Wednesday, 18 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ పోరంకి లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో CC Road ప్రారంభం

విజయవాడ….తాడిగడప మున్సిపాలిటీ పోరంకి గ్రామం నందు గల శ్రీనివాస్ నగర్ కాలనీలో కొత్తగా వేయబడిన CCరోడ్డును ప్రస్తుత శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు ఆదివారం 23.11.2025 తేదీన సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో అనుమోలు ప్రభాకర్ గారు మరియు మూడవ డివిజన్ అధ్యక్షులు చనుమోలు శ్రీనివాస్ గారు ,వెలగపూడి శంకర్రావు గారు, తాడిగడప మున్సిపాలిటీ కమిషనర్ నజీర్ గారు తదితరులు పాల్గొన్నారు, అనంతరం శ్రీనివాస్ నగర్ లోని “శ్రీమతే రామానుజాయ నమః ” భవనము మరియు శాంతి నిలయం భవనముల సమీపంలో అనేక రకాల పూల ,పండ్ల మొక్కలను గౌరవనీయులు శ్రీ బోడే ప్రసాద్ గారు నాటడం జరిగినది . కాలనీవాసులు శ్రీమాన్ గుదిమెళ్ళ లక్ష్మీనరసింహగారు ఈ మొక్కలకి గాను రాజమండ్రి నుంచి రకరకాల ఎరువులతో కూడిన మట్టిని తెప్పించి ఉపయోగించారు.ఈ కార్యక్రమంలో అనేకమంది కాలనీవాసులు ,మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం గావించారు.

విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ (PUC) ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం అభివృద్ధి మరియు ఆర్థిక అంచనాలపై సమీక్షా సమావేశం.

శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంచనాల కమిటీ (PUC) ఆధ్వర్యంలో సింహాచలం దేవస్థానం అభివృద్ధి మరియు ఆర్థిక అంచనాలపై సమీక్షా సమావేశం. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ​ ​ఆంధ్రప్రదేశ్ శాసనసభ (APLA) అంచనాలపై కమిటీ (PUC), గౌరవనీయులైన ఎమ్మెల్యే, శ్రీ వి. జోగేశ్వరరావు (మండపేట) గారి అధ్యక్షతన, 2025 నవంబర్ 26వ తేదీన విశాఖపట్నంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (SVLNSD), సింహాచలంను సందర్శించింది. ​ఈ కమిటీలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ (APLA) నుండి. గౌరవ సభ్యులలో శ్రీ జయకృష్ణ నిమ్మక, శ్రీ మద్దిపాటి వెంకట రాజు, డాక్టర్ వి.వి. సూర్యనరాయణ రాజు పెనుమత్స, మరియు శ్రీ ఏలూరి సాంబశివ రావు పాల్గొన్నారు. ​శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం యొక్క అంచనాలను సమీక్షించడం. ​ఆలయ అభివృద్ధి పనులు మరియు యాత్రికులకు అందిస్తున్న సౌకర్యాలపై పరిశీలన. ​కమిటీ ఛైర్మన్ మరియు సభ్యులు మొదట ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం దేవస్థానం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి , శ్రీమతి ఎన్. సుజాత గారితో మరియు ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భీమిలి ఆర్డిఓ మరియు చిన్నగదిలి ఎంఆర్ఓ లు పాల్గొన్నారు ​ ​2019-20, 2020-21, మరియు 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన దేవస్థానం యొక్క అంచనాలు (Estimates) మరియు ఆర్థిక వ్యయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ​ఆలయ అభివృద్ధి పనుల పురోగతి మరియు వాటికి సంబంధించిన అంచనాల అమలు. ​యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తీసుకుంటున్న చర్యలు పై చర్చించారు. ​ఈ సమావేశంలో దేవస్థానం తరపున కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్. సుజాత, అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యనిర్వహణ అధికారి వాడ్రేవు రమణమూర్తి, ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె. తిరుమలేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామకృష్ణ ,రమణ, రాంబాబు, ఏ.ఈ. (ఎలక్ట్రికల్) తాతాజీ, బంగార్రాజు, ఏ.ఈ. (సివిల్) రవిరాజు, తిరుపతి రావు, లోకేష్, పర్యవేక్షణ అధికారులు కె.వి.వి. సత్యనారాయణమూర్తి , బి సత్య శ్రీనివాస్ మరియు ఇతర ముఖ్య సిబ్బంది పాల్గొన్నారు. ​కమిటీ ఇచ్చిన సూచనలు మరియు ఆదేశాలను అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులను గౌరవ ఛైర్మన్ శ్రీ వి. జోగేశ్వరరావు ఆదేశించారు.

అమరావతి

నవంబర్ 27న విశాఖపట్నంలో జాతీయ దత్తత అవగాహన సమావేశం 2025

నవంబర్ 27న విశాఖపట్నంలో జాతీయ దత్తత అవగాహన సమావేశం 2025 ప్రత్యేక అవసరాలున్న పిల్లల సంస్థాగతం కాని పునరావాసంపై ప్రధాన దృష్టి దత్తత పై చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యంతో — విధాన నిర్ణేతలు, నిపుణులు, దత్తత కుటుంబాలను ఒక వేదికపైకి తీసుకురానున్నారు *అమరావతి విశాఖ పున్నమి ప్రతినిధి * భారత ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) ఆధ్వర్యంలోని కేంద్ర దత్తత వనరుల అథారిటీ (CARA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ సహకారంతో రేపు (నవంబర్ 27, 2025) ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జాతీయ దత్తత అవగాహన సదస్సు 2025ను నిర్వహించనుంది. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘జాతీయ దత్తత అవగాహన మాసోత్సవం’లో (National Adoption Awareness Month) భాగంగా జరుగుతుంది. ఈ సంవత్సరం సదస్సు ప్రధానాంశం “ప్రత్యేక అవసరాలు గల పిల్లల (దివ్యాంగ్ పిల్లలు) సంస్థాగతం కాని పునరావాసం”. జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 మరియు దత్తత నిబంధనలు, 2022కి అనుగుణంగా, తల్లిదండ్రుల మద్దతు లేని పిల్లలకు సమ్మిళిత, కారుణ్యభరితమైన మరియు కుటుంబ ఆధారిత సంరక్షణను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ థీమ్ తెలియజేస్తోంది. ఈ సదస్సులో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ (MWCD) కార్యదర్శి శ్రీ అనిల్ మాలిక్; ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి ఎ. సూర్య కుమారి; CARA సభ్య కార్యదర్శి & CEO శ్రీమతి భావన సక్సేనా హాజరై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాలు ప్రారంభం కానుండగా.. CARA CEO స్వాగతోపన్యాసం, నేపథ్య ప్రదర్శన ఉంటుంది. తదుపరి సెషన్లలో MWCD కార్యదర్శి ముఖ్య ఉపన్యాసం, ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయి. తల్లిదండ్రులలో కాబోతున్న వారిలో అవగాహన పెంచేందుకు, దత్తతను ప్రోత్సహించేందుకు “ప్రత్యేక అవసరాలు గల పిల్లలను దత్తత తీసుకోవడం (దివ్యాంగ్ పిల్లలు)” అనే ప్రత్యేక చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విభిన్న భాగస్వాముల సమూహాన్ని ఒకచోట చేర్చే ఈ సమావేశంలో రాష్ట్ర దత్తత వనరుల ఏజెన్సీల (SARAs) ప్రతినిధులు, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఒక్కో జిల్లా బాలల పరిరక్షణ అధికారి (DCPO), ఒక్కో బాలల సంక్షేమ కమిటీ (CWC) సభ్యులు పాల్గొంటారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులు, దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్న తల్లిదండ్రులు, MWCD మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా, దత్తత ప్రక్రియలో నిమగ్నమైన వారికి, లబ్ధిదారులకు మధ్య సహకారాన్ని బలోపేతం చేయాలని ఈ వేదిక లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమం ఉత్తమ విధానాలను ప్రోత్సహించడం, విధాన చర్చలకు వీలు కల్పించడం మరియు దత్తతతో పాటు ఇతర కుటుంబ ఆధారిత సంరక్షణ నమూనాలలో ప్రత్యేక అవసరాలు గల పిల్లల సున్నితమైన, సమాచారంతో కూడిన, మరియు సకాలంలో పునరావాసం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలున్న పిల్లల దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తమ జీవిత అనుభవాలను పంచుకోవడం, పిల్లల సాంస్కృతిక ప్రదర్శన ఉంటాయి. జాతీయ దత్తత అవగాహన సదస్సు 2025 ద్వారా ఆచరణీయమైన సిఫార్సులను రూపొందించడం, పరస్పర అభ్యాసాన్ని పెంపొందించడం మరియు భాగస్వాముల మధ్య కార్యాచరణ సమన్వయాన్ని మెరుగుపరచడం ఆశించబడుతోంది. తద్వారా భారతదేశ దత్తత వ్యవస్థను బలోపేతం చేసి, ప్రతి బిడ్డకు—ముఖ్యంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు—సురక్షితమైన, పోషణనిచ్చే మరియు శాశ్వత గృహం దొరికేలా చూడటం దీని అంతిమ లక్ష్యం.

విశాఖపట్నం

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి *

*భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి గారు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి* 76వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్.సి విభాగం అధ్యక్షులు బోని శివరామకృష్ణ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు,రాజ్యసభ సభ్యులు గొల్ల బాబు రావు గారు,శాసనమండలి సభ్యురాలు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి గారు,మాజీఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు,డిప్యూటీమేయర్ , రాష్ట్ర ,మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు ,జీవీఎంసీ కార్పొరేటర్, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు,ముఖ్య నాయకులు ,మహిళా విభాగం నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖనగరంలో 88.35 కి.మీ. రహదారుల అభివృద్ధికి ‘వార్షిక చెల్లింపు (Annuity Payout Model) నమూనా’కు జీవీఎంసీ ఆమోదం .

విశాఖనగరంలో 88.35 కి.మీ. రహదారుల అభివృద్ధికి ‘వార్షిక చెల్లింపు (Annuity Payout Model) నమూనా’కు జీవీఎంసీ ఆమోదం . *జీవీఎంసీ అభివృద్ధికి ప్రయోజనం, ఆర్థిక లాభం దిశగా ఖర్చుల నియంత్రణ. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి*: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 88.35 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ధి, నిర్వహణ కోసం **’వార్షిక చెల్లింపు నమూనా’ (Annuity Payout Model)ను అమలు చేయడానికి జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 307 కోట్లతో ఈ నూతన విధానం ద్వారా రహదారుల నాణ్యతలో స్థిరత్వం, నిర్మాణంలో ఏకరూపత, మరియు గడువులోగా పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందని, తద్వారా జీవీఎంసీ కి ఆర్థిక లాభం దిశగా ఖర్చుల నియంత్రణ జరుగునని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ బుధవారం పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. ఇది విశాఖ నగరంలో మొట్టమొదటిగా కొత్త విధానంగా మంచి ప్రయోజనాలతో ప్రవేశ పెట్టడం జరిగిందని, ప్రస్తుతం ఉన్న చిన్న చిన్న పనుల కోసం అనేక కాంట్రాక్టర్లకు ఇచ్చే పద్ధతికి భిన్నంగా, ఈ హైబ్రిడ్ వార్షిక చెల్లింపు నమూనా (Hybrid Annuity Model) కింద, మొత్తం ప్రాజెక్టును ఒకే పెద్ద కాంట్రాక్టర్‌కు అప్పగించడం జరుగుతుందని,ఇది రహదారి డిజైన్‌లో స్థిరమైన నాణ్యతను, ఏకరూపతను నిర్ధారిస్తుందన్నారు. ప్రస్తుతం రహదారుల నిర్వహణ కోసం జీవీఎంసీ ఏటా సుమారు రూ. 90 కోట్లు ఖర్చు చేస్తోందని,తరచుగా టెండర్లు పిలవాల్సిన అవసరం ఉన్న ప్రస్తుత పద్ధతి కంటే, ఈ వార్షిక చెల్లింపు నమూనా కింద పనిని ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించడం ద్వారా బహుళ టెండర్ల వల్ల కలిగే జాప్యాన్ని నివారించి, అధిక-నాణ్యత ఫలితాలు అందించగల ప్రతిష్టాత్మక కాంట్రాక్టర్లను ఆకర్షిస్తుందన్నారు. 40 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ వెడల్పు ఉన్న ప్రధాన రహదారులను ఈ ప్రాజెక్టులో కవర్ చేస్తారని, ఇందులో రోడ్డు పునరుద్ధరణ (resurfacing), సెంట్రల్ మీడియన్ అభివృద్ధి, పచ్చదనం పెంపు, మరియు వివిధ పట్టణ సౌకర్యాలు (urban amenities) కల్పించడం ఉంటాయన్నారు. హైదరాబాద్, తిరువనంతపురం వంటి నగరాలలో విజయవంతమైన ఈ నమూనాను అమలు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుమారు సంవత్సరం క్రితం విశాఖపట్నంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమోదం తెలిపారన్నారు. జోన్ II, III, IV, V, మరియు VI లలో ఉన్న ముఖ్యమైన, ప్రధానమైన, ఆర్టీరియల్ , V V I P రాకపోకల రహదారుల సాంకేతిక పరిశీలన, ట్రాఫిక్ సాంద్రత, వ్యూహాత్మక ప్రాముఖ్యత ఆధారంగా ఎంపిక జరిగిందన్నారు. ప్రాజెక్ట్ లైటింగ్, యుటిలిటీ డక్ట్‌లు, సీసీ కెమెరాలు, చెత్త బుట్టలు, బెంచీలు, భద్రతకు సంబంధించిన పరికరాలు, ముఖ్య కూడళ్ల అభివృద్ధి, బయో-టాయిలెట్‌లు, పార్కింగ్, వే-ఫైండింగ్ సిస్టమ్‌లు ,బస్ షెల్టర్ల వంటి మూలధన వ్యయాన్ని (Capital Expenditure) బిడ్డర్ పరిధిలో చేర్చామన్నారు. ఆపరేషన్ మరియు నిర్వహణ (O&M) బాధ్యతల్లో మెకానికల్ స్వీపింగ్, డ్రైనేజీ శుభ్రత, గుంతల మరమ్మత్తులు, ల్యాండ్‌స్కేపింగ్, వీధి దీపాల నిర్వహణ, రోడ్ మార్కింగ్, రోడ్డు మరియు వీధి ఫర్నిచర్ నిర్వహణ, కూడళ్ల సివిల్ మరియు ఎలక్ట్రికల్ నిర్వహణ వంటివి ఉంటాయన్నారు. కేటాయించిన పనులు ఒక సంవత్సరంలో పూర్తి చేయాలని, ఆ తర్వాత, కాంట్రాక్టర్ 10 సంవత్సరాల పాటు ఆ రహదారులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ రహదారుల వెంట అభివృద్ధి చేయబడే ప్రకటనలు (Advertisements), ఇతర ఆదాయ మార్గాల ద్వారా వచ్చే రాబడిని వార్షిక చెల్లింపుల (Annuity Payments)కు సర్దుబాటు చేయబడుతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (APUIAML) జీవీఎంసీకి లావాదేవీల సలహా (TransactionGood Advisory), స్వతంత్ర ఇంజనీర్ కన్సల్టెన్సీ సేవలను అందిస్తుందన్నారు. ఎంపిక చేసిన రహదారులు జోన్ – 2 లో 31.61 కి.మీ., జోన్ – 3 లో 14.24 కి.మీ., జోన్- 4 లో 8.65 కి.మీ.,జోన్-5 లో 3.70 కి.మీ.,జోన్- 6 లో 30.15 కి.మీ. మొత్తంగా 88.35 కి.మీ ఆన్యూటీ పే అవుట్ మోడల్ లో అభివృద్ధి చేయబడతాయని, ముఖ్యమంత్రి ఆదేశం మేరకు ప్రధాన రహదారుల నిర్వహణను హైబ్రిడ్ వార్షిక చెల్లింపు నమూనా కింద చేపట్టాలని నిర్ణయించడమైనదని జీవీఎంసీ కమిషనర్ తెలిపారు.

విశాఖపట్నం

కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోట్స్ ను రద్దు చేయాలి*

*కార్మిక హక్కులు కాలరాసే నాలుగు లేబర్ కోట్స్ ను రద్దు చేయాలి* *ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ డిమాండ్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * ఉదయం 11 గంటలకి అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో లలిత జ్యువెలరీ వద్ద నుండి కేంద్ర ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా, కార్మిక వర్గానికి ద్రోహం చేసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోట్స్ రద్దు చేయాలని, కార్పొరేట్ ప్రయోజనాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొడుతూ కార్మిక ప్రదర్శన నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ గారు ప్రసంగిస్తూ నేడు దేశవ్యాప్తంగా కార్మిక హక్కులను కాలరాసే విధంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు జరుగుతున్నాయని తెలియజేస్తూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన 11సంవత్సరాల కాలంలో అదాని, అంబానీ సేవలో ఉంటూ కార్పొరేటు సంస్థలకు పెద్దపీట వేస్తూ వారి మోచేతి నీళ్లు తాగే విధంగా నరేంద్రమోడీ వ్యవహరిస్తూ కార్మికు వర్గానికి ద్రోహం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు . గత 5 సంవత్సరాల నుండి కార్మికులకు దేశవ్యాప్తంగా లేబర్ కోట్స్ రద్దు కొరకు పోరాడుతున్న కేంద్ర ప్రభుత్వం కార్మికు వర్గాన్ని యజమానులకు ఊడిగం చేసే లేబర్ కోట్స్ దేశవ్యాప్తంగా అమలయ్య విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడానికి తీవ్రంగా తప్పుపట్టారు. స్వతంత్రం రాక పూర్వం నుంచి ఈ దేశంలో ఉన్న 44 కార్మిక చట్టాల్ని కార్మిక వర్గం ప్రాణ త్యాగాలు చేసి అనేక ఉద్యమాల ద్వారా సంపాదించుకున్న చట్టాలను ఈరోజు మోడీ రద్దు చేయడం అంటే కార్మికు వర్గానికి ద్రోహం చేయడం తప్ప మరి ఒకటి కాదని తెలియజేశారు. లేబర్ కోట్స్ అమలు అయితే యజమానుల ఇష్టారాజ్యంగా ఉంటాదని ఎప్పుడు బడితే అప్పుడు పని నుండి తొలగించే హక్కు పూర్తిగా వారికి వస్తాదని అన్నారు . కార్మికులు సమ్మె చేయడానికి వీలులేదని, సమస్యలపై ఆందోళనలో చేసే హక్కు లేదని , ప్రశ్నించే హక్కు కోల్పోతారని 8 గంటల పని దినాన్ని 12 గంటలు పెంచుతారని ఈ లేబర్ కోడ్స్ చెబుతున్నాయని అన్నారు. కార్మికులు సమస్యలపై సమ్మెలో నిర్వహిస్తే జైలు శిక్షలు విధించే విధంగా ఈ లేబర్ కోట్స్ ఉన్నాయని అన్నారు . దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్స్ రద్దు కొరకు పోరాటాలు ఉద్యమాలు నిర్వహించడం ద్వారా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ, జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఎం మన్మధరావు జి.ఎస్.జే అచ్యుతరావు, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ కే ఎస్ వి కుమార్, ఐ ఎన్ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగభూషణం, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీఐఎఫ్టియు జాతీయ నాయకులు కనకారావు గారు, ఏ సి సి టి యు కార్యదర్శి వాసుదేవరావు, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ, కే సత్య ఆంజనేయ, సీఐటీయూ నాయకులు జగన్, మని , ఏఐటియుసి కార్యదర్శి జి వామనమూర్తి సిహెచ్ కాశి బాబు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం…

గాజువాక: నవంబర్ (పున్నమి ప్రతినిధి) మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి పుణ్యదినం సందర్భంగా పాత కర్ణవానిపాలెం రామాలయంలో కళ్యాణ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ మంగళవారం వైభవంగా జరిగింది. పల్లకిపై స్వామివారిని సుందరంగా అలంకరించి వేదఘోషాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో కర్ణం నరసింగరావు, జ్యోతి దంపతులు, శ్రీనివాసరావు, రూప దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు, గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం నరసింగరావు మాట్లాడుతూ హిందూ ధర్మంలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు అపారమైన శక్తి, మహిమ ఉందని తెలిపారు. స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి శుభఫలితాలు లభిస్తాయని అన్నారు. పిల్లలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా, చదువులో వెనుకబడి ఉన్నా సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తే ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. మా ఆలయంలో షష్ఠి పర్వదినానికే కాకుండా స్వామివారి ప్రతిష్టా దినానికీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆరవెల్లి రవికుమార్ శాస్త్రి ఆధ్వర్యంలో వేదపండితుల నడుమ కళ్యాణోత్సవం వైభవంగా సాగి అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించడం మా పుణ్యభాగ్యమని భావోద్వేగ స్వరంతో నరసింగరావు తెలిపారు. కార్యక్రమంలో సిరశపల్లి అప్పారావు, బీజేపీ నేతలు అశోక్, రంగానాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం కింగ్ జార్జ్ ఆసుపత్రి లో 76వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు .

*విశాఖపట్నంనవంబర్ పున్నమి ప్రతినిధి * ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం కింగ్ జార్జ్ ఆసుపత్రి లో 76వ రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు . సూపరింటెండెంట్ డాక్టర్ డా.ఐ. వాణి భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యాంగం వలన మనకు న్యాయము స్వచ్ఛ హక్కు సామాజిక ఆర్ధిక రాజకీయ న్యాయము జరుగుతుంది అని ఆ హక్కులను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. మన రాజ్యాంగం అమలు అయి నేటికి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ సంవత్సరం మొత్తం కూడా “హమారా సంవిధాన్ హమారా స్వాభిమాన్”. “మన రాజ్యాంగం – మన గౌరవం” కార్యక్రమాన్ని దేశం మొత్తం అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో కె.జి. హెచ్. సూపరింటెండెంట్ డా.ఐ.వాణి తో పాటు అడ్మినిస్ట్రేటర్ బి.వి.రమణ, సి.యస్.ఆర్.ఎమ్.ఓ. డా.యు. శ్రీహరి, డిప్యూటి సూపరింటెండెంట్ డా.జి.వాసవిలత, ఆర్.ఎమ్.ఓ. లు డా.ఏ. రాజేష్, డా.బి. బంగారయ్య, యస్. చంద్రబాబు నాయుడు, నర్సింగ్ సూపరింటెండెంట్ సి. హెచ్. పద్మావతి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డా.బి. కిరణ్ కుమార్, అసిస్టెంట్ డైరక్టర్ బి.యస్.సుమతి, మేనేజర్ ఐ.వి. శ్రీనివాసాచారి, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రభాకర్, ఇతర మినిస్టీరియల్ సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది. నర్సింగ్ విధ్యార్థులు మరియు ఇతర కె.జి.హెచ్. సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ను జీవీఎంసీకి అప్ప‌గించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తాం*

*మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ను జీవీఎంసీకి అప్ప‌గించేలా ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదిస్తాం* * *ఏపీ శాస‌న స‌భా అంచ‌నాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు* *విశాఖపట్నం, న‌వంబ‌ర్ పున్నమి ప్రతినిధి: క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు, అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉండే అంచ‌నాల‌తోనే స‌త్ఫ‌లితాలు సాధించగలుగుతామని ఏపీ శాస‌న స‌భా అంచ‌నాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు తెలిపారు. క‌మిటీ స‌భ్యులు ఏలూరి సాంబ‌శివ‌రావు, నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పి. సూర్యనారాయణ రాజు, వరుదు కళ్యాణిల‌తో క‌లిసి బుధ‌వారం ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించిన అనంతరం విసీ హాలులో ఏర్పాటు చేసిన పత్రికా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్సరాల‌లో జిల్లాలో చేప‌ట్టిన అభివృద్ది ప‌నులు, రూపొందించిన అంచ‌నాలు, వ్యయం త‌దిత‌ర అంశాల‌పై క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్, జిల్లా అధికారులతో కలిసి చర్చించినట్లు తెలిపారు. అలాగే మేఘాద్రిగెడ్డ రిజ‌ర్వాయ‌ర్ ప్ర‌స్తుతం ఇరిగేష‌న్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఉంద‌ని, దానికి మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టి జీవీఎంసీకి అప్ప‌గించేందుకు అనుగుణంగా ప్ర‌తిపాద‌న‌లు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్ర‌భుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. స‌భ్యులు ప‌లు అంశాల‌పై స‌ల‌హాలు, సూచ‌న‌లతో పాటు ప్రాజెక్టుల వ్య‌యం, అంచ‌నాల రూప‌క‌ల్ప‌న త‌దిత‌ర అంశాల‌పై వారి అభిప్రాయాల‌ను తెలిపారన్నారు. సంక్షేమానికి, అభివృద్ధికి పెద్ద‌పీట వేస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం పెద్దయెత్తున ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంద‌ని, వాటిని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసేలా అధికారులు కృషి చేయాల‌ని సూచించినట్లు తెలిపారు.* *కమిటీ సభ్యులు వెంకటరావు మాట్లాడుతూ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో బడ్జెట్ అలకేషన్ చేసిందో, ఆయా డిపార్ట్‌మెంట్ల వారీగా రివ్యూ చేస్తూ, ఆ యొక్క లక్ష్యాలు చేరుకోగలిగామా లేదా, ఈ లక్ష్యాలు చేరుకోవాలంటే భవిష్యత్తులో ఎలాంటి మౌలిక వసతులు కల్పించాలి, ఎలాంటి మార్పులు చేయాలనేదాని పై డిపార్ట్‌మెంట్ల యొక్క హెడ్స్‌తో ఒక డీటెయిల్ రివ్యూ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా భవిష్యత్తులో ఆయా డిపార్ట్‌మెంట్ల యొక్క లక్ష్యాలు చేరుకోవడానికి అవసరమైన నిధులు, వాటిని ఖర్చు పెట్టాల్సిన తీరులో తీసుకోవాల్సిన మార్పులు కూడా కొన్ని చర్చించడం జరిగిందిని తెలిపారు. ఆయా జిల్లాలకు ఉన్న ప్రాధాన్యతలు, మేరకు అంటే విశాఖ జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక రకాలుగా మౌలిక వసతుల కల్పనలో కావచ్చు, ఉద్యోగాల కల్పనలో కావచ్చు, అదేవిధంగా పర్యాటక రంగంలో కావచ్చు, ఈ రకంగా అన్ని రంగాలలో సమగ్రంగా అభివృద్ధి చెందుతున్న ఒక పెద్ద మహానగరం. ఇది భారతదేశంలోనే ఒక విశిష్టతను సంతరించుకుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కి ఒక ముఖద్వారంగా పెట్టుబడులకి దీనిని అభివృద్ధి చేయడంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి అవసరాలు వీటికి అవసరం ఉన్నదో కూడా పరిశీలించి, రాబోవు బడ్జెట్‌లో కూడా ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని నివేదికలు ఇవ్వడం ద్వారా విశాఖ జిల్లా మరింత అభివృద్ధి చెందడానికి ఈ కమిటీ కూడా సహకరిస్తుందని తెలిపారు*. *కమిటీ సభ్యురాలు శ్రీమతి వరద కళ్యాణి మాట్లాడుతూ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ జోగేశ్వరరావు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కలిసి విశాఖపట్నం కలెక్టరేట్లో రివ్యూ చేయడం జరిగిందని, 2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవ‌త్సరాల‌లో ఏ ఏ ఎస్టిమేట్స్ ఏ ఏ వర్క్స్ కి ఇచ్చారు అనే దాని మీద రివ్యూ చేయడం జరిగిందన్నారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ వచ్చి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వివరించారని తెలిపారు. ఈ డిస్ట్రిక్ట్స్ కిఏమి అవసరమో అనేది కూడా కలెక్టర్ కమిటీకి వివరించారని, అవన్నీ కూడా మా కమిటీ తరపున ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో విశాఖపట్నం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు*.

విశాఖపట్నం

విశాఖ శ్రీ శారదా పీఠం లో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ శ్రీ శారదా పీఠం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు, ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివార్ల ఆశీస్సులతో శ్రీ శారదా పీఠంలో సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు భక్తి, వైభవాలతో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రతి సంవత్సరం అత్యంత శ్రద్ధతో నిర్వహించే ఈ ఉత్సవాల్లో ఈసారి కూడా భక్తులు అశేషంగా తరలి వచ్చి పాల్గొన్నారు. ఉదయం కార్యక్రమాల్లో భాగంగా శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామివారి పాలకావిడి ఊరేగింపు పీఠ ప్రాంగణంలోని మేధా దక్షిణామూర్తి ఆలయం నుండి ప్రారంభమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వైభవంగా సాగింది. భక్తులు స్వామివారికి అర్పించిన పాలకావిడి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరై “సరవణ భవ” నినాదాలతో ప్రాంతాన్ని మార్మోగించారు. తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకం వైదిక మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు. పంచామృతంతో స్వామివారికి చేసిన అభిషేకం భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. సాయంకాలం శ్రీ వల్లి–దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణోత్సవం వైభవోపేతంగా జరిగింది. మంగళవాయిద్యాలు, వేదపండితుల ఆశీర్వచనాలు, భక్తుల హారతులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. స్వామివారి కల్యాణం దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ఈ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దివ్యానుగ్రహం పొందారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.