మౌలానా అబ్దుల్ కలాం అజాద్ 137 వ జయంతి వేడుకలు.
రాజమహేంద్రవరం : నవంబర్ 11, మంగళవారం మౌలానా అబ్దుల్ కలాం అజాద్ 137 వ జయంతి సందర్బంగా రాజమండ్రి స్థానిక జాంపేట మార్కెట్ లో అజాద్ చౌక్ వద్ద ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో అజాద్ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేయడం జరింగింది. అబ్దుల్ కలాం సమితి అధ్యక్షులు ఎం.డి సెహనశా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఈసందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ తరపున అధ్యక్షులు బాలేపల్లి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని మౌలానా అబ్దుల్ కలాంకు జోహార్లు అర్పించారు ఈసందర్భంగా బాలేపల్లి మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్ర ఉద్యమం లో మౌలానా ప్రముఖ పాత్ర పోసించారాని స్వాతంత్ర అనంతరం ఈ దేశ మొదటి విద్యా శాఖ మంత్రివర్యులు గా పనిచేసి విద్యా వ్యవస్థ లో పెను మార్పులు తీసుకొని వచ్చారని దేశంలో ఐఐటీ లు యూనివర్సిటీలు స్థాపించి ఈనాటి దేశ అభివృద్ధికి బాటలు వేశారని దేశములో హిందూ ముస్లిం ఐక్యతకు ఇదే నిదర్శనం అని నేటి మత తత్వం శక్తుల మాయ లో పడవద్దు అని మాట్లాడరు. కొవ్వురి శ్రీనివాస్ మాట్లాడుతూ మౌలానా అబ్దుల్ కలాం సేవలు నిత్య స్మరనీయం అని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం లో మహ్మద్ అలీ, లాలఖాన్ మజీద్ అధ్యక్షులు, మొహమ్మద్ ఆరీఫ్, నాయీమ్ ఉదీన్, సల్మాన్, భాష, ఖాన్ బాబు, మొయిన్, రబ్బానీ, షబ్బెర్, తదితర ముస్లీమ్ సోదరులు తో పాటు కాంగ్రెస్ నాయకులు ఇజ్జరౌతు సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.










