Thursday, 19 March 2026

Blog

అన్నమయ్య

పోతుగుంట రమేష్ నాయుడుకు ఘన సత్కారం శివయ్య సేవ లభించడం పూర్వజన్మ సుకృతం — రమేష్ నాయుడు

శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడుకు నందలూరు మండల సర్పంచుల సంఘం తరఫున ఆదివారం ఘన సత్కారం లభించింది. నందలూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు,నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ ఆధ్వర్యంలో రాజంపేట మండలం వైబియాన్ పల్లెలోని చైర్మన్ రమేష్ నాయుడు స్వగృహంలో ఈ సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ,అనేక సంవత్సరాలుగా పోతుగుంట రమేష్ నాయుడు సమాజ సేవతో పాటు భారతీయ జనతా పార్టీలో విశిష్ట సేవలు అందించారు. ఆయనకు శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పదవి దక్కడం ఆయన చేసిన సేవలకు ప్రతిఫలం.శివయ్య సేవకుడిగా ఈ పదవి లభించడం ఆయన అదృష్టం,” అని అన్నారు.అలాగే, చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే టిటిడీ నుండి శ్రీశైలం అభివృద్ధికి ₹25 కోట్ల రూపాయలు తీసుకురావడాన్ని శుభపరిణామంగా అభివర్ణించారు.కూటమి ప్రభుత్వ సహకారంతో ఆలయం అన్ని విధాల అభివృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో రమేష్ నాయుడు మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ, శ్రీశైలం లాంటి మహోన్నత క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా సేవ చేసే అవకాశమొచ్చింది పూర్వజన్మ సుకృతం.శివయ్య దయతో ఆలయ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేసి మంచి పేరు తీసుకువస్తాను అని చెప్పారు.

అన్నమయ్య

ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా ఫారూఖ్ శుబ్లీ నియామకం – మైనార్టీల గౌరవాన్ని నిలబెట్టిన సీఎం చంద్రబాబుకు గుల్జార్ భాష అభినందనలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా జనాబ్ ఫారూక్ శుబ్లీ నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును రాష్ట్ర మాజీ ఏపీ.ఆర్.డీసీ డైరెక్టర్,మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు, మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ గండికోట గుల్జార్ భాష హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గుల్జార్ భాష మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రంలో ఎక్కడ మైనార్టీల పై అన్యాయం జరిగినా,ఆ అన్యాయానికి ఎదురుగా ముందువరుసలో నిలిచి పోరాడిన యోధుడు ఫారూఖ్ శుబ్లీ అని పేర్కొన్నారు.ఎన్నో తప్పుడు కేసులు ఎదుర్కొన్నప్పటికీ, మైనార్టీల హక్కుల కోసం మొక్కవోని దీక్షతో ఉద్యమించిన ఆయనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ బాధ్యత పోరాటానికి వచ్చిన గొప్ప గుర్తింపు అని అన్నారు.2024 రాష్ట్ర ఎన్నికల్లో మైనార్టీ ఓట్లను తెలుగుదేశం పార్టీవైపు సమీకరించడం లో ఫారూఖ్ శుబ్లీ పాత్ర విశేషమని,ఆయన చేసిన సేవలకు గాను ఈ చైర్మన్ పదవి మరింత న్యాయం చేస్తుందని గుల్జార్ భాష తెలిపారు.అదే విధంగా, ఉర్దూ భాష అనేది శతాబ్దాలుగా సాహిత్యం, గజల్,కవిత్వానికి నిలువెత్తు స్తంభమై ఉందని,ఈ భాషను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉండటం రాష్ట్ర మైనార్టీలకు ఆనందకర విషయమన్నారు.రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలు అన్ని చోట్లా ఫారూఖ్ శుబ్లీ నియామకాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాయని, భవిష్యత్తులో ఆయన నేతృత్వంలో ఉర్దూ భాష అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణోత్సవాలు 24 నుండి

నందిగామ పట్టణంలోని కుమారస్వామి నగర గణపతి శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 24 నుండి 28 వరకు ఐదు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం విశ్వక్సేనారాధన, అంకురారోపణ, హోమాలతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 25వ తేదీ మంగళవారం స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, నిత్యహోమాలు, ‘పెళ్లికొడుకు’ కార్యక్రమం నిర్వహించనున్నారు. 26వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి దివ్యకళ్యాణం ఘనంగా జరగనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తులకుఅన్నప్రసాద వితరణ ఉంటుంది. 27వ తేదీ గురువారం మూలమంత్ర హోమాది క్రతువులు, పూర్ణాహుతి, స్వామివారి గ్రామోత్సవం నిర్వహించబడుతుందని కమిటీ వివరించింది. 28వ తేదీ శుక్రవారం దీపోత్సవం, ఊంజల సేవతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ పవిత్ర వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కమిటీ సభ్యులు కోరారు.

జోగులాంబ గద్వాల

మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేల రాష్ట్ర ప్రభుత్వం చెప్పటిన ఇందిరమ్మ చీరల పంపిణీ..

గద్వాల్ నవంబర్ 24(పున్నమి ప్రతినిధి) మహిళల ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసేల రాష్ట్ర ప్రభుత్వం చెప్పటిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం లో భాగంగా జోగులంబ గద్వాల జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏఐసీసీ కార్యదర్శి చతిస్గడ్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం మహిళా సోదరీమణులకు చీరలను పంపిణీ చేశారు. తొలి విడతలోడిసెంబర్ 9 కల్లా పల్లెల్లో ప్రతి ఆడబిడ్డ ఇంటికీ ఇందిరమ్మ చీరలు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం తెలంగాణ ఆడబిడ్డలకు ‘పుట్టింటి సారె’ మాదిరిగా  ఆత్మ గౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు అందిస్తూ ఆడబిడ్డలకు అండగా నిలుస్తుందని గ్రామ నాయకులు చెప్పడం జరిగింది

E-పేపర్

నోవోదయ విద్యాలయం ను పరిశీలించిన జిల్లా ఎస్పి డాక్టర్ అజిత వేజెండ్ల గారు

మర్రిపాడు మండలం, కృష్ణపురం లోని నోవోదయ విద్యాలయం ను జిల్లా ఎస్పి డాక్టర్ అజిత వేజెండ్ల సందర్శించారు. నవోదయ విద్యాలయంలో ఇటీవల పదవ తరగతి చదువుతున్న ప్రణీత అనే విద్యార్థిని బలవన్మరణం ఘటనపై మృతి చెందిన విద్యార్థిని తోటి విద్యార్థులు, విచారణ చేపట్టారు. నవోదయ విద్యాలయంలో జరిగిన ఘటన పై విచారణ వేగవంతం చేసామని విద్యాలయంలో జరుగుతున్న వరుస ఘటనలతో విద్యార్థులు భయ బ్రాంతులకు గురి కాకుండా విద్యపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు . కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

విజయనగరం 

శ్రీ శాంతి యోగ సంస్థ రెండో వార్షికోత్సవం ఘనంగా

గాజువాక, నవంబర్ (పున్నమి ప్రతినిధి): రాజీవ్ ఇండోర్ స్టేడియం, వికాస్‌నగర్ బీసీ రోడ్‌లో స్థానిక శ్రీ శాంతి యోగా ఇన్స్టిట్యూట్ రెండో వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతం యూనివర్సిటీ యోగ ప్రొఫెసర్ డాక్టర్ యూ. రామారావు, కార్పొరేటర్ పల్లా శ్రీను, యోగా గురువు కనకరావు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో యోగా సాధకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రధాన అతిథిగా ప్రసంగించిన డాక్టర్ రామారావు మాట్లాడుతూ, “యోగ అనేది శారీరక ఆరోగ్యానికే కాక మానసిక సమతుల్యతకు, వ్యక్తిత్వ వికాసానికి కీలకం. ఇలాంటి సంస్థలు సమాజ ఆరోగ్యానికి ఎంతో గొప్ప సేవ అందిస్తున్నాయి” అని అన్నారు. సంస్థ డైరెక్టర్ శ్రీను మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాల్లో సంస్థ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు, వర్క్‌షాపులు, ఉచిత యోగా శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాలను వివరించారు. భవిష్యత్‌లో మరిన్ని యోగా ప్రచార కార్యక్రమాలు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక తరగతులను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిన్నారులు, పెద్దలు చేసిన యోగా ప్రదర్శనలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంస్థ నుంచి శిక్షణ పొందిన పలువురు చిన్నారులు నేషనల్‌ లెవెల్‌ వరకు ఎంపిక కావడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.

విశాఖపట్నం

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం .

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం . -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి *: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, అన్ని జోనల్ కార్యాలయాలలోనూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం” 2025 నవంబర్ 24 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు. కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై నవంబర్ 24 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు

విశాఖపట్నం

కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక*

* కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక* *మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి *జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి * విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం – పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు కార్యక్రమం జరుగుతుందని, అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని చెప్పారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోను చెక్ చేసుకోవచ్చన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో అందజేస్తున్నామని, ఎండార్స్మెంట్ ను రిజిస్టర్ పోస్ట్ ద్వారా సంబంధిత చిరునామాకు పంపిస్తున్నామని చెప్పారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో కోరారు. *కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలి* అర్జిదారులు మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు. అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను సంప్రదించవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు*

*దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి ఈరోజు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ 30 వార్డ్ పరిధిలో మీదరెల్లి వీధి లో శ్రీ మరిడిమాంబ అమ్మవారి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వీధి వద్ద జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా భక్తులకు కాసేపు అన్నప్రసాదాన్ని వడ్డించారు కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ , స్థానిక కూటమి నేతలు శ్రీ మహి గారు, తేజ గారు, ఆనంద గారు , ప్రసాద్ గారు, రాజేష్ గారు, తాతారావు , కూటమి వార్డు ఇన్చార్జ్ భాను గారు ఇతర నాయకులు పాల్గొన్నారు… అదేవిధంగా 39 వార్డు పరిధిలో స్వర్గస్తులైన సోమనాయుడు గారి సెరెమని కార్యక్రమంలో పాల్గొని , నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడే తనవంతు సహకారం ఉంటుందని ఉన్నారు కార్యక్రమంలో స్థానికువటం నేతలు పాల్గొన్నారు. చివరిగా వైజాగ్ కన్వెన్షన్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మరియు తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో జరిగిన రజస్వల వేడుకలో పాల్గొన్నారు…

విశాఖపట్నం

భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి 100 వ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*

*భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్యసాయిబాబా వారి 100 వ జన్మదినోత్సవ వేడుకలలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* పెందుర్తి నియోజకవర్గంలో జీవీఎంసీ 97వ వార్డు చిన్నముసిడివాడ గ్రామం సత్యసాయి మందిరంలో నూ, సుజాతనగర్ భగవాన్ శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రం ఆనంద సాయి మందిరంలోను మరియు ఉక్కునగరం స్టీల్ ప్లాంట్ సెక్టర్ 2 లో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరం కమిటీ వారి ఆహ్వానం మేరకు శ్రీశ్రీశ్రీ సత్యసాయి బాబా వారి వందవ జన్మదిన వేడుకలలో పాల్గొని కరుణ దయ మానవ ధర్మానికి ప్రత్యేకగా నిలిచిన దైవం శ్రీ సత్య సాయి బాబా గారి నిస్వాద సేవలను స్మరించుకుంటూ సేవా మార్గంలో నడుస్తున్న భక్తులందరికీ స్వామి వారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్యసాయిబాబా వారి మందిరాలలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో పాల్గొని కుట్టు మిషన్ల పంపిణీ మరియు పేదలకు బట్టలు మరియు కుర్చీల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు వీరితోపాటు స్థానిక వార్డు కార్పొరేటర్ శ్రీమతి శ్రీ వసంత శంకర్రావు గారు, పంచకర్ల ప్రసాద్ రావు గారు,77 వార్డు కార్పొరేటర్ బుట్ట సూర్యా కుమారి గారు,ముక్కా సంతోష్ గారు, ముక్కా గోపి గారు,తైనాల మహేష్ గారు,పిల్లా జగన్మోహన్ పాత్ర గారు, ఏఎంసీ డైరెక్టర్ లక్కీ గోవింద్ గారు, ముమ్మన సతీష్ గారు,నీటిపల్లి మహేష్ గారు, బిగిడి రామ గోవింద గారు, వెన్నెల నరసింహారావు గారు వియ్యపు చిన్న గారు, సిరపరపు అప్పలనాయుడు గారు,కాకి బాబు గారు, కెఎన్ఆర్ గారు, లక్కవరపు శ్రీనివాసరావు గారు, గోపి గారు, సతివాడ జ్యోతి గారు,రాపర్తి కిషోర్ గారు, తనకాల శ్రీనివాసరావు గారు, బసనబోయిన రాము గారు, బల్రెడ్డి సతీష్ గారు , నాగసుధ గారు, వరూధిని గారు, కర్రీ శివ గారు, వెంకటేశ్వరరావు గారు, మొదలగు సత్య సాయిబాబా భజన మండలి సభ్యులు ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.