Saturday, 21 March 2026

Blog

విశాఖపట్నం

ఏపీలో ట్రిలియల్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం*

*ఏపీలో ట్రిలియల్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం* *గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి* *ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ఏకైక అజెండా* *ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది* *స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో ముందుకు వెళ్తున్నాం* *సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్* *న్యూఢిల్లీ* నవంబర్ (విశాఖ పున్నమి ప్రతినిధి) ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ పై ఢిల్లీలో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో ఈ నెల 14,15 తేదీల్లో జరగబోయే సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు మిమ్మల్ని ఆహ్వానించేందుకు ఇక్కడకు వచ్చాను. రాష్ట్రం కోసం యువగళం పేరుతో 3,132 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పాదయాత్రలో ఎదురైన అనేక సంఘటనలు నన్ను తీర్చిదిద్దాయి. పాదయాత్ర సమయంలో గంగాధర నెల్లూరులో మోహన అనే మహిళతో మాట్లాడాను. తన భర్త మద్యానికి బానిసై చనిపోయాడని, రోడ్డు పక్కన బజ్జీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారని సదరు మహిళను అడిగినప్పుడు.. తన ఇద్దరు పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఆ సమయంలో యువత అంతా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అడిగారు. *గత 16 నెలల్లో ఏపీకి 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి* ఎన్నికల సమయంలో మేం ఆరు హామీలు ఇచ్చాం. మొదటి హామీ కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పిస్తామని చెప్పాం. ఇది కేవలం లక్ష్యం మాత్రమే కాదు.. ఇది మా యువతకు ఇచ్చిన ప్రమాణం. దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటివరకు చేపట్టని ఎంప్లాయిమెంట్ విషన్ ఇది. అందుకే మేం రూపొందించిన ప్రతి పాలసీ కూడా ఉద్యోగాల సృష్టికోసమే రూపొందించాం. ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పెట్టుకున్నాం. గత 16 నెలల్లో 120 బిలయన్ డాలర్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఇవి కేవలం సంతకాలకి పరిమితమైన ఎంవోయూలు కావు. నిజమైన ప్రాజెక్టులు. కొన్ని ప్రాజెక్టులకు ఎంవోయూలు కూడా కుదుర్చుకోలేదు. ఉదాహరణకు ఆర్సెలర్ మిట్టల్. దేశంలో అతిపెద్ద ఉక్కు కర్మాగారం. ఆర్సెలర్ మిట్టల్ తో మేం ఎలాంటి ఎంవోయూ చేసుకోలేదు. ఆదిత్య మిట్టల్ తో ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆ సంస్థ వచ్చింది. మరో ఉదాహరణ గూగుల్. దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ డేటా సిటీ విశాఖకు వచ్చింది. దేశంలోనే ప్రముఖ 10 సోలార్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీల్లో 5 సంస్థలు ఏపీని ఎంచుకున్నాయి. బీపీసీఎల్ లక్ష కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్రాజెక్ట్ ను స్థాపిస్తోంది. ఎన్టీపీసీ రూ.1.65 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ను అభివృద్ధి చేస్తోంది. *స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం* ఈ పెట్టుబడుల ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయనేదే ముఖ్యం. విశాఖలో జరిగే పార్టనర్ షిప్ సమ్మిట్ లో కూడా పెట్టుబడులకు వేగవంతమైన సౌకర్యాల కల్పన కోసం ఏపీని ఎంచుకోవాలనే థీమ్ తో ముందుకు వెళ్తున్నాం. రాష్ట్రంలో పెట్టుబడుల వేగం ఎంతో పెరిగింది. స్థానిక కంపెనీలు, ఎంఎస్ఎంఈలు కూడా వెయ్యి కోట్లకు పైగా క్యాపిటల్ ఎక్స్ పాన్షన్ చేస్తున్నాయి. నెల రోజులు ఆలస్యం అయినా మొత్తం బిజినెస్ ప్లాన్ మారిపోతోంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది చాలా ముఖ్యం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం. అందుకే టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు వచ్చాయి. ఇది కేవలం ఐటీ రంగానికే కాదు. బ్లూ కాలర్ ఉద్యోగాలు, హాస్పిటాలిటీ వరకు విస్తరించింది. పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీగా గుర్తించిన తొలి రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. వచ్చే మూడేళ్లలో 50వేల హోటల్ గదులు సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. *ఏపీలో నమో(NAMO) ప్రభుత్వం ఉంది* పెట్టుబడిదారులు ఏపీని ఎందుకు ఎంచుకోవాలో మూడు కారణాలు చెబుతాను. ఒకటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. రెండోది సమర్థవంతమైన నాయకత్వం. చంద్రబాబునాయుడు గారికి అనుభవం కలిగిన మంచ్రి ట్రాక్ రికార్డ్ ఉంది. మూడోది పరిపాలన. పలు రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండగా.. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. ఏపీలో నమో(NAMO) ప్రభుత్వం ఉంది. నాయుడు గారు, మోడీ గారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం. ఈ కారణాల వల్ల యువ పారిశ్రామిక వేత్తలు ఏపీని ఎంచుకుంటున్నారు. విశాఖలో నవంబర్ 14,15 తేదీల్లో పార్టనర్ షిప్ సమ్మిట్ నిర్వహణకు ఏపీకి అవకాశం ఇచ్చినందుకు సీఐఐకి ధన్యవాదాలు. చంద్రబాబునాయుడు గారితో సీఐఐకి మంచి అనుబంధం ఉంది. విశాఖలో జరిగే పార్టనర్ షిప్ ఎందుకంటే.. పెట్టుబడిదారులు, పాలసీ మేకర్లు, ప్రభుత్వం, ప్రజలందరూ కలిసి భవిష్యత్ అవకాశాలను పరిశీలించే వేదిక. క్వాంటమ్, ఏఐ, మెటీరియల్ సైన్సెనస్ రంగాల్లో భవిష్యత్ అవకాశాలను పరిశీలించబోతున్నాం. 120 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వం 410 ఒప్పందాలు కుదుర్చుకోనుంది. వీటి ద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు ఈ సమ్మిట్ కు రానున్నారు. మొత్తం 45 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 12 అంతర్జాతీయ సంస్థలు, జీ20 దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ వక్తలు హాజరుకానున్నారు. ఈ సదస్సులో మొత్తం 48 సెషన్లు, ఒక ప్లీనరీ, 27 సాంకేతిక సెషన్లు, 3 స్టాండ్ అలోన్ సెషన్లు, 11 రాష్ట్ర పరమైన సెషన్లు ఉంటాయి. *ఏపీలో ట్రిలియల్ డాలర్ల పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం* పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే సమయంలో రూ.2.7 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. అప్పుడే దేశం విజయం సాధిస్తుంది. ఏపీలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. క్లస్టర్ల వారీ విధానంలో పారిశ్రామికాభివృద్ధికి కృషిచేస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు.

సి ఐ ఐ సమ్మిట్ కు జీవీఎంసీ ఏర్పాట్లు సర్వం సిద్ధం.

సి ఐ ఐ సమ్మిట్ కు జీవీఎంసీ ఏర్పాట్లు సర్వం సిద్ధం. *దేశ ,విదేశాల అతిథులను ఆకర్షించేలా నగర అభివృద్ధి, సుందరీకరణ. *దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమానికి శ్రీకారం. -జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖ వేదికగా నవంబరు 14 ,15 తేదీల్లో జరుగనున్న 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సు కు జీవీఎంసీ చేపట్టిన ఏర్పాట్లను సర్వం సిద్ధం చేయడమైనదని, పరిశుభ్రత ప్రాధాన్యత దిశగా దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహించబడుతుందని, దేశ, విదేశాల నుండి పారిశ్రామికవేత్తలు, అతిథులు, ప్రతినిధులు ఈ పెట్టుబడుల సదస్సుకు విచ్చేయుచున్నందున వారిని ఆకట్టుకునేలా విశాఖ నగరాన్ని దీర్ఘకాలిక పద్ధతిలో మరింత అభివృద్ధి పరుస్తూ, సుందరీకరణ పనులతో తీర్చిదిద్దడం జరిగినదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం స్వచ్ఛతకు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తున్నారని, ఆ దిశగా ఆయన ఆదేశాల మేరకు విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుచున్న ఈ సదస్సును “జీరో వేస్ట్ మోడల్ ” కార్యక్రమంగా శ్రీకారం చుట్టి దేశంలోనే మొట్టమొదటి కార్యక్రమంగా చేపడుతున్నామని, ఉత్పత్తి అయ్యే అన్ని రకాల వ్యర్థాలను 100 శాతం రీసైకిల్ చేసి పునర్వినియోగం చేయనున్నామని, అలాగే ప్రాంగణం సమీపంలో ఆన్ సైట్ కంపోస్ట్ యూనిట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని అలాగే ఈ కార్యక్రమం దేశంలో మొట్టమొదటి కార్యక్రమంగా విశాఖ నగరంలో జరుగుచున్నదని, ఇకపై విశాఖ నగరంలో జరుగబోయే అన్ని కార్యక్రమాలు జీరో వేస్ట్ కార్యక్రమాలుగా ఏర్పాటు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విశాఖ నగర అభివృద్ధి ,సుందరీకరణ పనులను జీవీఎంసీ చేపట్టి పూర్తిచేసిన పనులను కేవలం సిఐఐ భాగస్వామ్య సదస్సు కొరకు మాత్రమే కాకుండా త్వరలో విశాఖలో జరుగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, నేవీ డే, తదితర కార్యక్రమాల కొరకు విశాఖ నగరం సుందరీకరణతో సిద్ధంగా ఉండేలా దీర్ఘకాలిక కార్యచరణ చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమైనదన్నారు. ముఖ్యంగా విశాఖ నగరానికి విచ్చేస్తున్న సందర్శకులు, విహారయాత్రికలు, అతిధులు బీచ్ ను సందర్శిస్తున్నందున బీచ్ రోడ్లను, ఫుట్ పాత్ లను,అందమైన మొక్కలతో పచ్చదనంతో సెంటర్ మీడియన్ లను, విద్యుత్తు కాంతులను , రాత్రిపూట కూడా ఎక్కువ కాంతినిచ్చేలా ఆర్కే బీచ్ లో నాలుగు అతిపెద్ద బీచ్ సాండ్ పోల్స్ లను ఏర్పాటుచేసి రంగు రంగుల విద్యుత్ దీపాలతో బీచ్ ని సుందరంగా తీర్చిదిద్దడమైనదన్నారు. అలాగే భాగస్వామ్య సదస్సుకు విచ్చేయనున్న అతిథులను ఆకర్షించుకునేందుకు గాను జీవీఎంసీ యంత్రాంగం మూడు నెలల కాలం నుండి నగరంలో 26 స్ట్రెచెస్ లో ఐదు కేటగిరీలలో రోడ్లు , ఫుట్పాతులు, సెంటర్ మీడియన్ లు, పలు జంక్షన్ లు, బస్ బే లు, వినూత్న ఆకృతి గల బొమ్మలు, పచ్చదనంతో కూడిన ఆకర్షణీయమైన మొక్కలు, విద్యుత్ దీపాలంకరణ, వాల్ పెయింటింగులు, మ్యూరల్ ఆర్ట్స్, తదితర అభివృద్ధి, సుందరీకరణ పనులను పూర్తి చేసామన్నారు. సదస్సు ప్రాంగణం ,పరిసరాలలో , పార్కింగ్ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, టాయిలెట్ల సదుపాయాన్ని ఏర్పాటు చేయడమైనదని, అలాగే వ్యర్థాలను వెలికి తీసి నిత్య పరిశుభ్రత కొరకు పారిశుద్ధ్య కార్మికులను 15వ తేదీ వరకు మూడు షిఫ్ట్ ల లో 24 గంటలు విధులు నిర్వహించేలా ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసేందుకు జీవీఎంసీ అధికారులు ,జోనల్ కమిషనర్లు, అన్ని విభాగాలు మూడు నెలల నుండి నిరంతరం శ్రమించి నగర అభివృద్ధి ,సుందరీ కరణ పనులను తీర్చిదిద్దారన్నారు.

విశాఖపట్నం

మాధవధార ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి డీఎస్ బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* మాధవధార ఎస్సీ బాలికల కళాశాల వసతి గృహంలో మంత్రి డీఎస్ బీవీ స్వామి ఆకస్మిక తనిఖీ హాస్టల్ పరిసరాలు పరిశీలించిన మంత్రి స్వామి విద్యార్థినిలతో ముఖాముఖి నిర్వహించి హాస్టల్లో సౌకర్యాలు, సమస్యలు తెలుసుకున్న మంత్రి విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని సిబ్బందికి మంత్రి సూచన విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ వైసీపీ హయాంలో సమస్యలకు నిలయాలుగా ఉన్న గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలు నేడు పరిశుభ్ర,ఆరోగ్యకర వాతావరణంతో విద్యార్థులకు ఆనంద నిలయాలుగా మారాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.143 కోట్లతో గురుకులాలు, సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతులు చేశాం గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం పేద పిల్లలు సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం అని మంత్రి డా. డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు

విశాఖపట్నం

విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాసీలగా టైం స్కేల్

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* నవంబర్ 13న విశాఖపట్నం పోర్ట్ అథారిటీస్ ఆధ్వర్యంలో జరగబోయే బోర్డ్ మీటింగ్లో, గత 30 సంవత్సరాల నుండి విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాసీలగా తక్కువ జీతాలకు పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, టైం స్కేల్ విధానంగా జీతభత్యాలు 43240 రూపాయలకి పెంచుతూ, రేపు బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకోవాలని ,విశాఖపట్నం పోర్ట్ పూల్ కళాశీల గౌరవ అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ ఈరోజు విశాఖ పోర్టు ఏవోబి ఆఫీస్ వద్ద విశాఖ పోర్ట్ చైర్మన్ అంగముత్తు గారిని ,సెక్రటరీ వేణుగోపాల్ గారిని కోరారు. వారు సానుకూలంగా స్పందించారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ,పవన్ కళ్యాణ్ గారు,నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు,కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రులు శర్వానంద్ సోనావాళ్ళ, సంతన్ ఠాకూర్, విశాఖ ఎంపీ శ్రీ భరత్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పళ్ళ శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు విశాఖ జిల్లా బిజెపి అధ్యక్షులు పరుశురామరాజు పోర్ట్ ఫుల్ కళాశాల అందరికీ టైం స్కేల్ చెయ్యమని గతంలో ఇచ్చిన లేఖలను పరిగణంలోకి తీసుకోవాలని, బోర్డు మీటింగ్ ద్వారా న్యాయం చేయాలని సెక్రటరీ సిహెచ్ పోతురాజు, అధ్యక్షులు కె.అప్పారావు, అలీమ్, వాసుపల్లి రాంబాబు, నాయుడు తదితరులు కోరారు.

విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్, వార్డ్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం

దక్షిణ నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్, వార్డ్ అధ్యక్షుల ప్రమాణ స్వీకారం *విశాఖపట్నo నవంబర్ పున్నమి ప్రతినిధి * దక్షిణ నియోజకవర్గంలో ఆయా వార్డులకు సంబంధించి క్లస్టర్ ఇన్చార్జ్, వార్డు అధ్యక్షుల పదవులకు ప్రమాణ స్వీకార కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగింది. టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ సీతమ్ రాజు సుధాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలో పలు వార్డుల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకటో నెంబర్ క్లస్టర్ ఇన్చార్జిగా షేక్ జుబేర్, కో క్లస్టర్ ఓంకార్ సాయి విశాల్, రెండో నెంబర్ క్లస్టర్ దాసన్న సత్యనారాయణ, కో క్లస్టర్ మండపాటి వెంకట సత్య భవాని, మూడో నెంబర్ క్లస్టర్ పుక్కల రాజేశ్వరి, కో క్లస్టర్ వేణు యానగి, నాలుగో నెంబర్ క్లస్టర్ గా విల్లూరి తిరుమల, కో క్లస్టర్ బంటుపల్లి శ్రీనివాసరావు, ఐదో నెంబర్ క్లస్టర్ విల్లూరి భాస్కరరావు, కో క్లస్టర్ మున్నం బాలాజీ, ఆరో నెంబర్ క్లస్టర్ వాసుపల్లి దానయ్య, కో క్లస్టర్ ఎం సునీత, ఏడో నెంబర్ క్లస్టర్ గా కేదారి లక్ష్మి, కో క్లస్టర్ గా పెనుమల్ల వెంకట రామారెడ్డి, 8 నెంబర్ క్లస్టర్ బంగారు రవిశంకర్ కో క్లస్టర్ కొండ చిన్న, తొమ్మిదవ నంబర్ క్లస్టర్ పోలిపల్లి జ్యోతి, కో క్లస్టర్ పెంటపల్లి సత్యనారాయణ, పదో నెంబర్ క్లస్టర్ ఉరికిటి నారాయణ రావు, వెంకటేశ్వర్లు కో క్లస్టర్ రావి వెంకటేశ్వర్లు, 11 నెంబర్ క్లస్టర్ వానపల్లి గాయత్రి ఫణి కుమారి, కో క్లస్టర్ పల్లా నగేష్, 12వ నెంబర్ క్లస్టర్ గొలగాని వీరా రావు, కో క్లస్టర్ పీతల పోల రావు లు ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. వార్డు అధ్యక్షులుగా … 27 వ వార్డ్ అధ్యక్షుడిగా అల్లూరి సత్యనారాయణ రెడ్డి, 29వ వార్డు అధ్యక్షుడిగా కందిపిల్లి సతీష్ కుమార్, 30 అధ్యక్షుడిగా డోకర రమణ, 31 వ వార్డ్ అధ్యక్షుడిగా బత్తిన వెంకట సత్య నవీన్ కుమార్, 32 వ వార్డు అధ్యక్షుడిగా దాసరి దుర్గారెడ్డి, 33 వ వార్డు అధ్యక్షుడిగా కర్రి నీలకంఠం రావు, 34వ వార్డు అధ్యక్షుడిగా వాసుపల్లి రామ్ కుమార్, 35 వ వార్డు అధ్యక్షుడిగా, బొత్స రామురెడ్డి, 36వ అధ్యక్షుడిగా, కోడూరు శివయ్య, 37వ అధ్యక్షుడిగా పిల్ల తాతయ్యలు, 38వ వార్డు అధ్యక్షుడిగా మజ్జి త్రినాధరావు, 39 వ వార్డు అధ్యక్షుడిగా మైలపల్లి శ్రీనివాసరావు, 41 వార్డ్ అధ్యక్షుడిగా ఐతి మధుబాబు లు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్చార్జులు ప్రమాణస్వీకారం చేశారు.

విశాఖపట్నం

జనరల్ బోగీలు పెంచాలి*

*జనరల్ బోగీలు పెంచాలి* *కిక్కిరిసి పోతున్న జనరల్ బోగీలు* *కొని రైళ్ళ లో జనరల్ బోగీలు తక్కువగా ఉండడం వలన రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తున్న జనరల్ భోగి ప్రయాణికులు* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి* విశాఖ నుంచి విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లలో తగినన్ని జనరల్ కోచ్లు లేకపోవడం వలన తమంత ఇబ్బందులు పడుతున్నాం అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,గోదావరి ఎక్స్ప్రెస్ లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ముందు ఒక జెనరలు కోచ్ వెనుక ఒక జనరల్ కోచ్ మాత్రమే పెడుతున్నారని దీని వలన తమకు ఎంతో ఇబ్బంది గా ఉంటుందని బాగా కిక్కిరిసి పోయి ఉంటుందని ఇంచు మించు సికింద్రాబాద్ స్టేషన్ వరకు రిటర్న్ చూసుకుంటే అనకాపల్లి దువ్వాడ స్టేషన్ వరకు ఇదే పరిస్థితి వుంటుంది అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,విశాఖపట్నం తిరుపతి , కోర్బా ఎక్స్ప్రెస్ లో కూడా తిరుపతి వైపుగా ప్రయాణించేటప్పుడు జనరల్ కోచ్లు సరిపోవడం లేదని దీని ఫలితంగా రిజ్వేషన్ కోచ్లను ఆశ్రయించాల్సి వస్తుందనీ టి టి లు తమకు ఫైన్ లు విధిస్తున్నారు అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ లో కూడా ఇదే పరిస్థితి ఉందని జనరల్ కోచ్ల సంఖ్య పెంచలనీ పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,విశాఖపట్నం విజయవాడ,విజయవాడ విశాఖపట్నం ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్ కు జనరల్ కోచ్ లను కేటాయించాలని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,, కన్యాకుమారి దిబ్రుఘాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు 10వరకు జనరల్ బోగీలు ను కేటాయించలని తగినన్ని జనరల కోచ్లు లేకపోవడం మొత్తం రైలు స్లీపర్ కోచ్లు తో సహా కిక్కిరిసిన ప్రయాణికులు తో తీవ్ర ఇబ్బందులు పడుతూ తాము ప్రయాణాలు చేస్తున్నాము అని ముఖ్యం గా మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,ఇప్పటికైనా రైల్వే శాఖ మరియు మన నాయకులు స్పందించి తగినన్ని జనరల్ కోచ్ లను ఏర్పాటు చేయిస్తారని తాము ఆశిస్తున్నాము అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,

విశాఖపట్నం

14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రాక*

*14న ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖ రాక* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఈ నెల 14వ తేదీన ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ విశాఖపట్నం రానున్నారు. ఈ నెల 14వ తేదీన ఉదయం 8.30 గంటలకు వాయు మార్గం ద్వారా విశాఖపట్నం చేరుకొని అక్కడ నుండి ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలసి ఇంజనీరింగ్ గ్రౌండ్ లో అల్పాహార విందులో పాల్గొంటారు. అనంతరం ఉదయం 8.55 గంటలకు 30వ సిఐఐ పార్ట్ నర్షిప్ లో పాల్గొంటారు. అదే రోజున ఉదయం 11.15 గంటలకు బయలుదేరి ఐఎన్ఎస్ డేగ చేరుకొని అక్కడ నుండి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఈమేరకు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి ,ఉప రాష్ట్రపతి సెక్యూరిటీ ఆఫీసర్ సింగ్,జాయింట్ కలెక్టర్,మయూర్ అశోక్,ఇతర ఉన్నత అధికారులు yvs మూర్తి ఆడిటోరియం లో ఏర్పాట్లపై సమీక్ష చేశారు.ఉప రాష్ట్రపతి పర్యటనకు అన్ని పటిష్టమైన ఏర్పాట్లు , పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా,పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సమావేశం లో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలో “అభ్యుదయం సైకిల్ ర్యాలీ” ప్రారంభం-* *హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి చేతులమీదుగా ప్రారంభం*

*మాదకద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలో “అభ్యుదయం సైకిల్ ర్యాలీ” ప్రారంభం-* *హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి చేతులమీదుగా ప్రారంభం* *“మాదకద్రవ్యాల రహిత భవిష్యత్తు వైపు పెడలింగ్!”* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలోని అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం మరియు శ్రీకాకుళం జిల్లాలలో “అభ్యుదయ సైకిల్ ర్యాలీ” ప్రారంభమైంది. విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారి ఆలోచనలతో, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో సుమారు 30 రోజుల పాటు, 1,000 కిలోమీటర్ల దూరం సైకిల్ యాత్రగా కొనసాగుతుంది. ర్యాలీని ఈ రోజు ఉదయం పాయకరావుపేటలోని గౌతమ్ థియేటర్ జంక్షన్ వద్ద గౌరవ హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు ఘనంగా ప్రారంభించారు. అనంతరం మంత్రి గారు స్వయంగా సైకిల్ తొక్కి ర్యాలీని శ్రీప్రకాశ్ కాలేజ్ వరకు నడిపారు. విద్యార్థులతో కలిసి మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతిజ్ఞ చేయించి, “మాదకద్రవ్యాలు వద్దు – జీవితమే ముద్దు” అంటూ ఆకట్టుకున్నారు. ర్యాలీ ప్రారంభానికి విద్యార్థుల ఫ్లాష్‌మాబ్ ఆకర్షణగా నిలిచింది. స్థానిక ప్రజలు, విద్యార్థులు అడుగడుగునా ర్యాలీకి హర్షధ్వానాలు చేశారు. *హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు మాట్లాడుతూ –*  “మాదకద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయం. యువతే మన భవిష్యత్తు – వారి జీవితాలను మత్తు పదార్థాలు చెడగొట్టకుండా కాపాడటం మనందరి బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనలో ఉక్కుపాదం మోపింది.  ఈ దిశగా ‘ఈగల్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించాలి. గంజాయి రవాణా చేసినా, సేవించినా వెంటనే 1972 నంబర్‌కి కాల్ చేయండి – పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుంటారు.  ప్రస్తుతం కఠినమైన NDPS చట్టాలు అమల్లో ఉన్నాయి. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. డ్రగ్స్‌కు నో, జీవితానికి యెస్ చెప్పుదాం” అని ఆమె పిలుపునిచ్చారు. *విశాఖపట్నం రేంజ్ డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారు మాట్లాడుతూ –*  అభ్యుదయం సైకిల్ యాత్రలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాయకరావుపేట నియోజకవర్గం నుండి ప్రారంభించడం జరిగింది. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం విశాఖపట్నం రేంజ్ పరిధిలో సుమారు 1000 కిలోమీటర్లు సైకిల్ యాత్రలో ఐదు జిల్లాలకు చెందిన 25 మంది బృందంతో కూడిన పోలీస్ సిబ్బంది వెళ్తున్న మార్గంలో స్కూల్స్, కాలేజీలు మరియు గ్రామాలు,ముఖ్య కూడళ్ల వద్ద ప్రజలకు మాదక ద్రవ్యాలు అక్రమ వినియోగం పట్ల అవగాహన, చైతన్యం కల్పించడం జరుగుతుంది. డిఐజి గారు రేంజ్ ఫరిదిలో అన్ని జిల్లాల ఎస్పీలతో సంప్రదించి ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ వారి వారి ప్రాంతాల్లో ర్యాలీ జరిగినప్పుడు ఆ జిల్లాల ఎస్పీలు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డిఐజి గారు ఆదేశించారు.  “ఈ ‘అభ్యుదయ సైకిల్ ర్యాలీ’ మాదకద్రవ్యాల నిర్మూలనలో ఒక చారిత్రాత్మక అడుగు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారి మార్గదర్శకత్వంలో గంజాయి నిర్మూలనలో విప్లవాత్మక మార్పు చోటు చేసుకుంది.  గత 14 నెలల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పంటను పండించే రైతులకు అవగాహన కల్పించి, వారికి ప్రత్యామ్నాయ పంటల సాగు అవకాశాలు కల్పించాము. ఏఎస్ఆర్ జిల్లాలో 2024-2025 వ సంవత్సరం కి గాను 10,817.25 ఎకరాల్లో సుమారు 46.8 లక్షల మొక్కలను ప్రత్యామ్నాయ పంటలు పంపిణి చేయడం జరగగా, 2025-2026 వ సంవత్సరం కి గాను 196 మంది రైతులకు 210 ఎకరాలు లో 1,35,453 యూకలిప్టస్ మొక్కలు పంపిణీ చేయడం జరిగినది.  దీని ఫలితంగా, గంజాయి పంట సాగు 2021 -2022 వ సంవత్సరం కి గాను 7515 ఎకరాలలో సాగు చేయగా 2024-2025 వ సంవత్సరం కి గాను 93 ఎకరాలకు, 2025-2026 వ సంవత్సరం కి గాను ZERO సాగు (Cultivation) కు తీసుకురావడం జరిగినది. ఆ పంటను పూర్తిగా ధ్వంసం చేసి, చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. డ్రోన్ లు, ఉపగ్రహ చిత్రాల ద్వారా నిరంతరం పర్యవేక్షించడం వలన గంజాయి సాగు తగ్గిందని నిర్ధారించబడింది.  గత 14 నెలల్లో రేంజ్ పరిధిలో 865 కేసుల్లో 2,500 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 95 మందిపై PIT NDPS, 61 మందిపై PD యాక్ట్, 1,474 మంది పై సస్పెక్ట్ షీట్లు తెరవడం జరిగింది.  గంజాయి అక్రమ వ్యాపారంలో పాల్గొన్న వారిపై 14 ఆస్తి కేసులు నమోదు చేసి,13 మంది నిందితులపై రూ.10,04,89,621/- కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాము.  2024-2025 సంవత్సరానికి గాను 53 NDPS కేసుల్లో 87 మందికి 10 నుండి 20 సంవత్సరాల కఠిన శిక్షలు విధించబడ్డాయి.  2024-2025 సంవత్సరానికి గాను 1109 కేసులు లో 60,369 కేజీ ల గంజాయి ని పట్టుకొని, 768 వాహణములను సీజ్ చేయడం జరిగినది.  ఇప్పటివరకు 18,314 “సంకల్పం” అనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు – 10,41,325 మంది హాజరయ్యారు – 13,606 గ్రామాలు/పట్టణాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి – 4,649 విద్యా సంస్థలు – సుమారు 4 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.  గంజాయి పిర్యాదులకోశం 3 88 డ్రాప్ బాక్సులు ను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు.  ఈ చర్యలన్నీ యువత భవిష్యత్తు రక్షణ కోసమే. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఈ ర్యాలీ విజయవంతం కావడానికి సహకరిస్తున్న విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” *జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ –*  “మాదకద్రవ్యాల సేవనాన్ని, అక్రమ రవాణాను అరికట్టే దిశగా ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు విశాఖపట్నం రేంజ్ పరిధిలో ‘అభ్యుదయ సైకిల్ ర్యాలీ’ను ప్రారంభించాం.  ఈ ర్యాలీ సుమారు 30 రోజుల పాటు 800 కిలోమీటర్ల దూరం కొనసాగుతుంది. ర్యాలీ సందర్భంగా ప్రతి మండలంలో అవగాహన సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యార్థులతో చర్చలు జరిపి మత్తు పదార్థాల దుష్ప్రభావాలను వివరించనున్నాం.  గత ఏడాది కాలంలో అనకాపల్లి జిల్లా పరిధిలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పటివరకు 3,500కి పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.  మత్తు పదార్థాల గురించి ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972 లేదా 112కి కాల్ చేయాలని ప్రజలను, యువతను కోరుతున్నాను. ఈ ర్యాలీకి అండగా నిలిచిన హోం శాఖ మంత్రివర్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి, రేంజ్ డీఐజీ గోపినాథ్ జట్టి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరికీ నా కృతజ్ఞతలు.” ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన్ రావు, సబ్‌ డివిజన్ డీఎస్పీలు శ్రీమతి ఎం.శ్రావణి, శ్రీ పి.శ్రీనివాసరావు, శ్రీ వి.విష్ణు స్వరూప్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు , పాయకరావుపేట ఇన్స్పెక్టర్ అప్పన్న, ఎక్సైజ్ మరియు ఇతర జిల్లా అధికారులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి

వైద్య విద్య సేవలను ప్రైవేటీకరణను వ్యతెరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ చేపట్టన వైకాపా

శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి,MLC సిపాయి సుబ్రమణ్యం నాయకత్వంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ కార్యకర్తలు నినాదాలు చేస్తూ ర్యాలీగా తరలివెళ్లి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా వైకాపా నాయకులూ మాట్లాడుతూ.. పేద ప్రజల వైద్యవిద్య హక్కును కాలరాస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టామని పేద, మధ్యతరగతి ప్రజలకు దక్కాల్సిన వైద్య విద్య, వైద్య సేవలను ప్రైవేటీకరణ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగిందన్నారు. అనంతరం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకుల బృందం ఆర్డీవో కార్యాలయ ఏవోని కలిసి, పేద విద్యార్థులు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ, ఈ ప్రైవేటీకరణ చర్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెమరాండంను సమర్పించారు. ఈ ర్యాలీలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, పట్టణ ప్రాంతం నుండి భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు,కార్యకర్తలు ముఖ్యంగా మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.