Friday, 20 March 2026

Blog

గూడూరు

దరఖాస్తుల ఆహ్వానం

గూడూరు: ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తాత్కాలిక ప్రతిపాదనలో కంప్యూటర్ బోధించేందుకు లెక్చరర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సింహాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఎం సీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వారు ఈ నెల 20వ తేదీ (గురువారం) 11 గంటలకు స్థానిక డిగ్రీ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని, P.G. 55% తో పాటు NET/SET, Ph D. ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు జూనియర్ కళాశాల ఎదురుగా మోటార్ సైకిల్ డి

17/11/2025:మనుబోలు మండల పరిధిలోని హైవేపై జూనియర్ కళాశాల ఎదురుగా మోటార్ సైకిల్ అదుపుతప్పి ఇవతల మార్గంలో కంటైనర్ గుద్దుకునీ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయారు.

ఎన్ టి ఆర్ జిల్లా

*సంక్షేమ బోర్డును పని చేయించాలి* *నవంబర్ 20న ధర్నాచౌక్‌లో బిల్డింగ్ వర్కర్స్ ధర్నా* *ఎన్‌టీఆర్ జిల్లా సిఐటియు యూనియన్ పిలుపు*

రాష్ట్ర బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డును పనిచేయించి నిలిపి వేసిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న విజయవాడ అలంకార్ సెంటర్ సమీపంలోని ధర్నాచౌక్‌లో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు ప్రకటించారు. ఈ మేరకు డాక్టర్ బిఆర్‌ అంబేద్కర్ బిల్డింగ్ & పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భం గా యూనియన్ నాయకులు పతి హరిబాబు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె.గోపాల్ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డుపై ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15 ధర్నా — అమలు కాని హామీలు సెప్టెంబర్ 15న రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నా అనంతరం, కమిషనర్ స్వయంగా ధర్నా స్థలానికి వచ్చి వెల్ఫేర్ బోర్డును పనిచేయిస్తా మని, సంక్షేమ పథకాలను పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. నెలరోజులు సమయం కోరినప్ప టికీ నేటి వరకూ హామీ అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 25 లక్షల కార్మికులకు నష్టం రాష్ట్రంలో 25 లక్షలకుపైగా నిర్మాణ కార్మికులు పనిచేస్తుం డగా,వెల్ఫేర్ బోర్డులో 18 లక్షల మంది నమోదు అయినట్టు నాయకులు వివరించారు. 2009 నుంచి 2019 వరకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నప్పటికీ, వైఎస్సాఆర్సిపి ప్రభుత్వం జారీ చేసిన మెమో 1214 కారణంగా ఆ పథకాలు పూర్తిగా నిలిచి పోయాయని తెలిపారు. వెల్ఫేర్ బోర్డు ఖాతాల్లో వేల కోట్ల నిధులు ఉన్నప్పటికీ, ఒక్క రూపాయి కూడా కార్మికులకు చేరకపోవడం తీవ్రమైన అన్యాయమని అన్నారు. ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు కర్ణాటకలో కార్మికుల పిల్లలకు స్కాలర్‌షిప్‌ లు, తమిళనాడులో ప్రమాద మరణాలపై రూ.10 లక్షల పరిహారం, హర్యానాలో మహిళ ల కోసం కుట్టు యంత్రాల పంపిణీ వంటి పథకాలు కొనసాగుతున్నాయని వివరించారు.మన రాష్ట్రంలో మాత్రమే సంక్షేమ పథకాలు నిలిచిపోవడం విచారకరమని విమర్శించారు. టిడిపి హామీ ఏమైంది? ఎన్నికల ముందు వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరిస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయినా, ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నాయకులు ఆక్షేపించారు. నానా విన్నపాలు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవ డం బాధాకరమని తెలిపారు. వెల్ఫేర్ బోర్డు పథకాలు అమలు చేస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదని, నిర్ణయం తీసుకుంటే లక్షలాది కార్మికులకు మేలు జరుగుతుందని వారు అన్నారు. 20న ధర్నాకు భారీగా తరలిరండి — యూనియన్ పిలుపు మెమో 1214 రద్దు చేయాలని, వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 20న జరిగే ధర్నాచౌక్ ధర్నాను విజయం సాధించాల్సి న అవసరం ఉందని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు డాక్టర్ బి.ఆర్‌ అంబేద్కర్ పెయింటింగ్ వర్కర్ యూనియన్ నాయకులు గులాయ్ దస్తగిరి బాజి (అధ్యక్షులు), కొరగంటి ఆనందరావు (కోశాధికారి), మందా స్వామి, కమాదుల నాగరాజు (ఉపాధ్యక్షులు), కొండ్ర కోండ రాము, కామా రమేష్ బాబు (సహాయ కార్యదర్శులు),షేక్ అలీల్ పాసా, పుప్పాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి దేవాలయం వారి డా.స్వామి వాసిస్ట్

చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి దేవాలయం వారి డా.స్వామి వాసిస్ట్ గారు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా దర్శించడం జరిగినది స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు గ్రామంలో ఉన్న పెద్దలందరూ కలిసి స్వామివారికి గణంగా స్వాగతం పలికారు.

తిరుపతి

శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి దేవాలయం వారి డా.స్వామి వాసిస్ట్

చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం గ్రామంలో వెలసిన పురాతన శివాలయం శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి దేవాలయం వారి డా.స్వామి వాసిస్ట్ గారు కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా దర్శించడం జరిగినది స్వామి వారికి ఆలయ కమిటీ సభ్యులందరూ కలిసి భక్తులు గ్రామస్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి స్వాగతం పలికారు.

E-పేపర్

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ CII సమ్మిట్ : మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా CII భాగస్వామ్య సదస్సు నిలిచిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్) నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్, నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య మాట్లాడుతూ CII భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాకుండా , ఆంధ్రప్రదేశ్ ను గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందని అన్నారు. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారని. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారని . ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయన్నారు . ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం వంటివి పరిశ్రమలు ఆకర్షణకు ప్రధాన కారణమన్నారు . రెండు రోజుల్లోనే భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు, లోకేష్ కి పెట్టుబడుల పట్ల ఉన్న స్పష్టమైన విజన్ ను చూపిందని మొత్తం 613 ఒప్పందాల ద్వారా రూ.13,25,716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు. అంచనాలకు మించి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ వైపు పరుగెత్తి రావడం చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి మళ్లీ ట్రాక్పైకి వచ్చిందని నిరూపించిందని. సదస్సుకు ఒక రోజు ముందే రాష్ట్రంలో పెట్టుబడుల వరద మొదలైంది. రూ.3,65,304 కోట్లు పెట్టుబడులతో 1,26,471 ఉద్యోగావకాశాలు సృష్టించే 35 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తుంటే ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలో విశ్వాసం ఎలా ఉందో తేటతెల్లమైందని. తొలి రోజు ఒక్కరోజే రూ.8.26 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు నమోదవడం ఏపీ అభివృద్ధికి గట్టి బలం అని. ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలు కుదరడం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ వ్యూహాత్మకంగా చేసిన కృషికి ఈ సదస్సు ప్రతిఫలంగా నిలిచిందని. జగన్ రెడ్డి విధ్వంసకర విధానాలకు భయపడి రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన రెన్యూ, హీరో ఫ్యూచర్స్, ఏబీసీ వంటి కంపెనీలు సైతం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, లోకేష్ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఆకర్షితులై తిరిగి రాష్ట్రానికి వచ్చాయన్నారు.. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు, కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పరి సురేష్ కుమార్, దూదేకుల దస్తగిరి పాల్గొన్నారు

నిర్మల్

వై.ఎస్.ఆర్. కాలనీ సమస్యలపై స్పందించాలని అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఆదేశం – మున్సిపల్ కమిషనర్‌కు సూచనలు

నిర్మల్ నవంబర్ 17 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆధ్వర్యంలో వై.ఎస్.ఆర్. కాలనీలో శనివారం 15 వ తేదీన నిర్వహించిన *‘ *జాడు చలావ్ యాత్ర’** లో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వెలుగులోకి వచ్చాయి. జిల్లా అధ్యక్షులు సయ్యద్ హైదర్‌తో కూడిన పార్టీ నాయకులు ఇంటింటికీ తిరిగి మౌలిక వసతుల లోపాలు, పారిశుద్ధ్య సమస్యలను పరిశీలించారు. కాలనీలో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ లేమి, చెత్త సేకరణ లోపాలు, వరద నీటి ముంపు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని స్థానికులు ఆప్ నాయకులకు వివరించారు. మురుగునీరు నిల్వ కారణంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు విస్తరిస్తుండగా, ఇప్పటికే సుమారు 20 మంది నివాసితులు ఈ రోగాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఈ అంశాలను ఆప్ నాయకులు ప్రజావాణి ద్వారా అధికారులు దృష్టికి తీసుకెళ్లగా, జెసి గారు వెంటనే స్పందించి, వై.ఎస్.ఆర్. కాలనీ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జనరల్ సెక్రెటరీ సిహెచ్ వినోద్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ట్రెజరీ అబ్దుల్ సాదిక్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ వసంతరావు పాల్గొన్నారు

Blog

నంద్యాలలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్.ఎమ్.డి. ఫరూక్

నంద్యాల స్థానిక పాలకేంద్రం పక్కన ఉన్న మురారి కాటన్ మిల్ ప్రాంగణంలో, నంద్యాల పట్టణంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని లాంఛనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యంగా పత్తి రైతులకు సరైన మద్దతు ధర (Minimum Support Price – MSP) లభించేలా ఈ కొనుగోలు కేంద్రం కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. దళారుల వ్యవస్థను తొలగించి, పారదర్శకతతో కూడిన కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ కేంద్రం ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, నేరుగా కేంద్రంలో పత్తిని విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్.ఎమ్.డి. ఫయాజ్ , చాబోలు ఇలియాస్ ,బద్రి శెట్టి రవి, రంగ ప్రసాద్, జనసేన పబ్బతి రవి, విజయ గౌరీ, కాల్వ శీను, ధనుంజయ, డైరెక్టర్ మునియర్ ఖలీల్, మరియు నంద్యాల మార్కెట్ యార్డ్ అధికారులు, మిల్లు ఓనర్లు, స్థానిక రైతులు, మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లాలో కరెంట్ మీటర్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి?

కామారెడ్డి, 17 నవంబర్ , (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లాలో కొత్త కరెంట్ మీటర్ కోసం దరఖాస్తు చేయడం ఇప్పుడు చాలా సులభమైంది. మీరు ఇంటర్నెట్‌లో, మీసేవ కేంద్రంలో లేదా TG SPDCL అధికార వెబ్‌సైట్‌లో “కొత్త సేవ కనెక్షన్” విభాగం ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు చేసేటప్పుడు మీకు కావలసిన పత్రాలు:వ్యక్తిగత గుర్తింపు పత్రం (ఆధార్, ఓటరు కార్డు, లేదా డ్రైవింగ్ లైసెన్స్)చిరునామా ధృవీక రణ పత్రం (ఇల్లు పత్రము, అద్దె ఒప్పందం, పాస్‌ బుక్, లేదా రేషన్ కార్డు)రెండు ఫోటోలుపూర్తి చేసి న అప్లికేషన్ ఫారంఅద్దె ఇళ్లవారి ప్రక్రియఅద్దెకు ఉన్న వారు తమ పేరుమీద మీటర్ తీసుకునేందు కు ఇంటి యజమానితో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తప్పనిసరి. అద్దె ఒప్పంద పత్రం చిరునా మా రుజువు గా చెల్లుతుంది. ఈ పత్రాలతో పాటు ఆధార్, అప్లికేషన్ మరియు ఫోటోలను మీసేవ కేంద్రంలో లేదా TGSPDCL వెబ్‌సైట్‌లో సమర్పిం చవచ్చు.సొంత ఇల్లు, స్థలం కలిగిన వారుమీ పేరు మీద నమోదు అయ్యిన సొంత ఇల్లు లేదా స్థల పత్రాలు ఉంటే, వాటిని ఆధారంగా తీసుకుని ఆధార్, రేషన్ కార్డు, ఫోటోలతో పాటు దరఖాస్తు చేయవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత 3-7 రోజుల్లో మీట్ కంట్రోల్ ప్రారంభం అవుతుంది.ఇల్లు లేకపోయినా సదుపాయం ఇల్లు లేదా స్థిరాస్తి పత్రాలు లేకపోయినవారైతే , మీటర్ కోసం ప్రయ త్నించవచ్చు. వాడుతున్న ప్రామాణిక చిరునామా పత్రాలు, స్థానిక అధికారుల NOC, ఆధార్ కార్డుతో పాటు 600 రూపాయల డిపాజిట్ చెల్లించి దరఖా స్తు చేయవచ్చు.చిన్న పరిశ్రమలకుచిన్న పరిశ్రమల కు కనెక్షన్ కావాలంటే పరిశ్రమ అనుమతులు, పర్యావరణ అనుమతులు, వైరింగ్ సర్టిఫికేట్ వంటి పత్రాలు సమర్పించి TGSPDCL వెబ్‌సైట్‌లోని “Industry Connection” ద్వారా దరఖాస్తు చేయాలి.దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌ లో మీ అప్లికేష న్ నెంబర్ ఉపయోగించి గమనించవచ్చు. ఏదైనా సందేహాలు తలెత్తినప్పుడు దగ్గరి మీసేవ కేంద్రం లేదా స్థానిక విద్యుత్ కార్యాలయం సంప్రదించం డి.ఈ సదుపాయం వల్ల కామారెడ్డి జిల్లాలో విద్యుత్ కనెక్షన్ పొందడం కోసం ప్రజలకు భారీ సౌకర్యం కలబడింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.