Saturday, 21 March 2026

Blog

వరంగల్

వరంగల్ లో యూత్ కాంగ్రెస్ సంబరాలు

తేదీ: [14-11-2025] స్థలం: వరంగల్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో *కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారు* భారీ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా, వరంగల్ రూరల్ *యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేశ్* ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు టపాకాయలు పేల్చి, స్వీట్లు పంపిణీచేసి ఘనంగా సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేశ్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధికి ప్రజలు ఈ ఉపఎన్నికల ద్వారా తమ మద్దతు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ విజయాన్ని కొనసాగిస్తామని ఆశిస్తున్నాం” అన్నారు.ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర *యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జెక్కిడి శివ చరణ్ గారికి మరియు జాతీయ ఇంచార్జి ఖలీద్ గారికి* యూత్ కాంగ్రెస్ నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Blog

బాలల ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం: నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి*

భారత ప్రథమ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు బాల అకాడమీ పాఠశాల, నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం సంయుక్తంగా బాల అకాడమీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యురాలు డాక్టర్ నాగమణి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ రాష్ట్ర మహిళా వైద్య విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజలు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బాల అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ బాలల సృజనాత్మక శక్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ,పాఠశాల యాజమాన్యాలపై, అధ్యాపకులపై ఉన్నదని గుర్తు చేశారు. బాలలు గొప్ప జీవిత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కోసం పట్టుదలతో, అంకితభావంతో, సమయపాలన పాటిస్తూ, నిరంతర కృషి చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఐఎంఏ నంద్యాల మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో పాఠశాలలలో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. డాక్టర్ లక్ష్మీ సౌజన్య మాట్లాడుతూ బాలలు చదువుతోపాటు క్రీడల్లో, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం అవసరమన్నారు. డాక్టర్ సునీత మాట్లాడుతూ బాలలు క్రమశిక్షణతో మెలుగుతూ, తోటివారిపట్ల స్నేహభావం కలిగి అవసరమైనప్పుడు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలన్నారు. డాక్టర్ శైలజ మాట్లాడుతూ విద్యార్థులు మొబైల్ ఫోన్ గేమ్స్ కు, హానికరమైన చిరు తిండ్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన అలవాట్లు పాటించాలని కోరారు. బాలల దినోత్సవం పురస్కరించుకుని బాలల హక్కులపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీ విజేతలకు నంద్యాల ఐఎంఏ మహిళా వైద్య విభాగం తరపున బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల అకాడమీ పాఠశాల విద్యార్థులు,అధ్యాపక బృందం పాల్గొన్నారు.

E-పేపర్

మాస్టర్ పబ్లిక్ స్కూల్లో ఘనంగా జరిగిన బాలల దినోత్సవం

నంద్యాల స్థానిక నడిగడ్డలోని మాస్టర్ పబ్లిక్ స్కూల్లో స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగిందని స్కూల్ కరస్పాండెంట్ హలీమా తెలిపారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు డాక్టర్ నష్యం మహమ్మద్ సుహేల్ ఖలీల్, ఎంఐఎం ప్రతినిధులు కుద్దుస్ స్కూల్ డైరెక్టర్ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా చిన్నారులు వేసిన విభిన్న వస్త్ర వేషాధారణ లు, సంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలు అందరినీ అలరించాయి ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని నెహ్రూ గారు తెలిపారని పిల్లలపై నెహ్రూ గారికి అపారమైన ప్రేమ ఆప్యాయత ఉండేదని అందుకనే ఆయన జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు ఇటీవల ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర సమరయోధుల పైన నిర్వహించిన డ్రాయింగ్ కాంపిటీషన్లో ప్రతిభ చూపి మొదటి, రెండు, మూడు స్థానాలు సాధించిన మాస్టర్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు అతిధుల చేతుల మీదుగా సర్టిఫికెట్ మెమొంటో పంపిణీ చేయడం జరిగింది

కడప

ప్రొద్దుటూరు ఒకటో వార్డులో కాలవ మరమ్మత్తులు

*ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 1 వ వార్డు బొల్లవరం నందు వర్షాలు పడి డ్రైనేజీ కాలువల నందు వర్షపు నీరు పోవడం లేదని స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు డ్రైనేజీ కాలువలను పరిశీలించి డ్రైనేజీ కాలువ యందు పూడికతీత పనులు చేపట్టాలని,కాలువ మీద ఉన్న అక్రమణలు తొలగించి త్వరితగతిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవ రెడ్డి గారు,ఇవి సుధాకర్ రెడ్డి గారు,జిల్లా ఆసుపత్రి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసులు రెడ్డి గారు,TNTUC జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్ గారు,మున్సిపాలిటీ ME శ్రీనివాసులు గారు,DE రాజేష్ గారు,శానిటేషన్ ఇన్స్పెక్టర్లు నూర్ భాష,సుబ్బరాయుడు*

జోగులాంబ గద్వాల

ప్రభుత్వం సూచించిన విధముగా విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం పెట్టాలి* *మునిసిపల్ కమిషనర్ శ్రీ CH సైదులు గారు*

*ప్రభుత్వం సూచించిన విధముగా విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం పెట్టాలి* *మునిసిపల్ కమిషనర్ శ్రీ CH సైదులు గారు* గద్వాల్ నవంబర్ 14(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పురపాలక సంఘం పరిధిలోని ఉత్తనూరు రోడ్ నందు గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు నేడు మధ్యాహ్న భోజనంను *మునిసిపల్ కమిషనర్ శ్రీ CH సైదులు గారు* పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ గారు పాఠశాల ప్రిన్సిపాల్ SO శ్రీమతి చెన్న బసమ్మ గారిని మధ్యాహ్న భోజనం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. తదుపరి కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థినిలకు నాణ్యమైన భోజనం అందించాలని మెనూ ప్రకారం ఏ పూటకు అందించాల్సిన భోజనమును ఆ పూటకు అందించాలని, పోషకాహార లోపం వల్ల ఎవరు ఇబ్బంది పడరాదని ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. *కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, మునిసిపల్ వార్డ్ ఆఫీసర్ శ్రీ నారాయణ గారు తదితరులు పాల్గొన్నారు*

నిర్మల్

ఈరోజు నిర్మల్ రూరల్ మండలంలో మూటపూర్ మరియు వెంగ్వా పేట్ గ్రామాలలో PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు

ఈరోజు నిర్మల్ రూరల్ మండలంలో మూటపూర్ మరియు వెంగ్వా పేట్ గ్రామాలలో PACS ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలను గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా బీమ్ రెడ్డి గారు ప్రారంభించినారు.ఈ కార్యక్రమంలో DCSO నర్సయ్య, ఆత్మ చైర్మన్ రాంరెడ్డి గారు,మూటపూర్ పాక్స్ చైర్మన్ బోండ్ల గంగాధర్ గారు,మంజులపూర్ పాక్స్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారు,మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్ గారు మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి, మండల తహసీల్దార్ రైతులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

📰 మధుమేహం నివారణకు ముందడుగు – అపోలోలో అవగాహన కార్యక్రమం

ప్రతి సంవత్సరం నవంబర్ 14న జరుపుకునే ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా, అపోలో ఆసుపత్రిలో ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ అధిపతి డాక్టర్ బిందు రెడ్డి, ఎండోక్రైనాలజీ నిపుణులు డాక్టర్ సర్ఫరాజ్, డాక్టర్ ఎం.వి. రామ్మోహన్ పాల్గొని మధుమేహంపై విస్తృత అవగాహన కల్పించారు. వైద్యులు మాట్లాడుతూ మధుమేహం వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో ఒకటని, అధిక బరువు, వ్యాయామం లోపం, తప్పుడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, వంశపారంపర్య ప్రభావం ప్రధాన కారణాలని వివరించారు. మధుమేహం ఉన్నవారిలో రక్తపోటు, హృద్రోగాలు, మూత్రపిండ, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు. నివారణ కోసం ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయడం, తక్కువ చక్కెర–తక్కువ కొవ్వు ఆహారం తీసుకోవడం, బరువును నియంత్రించడం, రక్త చక్కెర–రక్తపోటు–కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం తప్పనిసరి అని సూచించారు. సరైన మార్గదర్శకత్వం కోసం వైద్యులను సంప్రదించాలి అని అన్నారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించింది. రూ.2100 విలువైన పరీక్షలను రూ.699కు, రూ.4500 విలువైన పరీక్షలను రూ.1899కు మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.