Saturday, 21 March 2026

Blog

E-పేపర్

అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను బలోపితం చేయాలి.

అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటి పిలుపు మేరకు అంగన్వాడి లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనంతసాగరం మండల తహసిల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అనంతసాగరం ప్రాజెక్ట్ CITU నాయకురాలు సునీత మాట్లాడుతూ ప్రీ స్కూల్ ను బలోపితం చేయాలని 3నుండి 6సంవత్సరాల పిల్లలను అంగన్వాడి కేంద్రాలలో ఉండే విధంగా ప్రభుత్వం G.O ఇవ్వాలని అన్నారు.ప్రీ స్కూల్ పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం అమలుచేయాలని, ప్రీస్కూల్ పిల్లలకు యూనిఫాం, టై, బెల్ట్, బూట్లు ఇవ్వాలని, పిల్లలకు ఇచ్చే మెనూ క్వాంటిటీని పెంచాలని అన్నారు.అలాగే F.R.S యాప్ రద్దు చేయాలని, అంగన్వాడి లకు అదనపు పని భారం రద్దు చేసి ఆన్లైన్ వర్క్ తగ్గించాలని,ఆన్లైన్ వర్క్ కోసం కొత్త 5G ఫోన్లు ఇవ్వాలని అన్నారు. అంగన్వాడి లు ప్రభుత్వ ఉద్యోగులు అనే పదం తొలిగించి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయకార్యదర్శి అన్వర్ బాషా, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు సుబ్బమ్మ,పెంచలమ్మ, నిర్మలా,నూర్జహాన్, మధునిక, అనిత, మదీన, జ్యోతి,భారతి,బేబీ, బుజ్జమ్మ మరియు అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

📰 భగవద్గీత జయంతి సందర్భంగా పఠన శిక్షణ ప్రారంభం

📰 భగవద్గీత జయంతి సందర్భంగా పఠన శిక్షణ ప్రారంభం విజయవాడ, లబ్బీపేట — పున్నమి ప్రతినిధి శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల తెలుగు విభాగం వారు డిసెంబరు 1న జరగనున్న భగవద్గీత జయంతి పురస్కరించుకొని, ఈరోజు (14-11-2025) నుండి భగవద్గీత పఠన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో ప్రారంభమైంది. శిక్షణలో పలువురు విద్యార్థులు ఆసక్తిగా పాల్గొంటూ గీతా శ్లోకాల తాత్త్విక భావాలను తెలుసుకుంటున్నారు. కళాశాల అధ్యాపకులు ఈ శిక్షణ విద్యార్థుల్లో ఆధ్యాత్మికత, విలువలపట్ల అవగాహన పెంచుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేమూరి వెంకట సుబ్రహ్మణ్య కుమార్ గారు తెలుగు విభాగ o వారు డాక్టర్ k.సరళ డాక్టర్ ఐ మంజుల పాల్గొన్నారు.

కడప

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

స్థానిక ప్రొద్దుటూరు లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలలో బాలల దినోత్సవం సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని నేటి వారి బాల్యాన్ని చక్కదిద్దితే రేపు మంచి పౌరులుగా ఎదుగుతారని చెప్పారు ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారిని స్మరించుకుంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు

E-పేపర్

వైద్య కళాశాలల ప్రైవేటుపరం ఆలోచన విరమించుకోవాలి.. వైద్య కళాశాల ప్రైవేటుపరం ఆలోచన పేదలను, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమే. వత్తలూరు సాయికిషోర్ రెడ్డి, తల్లెం భరత్ కుమార్ రెడ్డి.

వైద్య కళాశాలల ప్రైవేటుపరం ఆలోచన విరమించుకోవాలి.. వైద్య కళాశాల ప్రైవేటుపరం ఆలోచన పేదలను, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమే. వత్తలూరు సాయికిషోర్ రెడ్డి, తల్లెం భరత్ కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ 13 ( పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఓబులవారిపల్లి మండలం పెద్దవరంపాడు,రాళ్లచెరువు పల్లి, ఎల్లయ్యపల్లి పంచాయతీల నందు మండల కన్వీనర్, మాజీ జెడ్పిటిసి, మాజీ టూరిజం డైరెక్టర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న గుంతకల్లు రైల్వే డిఆర్సిసి సభ్యులు, రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి. తదనంతరం తల్లెం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటినుండి మన ఆంధ్రప్రదేశ్లో 5 వైద్య కళాశాలలు ఉండేవని, వాటిలో 3 కళాశాలలు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో వచ్చాయని, తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు వైద్యం అందాలని, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో ఖర్చుల భారం ఎక్కువ అయ్యాయని, పేదలు ఖర్చు భరించలేరని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేయించారని, 5 మెడికల్ కళాశాలను పూర్తి చేయగా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేటు పరం చేసేందుకు సిద్ధమవుతుందని అందుకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలోనూ కోటము ప్రభుత్వం చేపడుతున్న పిపిపి విధానాన్ని నిరసిస్తూ చేసిన కార్యక్రమమే రచ్చబండని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి టంగుటూరు కృష్ణారెడ్డి, ఎల్లాయపల్లి సర్పంచ్ జరుగు నారాయణరెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపి రెడ్డి, శ్రీనివాసులు , సర్పంచ్ ఆళ్ల ఈశ్వరయ్య, ఎంపీటీసీ గంగాధరం, సుబ్బరాయుడు,దీపక్ రెడ్డి, పోలి వెంకటరెడ్డి,దార్ల రమణ, మరే సుకుమార్ ,ప్రభుదాస్,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

E-పేపర్

వైద్య కళాశాలల ప్రైవేటుపరం ఆలోచన విరమించుకోవాలి.. వైద్య కళాశాల ప్రైవేటుపరం ఆలోచన పేదలను, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమే. వత్తలూరు సాయికిషోర్ రెడ్డి, తల్లెం భరత్ కుమార్ రెడ్డి.

వైద్య కళాశాలల ప్రైవేటుపరం ఆలోచన విరమించుకోవాలి.. వైద్య కళాశాల ప్రైవేటుపరం ఆలోచన పేదలను, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమే. వత్తలూరు సాయికిషోర్ రెడ్డి, తల్లెం భరత్ కుమార్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ 13 ( న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం పేరిట కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఓబులవారిపల్లి మండలం పెద్దవరంపాడు,రాళ్లచెరువు పల్లి, ఎల్లయ్యపల్లి పంచాయతీల నందు మండల కన్వీనర్, మాజీ జెడ్పిటిసి, మాజీ టూరిజం డైరెక్టర్ వత్తలూరు సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న గుంతకల్లు రైల్వే డిఆర్సిసి సభ్యులు, రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి. తదనంతరం తల్లెం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చినప్పటినుండి మన ఆంధ్రప్రదేశ్లో 5 వైద్య కళాశాలలు ఉండేవని, వాటిలో 3 కళాశాలలు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చొరవతో వచ్చాయని, తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు వైద్యం అందాలని, ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో ఖర్చుల భారం ఎక్కువ అయ్యాయని, పేదలు ఖర్చు భరించలేరని కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి 17 మెడికల్ కళాశాలలో మంజూరు చేయించారని, 5 మెడికల్ కళాశాలను పూర్తి చేయగా, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని ప్రవేటు పరం చేసేందుకు సిద్ధమవుతుందని అందుకు వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి గ్రామంలోనూ కోటము ప్రభుత్వం చేపడుతున్న పిపిపి విధానాన్ని నిరసిస్తూ చేసిన కార్యక్రమమే రచ్చబండని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి జిల్లా ప్రధాన కార్యదర్శి టంగుటూరు కృష్ణారెడ్డి, ఎల్లాయపల్లి సర్పంచ్ జరుగు నారాయణరెడ్డి,సర్పంచుల సంఘం అధ్యక్షుడు పాపి రెడ్డి, శ్రీనివాసులు , సర్పంచ్ ఆళ్ల ఈశ్వరయ్య, ఎంపీటీసీ గంగాధరం, సుబ్బరాయుడు,దీపక్ రెడ్డి, పోలి వెంకటరెడ్డి,దార్ల రమణ, మరే సుకుమార్ ,ప్రభుదాస్,మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

వరంగల్

వర్ధన్నపేట ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి

వర్ధన్నపేట మండలం చెన్నారంలో అక్రమంగా ఈత చెట్లను తొలగించారు తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా గౌడ సంఘం వర్ధన్నపేట ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించారు గ్రామంలోని అనధికారికంగా చెట్లను నరికి తొలగించిన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు జిల్లా నాయకుడు గట్టు నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

పశ్చిమ గోదావరి

తాడేపల్లిగూడెంలో నూతన కల్వరి టెంపుల్ ప్రారంభం

తాడేపల్లిగూడెం జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా నిర్మించిన కల్వరి టెంపుల్ ను గురువారం రాత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్, విశ్వాసులు పింటో, గ్రేస్ పింటో, రంగరాజు, చార్లెస్ జాకబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పాపులను రక్షించడానికి క్రీస్తు భూమిపై జన్మించారని, ఆయన చూపిన మార్గంలో విశ్వాసులు పయనించాలని సూచించారు. వేలాది మంది విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

E-పేపర్

తాడేపల్లిగూడెంలో నూతన కల్వరి టెంపుల్ ప్రారంభం

తాడేపల్లిగూడెం జాతీయ రహదారిని ఆనుకుని నూతనంగా నిర్మించిన కల్వరి టెంపుల్ ను గురువారం రాత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కల్వరి టెంపుల్ వ్యవస్థాపకులు డాక్టర్ సతీష్ కుమార్, విశ్వాసులు పింటో, గ్రేస్ పింటో, రంగరాజు, చార్లెస్ జాకబ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ పాపులను రక్షించడానికి క్రీస్తు భూమిపై జన్మించారని, ఆయన చూపిన మార్గంలో విశ్వాసులు పయనించాలని సూచించారు. వేలాది మంది విశ్వాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

🖥️ *17 నుంచి బడుల్లో ఆధార్ క్యాంపులు* ⚡ *10 రోజులు పాటు నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు* ⚡ *విద్యార్థుల ఆధార్ అప్ డేట్ కు అవకాశం*

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కీలక అలర్ట్ జారీ చేసింది విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఆధార్ అప్డేట్ చేసుకునేలా ఈ నెల 17 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయాల డైరెక్టర్ శివప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖను జారీ చేశారు ఈ క్యాంపుల ద్వారా విద్యార్థుల ఆధార్ వివరాలను సరి చేసుకునే విధంగా అన్ని సౌకర్యాలు ప్రభుత్వం వారు కల్పించారు సుమారు 15 లక్షల 46వేల మంది పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సి ఉందని అధికారులు ఈ క్రమంలో గుర్తించారు తల్లితండ్రులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని పిల్లల ఆధార్ వివరాలను తప్పనిసరిగా సరి చేయాలని సూచించారు ఆధార్ అప్డేట్ లేకపోతే పలు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు హెచ్చరిక జారీ చేశారు

ఆంధ్రప్రదేశ్

16 న మహా పుష్పయాగం

సి.యస్. పురం: జిల్లాలో ప్రసిద్ధి గాంచిన మిట్టపాలెం నారాయణస్వామి దేవస్థానంలో నారాయణస్వామి, శ్రీదేవి భూదేవి సమేత విష్ణుమూర్తిలకు ఈ నెల 16న రాత్రి 7 గంటలకు మహా ఫుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వాహణధికారి ఎస్. నరసింహబాబు తెలిపారు. వేదపండితులు, అర్చకులతో దేవమూర్తులకు వివిధ రకాల ఫూష్పలతో అలంకరించనునట్లు చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.