Thursday, 19 March 2026

Blog

విశాఖపట్నం

శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మండల దీక్ష దిగ్విజయంగా పూర్తిచేసుకున్న స్వాములు – శబరిమలకు బయలుదేరిన భక్తులు

విశాఖపట్నం: శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో భక్తజనుల సమక్షంలో నిర్వహించిన మండల పూజా దీక్షలను స్వాములు భక్తిశ్రద్ధలతో పూర్తిచేశారు. దీక్షావ్రతం విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో నేడు స్వాములు ఇరుముడి కట్టుకు సంబంధించిన పవిత్ర కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి శబరిమల యాత్రకు బయలుదేరారు. ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ— “అయ్యప్ప స్వామి అనుగ్రహంతో మా మండల దీక్షను ఎంతో భక్తి, నియమ నిష్ఠలతో పూర్తిచేసుకున్నాం. అలాగే అయ్యప్ప కృపా కటాక్షాలతో శబరిమల యాత్రను సాఫల్యంగా పూర్తి చేసుకుని స్వామివారి ఆశీర్వాదం పొందుతామని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం” అని తెలిపారు. అదేవిధంగా, దేవాలయ పీఠం ఆధ్వర్యంలో మండల కాలమంతా శాస్త్రబద్ధంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు, బిక్షా ప్రసాదాలు, సేవలకు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. “పీఠం అందించిన సేవల ద్వారా అయ్యప్ప అనుగ్రహానికి పాత్రులమయ్యామనిపించింది” అని స్వాములు పేర్కొన్నారు. యాత్రను సుభక్షితంగా పూర్తిచేసుకుని స్వామివారి దర్శనానందం పొందాలని మరెన్నో మంది భక్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామియే శరణం అయ్యప్ప!

తిరుపతి

బుచ్చినాయుడు కండ్రిగ లో ఉచిత మెడికల్ క్యాంపు

బుచ్చి నాయుడు కండ్రిగ మండలం కాటూరు గ్రామమునందు పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో మెడికల్ క్యాంప్ నిర్వహించారు.మెడికల్ క్యాంపులో కాటూరు, చుట్టుపక్కల పల్లెల నుంచి ప్రజలు పాల్గొన్నారు.వారికి నెలకు సరిపడే ఉచిత మందులు కూడా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ ఏడుకొండలు,డాక్టర్ లక్ష్మీనారాయణ గారు,డాక్టర్ రాజేష్,డాక్టర్ భవ్య,సభ్యులు షాకిర్యాలీ,గుమ్మల రాజేశ్వరరావు జిఎంఆర్ సుబ్రమణ్యం,మోహన్, రాజేష్, నరసింహులు, షఫీ,కేశవ పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

చింతపల్లి: ప్రారంభమైన కాఫీ పల్పింగ్

చింతపల్లి లో కాఫీ పల్పింగ్ ప్రాసెసింగ్ ను అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ఫరిన్ శనివారం ప్రారంభించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. కాఫీ రైతులకు మంచి ధర చెల్లించే విధంగా కాఫీ కొనుగోలు చేస్తామని తెలిపారు. గత సంవత్సరంలో రైతులకు బోనస్ రూ.16 లతో కలిపి కేజీ కాఫీ పండ్లకు రూ.60/- లు చెల్లించామని వెల్లడించారు. ఈ ఏడాది 1600 మెట్రిక్ టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఐటీఏ ఏపీఓ వేంకటేశ్వరరావు, కాఫీ ఏడి బొంజుబాబు పాల్గొన్నారు.

సత్యసాయి

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. లైవ్ వీడియో..

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. Video: https://m.youtube.com/watch?v=W9DHWLRz3cc

సత్యసాయి

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. లైవ్ వీడియో..

శ్రీ సత్యసాయి శతజయంతి వేడుకల్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సహా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. వారితోపాటు.. పలువురు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. Video: https://m.youtube.com/watch?v=W9DHWLRz3cc

ఖమ్మం

వందేమాతరం 150 ఏళ్ల ఉత్సవాల నిర్వహణపై బీజేపీ నాయకుల వినతి పత్రం

పున్నమి ప్రతి నిధి దేశవ్యాప్తంగా వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఖమ్మం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి (సూపరింటెండెంట్) గారిని బీజేపీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ కుమార్, జిల్లా నాయకులు పోతుల చంద్రశేఖర్ ,పొట్టి మూర్తి జనార్ధన్, బోయినపల్లి సురేష్, ఖమ్మం 2వ పట్టణ ప్రధాన కార్యదర్శి మాధవ్ రుద్రగాని పాల్గొన్నారు.

ఖమ్మం

రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఖమ్మం టౌన్ పరిధిలో ని అన్ని డివిజన్ లలో బీజేపీ గెలుపే లక్ష్యం గా అధ్యక్షులు ధనియాకుల డివిజన్ ల పర్యటన

పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరము లోని 2 వ పట్టణ పరిధిలో గల అన్ని డివిజన్ లలో బీజేపీ గెలుపు లక్ష్యం గా ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ ఆధ్వర్యంలో డివిజన్ ల పర్యటన కార్యక్రమం చేపట్టడం జరిగింది 5వ రోజు పర్యటనలో భాగంగా 52వ డివిజన్‌లోని పోలింగ్ బూత్‌లు 186, 187, 188 అధ్యక్షులను కలిసి డివిజన్ సమస్యలను తెలుసుకున్నారు. ఖమ్మం డిపో రోడ్‌లో స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలియజేశారు. ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించేందుకు త్వరలో బీజేపీ టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌ను కలిసి చర్యలు తీసుకుంటామని వెంకటనారాయణ హామీ ఇచ్చారు. దాసరి మధు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఖమ్మం బీజేపీ సీనియర్ నాయకులు వేల్పుల సుధాకర్, ఈశ్వరప్రగడ రామారావు, బోయల వెంకట్, చిన్నికృష్ణ, టూ టౌన్ ప్రధాన కార్యదర్శి జ్యోతుల యుగంధర్ నాయుడు, టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాసరెడ్డి, ఇనుగుర్తి ఉపేంద్ర, ట్రెజరర్ దాసరి వీరభద్రం, నాయకులు చందు, సుభాష్, మాధవి, సాయి, సునీత తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

ఉధంపూర్‌లో జరిగిన 64వ ఐటీబీపీ రైజింగ్ డే వేడుకల్లో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వం – హిమవీరుల త్యాగాలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాళి:

పున్నమి ప్రతి నిధి జమ్మూ & కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో ఉన్న 15వ బెటాలియన్ కేంద్రంలో జరిగిన 64వ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) రైజింగ్ డే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హాజరై న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూమర్ ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సింహా గారు, ఐటీబీపీ డీజీ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు, మరియు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ముందుగా అమరవీరుల స్మారక స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం కొత్త నివాస మరియు ఆపరేషనల్ సౌకర్యాలను ప్రారంభించి, పరేడ్ సందర్భంగా ప్రతిభ కనబరిచిన వారికి ట్రోఫీలు మరియు పతకాలను ప్రదానం చెయ్యడం జరిగింది సమావేశం లో బండి సంజయ్ మాట్లాడుతు మన హిమవీరుల త్యాగాలు అమూల్యం. –45°C వరకు తగ్గే ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ ఉన్న కఠిన పరిస్థితుల్లో 3,488 కి.మీ. భారత–చైనా సరిహద్దును కాపాడడం వారి అసాధారణ సేవ. దేశం వారి సంకల్పం నుంచి శక్తి పొందుతుందన్నారు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఐటీబీపీకై పలు సంక్షేమ కార్యక్రమాలను బలోపేతం చేసిందని ఆధునిక పరికరాలు అందించి, కీలకమైన మౌలిక వసతులను పూర్తిచేసి, 5,900 మందికి పైగా సిబ్బందిని నియమించి, 2,400 ఫిర్యాదులను పరిష్కరించిందని తెలియజేసారు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, హోం మంత్రి శ్రీ అమిత్ షా మార్గదర్శకత్వంలో, ప్రతి ఐటీబీపీ సిబ్బంది మరియు వారి కుటుంబాల సంక్షేమం, ఆధునికీకరణ, అవశ్యక సహకారం కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూమర్

E-పేపర్

పేరుకే పెద్దహోటల్ పెట్టేది మాత్రం కుళ్లిపోయిన చికెన్, మటన్ తినేందుకు వెళ్లుతున్నారా… తస్మాత్ జాగ్రత్త

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 పేరుకే పెద్దహోటల్ పెట్టేది మాత్రం కుళ్లిపోయిన చికెన్, మటన్ తినేందుకు వెళ్లుతున్నారా… తస్మాత్ జాగ్రత్త? తులిప్స్ గ్రాండ్ హోటల్‌ లో తనిఖీలు చేసి 50 వేల రూపాయలు ఫైన్ విధించిన శానిటేషన్ అధికారి

E-పేపర్

నకిలీ మొబైల్స్ ను విక్రయిస్తున్నU&i శివ మొబైల్స్ వద్ద ఒక వ్యక్తిని పట్టుకున్న మొబైల్ షాప్స్ అసోసియేషన్ సభ్యులు

పున్నమి ప్రతినిధి దుర్గేష్ ఆలంపల్లి 9640204826 నకిలీ మొబైల్స్ ను విక్రయిస్తున్నU&i శివ మొబైల్స్ వద్ద ఒక వ్యక్తిని పట్టుకున్న మొబైల్ షాప్స్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మార్వాడి U&I శివ మొబైల్స్ లో నకిలీ ఫోన్లను అమ్ముతున్నారని మొబైల్ షాప్ అసోసియేషన్ సభ్యులు గుర్తు తెలియని వ్యక్తులు పెద్ద ఎత్తున నకిలీ ఫోన్లను విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాకొని పోలీసులకు అప్పగింత రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఫోన్లను విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలింపు, పూర్తిస్థాయిలో విచారణ జరిపి తగు న్యాయం చేయాలని మొబైల్ షాప్ అసోసియేషన్ సభ్యులు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.