Saturday, 21 March 2026

Blog

విశాఖపట్నం

CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ జిల్లాలో CII పార్ట్నర్ షిప్ సమ్మిట్ -2025 కార్యక్రమాలలో పాల్గొనేందుకు వాయుమార్గం ద్వారా గురువారం రాత్రి ఎయిర్ పోర్టునకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్ కు అధికారుల నుంచి ఘ‌న స్వాగ‌తం లభించింది.* *విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్న రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ నకు జిల్లా కలెక్టర్ M N హరేందిర ప్రసాద్, నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి, నగర మేయర్ పీలా శ్రీనివాసరావు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.*

E-పేపర్

యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు ఆహ్వానించిన

నంద్యాల పద్మావతి నగర్ లో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో ఈ నెల 16 వ తేదీన జరిగే యాదవ కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఆహ్వానించినట్లు యాదవ కార్తీక వనభోజన కమిటీ వేదిక , శ్రీకృష్ణ మందిరము పద్మావతి నగర్ నంద్యాల సభ్యులు పృధ్విరాజ్ యాదవ్, విజయ్ గౌరీ యాదవ్ , చలపతి యాదవ్ , కొండా శ్రీనివాస్ యాదవ్ , భోధనం చంద్రశేఖర్ యాదవ్, చల్ల గోపాల్ యాదవ్ , వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు

ఎన్ టి ఆర్ జిల్లా

పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు: తంగిరాల సౌమ్య ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకున్న నూతన మార్గం

ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానం ప్రజల ప్రయోజనాల కోసం చేపట్టినదేనని, దీన్ని *‘ప్రైవేటీకరణ’*గా వక్రీకరించడం తప్పుడు ప్రచారం అని నందిగామ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. నందిగామలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ప్రతిపక్షం ఈ అంశంపై చేస్తున్న ఆరోపణలు “అజ్ఞానం, బాధ్యతారాహిత్యం, రాజకీయ స్వార్థం” తప్ప మరేమీ కావని పేర్కొన్నారు. *”పీపీపీ ప్రజల భాగస్వామ్యమే”* “పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు. ఇది ప్రజల భాగస్వామ్యం తో, వేగవంతమైన అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టి గల నిర్ణయం. గత వైసిపి ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన వైద్య కళాశాలలను ఇప్పుడు సమయానికి పూర్తి చేసి, పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించడమే లక్ష్యం,” అని ఆమె చెప్పారు. ప్రజలకు లభించే ప్రధాన ప్రయోజనాలు సౌమ్య వివరించినట్లుగా, పీపీపీ విధానంలో కింది ప్రయోజనాలు లభిస్తాయి: కళాశాలల యాజమాన్యం 100% ప్రభుత్వానిదే. ప్రైవేట్ భాగస్వాములు కేవలం 33 సంవత్సరాలపాటు నిర్వహణ బాధ్యత మాత్రమే చేపడతారు. ఒక్క అంగుళం భూమి కూడా అమ్మబడదని స్పష్టం చేశారు. మొత్తం సీట్లలో 50% కన్వీనర్ కోటా కింద పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్య లభిస్తుంది. ఆసుపత్రులలో 70% పడకలు డా.ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద పేదలకు ఉచిత చికిత్స కోసం కేటాయిస్తారు. నిర్మాణాలు వేగవంతంగా పూర్తవడంతో ఆధునిక మౌలిక వసతులు సమయానికి అందుబాటులోకి వస్తాయి. మెడికల్ కాలేజీలతో పాటు నర్సింగ్, పారామెడికల్ రంగాల్లో వేలాది ఉద్యోగాలు స్థానిక యువతకు లభిస్తాయి. *”గత వైఫల్యాలే కారణం”* “ఈరోజు పీపీపీని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షమే, 17 కొత్త మెడికల్ కాలేజీల కోసం కేటాయించిన ₹8,480 కోట్లలో కేవలం ₹1,550 కోట్లు మాత్రమే ఖర్చు చేసి మిగతా నిధులను మళ్లించింది. ఆ వేగంతో వెళితే కళాశాలలు పూర్తవ్వడానికి 23 సంవత్సరాలు పట్టేది,” అని ఆమె విమర్శించారు. అలాగే, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్’ ద్వారా ప్రభుత్వ సీట్ల ఫీజులను ₹12 లక్షల నుండి ₹20 లక్షల వరకు పెంచి, పేద విద్యార్థులను ప్రభుత్వ విద్యకు దూరం చేసిందని ఆమె ఆరోపించారు. *“ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ మా లక్ష్యం”* “ప్రజా ప్రయోజనాల ముందు రాజకీయ స్వార్థం నిలబడదు. పీపీపీ అనేది పారదర్శకత, సమర్థత, వేగం కలిగిన విధానం. ప్రజల భాగస్వామ్యంతో ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ సాధ్యమవుతుంది,” అని తంగిరాల సౌమ్య తెలిపారు.

హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి…

పున్నమి నవంబర్ 13 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి… రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం… యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియంలో కౌటింగ్… ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 42 టేబుల్స్‌ ఏర్పాటు… ఒకటో నెంబర్‌ పోలింత్‌ బూత్‌ షేక్‌పేట డివిజన్‌ నుంచి ప్రారంభమై ఎర్రగడ్డతో ముగియనున్న కౌంటింగ్ ప్రక్రియ… మొత్తం 10 రౌండ్లలో తేలనున్న ఉప ఎన్నిక ఫలితాలు…

ఎన్ టి ఆర్ జిల్లా

వైసీపీ నేతల తీరు హాస్యాస్పదం : కొట్టె బద్రి

మెడికల్‌ కళాశాల వ్యవహారంపై వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయ నాటకాలు ప్రజలకు నవ్వు తెప్పిస్తున్నాయని జనసేన నాయకుడు కొట్టె బద్రి వ్యాఖ్యానించారు. సంతకాల సేకరణ పేరుతో పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యా సంస్థల ప్రైవేటీకరణకు జీవోలు తెచ్చిన వైసీపీ *“ఇప్పుడేమో పీపీపీ విధానంపై మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ నేతలు, తమ ప్రభుత్వం లో విద్యా సంస్థల ప్రైవేటీకరణ కు జీవో నంబర్లు 42, 50 తీసుకువచ్చిన విషయం ప్రజలు మరచిపోలేదు’’* అని బద్రి అన్నారు.నందిగామ కేవీఆర్‌ కాలేజీని ప్రైవేట్‌ పరంగా మార్చడానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేసినప్పుడు 31మంది విద్యార్థులను పోలీసులు ఈడ్చుకుపోయిన ఘటన అందరికీ గుర్తుందన్నారు. ఆ సమయంలో మొండితోక జగన్మోహన్‌రావు ఆదేశాల మేరకు విద్యార్థులను చందర్లపాడు, కంచికచర్ల పోలీస్‌ స్టేషన్లకు తరలించి అరెస్ట్‌ చేయించారని ఆయన పేర్కొన్నారు. *డ్రామాలతో దృష్టి మళ్లింపు* *“కల్తీ లడ్డు, కల్తీ లిక్కర్‌ వ్యవహారాలను కప్పిపుచ్చుకునేందుకే వైసీపీ నేతలు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు’’* అని బద్రి ఎద్దేవా చేశారు.ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వస్తున్నపెట్టుబడులు, సంక్షేమ పథకాలు చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. *“వైద్య కళాశాలలు పూర్తయ్యాక 1,500 సీట్లు లభిస్తాయి. అందులో 725 సీట్లు ఉచితం. ఇది ప్రజలకు మేలు చేసే నిర్ణయం’’* అని బద్రి వివరించారు.రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిసత్యకుమార్‌ ఇప్పటికే స్పష్టతనిచ్చినప్పటికీ వైసీపీ నేతలు ప్రజల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు. *“చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో మాట్లాడండి’’* *“వైసీపీ నేతలకు నిజంగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వెళ్లి మాట్లాడండి. ప్రజా రోడ్లను ఆక్రమించి సంతకాల సేకరణ పేరుతో ట్రాఫిక్‌ ఇబ్బందులు సృష్టించడం తగదు’’* అని బద్రి సూచించారు. *ఫొటో క్యాప్షన్* : గతంలో నందిగామ KVR కాలేజీ విద్యార్థులను అరెస్ట్‌ చేసి కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌కి తరలించిన దృశ్యం.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా – గ్రామాల్లో అవగాహనతో నేర నివారణకు పూనిన పోలీసులు

నెల్లూరు, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి): జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు నెల్లూరు పోలీసులు ప్రజలతో కలిసి నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తూ సైబర్‌ మోసాలు, గంజాయి, ఇసుక రవాణా, రోడ్డు ప్రమాదాలు, మహిళా భద్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. సామరస్యంగా జీవించాలని, చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చెడు ప్రవర్తన కలిగిన వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నారు. ప్రజలు అనుమానాస్పద కార్యకలాపాలను డయల్‌ 112 లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972కు తెలియజేయాలని పోలీసులు కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా – డ్రోన్ నిఘాతో నేరాలపై ఉక్కుపాదం

నెల్లూరు, నవంబర్ 13 (పున్నమి ప్రతినిధి): జిల్లా ఎస్‌పి డా. అజిత వేజెండ్ల, ఐపీఎస్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘా కొనసాగుతోంది. ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో పట్టణం, శివారు ప్రాంతాల్లో పోలీసు బలగాలు డ్రోన్లతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయి. ఓపెన్ డ్రింకింగ్‌, గ్యాంబ్లింగ్‌, గంజాయి వినియోగం, ఈవ్ టీజింగ్‌, చైన్ స్నాచింగ్‌, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు చేపడుతున్నారు. నేరప్రవణ ప్రాంతాలను గుర్తించి నిరంతరం నిఘా పెంచిన పోలీసులు ప్రజలను చట్టం పాటించాలని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం కోసం డయల్‌ 112 లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1972ను సంప్రదించవచ్చని తెలిపారు.

రంగారెడ్డి

* పిఎస్ వై కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న..సిహెచ్ యాదయ్య *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నూతనంగా నిర్మించిన పిఎస్ వై కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ యాదయ్య వారితో పాటుగా బిసి సెల్ మహేశ్వరం మండల్ అధ్యక్షులు బొల్లు కుమార్ యాదవ్ మహేశ్వరం మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు ఎర్ర నవీన్ కుమార్ మహేశ్వరం మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు సిహెచ్ బాలకృష్ణ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదిరులు పాల్గొన్నారు

రంగారెడ్డి

* ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అందరికీ న్యాయం: కెఎల్ఆర్ —రేపటి జూబ్లీహిల్స్ ఫలితం- విజయం కాంగ్రెస్ దే –ప్రచారం చేసిన మహేశ్వరం నియోజకవర్గ సేనకు ధన్యవాదాలు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు అధైర్యపడొద్దని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ తుక్కుగూడ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేఎల్ఆర్ స్పందించారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇంటి నిర్మాణం చేయకున్నా… ఫోన్ నంబర్ తప్పుగా ఇచ్చినా.. ఆధార్ కార్డ్ అప్ డేట్ లేకున్నా… ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే డబ్బులు జమ కావటం లేదని తెలిపారు. సంబంధిత హౌసింగ్ అధికారులతో ఆయన మాట్లాడారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను గుర్తించి పేదలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ కాంగ్రెస్ హయాంలోనే పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు లక్ష్మారెడ్డి.జూబ్లీహిల్స్ హస్తనిదే రేపు జరిగే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కిచ్చెన్న ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో దాదాపు 70శాతానికి పైగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయన్నారు.

రంగారెడ్డి

* ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు అందరికీ న్యాయం: కెఎల్ఆర్ —రేపటి జూబ్లీహిల్స్ ‘ఫలితం- విజయం” కాంగ్రెస్ దే –ప్రచారం చేసిన మహేశ్వరం నియోజకవర్గ సేనకు ధన్యవాదాలు*

పున్నమి వార్త మిర్రర్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 13 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులు అధైర్యపడొద్దని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ఇవాళ తుక్కుగూడ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కేఎల్ఆర్ స్పందించారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇంటి నిర్మాణం చేయకున్నా… ఫోన్ నంబర్ తప్పుగా ఇచ్చినా.. ఆధార్ కార్డ్ అప్ డేట్ లేకున్నా… ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చే డబ్బులు జమ కావటం లేదని తెలిపారు. సంబంధిత హౌసింగ్ అధికారులతో ఆయన మాట్లాడారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను గుర్తించి పేదలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఇళ్లు లేని నిరుపేదలందరికీ కాంగ్రెస్ హయాంలోనే పక్కా ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు లక్ష్మారెడ్డి.జూబ్లీహిల్స్ హస్తనిదే రేపు జరిగే ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కిచ్చెన్న ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి హయాంలో దాదాపు 70శాతానికి పైగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.