Saturday, 21 March 2026

Blog

విశాఖపట్నం

మోదీ నాయకత్వంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసo*

*మోదీ నాయకత్వంపై ప్రజల్లో పెరిగిన విశ్వాసo* *బీహార్ లో భాజపా ఘన విజయo… గాజువాకలో శ్రేణుల సంబరాలు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండు వందల పై చిలుకు స్థానాలను కైవసం చేసుకున్న నేపథ్యంలో గాజువాక పాత కర్నవానిపాలెం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.భాజపా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో మిఠాయిలు పంచి,బాణాసంచా కాల్చారు.అనంతరం కేక్ ను కట్ చేశారు.ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో అక్కడి ప్రజలు మోదీ నాయకత్వాన్ని నమ్మి పార్టీని అత్యధిక స్థానాల్లో గెలిపించారని అన్నారు.ఇటీవల జరుగుతున్న ఎన్నికలన్నింటిలో భాజపా జెండా రెపరెపలాడుతోందని దీంతో ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని అన్నారు.దేశంలో మోదీ ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది అన్నారు.జమ్ము కశ్మీర్ లో జరిగిన ఉప ఎన్నికల్లో అక్కడి బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా కూడా ఘన విజయాన్ని అందుకున్నారని పేర్కొంటూ భాజపా తరపున గెలుపొందిన అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు సిరసపల్లి నూకరాజు,గూటూరు శంకరరావు,బాటా శ్రీనివాస్,బొండా ఎల్లాజీ,అశోక్,నాగేశ్వరరావు,రోహిణి,పద్మ,భువనేశ్వరి ,అప్పలరాజు,నాగరాజు,కృష్ణారెడ్డి, మనోహర్,రమాదేవి,సత్యనారాయణ , జగదీష్,నారాయణ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్రకృతి అనుకూల ఆవిష్కరణలు రావాలి*

*ప్రకృతి అనుకూల ఆవిష్కరణలు రావాలి* *16 వ సెషన్ లో వక్తలు* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి*: ప్రకృతికి అనుకూలమైన ఆవిష్కరణలు చేయాలని పలువురు వక్తలు కోరారు. అభివృద్ధి ప్రక్రియలో ప్రకృతి వనరులకు నష్టం వాటిల్లకూడదని స్పష్టం చేశారు. 30వ సిఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా, 3 వ సెమినార్ హాలులో బయోడిజైన్ : డిజైనింగ్ ఫర్ పీపుల్ అండ్ నేచర్ అన్న అంశంపై 16 సెషన్ నిర్వహించారు. ఈ సదస్సులో వివిధ రంగాల ప్రతినిధులు మేఘఅవస్థీ, అంజా కారన్, ఏవీఆర్ శ్రీకర్, పెనుమత్స సురేష్ రాజు, మొహిన్ మెహతా పాల్గొన్నారు. సుచిత్ర ఎల్లా మోడరేటర్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. మనిషి ప్రకృతికి దూరం కాకూడదని స్పష్టం చేశారు. మానవ మనుగడ, భవిషత్ తరాల శ్రేయస్సు కోసం పర్యావరణ అనుకూల విధానాలను అవలంభించాలని సూచించారు.

విశాఖపట్నం

CII 30 వ భాగస్వామ్య సదస్సు 2025 ప్లీనరీ సెషన్ 13

CII 30 వ భాగస్వామ్య సదస్సు 2025 ప్లీనరీ సెషన్ 13 విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *ఇండియన్ ఇండస్ట్రీల్స్ కన్ఫెడరేషన్ (CII) 30 వ భాగస్వామ్య సదస్సు 2025 మొదటి రోజైన శుక్రవారం సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు ప్లీనరీ హాల్, హాల్ 5 నందు“భారతదేశం – ప్రపంచ స్థాయి ఆధునిక తయారీ కేంద్రంగా”అంశంపై చర్చ జరిగింది.* రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఆహార ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి. జి. భరత్ మాట్లాడుతూ,భారతదేశం తన బలమైన పారిశ్రామిక పునాదులు, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ పురోగతిని ఉపయోగించుకొని, ఆధునిక తయారీ రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని సాధించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇది టెక్నాలజీ ఆధారిత, ఆవిష్కరణ నడిపే ఉత్పత్తి విధానాల వైపు దిశ మార్చుకుంటూ, ఇండస్ట్రీ 4.0 మరియు గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా ముందుకు సాగుతోందన్నారు. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు ఎంతో తోడ్పడుతోందన్నారు. మెక్సికో,ఆగ్వాస్కాలియెంటెస్ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఎసావ్ గార్జా డి వాగా మాట్లాడుతూ, భారతదేశం తమ దేశంతో బలమైన సంబంధాన్ని కొనసాగించాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తాము ఇండియా తో ఒక ఎంఓయూ ను కూడా కుదుర్చుకోబోతున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఏరోస్పేస్ మరియు పునరుత్పాదక శక్తి వంటి రంగాల్లో భారతదేశం కీలక పాత్ర పోషించేందుకు వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌పై సత్య రామమూర్తి, చైర్మన్, పబ్లిక్ సెక్టార్, స్ట్రక్చర్డ్ ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్, ఆసియా- పసిఫిక్, సుమిటోమో మిట్సుయి బ్యాంకింగ్ కార్పొరేషన్, సింగపూర్, NICCT & ACG ఇంటర్నేషనల్, నెదర్లాండ్స్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీమతి ఎడిత్ ఎన్. నార్డ్‌మాన్, స్వీడన్, సీనియర్ అడ్వైజర్, మోనెమస్ AB & KIGO కన్సల్టెంట్స్, హాకన్ కింగ్స్టెడ్, కార్పొరేట్ వ్యవహారాలు, ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ , బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడు & ప్రెసిడెంట్ డి.వి. గిరి చర్చించారు. ఈ కార్యక్రమ మోడరేటర్ గా CII నేషనల్ కమిటీ ఆన్ స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, రాక్‌వెల్ ఆటోమేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ దిలీప్ సాహ్నీ వ్యవహరించారు.

విశాఖపట్నం

ఎస్ఎఇఎల్ చైర్మన్ సుఖ్ భీర్ ఆవ్లాతో మంత్రి లోకేష్ భేటీ* *డాటా సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి*

*ఎస్ఎఇఎల్ చైర్మన్ సుఖ్ భీర్ ఆవ్లాతో మంత్రి లోకేష్ భేటీ* *డాటా సెంటర్లపై పెట్టుబడులు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*: ఎస్ఎఇఎల్ చైర్మన్ సుఖ్ భీర్ ఆవ్లాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ…. చంద్రబాబు గారి నేతృత్వంలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారీ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతోంది. ఇప్పటికే రాయలసీమలో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టిన డాటా సెంటర్ హబ్ గా మారుతున్న విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుఖ్ భీర్ ఆవ్లా మాట్లాడుతూ… రెన్యువబుల్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎస్ఎఇఎల్ సంస్థ 500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేసింది. వ్యవసాయ, మున్సిపల్ వ్యర్థాల ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిర్మించింది. ఎస్ఎఇల్ హైవేలు, ఇండస్ట్రియల్ పార్కులు, సస్టయినబుల్ హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టిందని అన్నారు. మంత్రి లోకేష్ ప్రతిపాదనలపై ప్రతిపాదనలపై సుఖ్ భీర్ ఆవ్లా సానుకూలంగా స్పందించారు.

విశాఖపట్నం

ఏపీలో స్టీల్ రంగంలో పెట్టుబడులకు జపాన్ కంపెనీల ఆసక్తి*

*ఏపీలో స్టీల్ రంగంలో పెట్టుబడులకు జపాన్ కంపెనీల ఆసక్తి* *ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో జపాన్ రాయబారి ఒనో కేయిచ్చి* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ఆంధ్రప్రదేశ్‌లో స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ ఆసక్తిగా ఉందని ఆ దేశ రాయబారి ఓనో కేయిచ్చి తెలిపారు. విశాఖపట్నంలో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్‌లో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఓనో కేయిచ్చి భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. ఈ మేరకు స్టీల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశంలోని పారిశ్రామిక వేత్తలు ఆసక్తిగా ఉన్నారని కేయిచ్చి సీఎంకు వివరించారు. జపాన్ ఫార్మా రాజధాని కొయామా మాదిరిగానే ఏపీని ఔషధ రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు జపాన్ సహకారం అవసరమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. జపాన్‌ పనితీరు తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి తెలిపారు. సీఐఐ పార్ట్‌నర్‌షిప్‌ సమిట్‌లో 20కి పైగా జపాన్ కంపెనీలు పాల్గొనడం పట్ల ముఖ్యమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలో భవన నిర్మాణాల్లో జపాన్, సింగపూర్ ప్రతినిధులను ఆహ్వానించిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. శ్రీ సిటీలో ఇప్పటికే అనేక జపాన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని సీఎo చంద్రబాబు కేయిచ్చితో తెలిపారు.

విశాఖపట్నం

డిఫెన్స్ స్పేస్ హబ్ గా ఆంధ్రప్రదేశ్

డిఫెన్స్ స్పేస్ హబ్ గా ఆంధ్రప్రదేశ్ మేక్ ఇన్ ఇండియాకు మన రాష్ట్రమే ప్రధాన గమ్యస్థానం పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి టీజీ భరత్ *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి*: దేశ రక్షణ, ఏరోస్పేస్ తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా రక్షణ, ఏరోస్పేస్ మొదలైన రంగాలలో ఆంధ్రప్రదేశ్ ఎలా కీలక కేంద్రంగా మారుతుంది అనే అంశంపై జరిగిన ప్లీనరీలో ఆయన మాట్లాడారు. కేవలం వ్యాపార అంశాలకే తాము పరిమితం కాకుండా, రక్షణ, ఏరోస్పేస్ రంగాలు దేశ భద్రతకు దోహదపడే ప్రభావ కార్యకలాపాలలో తాము భాగస్వాములు కావడం ఆత్మ నిర్భర భారత సాకారానికి తమ వంతు సహాయం కూడా అందించడం ఎంతో గొప్ప అవకాశం గా ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నైపుణ్యాల పూల్‌ ను సృష్టించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఏపీలో తయారయ్యే ప్రతి భాగం భారతదేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సెషన్లో పాల్గొన్న అంతరిక్ష, రక్షణ రంగ ప్రముఖులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, అభివృద్ధికి గల అనుకూలతను ప్రశంసించారు. ఇస్రో సలహాదారు డా. ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ, ప్రైవేట్ రంగానికి చిన్న నుండి పెద్ద రాకెట్లను ప్రయోగించడానికి వీలుగా వికాస్ లాంచ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, రాకెట్లు, ఉపగ్రహాల తయారీ స్థావరాన్ని స్థాపించడానికి సత్యసాయి జిల్లా, తిరుపతి కారిడార్లలో ప్రాంతాలను గుర్తించామని, ఇక్కడ అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన డా.చంద్రిక కౌశిక్ (డీఆర్డీఓ), ఏపీ ప్రతిపాదించిన స్పేస్ సిటీ అనేది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో కీలకపాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. హెచ్‌ఎఫ్‌సీఎల్ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ‘వ్యాపార వేగం అద్భుతంగా ఉందని ప్రశంసించారు. రూ.1400 కోట్ల పెట్టుబడితో రక్షణ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి అవసరమైన అన్ని అనుమతులు “ఓవర్ ఏ ఫోన్” ద్వారానే లభించాయని తెలిపారు. రానున్న నాలుగేళ్లలో ఈ కేంద్రం 3,05,000 సెల్స్ ఉత్పత్తి చేస్తుందని, తద్వారా 3500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన ప్రకటించారు. అలాగే, కళ్యాణి రాఫెల్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సీఈఓ జయరామ్ ముమ్మిడి మాట్లాడుతూ, రక్షణ రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు 1 లక్ష ఉద్యోగాలు కల్పించే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. యువ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ఉపగ్రహాలు వంటి అధునాతన సాంకేతికత అభివృద్ధికి కీలకమని డిగంతర సీఈఓ అనిరుధ్ శర్మ తెలిపారు.

విశాఖపట్నం

ఎపిలో మెరైన పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పండి* *సాగర్ డిఫెన్స్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ*

*ఎపిలో మెరైన పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పండి* *సాగర్ డిఫెన్స్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి: మానవ రహిత సముద్ర వ్యవస్థలు, అటానమస్ వెసల్స్, డిఫెన్స్ సొల్యూషన్స్ లో పేరెన్నికగన్న సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. 2015లో ఏర్పాటైన ఈ సంస్థ సముద్ర భద్రత, నిఘా, పర్యావరణ పరిరక్షణ కోసం అత్యాధునిక ప్లాట్ ఫాంలను డిజైనింగ్, తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ… భారత్ ను మెరైన్ రోబోటిక్స్, డిఫెన్స్ ఇన్నొవేషన్ లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని అన్నారు. దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు స్వదేశీ సాంకేతికతకు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మెరైన్ రోబోటిక్స్, నావిగేషన్ వ్యవస్థలలో తాము మల్టిపుల్ పేటెంట్లను కలిగి ఉన్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 1057 కి.మీ.ల సువిశాల తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక మెరైన్ పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పాల్సిందిగా కోరారు. ఎఐ, ఐఓటి, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలపై దృష్టిసారించాల్సిందిగా సూచించారు.

విశాఖపట్నం

నవంబర్ 25,26,27 తేదీలలో ఏ.యు స్టూడెంట్స్ ఫెస్ట్.* *పోస్టర్ ఆవిష్కరణ చేసిన యూనివర్సిటీ వీసి ప్రొఫెసర్ జి.పి రాజశేఖర్ గారు.*

*నవంబర్ 25,26,27 తేదీలలో ఏ.యు స్టూడెంట్స్ ఫెస్ట్.* *పోస్టర్ ఆవిష్కరణ చేసిన యూనివర్సిటీ వీసి ప్రొఫెసర్ జి.పి రాజశేఖర్ గారు.* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25,26,27 తేదీలలో భారత విద్యార్థి ఫెడరేషన్ SFI ఆధ్వర్యంలో యూనివర్సిటీలోని ఓపెన్ ఎయిర్ థియేటర్ లో ఏ.యు స్టూడెంట్స్ ఫెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫెస్ట్ ప్రధానంగా విశ్వవిద్యాలయం శతాబ్ది సందర్భంగా పురస్కరించుకొని *సాంస్కృతిక కళా ప్రదర్శనలు* నిర్వహించబడుతున్నాయి. సాంస్కృతిక ఉత్సవాల ఈ కార్యక్రమంల నిర్వహణ పోస్టర్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొ. జి.పి. రాజశేఖర్ గారు, రిజిస్టర్ ప్రొ. కె.రాంబాబు గారు మరియు రెక్టర్ ప్రొ. పి.కింగ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఉపకులపతి మాట్లాడుతూ“విద్యార్థులు విద్యా రంగంలో మాత్రమే కాకుండా సాంస్కృతిక రంగంలోనూ తమ ప్రతిభను చూపించాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలను విద్యార్థులందరూ ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఎస్. ఎఫ్. ఐ నిర్వహించే యూనివర్సిటీ ఫెస్ట్ లో విద్యార్థులందరూ పాల్గొని ప్రదర్శించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. యూనివర్సిటీ విద్యార్థులు చదువుతో పాటు ఆటలు, పాటలు, కొత్త కొత్త ఆవిష్కరణలు ఇలా అన్ని రంగాల్లోని ముందంజలో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కార్యదర్శి డి. వెంకటరమణ మాట్లాడుతూ ఎస్.ఎఫ్. ఐ ప్రతి సంవత్సరం యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఫెస్ట్ ను ఘనంగా నిర్వహిస్తుందని. ఈ సంవత్సరం కూడా యధావిధిగా మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ ఫెస్ట్ లో విద్యార్థులందరూ పాల్గొని అనేక ప్రదర్శనలు ప్రదర్శించాలని కోరారు. గూగుల్ ఫామ్స్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు ఏమైనా సందేహాలు ఉంటే 9989789035, 8374293138 నెంబర్లకు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్షురాలు ఎం కుసుమాంజలి, జిల్లా అధ్యక్షులు జి అజయ్, సంజయ, హర్షిత్, ప్రగతి,నిఖిల్ మానస,సునీల్ మరియు యూనివర్సిటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విద్యార్థులందరినీ ఈ సాంస్కృతిక ఉత్సవంలో చురుకుగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించమని ఆహ్వానించారు

విశాఖపట్నం

విశాఖ లో జరుగుతున్న CII భాగస్వామ్య సదస్సు పై VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్

విశాఖ లో జరుగుతున్న CII భాగస్వామ్య సదస్సు పై VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* * సీఐఐ భాగస్వామ్య సదస్సు తో ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోంది – వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ * విశాఖలో పెట్టుబడుల జాతర జరుగుతోంది. * CII భాగస్వామ్య సదస్సు కి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తరలివచ్చారు * రెండు రోజుల సదస్సులో కేవలం 410 ఒప్పందాలతో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా పెద్ద ఎత్తున యువత కి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. * సదస్సుకి ముందు రోజు విశాఖలో ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు 5 రంగాల్లో 35 సంస్థ లతో 3.65 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలానే పలు సాఫ్ట్వేర్ సంస్థలకు, కార్పోరేట్ కంపెనీల కోసం శంకుస్థాపన కూడా చేశారు. * పెట్టుబడిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది. * రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తుండటంతో పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బారులు తీరుతున్నారు. * గత వైసీపీ ప్రభుత్వం హయంలో రాష్ట్రం లో కక్ష్య సాధింపు చర్యల కారణంగా అనేక సంస్థలు తరలిపోయాయి అనే కంటే తరిమికొట్టారనే చెప్పాలి. * దీంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిపై ఉన్న నమ్మకం తో పాటూ దేశ, విదేశాల్లో పర్యటించి, పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరుపున అందించే అవకాశాలు, ఇతర రాయితీలు వివరిస్తూ, రాష్ట్రంలో ఉన్న వనరులు గురించి చెపుతూ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించారు. * రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు. * అందువల్లే రాష్ట్రంలో పట్టుబడిదారులు రాష్టానికి తరలివస్తున్నారు. * వీటిని ప్రపంచం గమనిస్తోంది. భవిష్యత్తులో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయి.

విశాఖపట్నం

ఎపిలో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ను నెలకొల్పండి*

*ఎపిలో వ్యాక్సిన్ తయారీ యూనిట్ ను నెలకొల్పండి* *భారత్ బయోటెక్ మ్యానేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, సిడిఓ రేచస్ ఎల్లాతో మంత్రి లోకేష్ భేటీ* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ప్రపంచ మానవాళిని కోవిద్ వంటి మహామ్మారి నుంచి కాపాడిన అంతర్జాతీయస్థాయి వ్యాక్సిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ భారత్ బయోటెక్ మ్యానేజింగ్ డైరెక్టర్ సుచిత్రా ఎల్లా, చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లాతో మంత్రి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల నారా లోకేష్ భేటీ అయ్యారు. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ (కోవిడ్ – 19), రోటావాక్ (రోటా వైరస్), టైప్ బార్ టిసివి (టైఫాయిడ్ వ్యాక్సిన్), జెన్వాక్ (జపనీస్ ఎన్సెఫలిటీస్) వంటి వ్యాక్సిన్లను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా 80దేశాలకు సరఫరా చేస్తోంది. సుమారు రూ.3వేలకోట్ల వార్షికాదాయం కలిగిన ఈ సంస్థ వ్యాక్సిన్ల తయారీలో భారత్ లో టాప్-3లో ఒకటిగా ఉంది. ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికా వంటి దేశాలకు ప్రధానంగా వ్యాక్సిన్ ఎగుమతి చేస్తోంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… అన్నివిధాలా అనుకూలతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు. ఈ సందర్భంగా రేచస్ ఎల్లా మాట్లాడుతూ… ప్రస్తుతం తాము మలేరియా, చికెన్ గున్యా, జికా వైరస్ వంటి పాండమిక్ వ్యాధులకు వైరస్ తయారీ పై పరిశోధనలు సాగిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.