Friday, 20 March 2026

Blog

తూర్పు గోదావరి

రావులపాలెం రూరల్ సీఐ హెచ్చరిక —పవిత్ర ఆలయంలో దొంగతనానికి తావులేదు

తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం జరిగిన హుండీ లెక్కింపు సమయంలో దొంగతనానికి యత్నించిన వ్యక్తిని అక్కడికక్కడే పట్టుకున్నారు. రామచంద్రాపురం మండలం వేగేయమ్మపేటకు చెందిన వాసంసేట్టి శ్రీనివాసరావు (49) హుండీ లెక్కింపు పనుల్లో గుమిగూడిన సిబ్బంది కళ్లుగప్పి రూ.60,000 దొంగిలించి పారిపోవడానికి ప్రయత్నించగా, ఆలయ E.O, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రదర్ రావు సిబ్బందితో కలిసి అతన్ని పట్టుకొని ఆత్రేయపురం పోలీసులకు అప్పగించారు. తదుపరి SI ఎస్. రాము కేసు నమోదు చేశారు. దర్యాప్తు ఆదేశాలు అందుకున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా SP రాహుల్ మీనా, IPS మార్గదర్శకత్వంలో, కొత్తపేట DSP సుంకర మురళీమోహన్ పర్యవేక్షణలో రావులపాలెం రూరల్ CI విద్యాసాగర్, SI ఎస్. రాము కేసును వేగంగా విచారించి నిందితుడిని అరెస్టు చేశారు. తరువాత కొత్తపేట గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరు పరచగా, మేజిస్ట్రేట్ జస్వంత్ యాదవ్ నిందితుడికి 14 రోజుల న్యాయ పరిరక్షణ (జ్యుడీషియల్ రిమాండ్) విధించారు. అనంతరం అతన్ని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. పవిత్ర ఆలయ ప్రాంగణంలో ఇలాంటి చర్యలకు తావులేదని, ఎవరైనా ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని రావులపాలెం రూరల్ CI విద్యాసాగర్ స్పష్టంచేశారు. End

అల్లూరి సీతారామరాజు

హుకుంపేట: ఈ నెల 21 నుండి సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలు

భగవాన్ శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలకు హుకుంపేట మండలం గడుగుపల్లి గ్రామ సమీపం లోని భగవాన్ శ్రీ సత్యసాయి ప్రేమామృత సేవా నిలయం సిద్దమవుతోంది. ఈ వేడుకలు ఈనెల 21 నుండి 23 వరకు జరుగుతాయని నిర్వహకులు తెలిపారు. మూడు రోజులు జరుగు భగవాన్ శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదినోత్సవ వేడుకలలో చుట్టుప్రక్కల మండలాల ప్రజలంతా పాల్గొనాలని నిర్వహకులు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్

అక్రమ నిర్మాణంపై పోలీసులకు ఫిర్యాదు

నరసన్నపేట పట్టణంలోని ఇందిరానగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా నిర్మిస్తున్న అపార్ట్మెంట్ నిర్మాణం పై నరసన్నపేట పోలీసులకు బిల్డింగ్స్ సొసైటీ అధ్యక్షులు చింతు రామారావు ఫిర్యాదు చేశారు. బిల్డింగ్ సొసైటీ నియమాలకు అతీతంగా నిర్మాణాలు చేపడుతున్నారని, గ్రామపంచాయతీ బిల్డింగ్స్ సొసైటీ ఎన్ఓసి లేకుండా గృహేతర ఉపయోగాలకు నిర్మాణాలకు ఒప్పందం చేసుకోవడం బిల్డింగ్ సొసైటీ నియమాలు ఉల్లంఘిస్తూ చేపడుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరము జిల్లా గ్రీవెన్స్ ఫిర్యాదుల విభాగంలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలియజేశారు. గ్రామపంచాయతీ ఈవోకు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని, రెవెన్యూ అధికారులకు కూడా అనుమతులైన నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినట్లు ఆయన తెలియజేశారు. నరసన్నపేట నడిబొడ్డున కడుతున్న ఈ అక్రమ కట్టడానికి ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జోరుగా సాగుతున్న మేజర్ పంచాయితీ రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుల పేర్కొన్నారు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

నిర్మల్

గోపాల్ రావు పటేల్ డిగ్రీ కళాశాలలో “యువతకు సందేశం “అనే కరపత్రాల విడుదల

📝 గోపాల్ రావ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల – “యువతకు సందేశం” కరపత్రం ఆవిష్కరణ ఈ రోజు గోపాల్ రావ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో “యువతకు సందేశం” అనే కరపత్రం ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కే. బుచ్చయ్య గారు మరియు కళాశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్ గారు పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి విలువైన సందేశాలు అందించారు. వారు మాట్లాడుతూ— “దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. కాపీలు కొట్టే అలవాటు మన భవిష్యత్తును మాత్రమే కాదు, కుటుంబ, సమాజ, దేశ ప్రగతిని కూడా అడ్డుకుంటుంది.” అని విద్యార్థులను హెచ్చరించారు. అలాగే కళాశాలలో ప్రభుత్వం కల్పించిన సదుపాయాలను వివరించారు: ప్రతి తరగతి గదిలో A/C సదుపాయం డిజిటల్ బోర్డులు త్వరలో పీజీ కోర్సుల కోసం కొత్త భవనం నిర్మాణం ఉన్నత విద్యావేత్తలు, పిహెచ్.డి చేసిన లెక్చరర్ల సేవలు ఈ అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు రెగ్యులర్ గా క్లాసులకు హాజరై, శ్రద్ధతో చదివి తమ జీవిత వికాసాన్ని సాధించాలి అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిర్మల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సుదాకర్ గారు, డా. రవీకుమార్, డా. రఘునాథ్, డా పవన్ సార్, రాజు సార్ డాక్టర్ ఓం ప్రకాష్ సార్ కిషన్ సార్ రాజయ్య సార్ రామ్మోహన్ సురేందర్ అబ్దుల్లా మజా ఇఫ్రాన్ వాయిదా సంజీవ్ సార్ రాజు సార్ తదితర లెక్చర్స్ మరియు సి పి డి సి కార్యదర్శి మనోజ్, కళాశాల డైరెక్టర్ నిఖిల్ చెందర్, అనేకమంది తల్లిదండ్రులు మరియు దాదాపు 556 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇంగ్లీష్‌ రాని అమ్మాయి కలెక్టర్‌ అయ్యింది

సురభీ_గౌతమ్‌… ఐఏఎస్‌ ఆఫీసర్‌ కావాలని పదో తరగతిలోనే నిర్ణయించుకుంది. మధ్య ప్రదేశ్‌లోని అత్యంత వెనుకబడిన, కుగ్రామం నుండి వచ్చిన ఆ అమ్మాయి తన కలను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడింది. ఇంగ్లీష్‌ మాట్లాడలేక అవమానపడింది. చివరకు అనుకున్నది సాధించింది. ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె ప్రయాణం గురించి మరిన్ని విశేషాలు… ‘ఆరో తరగతి లెక్కల పరీక్షలో వందకు వంద మార్కులు సాధించాను. అప్పుడే క్లాసులో నాకంటూ ఓ గుర్తింపు, ప్రోత్సాహం లభించింది. ఎంత శ్రమిస్తే అంత గుర్తింపు వస్తుందని అప్పుడే నాకు అర్థమయింది” అంటూ తన స్కూలు చదువును గుర్తు చేసుకుంది సురభి. పదో తరగతిలో లెక్కలు, సైన్స్‌లో వందకు వంద మార్కులను సాధించింది. ఈ విజయం ఆమెకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. తన కలను నేరవేర్చుకోవడానికి ఈ విజయాన్ని ఓ మార్గంగా భావించింది. బాధ్యతగా భావించి ప్రస్తుతం ఓ మనిషి బతకాలంటే కనీసం వైద్యం, విద్యుత్‌ ఉండాలి. అయితే సురభి పుట్టిన గ్రామంలో ఇలాంటి మౌలిక సదుపాయాలు లేవు. అందుకే ఎప్పటికైనా ఐఏఎస్‌ ఆఫీసరై ఇలాంటి గ్రామాలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇలాంటి ఎన్నో కలలు, ఆశయాలతో ఇంజనీరింగ్‌ చేయడానికి భూపాల్‌ వెళ్ళింది. ”నాకు తెలుసు నాపై ఎంత బాధ్యత ఉందో. నా విజయం వెనుక మా గ్రామంలోని ఎంతో మంది అమ్మాయిల కలలు దాగి ఉన్నాయి. వారి ఆశలను, కలలను తీర్చడం నా బాధ్యత” అంటూ ఆమె తన కాలేజీలో చేరిన మొదటి రోజు గుర్తు చేసుకుంది. ఆ గ్రామం నుండి పై చదువుకు గ్రామం వదిలి బయటకు అడుగుపెట్టిన మొదటి అమ్మాయి సురభి. వెనక్కు వెళ్ళిపోవాలని అప్పటి వరకు ఆమె హిందీ మీడియంలో చదువుకుంది. అయితే అక్కడి పిల్లలందరూ ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతున్నారు. ఇది సురభికి పెద్ద ఎదురు దెబ్బగా అనిపించింది. మొదటి రోజు క్లాసు రూములో తనని తాను పరిచయం చేసుకున్న రోజే అవమానానికి గురయ్యింది. అది భరించలేక తన సామాను సర్దుకుని తిరిగి గ్రామానికి వెళ్ళిపోవాలనుకుంది. ఇదే విషయాన్ని తల్లికి చెబితే ”సవాళ్ళు ఎదురైనప్పుడే ధైర్యంగా నిలబడాలి” అని సలహా ఇచ్చింది. ”గ్రామంలో నా లాంటి ఆడపిల్లలు ఎందరో నా విజయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నేను వెనక్కు వెళ్ళిపోతే మూసి ఉన్న తలుపులు ఇక ఎప్పటికీ తెరుచుకోవు” అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది. ఏ మూలనో అసంతృప్తి ఇక తన ప్రయాణాన్ని ఆపదలచుకోలేదు. తన శ్రమను రెట్టింపు చేసింది. ఇంగ్లీష్‌ మాట్లాడడం నేర్చుకుంది. నలుగురిలో తనని తాను ఇంగ్లీష్‌లో పరిచయం చేసుకోవడానికి భయపడిన సురభి తన కాలేజీలోనే కాదు ఆ యూనివర్సిటీ పరిధిలోనే టాపర్‌గా నిలిచింది. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాయాలంటే కనీసం 21 ఏండ్లు ఉండాలి. అయితే ఆమెకు వయసు సరిపోలేదు. దాంతో ఆ సమయాన్ని కూడా ఆమె వృధా చేసుకోకుండా ఇతర పోటీ పరీక్షలు రాసి ఎంపికయింది. కానీ ఇవేవీ ఆమెకు తృప్తి నివ్వలేకపోయాయి. ఏ మూలనో అసంతృప్తి. అసలు లక్ష్యాన్ని తల్లి ఆమెకు గుర్తు చేసింది. దాంతో మళ్ళీ సివిల్‌ సర్వీస్‌పై దృష్టి పెట్టింది. ఒక్కో నిమిషం సాధారణంగా సివిల్స్‌కు సిద్ధమయ్యే వారు తమ ధ్యాస మొత్తం వాటిపైనే పెడతారు. కానీ సురభి అలా చేయలేదు. రైల్వేలో ఉద్యోగం చేస్తూ సాయంత్రం సమయంలో ఒక్కో పేపర్‌కు నాలుగు గంటలు సమయం కేటాయించేది. అయితే లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆ సమయం సరిపోదు. అందుకే మరింత సమయాన్ని కేటాయించింది. దొరికిన ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకుంది. కావల్సిన మెటీరియల్‌ సేకరించుకుంది. అమ్మే స్ఫూర్తిగా జీవితంలో ఇబ్బంది పెట్టే క్షణాలు ఎన్నో వస్తాయి. వాటిని తట్టుకున్న వాళ్ళే విజయం సాధించగలరు. ”మా అమ్మ 23 ఏండ్ల వయసులో ముగ్గురు పిల్లలకు తల్లి అయ్యింది. కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. పది నెలల పాపను వదిలిపెట్టి, ఇంటి బాధ్యతలు చూసుకుంటూ పది కిలో మీటర్లు వెళ్ళి ఉద్యోగం చేసి వచ్చేది. అంత బాధ్యతను మోస్తూ కూడా ఎవ్వరినీ నిందించలేదు. కానీ నాకు అలాంటి బాదరబందీలు లేవు. కాస్త కష్టపడితే అనుకున్నది సాధించగలను. ఇలా అమ్మను చూసి ఎన్నో నేర్చుకున్నాను” అన్నది సురభి. సేవ చేసినప్పుడే ఇలా ఎంతో కష్టపడి సివిల్స్‌లో ఆలిండియా 50వ ర్యాంకు సాధించిన ఆమె ”గుజరాత్‌లో నా మొదటి పోస్టింగ్‌. ఇక్కడి వాతావరణం చాలా కొత్తగా అనిపించింది. సమాజానికి సేవ చేయాల్సిన సివిల్‌ సర్వీస్‌ను ఇక్కడి వాళ్ళు ఓ అధికారంగా భావిస్తున్నారు. కేవలం బాధ్యత తీసుకున్నంత మాత్రాన అధికారి కారు. ప్రజలకు సేవ చేసినప్పుడే ఈ వృత్తికి అసలైన గౌరవం” అంటారామె. ఇలాంటి ఆలోచనలతోనే సురభి తన పనిని ప్రారంభించారు. తన చేతలతో అతి తక్కువ కాలంలోనే ప్రజల గౌరవాన్ని పొందారు. ఎన్నో సవాళ్ళు సురభి ప్రస్తుతం గుజరాత్‌లోని వడోదర ప్రాంతంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. ”ఇప్పటి వరకు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి. ఎన్నో ఒత్తిళ్ళను, సవాళ్ళను ఎదుర్కోవల్సి వస్తుంది. అలాంటివి ఎన్ని ఎదురైనా ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చడంపైనే దృష్టి పెడుతున్నాను” అంటారామె. ఈ విధంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సురభి ఎన్నో అడ్డంకులను బద్దలు కొట్టుకుంటూ ముందుకు సాగారు. ఒక స్ఫూర్తి దాయకమైన ఆఫీసర్‌గా గుర్తింపు పొందారు. ఎంతో మంది విద్యార్థులకు, యువతకు ఆదర్శంగా నిలిచారు..

భద్రాద్రి కొత్తగూడెం

మద్యం షాపులు వద్దని వెలసిన బ్యానర్లు

మద్యం షాపులు వద్దని వెలసిన బ్యానర్లు పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్ 20 నవంబర్ 2025, భద్రాచలం కోచింగ్ సెంటర్ గుడి ప్రాంతంలో మద్యం అమ్మకాలు విద్యార్థులు ఉపాధ్యాయులు తొలగించాలని ఆందోళన ప్లెక్సీలు కదలని సిండికేట్ చీకటి వ్యాపారస్తులు ప్రజల తిరుగుబాటుకు భారీ మూల్యం చెల్లించాల్సిందే భద్రాచలం పట్టణంలోని ఐటీడీఏ రోడ్డు ముందు ఎస్ ఎస్ కోచింగ్ సెంటర్ నిత్యం విద్యార్థులు విద్యని అభ్యసించే కోచింగ్ సెంటర్, అలాగే అక్కడే శివాలయం భక్తులు నిత్యం భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మిక భావంతో పెద్ద ఎత్తున ఆ గుడికి వస్తుంటారు. కానీ అక్కడే అనుమతులు లేని మద్యం బెల్ట్ షాపులు, బార్ షాపులు దర్శనమిస్తున్నాయి. అక్కడికి పెద్ద ఎత్తున మద్యం సేవించేందుకు మద్యం ప్రియులు నిత్యం సంచరిస్తున్నారు. అలాగే వారు తాగి అక్కడ గొడవలు పడటం వచ్చిపోయే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి అనేక సంఘటనకు ఆ ప్రాంతం నెలవుగా మారింది. ఈ ప్రాంతం గుడికి కోచింగ్ సెంటర్ కి ఆటంకంగా ఉండటం వలన అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ ప్రాంతంలో బార్ షాపులు కానీ, బెల్ట్ షాపులు గాని పెట్టవద్దని వారి యొక్క నిరసన తెలుపుతున్నారు. అయినా సరే వారి నిరసనను పెడచెవిన పెట్టి మద్యం దుకాణదారులు వారు ఇష్టానుసారంగా మద్యం ఏరులై పారించటం పరిపాటిగా మారింది. అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నిర్వహణ పెద్ద ఎత్తున కొనసాగుతా ఉన్నాయి. వీటిని ప్రశ్నించే వారే లేకపోవడం గమనహర్గం. అధికారులు ఉండి కూడా గుడి, బడి వద్ద మద్యం లైసెన్స్ ను ఇవ్వటం అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు. అధికారులు ఆలోచన చేయాల్సి ఉంది. ఏ రకంగా అయినా సరే అమ్ముకోమని ధోరణి కనిపిస్తుంది. చదువుకునే పిల్లలకు దీనివల్ల ఏ సంకేతం వెళ్తుందో అధికారులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి లేకపోలేదు శివాలయానికి వస్తున్న భక్తులకు కూడా తాగి దర్శనం ఇయ్యటం ఒకింత బాధని కలిగిస్తుంది. భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని వాదన బలంగా వినిపిస్తుంది. తక్షణమే ఎక్సైజ్ అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అక్కడ అంతరాయంగా ఉన్న మద్యం బెల్ట్ షాపులను తొలగించే ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఫ్లెక్సీల ద్వారా వారి నిరసన ను వ్యక్తపరుస్తున్నారు.

కామారెడ్డి

సన్న వరి రైతుల వినతి – బోనస్ హామీ ఇచ్చిన మంత్రి సీతక్క

– సన్న వరి రైతుల సమస్యలపై మంత్రి సీతక్క స్పందన: బోనస్ ఇచ్చే ఉద్దేశ్యం ప్రకటింపు కామారెడ్డి, నవంబర్ 20, (పున్నమి ప్రతినిధి) : కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మంత్రి సీతక్కకు రామారెడ్డి మండల రైతులు విజ్ఞప్తి చేశారు. రామారెడ్డి మీదుగా మంత్రి కాన్వాయ్ వెళ్తుండగా స్థానిక రైతులు ఆపి, సన్న వరి రైతుల కు బోనస్ మంజూరు చేయాలంటూ వినతి పత్రం అందజేశారు.రైతుల సమస్యలు విన్న మంత్రి సీత క్క తమ ప్రభుత్వమే రైతు పట్ల అనుకూల దృక్ప థంతో ఉందని పేర్కొంటూ, సన్న వరి పంటకు బోనస్ ఇవ్వడంపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం ప్రభు త్వ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.తదుపరి మంత్రి నిజామాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చేరుకుని ఎవరెస్టు శిఖరం అధిరో హించిన మాలవ త్ పూర్ణను పరామర్శించారు. పూర్ణ సాధన పట్ల ఆమె గర్వం వ్యక్తం చేస్తూ, గ్రామీణ ప్రాంత యువత కు ఆమె ప్రేరణగా నిలుస్తున్నారని ప్రశంసించారు.

ఖమ్మం

పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం : ఖమ్మం CP సునీల్ దత్

పువ్వాడ నాగేంద్ర కుమార్, (పున్నమి తెలంగాణ ప్రతినిధి) దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై ప్రయాణం ప్రమాదకరమని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ హెచ్చరిక జారీ చేశారు. ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని స్వల్ప నిర్లక్ష్యమే పెద్ద ప్రాణ నష్టాలకు దారితీసే అవకాశముందని ఆయన తెలిపారు. పొగమంచు కారణంగా దూరం కనిపించకపోవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు, పాదచారులు స్పష్టంగా గమనించలేని పరిస్థితులు ఏర్పడుతాయని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. వాహనదారులకు సీపీ సునీల్ దత్ పలు సూచనలు చేశారు. వాహనాలను వేగంగా నడపకండి ప్రయాణానికి ముందు వాహన పరిస్థితిని తనిఖీ చేయండి డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దు అనవసరంగా ఓవర్‌టేక్ చేయకండి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించండి పౌరుల ప్రాణ భద్రత కోసం ఈ సూచనలు తప్పనిసరిగా పాటించాలని CP సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు.

కడప

నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు::దిశా నిర్దేశం చేసిన వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకారణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ఉద్యమం మరియు వై.యస్.ఆర్.సి.పి గ్రామ, వార్డు కమిటీల నియామకం గురించి ఈ నెల 23 మరియు 24 తేదీలలో కడప జిల్లా ఎంపీ శ్రీ వై.యస్ అవినాష్ రెడ్డి గారు, వై.యస్.ఆర్.సి.పి కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి గారు మరియు పలువురు పార్టీ ఉన్నత స్థాయి నాయకుల ఆధ్వర్యంలో, నియోజకవర్గ స్థాయిలో వార్డు, గ్రామ కమిటీల సభ్యులతో జరగబోవు సమావేశానికి సంబంధించి నాయకులు మరియు కార్యకర్తలను ఉద్దేశించి ఇవాళ ప్రొద్దుటూరులోని ఆయన స్వగృహంలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేసిన వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి గారు

ఆంధ్రప్రదేశ్

జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానం

జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానించారు.కడప జిల్లా, కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన ‘అన్నదాత సుఖీభవ’ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పెండ్లిమర్రి సభ ప్రాంగణంలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు & కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు, కడప ముస్లిం పెద్దలతో కలిసి 2026 జనవరిలో జరగబోయే దీనీ ఇస్తిమా కార్యక్రమానికి ఆహ్వానించారు. రాష్ట్రం నలుమూలల నుండి, దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు కడపకు పెద్ద సంఖ్యలో విచ్చేసే ఈ మహా ఐక్య కార్యక్రమం కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మరియు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేకంగా సూచించారు. కడప జిల్లాలో దీనీ ఇస్తిమా నిర్వహణను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, భద్రత, రవాణా, వసతి, పారిశుద్ధ్యం వంటి అన్ని కీలక అంశాలను సమన్వయంతో పర్యవేక్షిస్తూ ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలను ఇప్పటికే ప్రారంభించినట్లు శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.