Thursday, 19 March 2026

Blog

విశాఖపట్నం

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం:డాక్టర్ టి. రవిరాజు వెల్లడి

శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం:డాక్టర్ టి. రవిరాజు వెల్లడి *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* శ్రీకాకుళం జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్, ప్రముఖ నెఫ్రాలజిస్ట్, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వీసీ, రిటైర్డ్ డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ టి.రవిరాజు తెలియజేశారు. శుక్రవారం ఆంధ్ర వైద్య కళాశాల డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో 18 శాతం జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందని ఈ నేపథ్యంలోనే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ కిడ్నీ వ్యాధులపై పరిశోధనలకు అనుమతి ఇచ్చిందని మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ఇందుకు 6.01 కోట్ల రూపాయలు కేటాయించినట్లు వివరించారు. ఉద్దానం ప్రాంతంలోని ఇచ్చాపురం కవిటి, కంచిలి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో అధ్యయనం జరుగుతుందని చెప్పారు. ఈనెల 1వ తేదీ నుండి ఈ ప్రక్రియ లాంఛనంగా మొదలయిందని వివరించారు. శాంపిల్ సర్వేలో భాగంగా రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తామని వాటిని ఆంధ్ర వైద్య కళాశాలలో కోటి రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ల్యాబ్ లో నిర్వహిస్తామని వివరించారు. కిడ్నీ వ్యాధులు తీవ్రతరం కాకుండా కొత్తగా మూడు రకాల మందులు వచ్చాయని వ్యాధి ప్రారంభ దశలో వాటిని వాడినట్లయితే వ్యాధి అదుపులో ఉంటుందని పేర్కొన్నారు అయితే ఈ కిడ్నీ వ్యాధులు ఏ కారణాల వల్ల వస్తున్నాయో తెలియడం లేదని ముఖ్యంగా పంటల్లో పురుగుల మందులు వాడడం, నీటి కాలుష్యం, మధుమేహం వల్ల వస్తున్నట్లు పరిశోధనల్లో తెలుస్తోందని వివరించారు. 1990 చివర్లో శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో మూత్రపిండ వ్యాధిని గుర్తించినట్లు పేర్కొంటూ మళ్లీ వ్యాధి ప్రబలకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వివరించారు. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి నియంత్రణ ధ్యేయంగా తమ పరిశోధనలు సాగుతాయని తుది నివేదికలో కూడా పలు విషయాలు పొందుపరుస్తామని డాక్టర్ రవిరాజు పేర్కొన్నారు. కిడ్నీ వ్యాధుల మూలాలు కనుగొనడం ద్వారా ఉద్దానం ప్రాంతంలో అవసరమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని తొలి విడతలో 5,500 మంది నుండి నమూనాలు సేకరిస్తామని తెలిపారు.వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు తాము పంపిన ప్రతిపాదనలు పరిగణనలోనికి తీసుకుని పరిశోధనకు ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిందన్నారు.శాస్త్రీయ విధానంలో 18 ఏళ్లకు పైబడిన వారి నమూనాలు సేకరిస్తామని ఆధునిక బయోమార్కర్స్ విధానంలో పరీక్షిస్తామన్నారు. దీనివల్ల బాధితులకు ఒకటి, రెండు సంవత్సరాల్లో కిడ్నీ సమస్య ఏ స్థాయిలో రావచ్చున్నది స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ విధానంలో జన్యుపరమైన పరీక్షలు కూడా ఈ పరిశోధనలో భాగంగా చేస్తామని తెలిపారు. దీనివల్ల బాధితులకు జన్యుపరంగా కిడ్నీ వ్యాధులు వస్తాయా? రావా? అని కూడా తెలుస్తుందని పేర్కొన్నారు. ఉద్దానంలోని వేరువేరు ప్రాంతాల్లో మట్టి, నీరు, గాలి, వరి, చేపలు, కూరగాయల నమూనాలు సేకరించి కూడా పరీక్షిస్తామని. వీటి ఫలితాల.ననుసరించి తదుపరి చర్యలు ఉంటాయని డాక్టర్ రవిరాజు పేర్కొన్నారు. ఈ సమావేశంలో కేజీహెచ్ కిడ్నీ వ్యాధుల విభాగాదిపతి డాక్టర్ జి. ప్రసాద్, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం

శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం *​విశాఖపట్నం:నవంబర్ పున్నమి ప్రతినిధి * పోలిపాడ్యమి సందర్భంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం కొండ దిగువన గల పవిత్ర వరాహ పుష్కరిణిలో. ​పవిత్రమైన పోలిపాడ్యమి పర్వదినాన్ని పురస్కరించుకుని, వరాహ పుష్కరిణిలో భక్తులు మరియు స్థానిక గ్రామస్తులచే దీపాల వెలిగింపు కార్యక్రమం అంబరాన్నంటింది. తెల్లవారుజాము నుండే భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ముఖ్యంగా మహిళలు, ఉత్సాహంగా తమ వెంట తెచ్చుకున్న దీపాలను, మొక్కుబడులను చెల్లించుకుంటూ, పవిత్ర పుష్కరిణి నదిలో వదిలారు. ​ ​భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని, దేవస్థానం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ​ పుష్కరిణి చెరువు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు బారికేడింగ్‌ ఏర్పాటు చేయబడింది. ప్రత్యేకంగా ఈతగాళ్ళ కమ్యూనిటీ గార్డులు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. వరాహ పుష్కరిణి మార్గంలో ట్రాఫిక్ పోలీసులు ద్విచక్ర వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ, భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అమరావతి

బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు*

*అమరావతి నవంబర్ పున్నమి ప్రతినిధి* *బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు* *ఈ నెల 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జోన్ ల వారిగా ప్రశిక్షణ* *జోన్ వారీగా ప్రశిక్షణ వర్గ* (వర్క్ షాప్) *కోస్తాంధ్ర జోన్ పరిధిలో వారి కి నెల్లూరు జిల్లాలో – 25 వతేదీ* *గోదావరి జోన్ పరిధిలోవారికి,రాజమండ్రి లో -27వతేదీ* *ఉత్తరాంధ్ర జోన్ పరిధిలో వారి కి,విశాఖపట్నం లో -28వతేదీ* *రాయలసీమ జోన్ పరిధిలోవారికి ,కడప జిల్లాలో -29వతేదీ* *ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది*

విశాఖపట్నం

విశాఖ తూర్పు కాంగ్రెస్ లో భారీ మార్పులు*

*విశాఖ తూర్పు కాంగ్రెస్ లో భారీ మార్పులు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పట్టు సాధించే దిశగా ఆ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అడుగులు వేస్తున్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలో అన్ని వార్డులలోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా వ్యూహాలు చేస్తున్నారు. విద్యావంతులు, పదవి విరమణ పొందిన ఉద్యోగులు, యువత, మహిళలు, సమాజసేవకులు, ఇంజనీర్లు,డాక్టర్లు, లాయర్లు,ముఖ్యంగా నిబద్దతతో దేశానికి సేవ చేసి ఉద్యోగ విరమణ పొందిన పోలీస్, ఆర్మీ మరియు డిఫెన్సె మాజీ ఉద్యోగులను, కాంగ్రెస్ నుండి ఇతర పార్టీలలోకి వెళ్లిన వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. విశాఖ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ సరికొత్త ప్రయోగం చేయబోతోంది, ప్రజా సమస్యల పరిష్కరానికి సులువైన విధానాలు తీసుకురాబోతోంది,ప్రజా సమస్యల పై ప్రభుత్వం స్పందించక తప్పని పరిస్థితి తీసుకువచ్చేలా ప్రియాంక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రజలకు పిలుపునిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. సలహాలు, సూచనలు చేయవచ్చు, ప్రజా సమస్యలు ఆమె దృష్టికి తీసుకువెళ్ళవచ్చు ఈ ఫోన్ / వాట్సాప్ *6305821260* లో సంప్రదించండి.

విశాఖపట్నం

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకున్న విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్.*

*వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించుకున్న విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్.* *విశాఖపట్ననవంబర్ పున్నమి ప్రతినిధి కొన్ని రోజుల క్రితం జరిగిన కొత్తపేట పర్యటన సందర్భంగా, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ గారు అపారమైన చారిత్రిక–ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని దర్శించారు. ఈ దర్శనం ఎంపీ శ్రీభరత్ గారికి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించిందని తెలిపారు. ప్రత్యేక దైవంగా పూజించబడే వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారు భక్తుల కోరికలను తీర్చే వరప్రదాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆలయంలోని శిల్పకళా వైభవం, ఆలయ పరిసరాల్లో నెలకొన్న నిశ్శబ్ద పవిత్ర వాతావరణం, గోదావరి తీరం అందించే ఆధ్యాత్మిక స్పూర్తి ఇవి అన్నీ కలసి ఎంపీ శ్రీభరత్ గారిలో మరింత గాఢమైన భక్తి భావాన్ని నింపాయి. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం రూ. 1.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్న టెన్జెల్ షెడ్డు పనులకు ఎంపీ శ్రీభరత్ గారు శంకుస్థాపన చేశారు. అలాగే అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడానికి కొత్త 108 అంబులెన్స్‌ను ఎంపీ శ్రీభరత్ గారు ప్రారంభించారు. ఈ పుణ్యక్షేత్ర కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు గారు కూడా ఎంపీ శ్రీభరత్ గారితో కలిసి పాల్గొన్నారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఎంపీ శ్రీభరత్ గారు ఆకాంక్షించారు.

విశాఖపట్నం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డా.స్వామి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డా.స్వామి *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * అనారోగ్యంతో బాధపడుతున్న అంబేద్కర్ గురుకుల విద్యార్థికి చికిత్స కోసం సీఎం.ఆర్.ఎఫ్ ద్వారా రూ.10 లక్షలు విడుదల చేసిన ముఖ్యమంత్రి జీబీ సిండ్రోమ్ తో బాధపడుతున్న శ్రీకాకుళం జిల్లా కొల్లివలస గురుకులం విద్యార్థి బోనెల చరణ్ మంత్రి డా.స్వామి ప్రత్యేక చొరవతో విద్యార్థికి విశాఖ మెడికవర్ ఆసుపత్రిలో వైద్యం విద్యార్థి వైద్యం కోసం సీఎం.ఆర్.ఎఫ్ ఎల్వోసీ ద్వారా రూ.10 లక్షలు సాయం పేదింటి విద్యార్థి ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి కృతజ్ఞతలు పేద విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం

విశాఖపట్నం

దక్షిణలో విస్తృతంగా బూత్, వార్డు కమిటీలనియమకాలు*… * *పనిచేసే వారికే ప్రాధాన్యత*

*దక్షిణలో విస్తృతంగా బూత్, వార్డు కమిటీలనియమకాలు*… * *పనిచేసే వారికే ప్రాధాన్యత* * *వార్డు అధ్యక్షులతో సమావేశాల్లో పాల్గొంటున్న వాసుపల్లి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* దక్షిణ నియోజకవర్గంలో 14 వార్డులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ ఆదేశాల మేరకు బూత్, వార్డు, అనుబంధ కమిటీ ల నియామకాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు వార్డులలో కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు చేసి పనిచేసే వారికి ప్రాధాన్యత కల్పిస్తూ నియామకాల నివేదికను సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం 31 వార్డ్ బాపుఆనంద్, 42వ వార్డు అధ్యక్షుడు బిశెట్టి ప్రసాద్ లతో ఆయా కార్యాలయాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నియామకాలు సిద్ధం చేసిన బిశెట్టి ప్రసాద్ వాసుపల్లి గణేష్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ కమిటీ నియామకాల్లో కష్టపడే వారికి మాత్రమే ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. పార్టీ బలోపేతానికి, మళ్లీ అధికారంలో తీసుకువచ్చేందుకు సంస్థాగతంగా బలపడాలన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో గెలుపు వైసిపి కైవసం చేసుకోనున్నదని వాసుపల్లి గణేష్ కుమార్ జోష్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం పై ఇప్పటికే ప్రజలు వ్యతిరేకత కనబరుస్తున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారన్నారు. నాడు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని అటకెక్కించారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ దొడ్డి రామానంద్, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,31 వ వార్డు, 42వ వార్డు ల సీనియర్ నాయకులు, మహిళా నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

విద్య విజ్ఞానం

మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పదోతరగతి పరీక్షలు

ఏపీలో టెన్త్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1 వరకు పదోతరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు

విశాఖపట్నం

రెవెన్యూలో అభ్యంత‌రాల ప‌రిష్కారానికి రెండేళ్ల గ‌డువు*

*రెవెన్యూలో అభ్యంత‌రాల ప‌రిష్కారానికి రెండేళ్ల గ‌డువు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* *విశాఖ‌లో శాస‌న స‌భాప‌క్ష ఫిర్యాదుల క‌మిటీ ఛైర్మ‌న్ ర‌ఘురామ కృష్ణ‌రాజు *ప్రైవేటు స్థ‌లాల‌ వివాదాల‌ను ప‌రిష్క‌రించేందుకు జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు అధికారాలు విశాఖ‌ప‌ట్ట‌ణం, న‌వంబ‌ర్ 21 ః భూ సంబంధిత రెవెన్యూ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌పై రైతుల నుంచి వ‌చ్చే అభ్యంత‌రాల ప‌రిష్కారానికి రెండేళ్ల గ‌డువు అవ‌స‌ర‌మ‌ని, ఆ మేర‌కు చ‌ట్ట‌ప‌ర‌మైన నిర్ణ‌యం తీసుకునేలా ప్ర‌భుత్వానికి నివేదిస్తామ‌ని రాష్ట్ర శాస‌న స‌భాప‌క్ష ఫిర్యాదుల క‌మిటీ ఛైర్మ‌న్, డిప్యూటీ స్పీక‌ర్ కె. ర‌ఘురామ కృష్ణ‌రాజు తెలిపారు. స‌భ్యులు కొణ‌తాల రామ‌కృష్ణ‌, ప‌ల్లా శ్రీ‌నివాస‌రావు, విష్ణుకుమార్ రాజుల‌తో క‌లిసి శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించిన ఆయ‌న క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో విలేక‌రుల‌తో మాట్లాడారు. స‌మ‌గ్ర భూ రీస‌ర్వే అంశంపై అధికారుల‌తో చ‌ర్చించిన అంశాలు, క‌మిటీ చేసిన‌ ప్ర‌తిపాద‌న‌ల గురించి వివ‌రించారు. రీ-స‌ర్వే లేదా ఇత‌ర రెవెన్యూ ప‌ర‌మైన అంశాల్లో రైతులు చేసే అభ్యంత‌రాల ప‌రిష్కారానికి త‌హ‌శీల్దార్ స్థాయిలో ఉన్న‌ ఏడాది కాలం ప‌రిమితిని, మ‌రొక ఏడాది పాటు అన‌గా రెండు సంవ‌త్స‌రాలకు పెంచాల‌ని సూచిస్తూ క‌మిటీ ప్ర‌తిపాదించిందన్నారు. ఏడాది కాల ప‌రిమితి దాటిపోతే రైతులు సివిల్ కోర్టుల‌ను ఆశ్ర‌యించాల్సి ఉంద‌ని, దీనివ‌ల్ల చాలా మంది రైతులు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని, కావున అభ్యంత‌రాల ప‌రిష్కార గ‌డువును పెంచాల‌ని ప్ర‌తిపాదించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు. సీసీఎల్ఏ దృష్టికి తీసుకెళ్లి ఆచ‌ర‌ణ‌లో పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకొనేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. అలాగే ప్ర‌యివేటు భూముల వివాదాల ప‌రిష్కారానికి జిల్లా క‌లెక్ట‌ర్ కు అధికారాలు ఇస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసినప్ప‌టికీ ఎగ్జిక్యూటివ్ ఆర్డ‌ర్ రాలేద‌ని త్వ‌రిత‌గ‌తిన అమ‌ల్లోకి వ‌చ్చేలా ఉన్న‌తాధికారుల‌తో చ‌ర్చిస్తామ‌ని ఛైర్మ‌న్ పేర్కొన్నారు. *6,688 గ్రామాల్లో రీ-స‌ర్వే పూర్త‌యింది… 2,093 గ్రామాల్లో కొన‌సాగుతోంది ః డైరెక్ట‌ర్* విలేక‌రుల అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బ‌దులుగా రీసర్వేకు సంబంధించిన వివ‌రాల‌ను స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డుల విభాగం డైరెక్ట‌ర్ ఆర్. కూర్మ‌నాథ్ వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 6,688 గ్రామాల్లో రీసర్వే పూర్త‌యింద‌ని, అక్క‌డ సుమారు 7 లక్ష‌ల వ‌ర‌కు అభ్యంతరాలు వ‌చ్చాయ‌ని, అందులో మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు సంక్లిష్ట‌మైన‌వ‌ని.. జాయింట్ ఎల్.పి.ఎం., నాలుగు ల‌క్ష‌ల వ‌రకు ప‌రిష్క‌రించ‌డానికి వీలుగా ఉన్న‌వ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రెండు ల‌క్ష్య‌ల అభ్యంత‌రాల‌ను ప‌రిష్క‌రించామ‌ని, మిగిలిన రెండు ల‌క్ష‌ల అభ్యంత‌రాల‌కు 2025, డిసెంబ‌ర్ 31లోగా ప‌రిష్కారం చూపుతామ‌ని చెప్పారు. 4,400 ఫిర్యాదులు కోర్టుల ప‌రిధిలో ఉన్నాయ‌న్నారు. మూడో విడ‌త‌లో భాగంగా 2025, జ‌న‌వ‌రి 20వ తేదీ నుంచి 2,093 గ్రామాల్లో రీ-స‌ర్వే మొద‌లు పెట్టామ‌ని, 628 పైలెట్ గ్రామాల‌ను తీసుకున్నామ‌ని చెప్పారు. ఫేజ్ -2లో 740 గ్రామాలు, ఫేజ్-3లో 720 గ్రామాల‌ను ఎంపిక చేశామ‌ని వివ‌రించారు. మిగిలిన మ‌రొక 7,200 గ్రామాల్లో కూడా రీస‌ర్వేను పూర్తి చేస్తామ‌ని పేర్కొన్నారు. 2027, డిసెంబ‌ర్ 31 నాటికి అన్ని గ్రామాల్లో రీస‌ర్వే పూర్తి చేస్తాం. గ్రామీణంలో స్వామిత్వ ద్వారా, ప‌ట్ట‌ణాల ప‌రిధిలో న‌క్ష ద్వారా స‌ర్వే ప్ర‌క్రియ‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. రీ-స‌ర్వేలో కార్స్ నెట్వ‌ర్కును వినియోగిస్తున్నామ‌ని చెప్పారు. సుమారు 44,000 ఎల్.పి.ఎం.ల‌ను ఫ్రీ హోల్డ్ భూముల‌కు సంబంధించిన‌విగా గుర్తించామ‌ని, దీనిపై ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా తుది చ‌ర్య‌లు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

విశాఖపట్నం

సంయుక్త తీర భద్రతా వ్యాయామం “సాగర కవచ్-02/2025” నిర్వహణ.

ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో 20 మరియు 21-11-2025 తేదీలలో రెండు రోజులపాటు సంయుక్త తీర భద్రతా వ్యాయామం “సాగర కవచ్-02/2025” నిర్వహణ. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత వ్యాప్తంగా రెండు రోజులపాటు (20 & 21-11-2025) “సాగర కవచ్-02/2025” సంయుక్త తీర భద్రతా వ్యాయామం కోస్ట్ గార్డ్స్ జిల్లా ప్రధాన కార్యాలయం, రాష్ట్ర తీర భద్రతా ఆపరేషన్ సెంటర్ (SCSOC), విశాఖపట్నం ఆధ్వర్యంలో DIG శ్రీ రాజేశ్ మిట్టల్ గారి అధ్యక్షతన కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, స్థానిక పోలీసులు, కోస్ట్ గార్డ్స్, నేవీ మరియు ఫిషరీస్ శాఖల వంటి ముఖ్య విభాగాల సమన్వయంతో నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించబడే ఈ “సాగర కవచ్” వ్యాయామం, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత భద్రతను బలోపేతం చేయడం మరియు దేశ విరోధక అంశాలు, ఉగ్రవాదుల చొరబాట్లను నిరోధించడం లక్ష్యంగా ఉంచుకుంది. ఈ వ్యాయామంలో కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఇన్‌చార్జ్ మరియు విశాఖపట్నం రేంజ్ DIG శ్రీ గోపీనాథ్ జట్టి, IPS నాయకత్వంలో, మొత్తం 1 అదనపు SP, 1 DSP, 21 SHOs/ఇన్‌స్పెక్టర్లు, 42 SIs మరియు 377 కోస్టల్ సెక్యురిటీ పోలీస్ సిబ్బంది, అలాగే 1336 స్థానిక పోలీసు సిబ్బంది — మొత్తం 1778 మంది రెండు రోజులపాటు ఈ వ్యాయామంలో పాల్గొన్నారు. ఈ వ్యాయామంలో దళాలను “రెడ్ ఫోర్స్” (శత్రువులు) మరియు “బ్లూ ఫోర్స్” (దేశ రక్షకులు)గా విభజించగా, బ్లూ ఫోర్స్ అప్రమత్తతను పరీక్షించేందుకు “రెడ్ ఫోర్స్” సిబ్బందితో కొన్ని సిమ్యులేషన్/డీకాయ్ ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి. రెండు రోజుల వ్యాయామ సమయంలో, 47 మంది రెడ్ ఫోర్స్ సభ్యులను (శత్రువులు) 89 మంది బ్లూ ఫోర్స్ సభ్యులు (రక్షకులు) 18 వివిధ సంఘటనల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇది బ్లూ ఫోర్స్ సిబ్బంది తీరప్రాంతంలో తమ విధుల్లో ఉన్నతమైన అప్రమత్తతను చూపుతుంది. ఈసారి సాగర కవచ్ వ్యాయామం అత్యంత పద్ధతిగా, సమర్థవంతంగా మరియు ఫలప్రదంగా నిర్వహించబడింది. ఈ సందర్భంలో “సాగర కవచ్-02/2025” వ్యాయామంలో పాల్గొని విజయవంతం చేసిన రెడ్ మరియు బ్లూ ఫోర్స్ సిబ్బంది, కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, స్థానిక పోలీసులు, కోస్ట్ గార్డ్స్, నేవీ మరియు ఫిషరీస్ శాఖ సిబ్బందికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సిమ్యులేషన్/డీకాయ్ ఆపరేషన్లలో పాల్గొన్న రెడ్ మరియు బ్లూ ఫోర్స్ సిబ్బందికి తగిన బహుమతులు అందజేయబడతాయి అని తెలియజేసారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.