొనసాగినప్పటికీ, ప్రజలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా స్వేచ్ఛగా, నిస్పాక్షికంగా ఓటు వేయాలని, ఇది ప్రజాస్వామ్య బలాన్ని పెంచుతుందని అన్నారు.పోలింగ్ కేంద్రాలలో వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలను, పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ప్రజల సౌకర్యార్థం అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. భారత రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ప్రతి పౌరుడి గౌరవ చిహ్నమని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించాలని కార్పొరేటర్ గారు తెలిపారు.మొత్తానికి ప్రజాస్వామ్య పండుగగా భావించే ఈ ఎన్నికల్లో అందరూ చురుకుగా పాల్గొని అధిక శాతంలో పోలింగ్ నమోదు చేయాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం లో బీజేపీ రంగా రెడ్డి జిల్లా అర్బన్ ప్రధాన కార్యదర్శి బండారి భాస్కర్, నాయకులు జక్కిడి ప్రభాకర్, షకీల్ మిర్జా, బొంగు రఘు, లింగోజిగూడ డివిజన్ అధ్యక్షులు కిరణ్ కుమార్ మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు…

E-పేపర్

కోటిసంతకాల సేకరణలో అంకమ్మనగర్ లో దుకాణాల దగ్గర సంతకాల సేకరణ

కోటిసంతకాల సేకరణలో అంకమ్మనగర్ లో దుకాణాల దగ్గర సంతకాల సేకరణ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు స్థానిక అంకమ్మ నగర్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 17 మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తున్నందుకు కూటమి సర్కారుపై నిరసనగా కోటి సంతకాల కోడూరు గ్రామపంచాయతీ పరిధిలోని అంకమ్మ నగర్ లో షాాపుు యజమానుల దగ్గర సంతకాలు సేకరిస్తున్న కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్థానిక ఎంపిటిసి యు పుష్పలత, యనమాల చైతన్య మొదలగు వైసిపి నాయకులు పాల్గొనడం జరిగినది.

హైదరాబాద్

గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ సామాజిక భద్రత అష్టవ్యస్తం

పున్నమి హైదరాబాదు ఉప్పల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకొస్తున్న గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ సామాజిక భద్రత ముసయిదా అస్తవ్యస్తంగా ఉందని తెలంగాణ ట్రాన్స్పోర్ట్ and గీగ్ మరియు ఫ్లాట్ఫామ్ వర్కర్స్ ఫోరమ్ కమిటీ సభ్యులు తెలుపుతూ ప్రభుత్వం తీసుకొస్తున్న పాలసీలో కార్మికులకు సంక్షేమ పథకాలు ఏవిదంగా అందుతాయో స్పష్టత లేదని, నిధుల విషయంలో అవకతవకలు ఉన్నాయని మరిన్ని విషయాలు కంపెనీలకు అనుగుణంగా మార్చారని, ఇందులో మార్పులు చేర్పులు చేయాలని వర్కర్స్ యొక్క సంక్షేమము మరియు భద్రతకు సంబంధించిన విషయాలు ఇందులో లేవని మాట్లాడుతూ, అన్ని సంఘాలతో, కార్మికులతో మరొకసారి చర్చించాలని డిమాండ్ చేస్తూ 13/11/25 గురువారం రోజున కార్మికశాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేస్తామని సమావేశంలో పాల్గొన్న సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు ఈ సమావేశంలో బిజ్జుల రామకృష్ణారెడ్డి Tరాజశేఖర్ రెడ్డి , సతీష్ కుమార్ , అబ్దుల్ రావొఫ్ ,కిరణ్ కుమార్, వినయ్ భూషణ్, md ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం

– పాఠ్యపుస్తకాలను తరలించే ఆటో బోల్తా – నలుగురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరం నాగర్ కర్నూల్,(పున్నమి): నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పాఠ్యపుస్తకాలు తరలించడం కోసం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను అమాలీలుగా వినియోగించుకున్నారు.  పాఠ్యపుస్తకాలను ఆటోలో తరలిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.  ఈ ఘటనలో నలుగురు విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలకు పార్ట్ 2 పాఠ్యపుస్తకాలను ఆటోలో తరలించేందుకు 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను బరువైన పుస్తకాలను మోయిస్తూ వినియోగించారు. కాగా సాతాపూర్ గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు టైరు పేలి ఆటో బోల్తా కొట్టింది. 9వ తరగతి చదువుతున్న కార్తీక్,  అశోక్, నాని, శివ అనే విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో శివ అనే విద్యార్థి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ను వివరణ కోరగా తనకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం ఫై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

మహబూబ్ నగర్

అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర జిల్లా శాఖలు ప్రగాఢ సానుభూతి

*సాహితీ లోకానికి తీరని లోటు అందెశ్రీ మరణం* *పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా తేదీ 11/11/ 2025* *అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించి తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ మరియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శానమోని నరసింహులు శశి యాదవ్ గౌరవ సలహాదారులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, గోపాల్ జి, సహధ్యక్షులు వివేక్ భవాని ,సంయుక్త కార్యదర్శి అమీర్ పాషా, రాష్ట్ర బాధ్యులు వీరేందర్ గౌడ్, శ్రీనివాసులు ,వనపర్తి జిల్లా అధ్యక్షుడు సుధాకర్ ఆచారి రాష్ట్ర మహిళా కార్యదర్శి శాంతా రెడ్డి గారు, హైదరాబాదు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటస్వామి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు,తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు, రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా నిలవాలని వారికి సందర్భంగా డిమాండ్ చేశారు*

ఆదిలాబాదు

డబ్బు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలి – సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్ కమలాకర్, భూమన్న

ఆదిలాబాద్ రూరల్ మండలం పోతాగూడ గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో కౌన్సిలర్స్ కమలాకర్, భూమన్న లు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డబ్బు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, ఖాతాకు కేవైసీ తప్పనిసరి చేసుకోవాలని, నామినీలను పెట్టాలని తెలిపారు. బ్యాంకుల్లో గల ఇన్స్యూరెన్స్, పెన్షన్ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి తెలిపారు. డిజిటల్ పేమెంట్స్ గురించి, స్వయం ఉపాధి లోన్స్ గురించి, శిక్షణ గురించి తెలిపారు. సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపి 1930 టోల్ ఫ్రీ నెంబర్ గురించి వివరించారు. డిపాజిటర్లు మరణిస్తే వారి కుటుంబ సభ్యులు బ్యాంకును సంప్రదించి నిబంధనల ప్రకారం వచ్చే లబ్ధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిపిఎం మణికంఠ, గ్రామస్తులు మారుతి, కన్నీరం, శ్రీనివాస్, ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

కలాం స్ఫూర్తితో ముందుకెళ్లాలన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) భారత స్వాతంత్ర సమరయోధుడు, బహు భాష కోవిదుడు, దేశవిద్య రంగ పురోభివృద్ధికి కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. భారతదేశ మొదటి విద్యా శాఖ మంత్రి, మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి మరియు జాతీయ విద్య దినోత్సవం పురస్కరించుకొని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఆంధ్రప్రదేశ్

త్వరలో కనిగిరి కనకపట్నం అవుతుంది : సీఎం చంద్రబాబు

1996లో తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి కనిగిరి ప్రజలకు నీరు అందిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో మాసమే పార్కు ప్రారంబోత్వవంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి కాకుండా గోదావరి నీళ్లు కూడా జిల్లాకు తీసుకొస్తానని అన్నారు. ఇది జరిగితే కనిగిరి కంకపట్నం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పామూరుకు రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పుకొచ్చారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.