Thursday, 19 March 2026

Blog

హైదరాబాద్

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహణకై వినతి

*ఇన్ సర్విస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర శాఖ వినతి* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ 21/ 11/ 2025* *ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ వేసవి సెలవుల్లో నిర్వహించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు,గౌరవ అధ్యక్షులు, ఎం .ఎన్ విజయకుమార్, విజ్ఞప్తి చేశారు ఇప్పుడు జనవరిలో నిర్వహించినట్లయితే అటు విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్నది ఎందుకంటే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయ లోకమంతా నిమగ్నై నిమగ్నమై ఉన్నందున వారికి వేసవి సెలవుల్లో ప్రత్యేక నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు*

హైదరాబాద్

*ఇన్సూరెన్స్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్టు నిర్వహించాలని రాష్ట్ర శాఖ వినతి

*ఇన్ సర్విస్ ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు కోరుతూ రాష్ట్ర శాఖ వినతి* *పున్నమి ప్రతినిధి హైదరాబాద్ 21/ 11/ 2025* *ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ వేసవి సెలవుల్లో నిర్వహించాలని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత రాష్ట్ర అధ్యక్షులు శానమోని నరసింహులు,గౌరవ అధ్యక్షులు, ఎం .ఎన్ విజయకుమార్, విజ్ఞప్తి చేశారు ఇప్పుడు జనవరిలో నిర్వహించినట్లయితే అటు విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉన్నది ఎందుకంటే పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణలో ఉపాధ్యాయ లోకమంతా నిమగ్నై నిమగ్నమై ఉన్నందున వారికి వేసవి సెలవుల్లో ప్రత్యేక నిర్వహిస్తే అనుకూలంగా ఉంటుందని వారు విజ్ఞప్తి చేశారు*

ఆంధ్రప్రదేశ్

పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

A P టెన్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2026 MAR 16 నుండి APR 1 వరకు జరుగనున్నాయి. MAR 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీషు, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయోలజీ, 30న సోషల్, 31న ఒకేషనల్ పేపర్-2, ఏప్రిల్ 1న SSC సాధారణ కోర్సు ఎగ్జామ్ ఉండును. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మ.12.45 గంటల వరకు నిర్వహించబడతాయి. Video: https://dqmbjov5jawsp.cloudfront.net/PDF/SSC-TIME-TABLE-2026.pdf

తిరుపతి

చిట్టత్తూరులో స్వచ్చ గ్రామం హరిత గ్రామ కార్యక్రమం

తొట్టంబేడు నవంబర్ 21, పున్నమి న్యూస్ : చిట్టత్తూరు గ్రామంలో శుక్రవారం నాడు స్వచ్చ గ్రామం హరిత గ్రామం కార్యక్రమంలో తొట్టంబేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆద్వర్యంలో మండలం లో అందరూ గ్రీన్ అంబాజీడర్లకు, గ్రీన్ గార్డ్ లకు మురుగునీటి నిలువలను, చెత్తను తొలగించడంపై ఒక్క రోజు శిక్షణను ఇవ్వడమైనది. ఇందులో భాగంగా చిట్టత్తూరు గ్రామం లోని, మురుగునీటిని, చెత్తకుప్పలను పిచ్చి మొక్కలను తొలగించి వీధులను, గ్రామ పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగినది. స్వచ్చమైన గ్రామంగా తీర్చేందుకు ప్రతి మనిషి ఆరోగ్యం, అభివృద్ధికి పునాదిగా, చెత్త లేకుండా, కాలుష్యం లేకుండా, పరిశుభ్రతతో ఉంచుకోవాలని, ప్లాస్టిక్ ను వాడకుండా నిషేదించాలని, స్వచ్ఛమైన గాలి కొరకు ప్రతి ఇంటి ఆవరణలోను చెట్లను పెంచాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి. సురేంద్రనాధ్ ప్రజలకు సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమం లో ETC, ప్రిన్సిపాల్ విద్యారమ సీనియర్ ప్యాకల్టీలు రూపారాణి, మధుసూధన్ లు ఉపమండల పరిషత్ అభివృద్ధి అధికార్లు గిరిధర్, భార్గవ సత్యం, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, మండలం లోని పంచాయితీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

పదో తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

A P టెన్ క్లాస్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. 2026 MAR 16 నుండి APR 1 వరకు జరుగనున్నాయి. MAR 16న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, 18న సెకండ్ లాంగ్వేజ్, 20న ఇంగ్లీషు, 23న మ్యాథ్స్, 25న ఫిజిక్స్, 28న బయోలజీ, 30న సోషల్, 31న ఒకేషనల్ పేపర్-2, ఏప్రిల్ 1న SSC సాధారణ కోర్సు ఎగ్జామ్ ఉండును. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మ.12.45 గంటల వరకు నిర్వహించబడతాయి. Video: https://dqmbjov5jawsp.cloudfront.net/PDF/SSC-TIME-TABLE-2026.pdf

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సిఐటియు 18వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలి

నెల్లూరు | నవంబర్ 2025 | పున్నమి ప్రతినిధి విశాఖపట్నంలో నిర్వహించనున్న సిఐటియు (CITU) 18వ అఖిలభారత మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ, సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం వాల్ పోస్టర్‌లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కార్మికుల హక్కులు, జీవన భద్రత, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ మహాసభలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయని అన్నారు. కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని, మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి

రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు ఎంపికైన ఆక్స్ఫర్డ్ స్కూలో విద్యార్థి

శ్రీకాళహస్తి నవంబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మగుడి వీధి, ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి కిరణ్ కుమార్ తిరుపతి జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎస్‌.జి‌.ఎఫ్‌.ఐ (School Games Federation of India) అంతర్ జిల్లా కరాటే పోటీలలో పాల్గొని విజయం సాధించాడు. ఈ విజయం ద్వారా ఆయన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. ఈ సందర్భంలో, ఆక్స్ఫర్డ్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గౌరవనీయులు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి కిరణ్ కుమార్‌ను అభినందింస్తూ.. రాష్ట్రస్థాయి కరాటే పోటీలు 23, 24 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరగనున్నాయని అందులో సి. కిరణ్ కుమార్ పాల్గొనబోతుడని ఆయన తెలిపారు.

తిరుపతి

పిడుగుపాటుతో వ్యక్తికీ తీవ్రగాయాలు

తొట్టంబేడు నవంబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం కొత్త కండ్రిక గ్రామానికి చెందిన టి. నరసింహారెడ్డి (36) కొత్త కండ్రిగ పెట్రోల్ బంకుకి ఎదురుగా ఉన్న తన పొలాలలో వరి నాట్లు వేస్తుండగా వర్షం కారణంగా గొడుగు పట్టుకుని వున్నా నరసింహారెడ్డి పక్కనే పిడుగు పడడంతో ఆ వ్యక్తి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో అతనికి తొడ దగ్గర తీవ్రగాయాలై అధిక రక్తస్రావం జరగడంటో అతని బందువులు హుటాహుటిన శ్రీకాళహస్తి దగ్గరలో ఉన్న ఎంజీఎం హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళినా ఫలితం లేకపోవడంతో మెరుగైన చికిత్సకోసం నరసింహారెడ్డిని వేలూరు హాస్పిటల్ కి తరలించడం జరిగింది.

తిరుపతి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్య అవగాహనా సదస్సు

శ్రీకాళహస్తి నవంబర్ 21, పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి పట్టణంలోని ఆక్సి్ఫర్డ్ డిగ్రీ కాలేజీ విద్యార్ధినులకు శుక్రవారం నాడు శ్రీకాళహస్తి యం.జి.యం.హాస్పిటల్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో స్త్రీ సంబంధిత ఆరోగ్యలపై అవగాహనా సదస్సులను నిర్వహించారు. ఈ సదస్సులో యం.జి.యం. హాస్పిటల్స్ స్త్రీ సంబంధిత వైద్య నిపుణురాలు డాక్టర్ లక్ష్మి ప్రసన్న మాట్లాడుతూ..విద్యార్ధినులకు ఋతుక్రమ సమయంలో అవసరమగు జాగ్రతలు, తీసుకోవలసిన శుభ్రతా విధానాలను గురించి వివరంగా తెలియ జేశారు. ప్రతీ విషయంలోనూ అమ్మాయిలు తగు నియమాలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలన్నారు. అనంతరం MGM హాస్పిటల్స్ చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఉమా మహేశ్వర్ రావు మాట్లాడుతూ.. క్యాన్సర్ సంబంధిత వాక్సిన్ లు తగు సమయంలో వేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తూ.. విద్యార్ధినులు అడిగిన ప్రతీ సందేహాలకు వివరంగా విశదీకరించారు. ఈ సదస్సులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ డాక్టర్ మయూర్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ప్రతీ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ లలో నిర్వహించి విద్యార్ధినులకు అవగాహన కల్పించడమే MGM హాస్పిటల్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముఖ్య ఉద్దేశ్యంమని ఆయన తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న MGM హాస్పిటల్స్ డైరెక్టకి ఆక్సిఫోర్డ్ డిగ్రీ కాలజీ కరెస్పాండంట్ మధుసూదనరెడ్డి ధన్యవాదములు తెలిపారు.

జనగాం

ZPHS ఏడునూతుల‌కు మండల స్థాయి CMSTT – చెకుముకి సైన్స్ పరీక్షలో 1వ స్థానం

ZPHS కొడకండ్లలో నిర్వహించిన మండల స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ (CMSTT) లో ZPHS ఏడునూతుల విద్యార్థులు ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచారు. ఈ పోటీలో పాల్గొని జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనవారు: నూతనగంటి దుర్గ వర్షిత (10వ తరగతి) బోనగిరి మానస (9వ తరగతి) రాసాల అభినయ్ (8వ తరగతి) ఈ ముగ్గురు విద్యార్థులు 28-11-2025న జిల్లా స్థాయిలో కూడా మా పాఠశాల ప్రతిష్ట పెంచాలని ఆశిస్తూ, ZPHS ఏడునూతుల బోధనా సిబ్బంది అందరూ వారిని అభినందించారు. ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, సోమేశ్వర్, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.