Saturday, 21 March 2026

Blog

చిత్తూరు

అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ – అభిప్రాయ సేకరణ అనంతరమే రోడ్డు ఏర్పాటు.. ఎమ్మెల్యే అమర్

*అతి త్వరలో రాయలపేట రోడ్డు విస్తరణ* *నిర్వాసితులకు ఆందోళన వద్దు* *అభిప్రాయ సేకరణ అనంతరమే రోడ్డు ఏర్పాటు.. ఎమ్మెల్యే అమర్* : పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలం రాయలపేటలోని రోడ్డు విస్తరణ పనులు అతి త్వరలో చేపట్టనున్నట్లు పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఇరుకైన రోడ్లతో రాకపోకలకు ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతొంది. ఇలా ఉండగా ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో ఈ రోడ్డును విస్తరించేందుకు ప్రభుత్వం ద్వారా రూ. 4.4 కోట్ల దాకా మంజూరు చేయించారు. అయితే కొంతమంది అభ్యంతరాల మేరకు రోడ్డు విస్తరణ జరగకపోవడంతో ఊరికి వెలుపల బైపాస్ నిర్మాణాన్ని చేపట్టదలిచారు. ఈ విషయం తెలుసుకున్న మెజారిటీ గ్రామాల ప్రజలు రాయలపేట మీదుగానే రోడ్డును ఏర్పాటు చేయాలని ఈమధ్య ఎమ్మెల్యేకు విన్నవించారు. దీంతో రోడ్డును ఏర్పాటుకు అధికారులు మార్కింగ్ ఇవ్వాలని ఎమ్మెల్యే సూచించడంతో రెండు రోజులుగా అధికారులు ఆ పనులను చేపడుతున్నారు. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ భాగం రోడ్డు విస్తరణకు వెళ్లే అవకాశం ఉందని పలువురు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శనివారం రాయల్ పేట గ్రామంలో పర్యటించి మార్కింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ ఇబ్బంది తలెత్తుతుందో స్థానికులు అడిగి తెలుసుకున్నారు. దీనిపై ఎవరికి ఎటువంటి ఆందోళన వద్దని అధికారులు మరియు గ్రామస్తుల తో సమీక్ష నిర్వహించి అందరి అభిప్రాయ సేకరణ అనంతరమే పనులు చేపడతామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వివి మెరక గ్రామంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

మల్కిపురం నవంబర్ 15 పున్నమి ప్రతినిధి శ్రీ చింతా.కోటమ్మ సూర్య ప్రకాష్ రావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారి కుమారుడు చింతా.సుధాకర్ రావు జగదీశ్ మరియు వారి కుటుంబ సభ్యులు ద్వారా 21 సంవత్సరాల నుంచి వృద్ధులకు మరియు అనాధ పిల్లలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వివి మెరక సర్పంచ్ ఓగూరి. రత్నకుమారి బాబుల్, జాన. శంకర్రావు,(బాబ్జి) సహదేవ్. తాడి, ఉప్పు సోమరాజు, ఇనుమర్తి . శ్రీకాంత్, కందనాల ముత్యాలు, కారు పత్తి భాస్కర నాగేశ్వరరావు, కొండ బాబి, గోళ్ళ బాపూజీ, జాన పార్వతీశం, గుంటు. రంగా తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ ఆకస్మిక తనిఖీలు – అధిక రుసుములపై నిఘా, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల సౌకర్యం, పారదర్శకతను మెరుగు పరచాలనే లక్ష్యంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ కొట్టే సాయిప్రసాద్ గారు ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్నప్రసాద కాంటీన్ ప్రాంతం, భద్రత సిబ్బంది విధులు, క్యూ లైన్ వ్యవస్థతో పాటు ఫోన్–బ్యాగ్ భద్రపరచే కౌంటర్లు వంటి కీలక ప్రాంతాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఇటీవలి కాలంలో ఫోన్ – బ్యాగ్ భద్రపరచే కేంద్రాల్లో అధిక రుసుములు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు రావడంతో, చైర్మన్ గారు అక్కడికే వెళ్లి వివరాలను సేకరించారు. భక్తులతో నేరుగా మాట్లాడి ఎలాంటి అసౌకర్యాలు ఎదురవుతున్నాయో తెలుసుకున్నారు. నిఘా కేంద్రాలు కూడా పరిశీలన: ఆలయంలో ఏర్పాటు చేసిన నిఘా కేంద్రాలను కూడా చైర్మన్ గారు తనిఖీ చేశారు. భద్రత, క్రమశిక్షణ, క్యూ లైన్ నియంత్రణ, మరియు దళారుల దూకుడును అరికట్టడంలో ఈ నిఘా కేంద్రాల పాత్రను సమీక్షిస్తూ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. “శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తాను. అధిక రుసుములు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు” అని చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ గారు భక్తులకు హామీ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో పారదర్శకత, భక్తుల భద్రత, సౌకర్యం, సేవా ప్రమాణాలను మరింత మెరుగుపరచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ శ్రీ కొట్టేసాయి ప్రసాద్ గారు పేర్కొన్నారు.

జోగులాంబ గద్వాల

నవంబర్ 26 న రాజ్యాంగం అమలు దినోత్సవం నడిగడ్డలో మహా ర్యాలీనీ విజయవంతం చేయండి. భీమ్ ఆర్మీ

నవంబర్ 26 న రాజ్యాంగం అమలు దినోత్సవం నడిగడ్డలో మహా ర్యాలీనీ విజయవంతం చేయండి భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్ జోగులాంబ గద్వాల జిల్లా:ఈ నెల నవంబర్ 26వ తారీఖున రాజ్యాంగం అమలు దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లాలో భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో జరిగే మహా ర్యాలీని విజయవంతం* చేయాలనీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ అన్నారు, భారత రాజ్యాంగాన్ని కాపాడండి సోదర భావాన్ని నిర్మించండి,,, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం రక్షించుకోవడం మన బాధ్యతనీ ప్రతి పౌరుడు జోగులాంబ గద్వాల జిల్లాలోనూ ప్రతి గ్రామ, గ్రామానికి వెళ్లి సమావేశాలు నిర్వహించి రాజ్యాంగ హక్కుల గురించి ప్రతి పౌరుడికి అవగాహన కల్పించాలనీ అన్నారు, భారత రాజ్యాంగ అమలు దినోత్సవ మహా ర్యాలీ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈ నెల నవంబర్ 26 తేదీన ఉదయం 10 గంటల నుండి అంబేద్కర్ చౌరస్తా నుండి విజయవంతం చేయడానికి గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున తరలివచ్చి విజవంతం చేయాలనీ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు మేళ్లచెరువు వర్షిత్, ఉపాధ్యక్షులు పుట్ట ప్రసాద్, ధరూర్ మండల అధ్యక్షుడు ఈదన్న,జిల్లా భీమ్ ఆర్మీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా కోఆర్డినేటర్ విజయ్,శ్రీను, ఆంజనేయులు, సూరి బాబు తదితరులు

తెలంగాణ

_High Court : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు_*

High Court : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు తెలంగాణా నవంబర్ 15 (పున్నమి ప్రతినిధి ) High Court : తెలంగాణలో మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీ లోపు లోకల్ బాడీ ఎన్నికలపై తేల్చాలని సూచించింది _మేం రిజర్వేషన్ల మీదే అభ్యంతరం చెప్పాం కానీ ఎన్నికల నిర్వహణఫై కాదని హైకోర్టు పేర్కొంది. బీసీ రిజర్వేషన్లపై వివాదం లేనిచోట ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పేర్కొనడంతో.. ఎస్‌ఈసీ తీరుపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విభజించి ఎన్నికలు నిర్వహించడం సరికాదని హైకోర్టు సూచించింది. నవంబర్ 24వ తేదీలోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గతంలో బీసీ రిజర్వేషన్ల వలన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిలిచిపోయింది. ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడదల చేయడంతోపాటు ఎన్నికల నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. అయితే, బీసీ రిజర్వేషన్లపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులు జోక్యంతో ఎన్నికలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేసిన విషయం తెలిసిందే. అయితే, అత్యున్నత న్యాయస్థానం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరిస్తూ డిస్మిస్ చేసింది. హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. కావాలనుకుంటే పాత రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చని పేర్కొంది. తాజాగా.. హైకోర్టులో ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. 24వ తేదీలోపు ఎన్నికల తేదీలు ప్రకటించాలని సూచించింది

ఆంధ్రప్రదేశ్

Elementor #150363

🔸కిడ్నీ వ్యాధితో మృతి చెందిన కుటుంబానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేయూత..! వింజమూరు నవంబర్ 15న వింజమూరు మండలం, గుండెమడకల గ్రామానికి చెందిన బత్తల వనయ్య కిడ్నీ వ్యాధితో కొద్దిరోజుల క్రితం మృతి చెందడంతో, వారి కుటుంబానికి ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ అండగా నిలిచారు.ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు గుండెమడకల తెలుగుదేశం పార్టీగ్రామ కమిటీ అధ్యక్షులు గాలి రామ్మోహన్ నాయుడు, ప్రముఖ బిల్డర్ గాలి రఘురామ నాయుడుతో కలిసి శుక్రవారం వనయ్య నివాసానికి వెళ్లి, కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అందించిన 5000 రూపాయలను, రామ్మోహన్ నాయుడు 5000 రూపాయలను, రఘురామ నాయుడు 5000 రూపాయలను కలిపి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయంగా ₹15,000 అందజేశారు. ఈ సందర్భంగా, తమకు కష్టకాలంలో అండగా నిలబడి, ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి, గాలి రామ్మోహన్ నాయుడుకి, గాలి రఘురాం నాయుడుకు వనయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

అవార్డు డే ఫంక్షన్ లో పాల్గొన్న కృష్ణా -గుంటూరు పట్టభద్రుల MLC

ఈరోజు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం బంటుమిల్లి గ్రామంలో కొమ్మారెడ్డి E. M మోడల్ హై స్కూల్ లో బాలల దినోత్సవం సందర్భంగా అవార్డ్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ పోటీలలో ప్రతిభ చూపిన పిల్లలకు బహుమతి ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మరియు కృష్ణ గుంటూరు MLC శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు స్కూల్ యాజమాన్యం, టీచర్స్, విద్యార్థి విద్యార్థినులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కారం

జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కారం

జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి , పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి , నూతన రాష్ట్ర కార్యదర్శులుగా నియమితులైన ఆదిత్య కటకంశెట్టి , కర్రి నాగిరెడ్డి గార్లను ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి,పార్లమెంట్ పరిశీలకురాలు విజయలక్ష్మి, రాజోలు నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు కర్రి పాపారాయుడులను నూతన రాష్ట్ర కార్యదర్శులు ఘనంగా సత్కరించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.