Saturday, 21 March 2026

Blog

E-పేపర్

నంద్యాల ఐఎంఏ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారంఐఎంఏ ద్వారా విస్తృత సేవా కార్యక్రమాలు చేయాలి: డాక్టర్ రవి కృష్ణ

భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం రాత్రి మధు మణి సమావేశ భవనంలో ఘనంగా నిర్వహించారు.ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. గత సంవత్సర కాలంగా డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ పనిల్ అధ్యక్ష కార్యదర్శులుగా నంద్యాల ఐఎంఏ ద్వారా చేసిన 146 కార్యక్రమాలను మల్టీమీడియా ప్రజెంటేషన్ ద్వారా డాక్టర్ మధుసూదనరావు వివరించారు. నంద్యాల ఐఎంఏ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ కె.శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ రఫీ, కోశాధికారిగా డాక్టర్ హరితల తో పాటు మిగిలిన కార్యవర్గంతో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మాధవి డాక్టర్ సునీత డాక్టర్ శైలజలతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులతో డాక్టర్ మధుసూదనరావు ప్రమాణస్వీకారం చేయించారు. నంద్యాల ఐఎంఏ అకాడమిక్ విభాగం ఏ.ఎం.ఎస్. అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత కోశాధికారి డాక్టర్ శశి కిరణ్ లతో పాటు కార్యవర్గ సభ్యులతో ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి ప్రమాణం చేయించారు. 38 మంది వివిధ పదవీ బాధ్యతలను నంద్యాల ఐఎంఏ లో, 32 మంది మహిళా వైద్య విభాగం బాధ్యతలను, 15 మంది ఏఎంఎస్ విభాగ బాధ్యతలను ఈ సందర్భంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు, నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలకు నంద్యాల ఐ.ఎం.ఏ.కు రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్నదని, ఆ పేరు నిలబెట్టుకునేలా నంద్యాల ఐఎంఏ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని, ఐక్యతతో అసోసియేషన్ ను బలోపేతం చేయాలని నూతన కార్యవర్గానికి సూచించారు. ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ఐఎంఏ లో నూతన సభ్యులను చేర్చుకుని బలోపేతం చేస్తామని, రాష్ట్రంలో నంద్యాల ఐఏఎస్ ఉన్న ప్రతిష్టను ఇనుమడింప చేస్తామని ప్రకటించారు. మహిళా వైద్య విభాగ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మాధవి డాక్టర్ సునీత డాక్టర్ శైలజలు మాట్లాడుతూ తమ మహిళా వైద్య విభాగం ద్వారా విస్తృతంగా వైద్య ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను ప్రజలలో నిర్వహిస్తామని, వైద్య శిబిరాలను నిర్వహించి సేవలు కొనసాగిస్తామని అన్నారు. నంద్యాల ఐఎంఏ అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ (ఏ.ఎం.ఎస్.) విభాగం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ మల్లీశ్వరి డాక్టర్ లలిత తమ విభాగం ద్వారా నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను నిర్వహించి వైద్యులకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తామన్నారు. తదుపరి నంద్యాల గత రెండు సంవత్సరాల కాలంలో వివిధ పదవులలో బాధ్యతలు నిర్వహించిన వైద్యులను నూతన కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏవి సుబ్బారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర పిపిడబ్ల్యూ స్కీం వైస్ చైర్మన్ డాక్టర్ అనిల్ కుమార్, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ జఫరుల్లా, డాక్టర్ వినోద్,డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ వసుధ, డాక్టర్ కల్పన, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయబాబు, డాక్టర్ భార్గవ్ వర్ధన్ రెడ్డి, డాక్టర్ పెసల అశోక్ , అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 పట్టణ గృహ నిర్మాణ పథకం

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 పట్టణ గృహ నిర్మాణ పథకం ద్వారా మంజూరైన ఇంటి లబ్ధిదారుల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * తేదీన పెందుర్తి నియోజకవర్గం *జీవీఎంసీ 94 వ* వార్డు *ముత్యమాంబ కాలనీలో* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన PMAY 2.0 ద్వారా ఇల్లు మంజూరైన లబ్ధిదారుల *భూమి పూజ కార్యక్రమంలో* మరియు 2024 తర్వాత ఈ యొక్క పథకం ద్వారా లబ్ది పొంది గృహ నిర్మాణం చేసుకున్న *లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేసి* PMAY 2.0 పథకం ద్వారా మంజూరైన ఇంటి నిర్మాణానికి *మంజూరు పత్రాలు ఇంటి నిర్మాణదారుడి కి అందజేసిన* జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ *పంచకర్ల రమేష్ బాబు గారు* నగర మేయర్ శ్రీ *పీలా శ్రీనివాసరావు గారు.* ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావు ,93 వార్డు కార్పొరేటర్ రాపర్తి కన్నా ,97 వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ వసంత శంకర్రావు ,95 వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు ,జోన్ 8 జోనల్ కమిషనర్ శంకర్రావు భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ రాము నాయుడు ,పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయితే సింహాచలం ,వార్డు అధ్యక్షులు పెన్నింటి పార్వతి ,గంటల దివాకర్ ,కంచిపాటి మధు, సేనాపతి సోమశేఖర్ డిబిఎల్ సంతోష్ , తమరాడ ఆది బాబు , స్థానిక నాయకులు తనకల శ్రీనివాస రావు , మోటూరు చైతన్య ,జుత్తాడ శ్రీనివాసరావు , పిల్లా జగన్మోహన్ పాత్రుడు , సేనాతి దేముడు ,ఎర్ర నాగరాజు , త్రిబుల్ ఎస్ రమేష్ ,ఏం సి డైరెక్టర్ గొంతిన హైమావతి , సంతోష్ లక్కీ గోవింద్ , నాగ సుధా ,సిహెచ్సి నెంబర్ వరూధిని గొర్లి అప్పారావు గారు,మడక బంగార్రాజు రాపర్తి కృష్ణమోహన్ , రాపర్తి కిషోర్ , బంటు సురేష్ మరియు గృహ నిర్మాణ సంస్థ సంస్థ అధికారులు, ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

విశాఖపట్నం

పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్న ప్రభుత్వం

పేదవాడి సొంతింటి కల నిజం చేస్తున్న ప్రభుత్వం *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఇళ్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను నిజం చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలో మొత్తం మంజూరైన 60 ఇళ్లకు సంబంధించి ఇంటి నిర్మాణం కోసం రెండున్నర లక్షల రూపాయలు అర్హులైన పేదవారు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. ఈ సందర్భంగా 32 వ వార్డు కు చెందిన సింహాద్రి సుజాతకు ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంటి నిర్మాణానికి సంబంధించి లక్షన్నర రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు సమకూరుస్తుందని చెప్పారు. ఈ మొత్తం అమౌంట్ను ఇంటి నిర్మాణదారుల బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరిగిందని పేర్కొన్నారు. మొత్తం నియోజకవర్గంలో 60 మందికి ఇళ్లు మంజూరైన వారికి ఈ అమౌంట్ ను అందజేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చేస్తున్న కృషిని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజాన అప్పారావు, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Blog

డా. అబ్దుల్ హఖ్ అవార్డు అందుకున్న హఫిజ్ అంజద్ బాష సిద్దీఖి ని ఘనంగా సన్మానించిన టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ ఎం డి ఫయాజ్

నంద్యాల పట్టణంలో ఖలీల్ సిద్దీఖి హైస్కూల్ లో ఉర్దూ లాంగ్వేజ్ పండిట్ గా విధులు నిర్వహిస్తున్న హఫీజ్ అంజద్ బాష సిద్ధిఖి నవంబర్ 11వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవం, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా డా. అబ్దుల్ హఖ్ అవార్డును అందుకున్న శుభ సందర్భంగా నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హఫిజ్ అంజద్ బాష సిద్దీఖి ని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాజేష్ , అస్ముద్దీన్ , జాకీర్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

కక్షపూరిత విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

కక్షపూరిత విధానాలను అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * * పి పి పి పేరుతో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి * మెడికల్ కాలేజీలు పూర్తిచేసి, వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి * వైసిపి అధినేత జగన్ పిలుపుమేరకు ర్యాలీ చేపట్టిన వైసిపి శ్రేణులు * మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయని వైసీపీ నాయకులు, విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. వైసిపి హయాంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో విశాఖలో ఏవీఎన్ కళాశాల నుంచి పూర్ణ మార్కెట్ వయా చౌట్రీ ఎమ్మార్వో ఆఫీస్ వరకు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కోలా గురువులు, క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్రాధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ వాసుపల్లి తో పాటు ర్యాలీలో పాల్గొని ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడంతో వీఆర్వోకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణ వల్ల వాటికి అనుబంధంగా ఉండే బోధన ఆసుపత్రులలో పేదలకు పూర్తిస్థాయిలో ఉచిత వైద్యం అందదని చెప్పారు. ఇంకా రోగనిర్ధరణ అలాగే ఇన్ పేషెంట్ మెడిసిన్స్ కి చార్జ్ చేస్తారని ఆరోపించారు. ఇదిలా ఉండగా మరో వైపు రాష్ట్రం పెద్ద సంఖ్యలో మెడికల్ సీట్లు కోల్పోతుందని తెలిపారు. గత ఏడాది 750 ఎంబిబిఎస్ సీట్లు సమకూర్చాల్సి ఉన్న చంద్రబాబు ప్రభుత్వ కక్ష పూర్తి విధానాలతో 700 సీట్లు కోల్పోయామని పేర్కొన్నారు. 2025 – 26 లో 1750 సీట్లు, అలా మొత్తం 2450 మెడికల్ సీట్లు మన పిల్లలు కోల్పోతున్నారని తెలియజేశారు. 1947 నుంచి 2022 వరకు రాష్ట్రంలో కేవలం 11 మెడికల్ కాలేజ్ మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ఒక చరిత్రగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వం పి పిపి పేరిట డ్రామాలు ఆడుతోందని ప్రజలకు అర్థమైందని వివరించారు. వైయస్ జగన్ ప్రభుత్వం హయాంలోనూ 7 మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తికాగా అయిదు కాలేజీలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి అని చెప్పారు. మరో 10 కాలేజీల నిర్మాణ పనులు వివిధ దశలలో ఉన్నట్లు వెల్లడించారు. వైయస్సార్సీపి ప్రభుత్వం దిగిపోయేసరికి వాటిలో దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులు జరిగినట్లు పేర్కొన్నారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం ఏటా రూ. 1000 కోట్ల చొప్పున అయిదు ఏళ్ళు వ్యయం చేస్తే చాలని, కానీ ప్రభుత్వం ఆ దిశలో ఆలోచన చేయకుండా, పి పి పి పేరుతో ప్రైవేటీకరణ పై ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ధ్వజమెత్తారు. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు కూడా పూర్తిచేసి అన్నిటిని ప్రభుత్వం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, వైసీపీ సీనియర్ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేరుస్తాం. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధిదారులు ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేస్తున్నట్టు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం సీతంపేట లోని పార్టీ కార్యాలయంలో 21 మంది లబ్ధిదారులు ఎంపిక చేసి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అదేవిధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. లబ్ధిదారులందరికీ ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ హోసింగ్ AE M. M. నాయుడు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ T. రాజశేఖర్, జనసేన సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి, 33 వార్డ్ కార్పొరేటర్ GK, కనీస వేతనాలు సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ తెలుగు లక్ష్మి, 32 వార్డ్ కార్పొరేటర్ కందుల నాగరాజు 34 వ వార్డ్ అధ్యక్షులు నీలం రాజు, 32వ వార్డ్ అధ్యక్షులు తెలుగు అర్జున్, 29 వ వార్డ్ అధ్యక్షులు శ్రవణ్, 37 వార్డ్ అధ్యక్షులు గరికిన రవి, జనసేన వార్డ్ ఇంచార్జిలు డా, మర్రివేముల శ్రీనివాస్, నారా నాగేశ్వరావు, జనసేన నాయకులు మాన్యల శ్రీనివాస్, ప్రణీత్ మరియు జనసైనికులు, వీరామహిళలు పాల్గొన్నారు.

E-పేపర్

పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కూటమి ప్రభుత్వం : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకం కింద ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిందని . పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తూ, రాష్ట్రంలో కోట్లాది మంది పేదలకు గూడు కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఈ రోజు పేదల సొంతింటి కల సాకారమవుతున్న పండుగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని అందులో భాగంగానే నంద్యాల మండలం చాపిరేవుల గ్రామంలో సొంతింటి కలను నెరవేర్చుకున్న మారెళ్ళ వైష్ణవి (లబ్దిదారుని పేరు) భర్త పేరు మారెళ్ళ ఆదినారాయణ వారి ఇంటిని ఈరోజు అధికారులతో కలిసి మంత్రివర్యులు ఫరూక్ ప్రారంభించడం జరిగింది. అనంతరం నూతన గృహప్రవేశం చేసినందుకు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మారెళ్ళ వైష్ణవి, మారెళ్ళ ఆదినారాయణ కు నూతన వస్త్రములు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత 16 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,85,557 గృహాలను పూర్తి చేయడం జరిగిందని ఇందులో ముఖ్యమంత్రి చొరవతో చేపట్టిన నిర్మాణాలు, PMAY, BLC, PMJM పథకాల కింద పూర్తైనవి ఉన్నాయన్నారు . గత 16 నెలల్లో దాదాపు 3 లక్షల ఇళ్ల పూర్తి చేసి పేదలకు తాళాలు అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే నిర్మాణంలో ఆగిపోయి ఉన్న ఒక్క ఇళ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారని . ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగిందని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలకు ప్రభుత్వం వేడుకకు సిద్ధమవుతోందని తెలిపారు. పూర్వ పాలకుల వైఫల్యాలు – ప్రస్తుత ప్రభుత్వం చొరవ గత టీడీపీ ప్రభుత్వంలో (2014-19)లో పేదవాడి సొంతింటి కలను నెరవేర్చేందుకు పట్టణాల్లో 1.5, గ్రామాలలో 2 సెంట్లు ఇచ్చి పేదల పెన్నిదిగా చంద్రబాబు నిలిస్తే దాన్ని సెంటుకే కుదించి పేదల ద్రోహిగా జగన్ రెడ్డి నిలిపోయాడని. 2014-19లో టిడ్కోతో కలిపి 12 లక్షల గృహాలను పూర్తి చేసి పేదలకు అందిస్తే జగన్ రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటం తప్పించి పేదలకు గృహాలను పూర్తి చేసి ఇచ్చింది లేదని పైగా NTR రూరల్ హౌసింగ్ లబ్ధిదారులకు రూ.920 కోట్ల బకాయిలా చెల్లించకుండా నిలిపివేశాడని అన్నారు. “ఇళ్లు కాదు, ఊళ్లే నిర్మిస్తాం” అని చెప్పి రోడ్లు, డ్రైనేజీ, నీరు, విద్యుత్ ఏవి కల్పించకుండానే పెండింగ్ లోనే ఉన్న ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి వైసీపీ నాయకులు చేతులు దులుపుకున్నారని. నేడు కూటమి ప్రభుత్వం ఇళ్లతో పాటు రోడ్లు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు అందిస్తుందని. గత వైసీపీ ప్రభుత్వం పేదల కలలకు తాళం వేస్తే , కూటమి ప్రభుత్వం ఆ తాళం తెరిచి గౌరవంగా ఇల్లు ఇస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రూలర్ ఎమ్మార్వో శ్రీవాణి, ఎంపీడీఓ సుగుణ శ్రీ , డిప్యూటీ ఎంపీడీఓ నాగజ్యోతి, హోసింగ్ డిఈ విజయ బాబు , చాపిరేవుల గ్రామ టిడిపి నాయకులు భూపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి , సుబ్బారెడ్డి, సర్పంచ్ రాజు, సంజన , సుబ్బరాయుడు, మునిస్వామి, రాజశేఖర్, బిజ్జల శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

ఘణంగా విశాఖ బీచ్ రోడ్డులో యూనిటీ రన్*

*ఘణంగా విశాఖ బీచ్ రోడ్డులో యూనిటీ రన్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఉక్కు మనిషి భారత మాజీ ఉప ప్రధాని, మాజీ కేంద్ర హోంమంత్రి సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా యూనిటీ రన్ నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులో మైభారత్ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ రన్ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ , నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జెండా ఊపి ఐక్యతా రన్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారతావని కోసం ఎంతో కృషి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ నేటి యువతకు స్ఫూర్తి అని అన్నారు. బీచ్ రోడ్ కాళీమాత ఆలయం నుండి వైయంసిఏ వరకు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తూ యూనిటీ రన్ చేసారు. కార్యక్రమంలో బిజేపి రాష్ట్ర మీడియా పేనలిస్ట్ కరణంరెడ్డి నరసింగరావు, రాష్ట్ర కార్యదర్శి సుజాత,టిడిపి జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ,కూటమి నాయకులు సిరసపల్లి నూకరాజు, దానేష్, శంకరరావు, నాగేశ్వరరావు, కృష్ణారెడ్డి ప్రభుత్వ అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు మహిళ డిగ్రీ కళాశాలలో ఆర్వో ప్లాంట్ ప్రారంభించిన పీఓ

శుభ్రమైన త్రాగునీటి వలన ఆరోగ్యంగా ఉంటామని పాడేరు ఐటీడీఏ పీఓ తిరుమణి శ్రీపూజ తెలిపారు. బుధవారం అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ జితేంద్ర శర్మ తో కలసి ఆర్వో ప్లాంటు ప్రారంభించిన సంధర్బంగా పీఓ మాట్లాడారు. విద్యార్ధినిలు త్రాగునీటికి ఆర్వో ప్లాంట్ వాటర్ ను వినియోగించాలని ప్రిన్సిపల్ చలపతి రావు తెలిపారు. కళాశాలకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేసినందు జిల్లా కలెక్టర్ కు, పీఓ కు, యూనిబ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ కు ప్రిన్సిపల్ చలపతిరావు కృతజ్ఞతలు తెలిపారు.

విశాఖపట్నం

ప్రతి పేదవానికి సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం*

*ప్రతి పేదవానికి సొంత గూడు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం* *నగర మేయర్ పీలా శ్రీనివాసరావు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * నగరంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు సొంత గూడు కల్పించడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన పెందుర్తి జోన్ వేపగుంట లోని కళ్యాణ మండపంలో పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకం కింద బెనిఫిసరీ లీడ్ కన్స్ట్రక్షన్ (బి. ఎల్. సి) పత్రాలను పంపిణీ కార్యక్రమం పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు పలువురు కార్పొరేటర్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఇది పేదల సంక్షేమ ప్రభుత్వమని గూడు లేని ప్రతి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు గూడు కల్పించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. నీడ లేని పేదలకు సొంతంగా ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కృషి చేస్తున్నాయని తెలిపారు. పట్టణ ప్రాంతాలలో స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్థోమత లేని వారికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాని మంత్రి ఆవయాస్ యోజన 2.0 అర్బన్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా 2 లక్షల 50 వేలు అందిస్తుందని, నేడు 77, 78, 93, 94, 95, 96, 97, 98 వార్డులలో 709 మంది అర్హులైన వారికి బెనిఫిసరీ లీడ్ కన్స్ట్రక్షన్ (బి. ఎల్. సి) పత్రాలను అందించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వాటా కింద 1లక్ష 50 వేలు, రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు సమకూర్తుంది అన్నారు. అనంతరం పెందుర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నిరంతరం సంక్షేమం కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పెందుర్తి నియోజకవర్గం లోని పలు వార్డులలో ఇండ్ల స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక స్తోమత లేని వారి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అర్బన్ పథకం ద్వారా 2 లక్షల 50 వేలు అందిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి, సంక్షేమం రెండు నిరంతరం కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని పేర్కొన్నారు నేడు 709 మందికి ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం జరిగినది అన్నారు. ఈ కార్యక్రమంలో బల్ల శ్రీనివాసరావు, ముమ్మన దేముడు, రాపర్తి కన్నా, సేనాపతి వసంతలక్ష్మి, జోనల్ కమిషనర్ శంకర్, ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది, హౌసింగ్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.