Saturday, 21 March 2026

Blog

తెలంగాణ

బీహార్ లో ఎన్ డి ఏ కూటమి విజయం.. సంబరాల్లో బిజెపి నాయకులు ‌.

బీహార్ లో ఎన్ డి ఏ కూటమి విజయం.. సంబరాల్లో బిజెపి నాయకులు ‌. వెల్దండ నవంబర్ 14 : బీహార్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించినందున వెల్దండ మండల కేంద్రంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై శుక్రవారం భారతీయ జనతా పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు బాణసంచా కాల్చి, స్వీట్లు ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. అలాగే మండల పరిధిలోని పెద్దాపురం గ్రామంలో మాజీ ఎంపిటిసి పబ్బు చక్రవర్తి గౌడ్, దుగ్గపురం యాదయ్య పులి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి బిజెపి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఎన్నం శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో తెలంగాణలోనూ డబ్బులు ఇంజన్ సర్కార్ ఏర్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కోరుమిద్దె యాదగిరి, సింగిల్ విండో వైస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు జూలూరు బాలస్వామి, గుద్దేటి రామస్వామి, మోహన్ రెడ్డి, రమేష్, వజ్ర లింగం, కానుగుల రవి, కాసోజు పాండు చారి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల

పదవులు శాశ్వతం కాదు.. ప్రజలు శాశ్వతం ప్రజలు అన్ని వింటారు… సమయం వచ్చినప్పుడు రోడ్డుపైన నిలబెడతారు గమనించగలరని తెలియజేసిన ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి.

నంద్యాల, పున్నమి ప్రతినిధి ఆర్ ఎన్ రెడ్డి: ఒక్క ముస్లిం అమ్మాయికి దుల్హన్ పథకము ఇవ్వాలంటే లక్ష రూపాయలు అవుతుంది ఆ డబ్బులు ఇవ్వకుండా పదిమంది మోజోన్లకు వేతనం ఇవ్వచ్చు ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పిన వెంటనే ఇచ్చినారు కానీ దుల్హన్ పథకము కళ్యాణమస్తు మహిళలందరూ బహిరంగ వేదికలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానము నేటి వరకు అమలు జరగలేదు. వీటిపైన ఆ పార్టీలో ఉన్న పదవులు పొందిన నాయకులు మాట్లాడే శక్తి ఉందా ఇది మోసం కాదా ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ కదా గత ప్రభుత్వము కరోనా సమయంలో కూడా చదువుకున్న వారికి 50 వేల రూపాయలు పెండ్లి సందర్భంగా ఇచ్చారు మీరు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పి దాదాపు సంవత్సరం ఆరు నెలలు అధికారంలోకి వచ్చిన గాని నేటి వరకు అమలు జరగలేదు ఈ పథకం కింద పెళ్లయిన వారికి కూడా బకాయిలు ఇవ్వరు ఆ విధంగా పేద బడుగు బలహీన మైనార్టీ వర్గాల ఆడపిల్లలను ఆదుకునే బాధ్యత తీసుకుంటానని చెప్పిన హామీ ఏమైంది చెప్పండి కోట్ల రూపాయలు విదేశీ యులు పెట్టుబడి పెడితే వారికి రాయితీలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నవి నాలుగు నక్షత్రాలు ఐదు నక్షత్రాలు హోటల్స్ పెట్టే వారి కూడా డబ్బులు ఉన్నవి కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మాత్రం అమలు చేయడానికి డబ్బులు లేవు ఇది ముస్లిం మైనార్టీ పదవులు పొందిన నాయకులు ప్రజలకు తెలియజేయాలి అలాగే సూపర్ సిక్స్ అని చెప్పారు రెండోసారి వంట గ్యాస్ కు డబ్బులు ఇవ్వలేదు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేద బలహీన వర్గాల వారు ఉన్నారు వారందరూ ఈరోజు బాధపడడం మీ ప్రభుత్వానికి తగునా ఈరోజు విశాఖపట్నంలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పారిశ్రామిక రంగాన్ని కమ్యూనికేషన్ మరియు విద్యుత్తు లఘు పరిశ్రమలకు ఖర్చుపెట్టి నిరుద్యోగాన్ని నిర్మూలించే ప్రయత్నం అంటున్నారు మంచిదే కానీ వారు లాభాల శ్రేయస్సు తో పనిచేసేవారు నష్టం వస్తే మూసుకొని వెళ్ళిపోతారు ఉద్యోగాలు కోల్పోతారు మన డబ్బు మన భూములు వారి సొంతం అవుతాయి మీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అధికారంలో ఉండదు. అప్పుడు నష్టపోయేది రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రజల పైన అప్పు తెచ్చి కార్పొరేట్ సంస్థలకు జేబులో నింపి పేద బడుగు బలహీన అట్టడుగు వర్గాల వారికి కడుపు కొట్టే చర్యలు రాబోయే రోజుల్లో చవిచూడక తప్పదు గతంలో ఈ సమస్యలు ఆ ప్రభుత్వము అంటే వైసీ ప్రభుత్వం చేయలేదని ప్రచారం చేసిన వారే ఈరోజు ఆ సమస్యలు ఉన్న పరిష్కారం కోసం మంత్రుల వద్ద మాట్లాడా లేని పరిస్థితి ఉన్నది 90 కోట్ల రూపాయలు మౌజనులకు ఇచ్చిన అంటున్నారు ఇది గత సంవత్సరం నుండి వారికి రావలసిన వేతన బకాయి ఇమాములు మౌజనులకు కలిపి ఉన్న బకాయి డబ్బులు చెల్లించారు కనీసము ఒక కుటుంబం జీవించడానికి మీ ప్రభుత్వ లేబర్ ఆఫీసర్ల లెక్కల ప్రకారము మీరు గమనించిన ఇంటి అద్దె విద్యుత్ చార్జీలు పాలు నిత్యవసర వస్తువులు మందుల ఖర్చులకు గాను మరియు బట్టలు శుభ్రం చేసుకొనుటకు శరీరసుబ్రతకు సబ్బులు నూనె అన్ని కలిపితే 30 వేల అవసరమని చెప్పిన మీరే ఈరోజు ఇమాము 10000 మోవుజెన్ 5000 తో ఏ విధంగా జీవిస్తాడు వాలంటీర్లకు 5000 రూపాయలు ఇస్తే గత ప్రభుత్వము మీరు 5000 జీతంతో ఏ విధంగా జీవిస్తాడు ఆయనకు పిల్లను ఇవ్వరు అని చెప్పి నేను అధికారంలోకి వస్తే జీతం పెంచుతాను మరియు అర్హత ఉన్నవారికి తగిన పోస్టు ఇస్తానన్నారు ఈరోజు మొండిచేయి చూపించారు ఇది మోసం కాదా డిగ్రీ విద్యార్థులకు నేటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని అలాగే ఇంజనీరింగ్ పై చదువులు చదివే వారికి ఎంబీబీఎస్ చదివే వారికి ఫీజులు వారి ఖాతాలో రానందుకు విద్యాసంస్థలకు చెల్లించనందుకు బాధపడే విద్యార్థుల పరిస్థితి ఒకవైపు ఉంటే మరొకవైపు విదేశీ విద్య అంటున్నారు విదేశాల్లో పోయి నేడు చదువుకునే పరిస్థితి లేదు అమెరికాలో మనం చూస్తున్నాము కావున మన రాష్ట్రంలో ఉన్నవారికి అందరికీ విద్యా వైద్యము ఇల్లు తినడానికి తిండి ఉండడానికి ఇండ్లు కల్పించండి విదేశీ శక్తులను పెంచి పోషించడం మానండి మొన్ననే అబ్దుల్ కలాం ఆజాదు జయంతి ఉత్సవాలు జరిపారు ఆయన గారు విదేశీయుల తో పోరాడి సాయంత్రం వచ్చిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఇచ్చినారు మైనార్టీలకు ప్రార్ధన ఇచ్చినారు అందుకే జాతీయ విద్యా విధానము మైనార్టీ సంక్షేమ అభివృద్ధి అని జరుపుతున్నారు వారి త్యాగాలు స్మరించుకున్న వారు విదేశాల్లో ఉన్నవారు వచ్చి పెట్టుబడి పెట్టుటకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం ఉండదు గతంలో మీ పార్టీలో పదవులు పొందిన నాయకులు ముస్లింలు దేశ రక్షణ కోసం త్యాగం చేశారు ప్రాణాలర్పించారు ఢిల్లీలో పోయి చూడండి అని చెప్పిన వారు నేడు అటువంటి ముస్లింలు కుటుంబాలు ఆకలితో అలమటిస్తుంటే ఇతర వర్గాల వారు కూడా అన్నమో రామచంద్ర అని కేకలు వేస్తుంటే మీరు మీ పార్టీ వారు ప్రశాంతంగా మీడియాలో బ్రహ్మాండంగా మేము అన్ని చేస్తున్నామని చెప్పుకోవడం మోసం చేయడము మీ సూత్రాలు గతంలో నేడు గమనిస్తే మా తాతగారు నేతులు తాగినారు మేము మీ మీసాలు తూర్చుకుంటాం అన్న చందంగా వారి పేర్లు చెప్పుకొని బ్రతికే కన్నా నేడు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను ముస్లిం సంఘాలు వ్యక్తులు నాయకులు పదవిలో ఉన్న వారందరూ మాట్లాడితే బాగుంటుంది అని సిపిఎం మాజీ జిల్లా నాయకుడు ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి తెలియజేశారు రాష్ట్రంలో ఏమి చేయలేక పోయినా కనీసము మీరు ఉన్న ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని వర్గాల పేద బడుగు బలహీన వర్గాల మైనార్టీ వర్గాల వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ద్వారా నిధులు సాధించి అభివృద్ధి చేయండి పదవులు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రజలు అన్ని వింటారు సమయం వచ్చినప్పుడు రోడ్డుపైన నిలబెడతారు గమనించగలరని తెలియజేసిన ఆవాజ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎదుట swf నిరసన

ఉదయగిరి ఆర్టీసీ డిపో ఎదుట swf శుక్రవారం తమ నాణ్యమైన డిమాoడ్లను పరిష్కరించాలని నిరసన కార్యక్రమo నిర్వహించారు వారు మాట్లాడుతూ పని గంటలు పెంపు తగ్గించాలని , అక్రమ సస్పెండ్లు ఆపాలని శ్రీ శక్తి సమస్యలు పరిష్కరించాలoటూ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమo లో ఏస్థాని, బాషా, రవి, జాషువా, రమణయ్య, మల్లి ఖార్జున తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

బీహార్లో భాజపా అఖండ విజయంపై పార్టీ శ్రేణుల సంబరాలు

శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి న్యూస్ : భారతీయ జనత పార్టీ బీహార్లో అఖండ విజయం సాధించిన సందర్బంగా శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులతో కలిసి విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ…బీహార్ లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అతి భారీ స్థాయిలో విజయం సాధించిందని ఈ విజయానికి కారణం బీజేపీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజారంజకమైన సుపరిపాలన అందించడం అనేది ఒక అంశమైతే, కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు చేస్తున్న వికృతచేస్టలు వలన ఎన్డీయే కూటమికి అతి భారీ ఎత్తున 200 పైగా సీట్లతో విజయ దుందుభి మోగించదన్నారు. పార్టీ కార్యాలయం వద్ద బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని మోదీ, బీజేపీ జిందాబాద్, ఎన్డీయే కూటమి ఐక్యతా వర్ధిల్లాలి అని నినాదాలతో హోరుతో సంబరాలు నిర్వహించి, ఎన్డిఏ కూటమికి శుభాకాంక్షలు తెలుపుతూ… ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నీన ఎన్నికల సమయంలో ఉగ్రదాడులు జరిపి బిజెపి మీద నెపం వేద్దామనుకున్న ఉగ్ర మూకల ఆటలు చెల్లకుండా బీహార్ ప్రజలు బీజేపీ వైపు నిలబడ్డందుకు బిజెపి తరుపున బీహార్ ప్రజలకు శ్రీకాళహస్తి అసెంబ్లీ తరుపున ధన్యవాదాలు కోలా ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు చిలకా రంగయ్య, పిల్లారు బతినయ్య, గరికపాటి రమేష్ బాబు, సొట్ట సుకుమార్, ఇమ్మిడిశెట్టి మోహన్, మద్దు వాసు యాదవ్, లింగాబత్తిన గోపాల్, కన్నా వెంకటేశ్వర్లు, పుణ్యం డిల్లీ కుమార్ రెడ్డి, గోవర్ధన్, రవిచంద్ర, బొక్కిసం కిరణ్, గదిపాకుల యతీష్, మారీ, హరీష్, ధనుష్, కృష్ణా రెడ్డి, తులసి, నాని, చెంచురెడ్డి, అనిల్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

జడభరతోపాఖ్యానము ఉపన్యాసకునికి చిరు సన్మానం

శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి న్యూస్ : శ్రీ శుక్రబ్రహ్మశ్రమఆశ్రమ ధార్మిక భగవత ప్రవచనములలో భాగంగా ఈ నెల 8వ నుంచి 14వ వరకు శ్రీకాళహస్తి పట్టణంలోని బహుదూర్ పేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ‘జడభరతోపాఖ్యానము’ అనే అంశంపై ఉపన్యాసకులు శతావధాని ఆముదాల మురళి ఉపన్యాసము అందించారు. ఆఖరి రోజు ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా శ్రీ సుఖ బ్రహ్మ ఆశ్రమం పీఠాధిపతులు శ్రీ విద్యా స్వరూపానందగిరి స్వామి, సర్వాత్మనంద స్వామి, విచ్చేసి ఉపన్యాసకులకు చిరు సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్బంగా ఉపన్యాసకులు ఆమదాల మురళి మాట్లాడుతూ…. జడభరతుడు కథ భగవద్గీతలో చాల కీలకమైన ఘట్టము జడభరతోపాఖ్యానము అద్భుతమైన ప్రవచనమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రంలో కన్యకా పరమేశ్వర దేవస్థాన అధ్యక్షులు పురుషోత్తం, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

తిరుపతి

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా చాచా నెహ్రూ జయంతి సంబరాలు

శ్రీకాళహస్తి నవంబర్ 14, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్బంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశనికి తొలి ప్రధానిగా సేవలందించినటువంటి జవహర్ లాల్ నెహ్రూ, భారతదేశ అభివృద్ధి కొరకు ప్రభుత్వ రంగ పరిశ్రమలు, మరియు ISRO అంతరిక్ష సంస్థ, సైన్స్, టెక్నాలజీ లకు పెద్దపీట వేస్తూ ఆయన చేసినటువంటి సంస్కరణలు నేటి భారత దేశ అభివృద్ధికి బీజాలని అయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్, చరణ్, నాగరాజు, మహేష్, ప్రతాప్, జోసఫ్, సారధి, అల్లావుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి) చదివే ధ్యేయంగా బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశలో చదువు ప్రధాన లక్ష్యంగా ఉండాలని, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగితేనే,బలమైన భవిష్యత్తు నిర్మించుకోవచ్చని, చిన్న వయసులోనే క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకోవాలన్నారు. ఆడపిల్లలు మగపిల్లల కంటే తక్కువ కాదని, భయపడాల్సిన అవసరం లేదని, ధైర్యంగా ఉండాలని అన్నారు. చదువుకుంటే డాక్టర్లు,కలెక్టర్లుగా, తయారు కావచ్చని, మనసులో ఏది బలంగా అనుకుంటే, ఆ విధంగా తయారు కావచ్చని కలెక్టర్ అన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*బీహార్ లో ఘన విజయం: నందిగామలో బీహార్ ఓటర్లకు ధన్యవాదాలు తెలిపి BJP సంబరాలు*

నందిగామ, ఈనాడు: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (ఎన్డీఏ) భారీ విజయం సాధించడంతో నందిగామ గాంధీ సెంటర్‌లో సంబరాలు జరిగింది. కార్యకర్తలు, నాయకులు టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకుని విజయాన్ని జరుపుకున్నారు. నందిగామ పట్టణ అధ్యక్షుడు మునగంటి కామేశ్వరరావు మాట్లాడుతూ, బీహార్ మహిళా ఓటర్లకు, అన్ని బీహార్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీహార్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ చరిస్మా పార్టీ విజయం సాధించడంలో కీలకంగా చేసిందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, మాజీ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య, మాజీ కో-కన్వీనర్ చిరుమామిళ్ల శ్రీనివాసరావు, కొత్త సాంబశివ రావు, పట్టణ ప్రధాన కార్యదర్శి మురుమురి శివరామాలయ, డైరెక్టర్ రామాచార్యులు, సీనియర్ నాయకులు కటుకూరి సుందర్ రావు, గోనెల సత్యనారాయణ, బోనం రామిరెడ్డి, పులిపాటి లక్ష్మణ్ నారాయణ, రజియా బేగం, డాక్టర్ సత్యనారాయణ సాయి, ఇరుకుల రాజు, కుమారి గొంగోలు జయశ్రీ, పరసా వెంకటేశ్వరావు, రమణ పరువులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయోత్సాహంలో, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నట్లు వివరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు

ఉదయగిరి ఏం ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ నారాయణ స్వామి జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు ఆయన మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞాన భాండగారలన్నారు గ్రంధాలయాలా ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించలన్నారు పాఠాశాల, కళాశాలలో ఉన్న గ్రంధాలయాలు ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు అని ఆయన కోరారు

E-పేపర్

డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు.

నందలూరు మండలంలో శుక్రవారం బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ (డబ్ల్యూ హెచ్ ఆర్సీ) ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి బాపులే ఆంధ్ర ప్రదేశ్ బి. సి. గురుకుల పాఠశాల & జూనియర్ కాలేజ్ (గర్ల్స్), నందలూరు మరియు గొబ్బిళ్ళ అక్షర స్కూల్ లో కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.పిల్లల్లో ఉన్న ప్రతిభను వెలుగులోకి తీసుకువస్తూ మెడల్స్, మోమెంటోస్, సర్టిఫికేట్స్. ప్రదానం చేసి విద్యార్థినులను సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలుసయ్యద్ మెహతాజ్ బేగం మాట్లాడుతూ ప్రతి బాలిక స్వప్నం నిజం కావాలి. వారికి విద్యతో పాటు స్ఫూర్తి, ప్రోత్సాహం, సమాన హక్కులు కల్పించడం సమాజం యొక్క బాధ్యత” అని తెలిపారు. అలాగే, డబ్ల్యూ హెచ్ ఆర్సీ చేపడుతున్న మానవహక్కుల అవగాహన కార్యక్రమాలు, బాలిక విద్య, భద్రత పై సంస్థ కట్టుబాటును వివరించారు. డబ్ల్యూ హెచ్ ఆర్సీ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు షేక్ మస్తాన్ సాహెబ్ కూడా ఇరువురు పాఠశాల లోని విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు తమ భవిష్యత్తు పై దృష్టి పట్టి చదివి , ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. హక్కులను రక్షించే బాధ్యత అని పేర్కొన్నారు. డబ్ల్యూ హెచ్ ఆర్సీ టీమ్ మరియు స్కూల్ నిర్వాహకుల పాత్ర ప్రశంసనీయం ఈ కార్యక్రమాల్లో డబ్ల్యూ హెచ్ ఆర్సీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జుల్ఫికర్, రాయలసీమ జోన్ ఎడ్యుకేషన్ సెల్ ప్రెసిడెంట్ వరప్రసాద్, స్టేట్ సెక్రెటరీ రవితేజపాల్గొని విద్యార్థినులను అభినందించారు. ఇరువురు స్కూల్ ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థి విద్యార్థినులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.