Friday, 20 March 2026

Blog

కడప

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ

*జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 14 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *ప్రొద్దుటూరు నియోజకవర్గం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు 14 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు* *ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మంచి సదుపాయాలతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మహర్దశ రానుందని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు.జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి 14 కోట్ల రూపాయలు మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు.* *ఈ సందర్భంగా దాతల సహకారంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి కుర్చీలు,వీల్ చైర్స్,బెడ్శిట్లు ఆసుపత్రి సిబ్బందికి అందజేసిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు* *ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి గారు,DCH డాక్టర్ హిమదేవి గారు,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిడెంట్ సుజాత గారు,RMO శివరాం గారు,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి గారు,డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి గారు,డాక్టర్ పద్మజా గారు,రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు గారు,రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ హుస్సేన్ గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ Vs ముక్తియార్ గారు,టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్ గారు,టీడీపీ ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు పేట చంద్రశేఖర్ గారు,లింగాపురం AGR బ్యాంకు చైర్మన్ సిద్ధారెడ్డి నాగముని రెడ్డి గారు,ప్రొద్దుటూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గారి భర్త & మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు గారు,కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గారు,TNTUC జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్ గారు,కౌన్సిలర్లు కొవ్వూరు స్వాతి గారు,వంగనూరు మురళీధర్ రెడ్డి గారు,జిలాన్ గారు,మునీర్ గారు,కమాల్ భాష గారు,కంకర గౌస్,బీజేపీ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర గారు,జనసేన జిలాన్,ఘంటసాల వెంకటేశ్వర్లు,మున్నా,తలారి పుల్లయ్య,మార్తల గురివి రెడ్డి,బేపారి గౌస్ బాషా,తలారి రమేష్,నూరి,మీగడ చంద్ర,చెన్నారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు,సిబ్బంది,కూటమి ప్రభుత్వ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.*

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో డీజీ లక్ష్మీ సెంటర్ ప్రారంభం ప్రారంభించడంలో పాల్గొన్నారు: ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలోని గాంధీ సెంటర్‌లో మున్సిపల్ మరియు మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీజీ లక్ష్మీ సెంటర్ ను సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. *ప్రధాన విషయాలు:* సెంటర్ ద్వారా మహిళలకు నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి శిక్షణలు, ఆర్థిక సాయం, వనరుల సమన్వయం వంటి సేవలు అందుబాటులో ఉంటాయి. మహిళల ఆర్థిక స్వావలంబన మరియు కుటుంబ అభివృద్ధికి ఈ సెంటర్ కీలకం అవుతుంది. ప్రభుత్వం స్థానిక మహిళలకు మరిన్ని అవకాశాలు మరియు ప్రోత్సాహక పథకాలు అందించేం దుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలు, మున్సిపల్ అధికారులు, మెప్మా ప్రాజెక్టు సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

తెలంగాణ

ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించిన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి) ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దు అని అన్నారు. ఎప్పటి ఫిర్యాదులు అప్పుడే పరిష్కరించాలన్నారు. ఈ సోమవారం మొత్తం 129 ఫిర్యాదులు రాగా, 73 ఫిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవెన్యూ శాఖకు వచ్చాయి. ప్రజావాణి అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ వర్షం కారణంగా గ్రామాలలో నీరు నిలువ లేకుండా చూడాలని, డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా పూర్తిగా శానిటేషన్ చేయాలని చెప్పారు.

కామారెడ్డి

రేవంత్ మార్గంలోనే విజయమే లక్ష్యం

– మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ నా.మోహన్ రెడ్డి కామారెడ్డి,17 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలు పు కోసం కార్యకర్తలు గ్రామ గ్రామాన పోరాట బాట పట్టాలని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ నా.మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్య క్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కాంగ్రె స్ విజయాలను సాధించింది. అదే స్పూర్తితో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలన్నారు. రెడ్డిపేట తండాలో జరిగిన సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, వక్తిగత, భేషజాల విభేదాలకు తావు లేకుండా పార్టీ అభ్యర్థి గెలుపు లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా కృషి చేయాలని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత బస్సు, రైతులకు రెండేళ్లలో రెండు లక్షల రుణమాఫీ, రూ.500కు గ్యాస్, ఉపాధ్యాయ నియామకాలు, మహిళా బలోపేతం వంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు గుర్తింపు ఖాయం అని అన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు రగోతం రెడ్డి, సల్మాన్, కుమ్మరి శంకర్, గంగావత్ రవి నాయక్, ఇర్షద్, దయానంద్, గంగావత్ బోజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో శంకుస్థాపనలు చేసిన : మంత్రులు

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి, మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 171.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు, 👉 శెట్టిపాలెం నుండి అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. 👉 15 కోట్ల రూపాయల టిఎఫ్ యు ఐ డి సి నిధులతో చేపట్టిన రోడ్డు, 👉 16 కోట్ల రూపాయల టిఎఫ్ యుఐడిసి నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, మురికి కలవలను ప్రారంభించారు. 👉 మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 41 కోట్ల రూపాయల బిటి, సిసి రోడ్డు పనులను, 👉 15 కోట్ల రూపాయల వ్యయంతో మిర్యాలగూడ నుండి తడకమళ్ల వరకు ఉన్న డబుల్ రోడ్డు ను, ఆరు లైన్లుగా మార్చే పనులకు, మూడు కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, మున్సిపాలిటీ ఆఫీస్ ఏరియా, సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. 👉 ఐదు కోట్ల రూపాయల వ్యయంతో కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు భవనాన్ని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు భవనాన్ని మంత్రులు ప్రారంభించారు.

కామారెడ్డి

పోసానిపేటలో ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు కార్యక్రమం ఘనంగా

కామారెడ్డి, 17నవంబర్, ( పున్నమి ప్రతినిధి ). : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలోని పోసా నిపేట గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల ముగ్గు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుద్దాల బాలరాజు మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు గృహ కల్పన జరుగుతోం ది. ఈ పథకాన్ని ప్రతి అర్హుడి దాకా చేరేలా కృషి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గ్రామంలో ఇంకా ఇళ్లు పూర్తి కావాల్సివున్న వారికి త్వరలోనే పనులు పూర్తి అవుతాయి” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంపీఓ, గ్రామ కార్యద ర్శి, పార్టీ నాయకులు,AMC డైరెక్టర్ బట్టు సత్యం, మండల ఉపాధ్యక్షుడు నా.రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సలహాదారు నా.రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మండల సీనియర్ నాయకు లు మెలిగే నరేందర్, మండల ఎస్సీ సెల్ నాయకు లు, గంగాధర్, దెబ్బతిలింగం, మహిళా కమిటీ అధ్యక్షురాలు కుడుదుల అంజ వ్వ, సభ్యురాలు విజయ పాల్గొన్నారు

అనకాపల్లి

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ వనభోజన కార్యక్రమం మరియు మండల క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం…!! కార్యక్రమం

పున్నమి న్యూస్ ప్రతినిధి నవంబర్ 17 అనకాపల్లి జిల్లా: ఎలమంచిలి నియోజకవర్గంలో అచ్చుతాపురం కేంద్రంలో శిల్పా లే ఔట్ లో ఎలమంచిలి నియోజకవర్గ వనభోజనా కార్యక్రమం మరియు మండల, క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ పప్పల చలపతిరావు గారు, రాష్ట్ర రహదారులు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు ఎలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి లాలం భవాని భాస్కర్ గారు, నియోజవర్గ పరిశీలికులు శ్రీ బోండా జగన్నాథం గారు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ రాజాన రమేష్ కుమార్ గారు, రాష్ట్ర కార్యదర్శి మరియు యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ధూళి రంగనాయకులు గారు, రాష్ట్ర కార్యదర్శి మరియు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీ కోటిని బాలాజీ గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్న అన్ని కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం నేడు పండుకు వాతావరణంలో జరపడం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి పనిచేసే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాల్లో గెలిపే ధ్యాయంగా కలిసిమెలిసి పనిచేయాలని, కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి నష్టం జరగకుండా అందరం ఐకమత్యంతో కలిసి ముందుకు వెళ్దామని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను ఎక్కడ వదిలిపెట్టకుండా ఎలమంచిలి నియోజకవర్గంలో ఎంతో మంది కార్యకర్తలు ఉన్నారని, వారి స్ఫూర్తితోనే మనందరం ముందుకు వెళ్దామని, త్వరలో మరిన్ని నామినేటెడ్ పోస్టులు రానున్నాయని, ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగే విధంగా కలిసి పనిచేస్తామని, ఎలమంచిలి నియోజక వర్గంలో సమస్యలపై త్వరలో అధినాయకత్వాన్ని కలుస్తామని, మన అధినాయకుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, మన యువ నేత శ్రీ నారా లోకేష్ గారి అడుగుజాడల్లో నిరంతరం కలిసిమెలిసి పనిచేయాలని, లోకేష్ గారు ప్రవేశపెట్టిన మై టిడిపి యాప్ ను ఉపయోగించి కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీల తులసీరామ్, లాలం శ్రీ భరత్, పెంటకోట విజయ్, గొర్లి శివన్నారాయణ మూర్తి, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, పడుకుని బాధ్యతలు కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి శ్రీనివాసరావు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ డొక్క నాగభూషణం, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివ అప్పారావు, శ్రీకాళహస్తి డైరెక్టర్ బిలా స్రవంతి, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి మంజు, జిల్లా ఉపాధ్యక్షుడు కొలుకులూరి విజయరామరాజు, సీనియర్ నాయకులు మెరుగు బాపు నాయుడు, పొన్నమల్ల కొండబాబు, కడియం అనురాధ, ఆడారి జానకి, రాజాన నారాయణమ్మ, కాండ్రకోట చిరంజీవి, రాజాన సూరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ నీరుకొండ నరసింగరావు, కౌన్సిలర్ మజ్జి రామకృష్ణ, క్లస్టర్ ఇంచార్జిలు, యూనిట్ ఇన్చార్జులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, భూత్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైల్వేకోడూరు ప్రాంతాన్ని అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయాలని రైల్వేకోడూరు టిడిపి యువ నాయకులు రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ అభ్యర్థించా రు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైల్వేకోడూరు ప్రాంతాన్ని అభివృద్ధికి తమ వంతు సహకారాన్ని అందజేయాలని రైల్వేకోడూరు టిడిపి యువ నాయకులు రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ అభ్యర్థించా రు. సోమవారం రైల్వే కోడూరులోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత నాలుగు రోజులు క్రితం విశాఖపట్టణం నందు సిఐఐ అనే సమావేశంలో పారిశ్రామిక దిగ్గజాలతో 13 లక్షల కోట్లతో ప్రఖ్యాత కంపెనీలను ఆంధ్రప్రదేశ్ లో స్థాపించేందుకు సర్వతో ముఖాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ ఆధ్వర్యంలో జరగడం ప్రపంచ దేశాలకు ఒక చక్కటి సందేశం వచ్చిందని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని వారు అన్నారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలంటే పారిపోయే వారని, అని ఆయన గుర్తు చేశారు రాష్ట్రంలో 90 శాతం సూపర్ సిక్సు సూపర్ సక్సెస్ విజయోత్సవాలను రాష్ట్రంలో పలుచోట్ల విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ప్రపంచ దేశాలలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ను పారిశ్రామికవేత్తలు ఎంతో ఉన్నత భావాలతో కొన్ని పెద్ద పెద్ద సంస్థలు ఈ ప్రాంతానికి రావడం వారి అభ్యున్నతికి తన జోహార్లు కురిపిస్తున్నానని అదేవిధంగా రైల్వేకోడూరు నియోజకవర్గం పాడిపంటలకు ప్రసిద్ధి చెందిందని అయితే ఈ ప్రాంతంలో – పండిన పంటలు గిట్టుబాటు ధర లేక ఎన్నో ఉడుదుడుకులు రైతులు పడుతు = న్నారని ఈ ప్రాంతం నందు ఒక పారిశ్రామిక రంగాన్ని ప్రవేశపెడితే ఎంతో మంది ఉద్యోగాలు రైతులకు ఉపయోగపడతాయని వారికి సముచిత న్యాయం చేయవచ్చని అన్నారు. తిరుపతికి కూతవేటు దూరంలో ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు. నారా లోకేష్లు ప్రత్యేక దృష్టి సారిస్తే రైల్వే కోడూరు నియోజకవర్గ ఎంతో పుణ్యం చేసినట్లు అని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో పండిన పంటలు ఈ ప్రాంతంలోనే కొన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అటు రైతులకు ఇటు నిరుద్యోగులకు సమచిత న్యాయం జరుగుతుందని అదేవిధంగా రైల్వేకోడూరు నియోజకవర్గ కూడా ఎంతో అభివృద్ధికి ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న సందర్భంలో దళిత నియోజకవర్గం అయినా రైల్వే కోడూరును అభివృద్ధి పథంలో నడిపించే సత్తా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కే దక్కుతుందని ఇప్పటికైనా వారి ఇరువురు రైల్వే కోడూరు ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ఈ ప్రాంతానికి నిధులు కేటాయించి గూగుల్, సిఐఐ సమ్మిట్ లాంటి సంస్థలను ఈ ప్రాంతంలో కేటాయిస్తే జిల్లాలో రైల్వే కోడూరు నియోజకవర్గం కూడా ఎంతో అభివృద్ధికి బాటలు వేసినట్లుగా ఉంటుందని ఆయన అభ్యర్థించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని ,నారా లోకేష్ ను వేడుకొన్నారు.

E-పేపర్

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బోలా శంకర్ సేవా సమితి పెనపోలు చంద్రశేఖర్

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బోలా శంకర్ సేవా సమితి పెనపోలు చంద్రశేఖర్ రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు రంగనాయకులపేటకు చెందిన కొర్లకుంట సిద్దమ్మ ఆనే నిరుపేద మహిళకు మా భోళాశంకరసేవా సమితి ద్వార రైల్వే కోడూర్ పాత బజర్ కు చెండిన,పెనపోలు చంద్రశేఖర్ఆనే వ్యక్తి ఎవరైనానిరూపేద మహిళకు తన వంతు సహాయము అందించాలని మా భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షడు.మండల.నాగేంద్ర నీ కోరగా మా సమస్త ద్వార కొర్లకుంట సిద్దమ్మ ఆనే మహిళ పే రు చెప్పగా ఆమెకునిత్యావసర సరుకులు బియం పంపిని చేయడము జరిగినది. ఈకార్యక్రమములో పాల్గొనవారు చెనంశెట్టి రమేష్ బాబు ,వాసా బాబు, పి.రాజేశ్వరమ్మ, యనమల,రత్తయ్య,టి.ఆంజనేయులు,కొప్పల.శంకరయ్య,మహాకాళి సుబ్రహ్మణ్యం,బి.నాగరాజ మలేల ,సుబ్రహ్మణ్యం,కస్తూరీ సుబ్బారావు,పెనుకొండ సుబ్బరాయుడు,సుంకేసులబాష,చాటకొండు సుబ్రహ్మణ్యం చెనం సెట్టి పురుషోత్తం తధితరులు పల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దిగ్విజయంగా ముగిసిన యాదవ సంఘం వనభోజన మహోత్సవం

మర్రిపాడు (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నియోజకవర్గంలోని మర్రిపాడు మండలంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం వనభోజన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వందలాది యాదవ సోదరులు తరలి రావడంతో మండల కేంద్రం సందడిగా మారింది. తాసిల్దార్ ఆఫీస్ దగ్గర ప్రారంభమైన ర్యాలీ పి.ఎన్.ఆర్ బృందావనం గార్డెన్స్ వరకు అద్భుతంగా కొనసాగింది. బాణాసంచాలు, నృత్యాలు, సంఘ జెండాలు, నినాదాలతో సాగిన ప్రదర్శన స్థానికుల దృష్టిని ఆకట్టుకుంది. బృందావనంలో ఉసిరి చెట్టు, శివలింగానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. పురోహితుల వేదమంత్రాలతో వాతావరణం ఆధ్యాత్మికంగా మారింది. అనంతరం వనభోజనం ఏర్పాటు చేసి సంఘసభ్యులు కుటుంబాలతో కలిసి పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన యాదవ సంఘం పెద్దలు, మాజీ ప్రజా ప్రతినిధులు నిర్వాహకులను అభినందించారు. బొమ్మి రాదయ్య మాట్లాడుతూ యాదవ సమాజ అభివృద్ధికి విద్య, ఐక్యత, పరస్పర సహకారం అత్యవసరమని పిలుపునిచ్చారు. జిల్లా యాదవ సంఘం ఆఫీసు ఏర్పాటు చేయడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో జిల్లా, మండల యాదవ సంఘం కమిటీలు, యువజన విభాగం కీలకపాత్ర పోషించాయి. మాజీ జెడ్పిటిసి చైర్మన్ చెంచలబాబు యాదవ్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.