విశాఖపట్నం
గాజువాక, నవంబర్ : (పున్నమి ప్రతినిధి) గాజువాక నియోజకవర్గంలోని దువ్వాడలో గల సినర్జీస్ క్యాస్టింగ్ లిమిటెడ్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు గత ఏడు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంస్థ ఎదుట ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఉద్యోగుల ఆందోళనకు సంఘీభావంగా వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు, కార్పొరేటర్ పి.వి. సురేష్ హాజరై మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ, “ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే నిలుస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో 86వ వార్డు అధ్యక్షులు చేగొండి శ్రీనివాసరావు, వాడపల్లి రామచంద్రరాజు, చిట్టి బాలకృష్ణ, భూపతిరాజు శ్రీనివాసరాజు, శ్రీనివాస్ పట్నాయక్, రమణారెడ్డి, వెంకట్రావు, జీవీ రమణరెడ్డి, సినర్జీస్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్, కార్యదర్శి దాసు, జగన్, దేవర సత్తిబాబు, యువీ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.