Wednesday, 18 March 2026

Blog

కామారెడ్డి

పడిగెల శ్రీను ను ఆశీర్వదించండి. మొరపెట్టుకున్న అభ్యర్థి

కామారెడ్డి, 27 నవంబర్, (పున్నమి ప్రతినిధి) : రామారెడ్డి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతు న్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి న నేపథ్యంలో సర్పంచ్ పదవికి నేడు నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలైంది.ఈ సందర్భంగా అభ్య ర్థి రిటర్నింగ్ ఆఫీసర్‌కు నామినేషన్ పత్రాలు అప్ప గించగా, సంబంధిత అధికారుల సమక్షంలో దాన్ని స్వీకరించారు. అభ్యర్థి సందేశం… గతంలో సర్పంచ్‌గా సేవలందిం చిన తన భార్య శైలజకు గ్రామ ప్రజలు ఇచ్చిన అపారమైన ఆశీర్వాదం, విశ్వాసమే తనకు ప్రేర ణగా నిలిచిందని అభ్యర్థి పేర్కొన్నారు.అదే ఉత్సా హంతో, మాట తప్పకుండా ప్రజలకు అందుబాటు లో ఉంటూ, అభివృద్ధి–సేవలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని పనిచేస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చా రు. ఓటర్లకు పిలుపు రామారెడ్డి గ్రామ ప్రజల ఆశీ స్సులు, మద్దతు లభిస్తే రత్నాకర్ సేటు కొడుకుగా మీ అందరి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, నిరంత రం సేవ చేస్తాను అంటూ ప్రజలను అభ్యర్థి కోరా రు. జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను గెలిచేలా ప్రతి ఓటు అమూల్యమైందని, అభివృద్ధి కొనసాగేందుకు అందరూ సహకరించాల ని గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలు మండలంలో బల్లాహరి ఆధ్వర్యంలో జరిగిన కాంగ్రెస్ సమావేశం

27/11/25 గురువారం మనుబోలు పద్మవతి కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ సుధా రామకృష్ణన్ మేడం పాల్గొన్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జిల్లా రాష్ట్ర పదవుల అప్లికేషన్లను స్వీకరించారు దేశ కాంగ్రెస్ పార్టీ సంకట్ సృజన్ అభియాన్ కార్యక్రమమును ఎఐసిసి చేపట్టిందని ఇందులో భాగంగా నాయకులు ఇచ్చిన అప్లికేషన్లను ఢిల్లీకి పంపడం జరుగుతుందని అక్కడ ఎవరికి అయితే ఎక్కువ మద్దతు ఉంటుందో వారికి పదవులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు బల్ల హరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా రాహుల్ గాంధీ చేపట్టిన ఈ ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని కోరారు ఈకార్యక్రమం లొ ex ఎంపీ చింతమోహన్,DCC తిరుపతి జిల్లా ఇంచార్జి బాల గురవబాబు,Ap,CC అజర్ వర్ మదన్ మోహన్, పాల్ విజయ్ కుమార్, సర్వేపల్లి నియోజకవర్గం ఇంచార్జి బల్ల హరి, KKC తిరుపతి ప్రసిడెంట్ కృపానంద్, వెంకటాచలం మండల అధ్యక్షులు నక్కశివ, తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

డుండి రాకేష్ రైల్వే కోడూరు కన్యకా పరమేశ్వరి దేవస్థానం నిర్మాణానికి గాను తనవంతు సాయంగా ఒక లక్ష రూపాయలు తన సొంత నిధులనుండి

పెండ్యాల విజయ్ కుమార్ గారి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన *శ్రీ డుండి రాకేష్ గారు* రైల్వే కోడూరు కన్యకా పరమేశ్వరి దేవస్థానం నిర్మాణానికి గాను తనవంతు సాయంగా ఒక లక్ష రూపాయలు తన సొంత నిధులనుండి విరాళంగా ప్రకటించడం జరిగింది. దీనికిగాను మన కోడూరు ఆర్యవైశ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. వారిని మన కోడూరుకి కి తీసుకు వచ్చిన మన నూతన ఆర్యవైశ్య అధ్యక్షులు పెండ్యాల విజయకుమార్ గకి ధన్యవాదములు.

ఎన్ టి ఆర్ జిల్లా

పునాదిపాడు గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం…

పునాదిపాడు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం 1,2 యూనిట్స్ వారు 27-11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, దానితోపాటు , ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, మరియు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని నిర్వహించి దాని వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరo.

కంకిపాడు మరియు పునాదిపాడు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ విభాగం 1,2 యూనిట్స్ వారు 27-11 -2025 వ తేదీన కంకిపాడు మరియు పునాదిపాడు గ్రామంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, దానితోపాటు , ఎయిడ్స్ పై అవగాహన కల్పించే విధంగా ర్యాలీని, మరియు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని నిర్వహించి దాని వల్ల కలిగే నష్టాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. కె.సరళ, శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

విశాఖపట్నం

జబ్బరితోట వద్ద సామాజిక భవనాన్ని ప్రారంభించిన నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*37 వార్డు , జబ్బరితోట వద్ద సామాజిక భవనాన్ని ప్రారంభించిన నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిందన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *నియోజకవర్గంలో అన్ని వార్డులలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపిన ఎమ్మెల్యే* ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రథమ కర్తవ్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు 37 వ వార్డు పరిధిలోని జబ్బరితోట వద్ద సుమారు 42 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మించిన సామాజిక భవనం రెండవ అంతస్తు ను దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ చెన్న జానకిరామ్ లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పన ప్రధమ కర్తవ్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతుల పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు చేరువులో ఉంటుందన్నారు. ప్రజలకు మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీలకతీతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జబ్బర తోటలోని ప్రజల అవసరాల మేరకు సామాజిక భవనాన్ని కి అదనపు అంతస్తు నిర్మించి నేడు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, జబ్బరి తోటలో సామాజిక భవనాన్ని ప్రారంభించి ఇక్కడ ప్రజలకు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, జీవీఎంసీ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటేశ్వరరావు, సహాయక ఇంజనీరు, సచివాలయం కార్యదర్శులు, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి గారు స్థానిక కూటమి నేతలు శ్రీ గరికిన రవి గారు, శ్రీ చిన్న గారు, తాతలు మాస్టర్, శ్రీ తాతాజీ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ తాతారావు గారు, పెద్దయ్య గారు, కే ఎఫ్ రాజు, అయ్యప్ప గారు, పలువురు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఐదవ వార్డు లో యూజిడి సమస్యకు పరిష్కారం*

*ఐదవ వార్డు లో యూజిడి సమస్యకు పరిష్కారం* *సుమారు రూ.3 కోట్ల నిధులతో రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలలో యూజీడి పనులకు శ్రీకారం.* *_5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత_* *మధురవాడ* విశాఖ పున్నమి ప్రతినిధి: జీవీఎంసీ ఐదవ వార్డ్ పరిధిలోగల రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలలో యూజీడి సమస్య శాశ్వత పరిష్కారానికై సుమారు మూడు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఐదవ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు మొల్లి హేమలత అన్నారు. అందులో భాగంగా ఈరోజు ఆ పనులకు కార్పొరేటర్ హేమలత భూమి పూజ చేసి ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ హేమలత మాట్లాడుతూ వార్డు లో యూజీడి సమస్య చాలా ఎక్కువగా ఉందని, దశాబ్దాలుగా ఇక్కడ ప్రజలు ఆ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ యుజిడి సమస్యను పరిష్కరించాలని చాలా సార్లు జివిఎంసి కౌన్సిల్ సమావేశాలలో మాట్లాడడం జరిగిందని,గత ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో చాలా అలసత్వంగ ఉండడం వలన అప్పుడు ఈ సమస్య పరిష్కారం కాలేదని, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ సమస్యపై జీవీఎంసీ కౌన్సిల్ ద్వారా మేయర్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లానని అలాగే స్థానిక శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు సహకారంతో ఈరోజు వార్డులో యూజిడి సమస్య పరిష్కారానికై సుమారు 6 కోట్ల నిధులు మంజూరయ్యాయని, అందులో భాగంగా మొదట విడతగా రాజీవ్ గృహకల్ప, వైయస్సార్ కాలనీలో సుమారు మూడు కోట్ల నిధులతో పనులు ప్రారంభించమని, మిగిలిన పనులు కూడా తొందరగానే ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,వాండ్రాశి అప్పలరాజు, ఈగల రవికుమార్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్, కొండపూ రాజు, వంకా నూకరాజు, శ్రావణ్, చక్రీ,నాగేశ్వరరావు, రామునాయుడు,రమేష్, ఇమందిరాజు ,ప్రమీలదేవి,కృష్ణవేణి, మాధవ,రాంబాబు, రవీంద్ర,మోహన్, హరికృష్ణ,లక్ష్మీనారాయణ, అప్పారావు, వాయుకుమార్ సచివాలయ కార్యదర్శులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ల ద్వారా బీఎల్వోల‌కు అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి*

*ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ల ద్వారా బీఎల్వోల‌కు అన్ని విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాలి* *రాష్ట్ర ప్ర‌ధాన‌ ఎన్నిక‌ల అధికారితో వీడియో కాన్ఫరెన్స్ అనంత‌రం అధికారుల‌ను ఆదేశించిన జిల్లా క‌లెక్ట‌ర్ *విశాఖ‌ప‌ట్ట‌ణం పున్నమి ప్రతినిధి * కేంద్ర‌, రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ల ఆదేశాల మేర‌కు చేప‌ట్టే అన్ని ర‌కాల ప్ర‌క్రియ‌ల‌పై, అంశాల‌పై బీఎల్వోలు స‌మ‌గ్ర అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని, ఆ మేర‌కు ఈఆర్వోలు, ఏఈఆర్వోలు క్ర‌మం త‌ప్పకుండా శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారి నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్లో స్థానిక క‌లెక్ట‌రేట్ వీసీ హాలు నుంచి భాగ‌స్వామ్య‌మైన క‌లెక్ట‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం జిల్లాకు సంబంధించిన అన్ని అంశాల‌ను వెల్ల‌డించారు. ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ‌, పోలింగ్ స్టేష‌న్ల రేష‌న‌లైజేష‌న్, మ్యాపింగ్ ప్ర‌క్రియ‌లు, ఇత‌ర అంశాల‌పై నియోజ‌క‌వ‌ర్గ‌, మండ‌ల‌, గ్రామ స్థాయి అధికారుల‌కు శిక్ష‌ణ స‌ద‌స్సులు నిర్వ‌హించి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నామ‌ని చెప్పారు. తాజాగా ఈ నెల 25వ తేదీన బీఎల్వోల‌కు శిక్ష‌ణ అందించామ‌న్నారు. ఎప్పుడొచ్చిన ద‌ర‌ఖాస్తుల‌ను అప్పుడే ప‌రిశీలించి త‌గిన చ‌ర్య‌లు చేప‌డుతున్నామ‌ని, పెండింగ్ లేకుండా చూసుకుంటున్నామ‌ని చెప్పారు. జిల్లాలో ఒక ఈఆర్వో, ఒక ఏఈఆర్వో స్థానాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంద‌ని సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. వీసీ అనంత‌రం జిల్లా అధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన క‌లెక్ట‌ర్ ప‌లు అంశాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. రాబోయే అవ‌స‌రాల‌ను, జాబితా స‌వ‌ర‌ణ, మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ఇప్ప‌టి నుంచే అంద‌రూ స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని సూచించారు. ప్రీ ఎస్.ఐ.ఆర్. నేప‌థ్యంలో 2002 జాబితాను 2025 ఓట‌ర్ల జాబితాతో స‌రిచూసి ప‌రిశీలించాలని చెప్పారు. ఓట‌ర్ల మ్యాపింగ్ ప్ర‌క్రియ‌ను స‌జావుగా, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు వీలుగా ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక చేసుకోవాల‌న్నారు. రోజుకో గంట స‌మయం కేటాయించాల‌ని, బీఎల్వోల‌కు క్ర‌మం త‌ప్ప‌కుండా శిక్ష‌ణ‌లు ఇస్తూ అన్ని విష‌యాల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఈఆర్వోలు, ఏఈఆర్వోల‌కు సూచించారు. బీఎల్వోలు క‌చ్చితంగా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించాల‌ని, మ్యాపింగ్ ప్ర‌క్రియ‌లో స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, ఏఎన్ఎం, ఆశా కార్య‌క‌ర్త‌లు, పోస్ట‌మెన్ల స‌హ‌కారం తీసుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఎక్క‌డైనా బీఎల్వోలు లేక‌పోతే వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈఆర్వోల‌ను ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎల‌క్ష‌న్ డీటీలు, ఎల‌క్ష‌న్ సెల్ అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మొదటి గురువారం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు*

*శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి మొదటి గురువారం పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, పద్మజ దంపతులు* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * * వైభవంగా ప్రారంభమైన మొదటి గురువారం పూజా కార్యక్రమం * అమ్మవారి గర్భాలయంలో పంచామృతాలతో మొదటి గురువారం పూజ ప్రారంభించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ దంపతులు * పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ ఈవో, ఉత్సవ కమిటీ సభ్యులు ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో తొలి గురువారం పూజలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజా దంపతులు పంచామృత అభిషేకాలతో పూజలు ప్రారంభించారు. ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి మరియు ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పూజ అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న మండపంలో ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదములు అందజేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేశారని మొదటి గురువారం అధిక సంఖ్యలో భక్తులు వస్తారని ముందు జాగ్రత్తతో అధికసిబ్బంది తో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేసామని తెలిపారు . కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక కార్పొరేటర్ , కూటమి నేతలు, పోలీసు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రాజ్యాంగ దినోత్సవం వేడుకలు ఘనంగా

వెంకటాచలం నవంబరు (పున్నమి ప్రతినిధి) వెంకటాచలం మండలం పూడిపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు డేవిడ్, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి, సత్య ప్రియ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా డా. బి.ఆర్. అంబేద్కర్ చిత్రానికి పూలదండ అర్పించి ఆయన చేసిన రాజ్యాంగ సేవలను స్మరించారు. అనంతరం సిబ్బంది, విద్యార్థులు కలిసి రాజ్యాంగ పీఠికను వాచించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డేవిడ్ మాట్లాడుతూ రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుతో ప్రారంభమైన రచనా ప్రక్రియ 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు సాగి, 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిందని, 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వర రెడ్డి విద్యార్థులు రాజ్యాంగ విలువలను ఆచరించి ఆదర్శ పౌరులుగా ఎదగాలని సూచించారు. తరువాత వక్తృత్వ, క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. మిఠాయిలు పంచి, జాతీయ గీతంతో కార్యక్రమం ముగిసింది. ఉపాధ్యాయులు కొమ్మల కృష్ణయ్య, శ్రీలక్ష్మి, సుమన్ బాబు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.