Wednesday, 18 March 2026

Blog

ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో ‘రైతన్న… మీ కోసం ‘

సిఎస్ పురం: పెద్దగోగులపల్లి, ఆర్ కె. పల్లి, కంభంపాడు గ్రామల్లో రైతన్న మీకోసం కార్యక్రమాన్ని మండలం వ్యవసాయ అధికారి పి. మధుబాబు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ప్రతి రైతు ఇంటిని సందర్శించి ముఖ్యమంత్రి సందేశాన్ని రైతులకు వివరించాలని తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల గురుంచి వివరించారు. అన్నదాత సుఖీభవ పిఎమ్ కిసాన్ పథకం మరియు నీటి భద్రత, డిమాండ్ ఆదారిత పంటలు, అగ్రిటెక్, పుడ్ ప్రాసెసింగ్ గురుంచి రైతులకు వివరించారు.

హెల్త్ టిప్స్

పన్ను ఊడిపోయిందా? డెంటల్ ఇంప్లాంట్ అవసరం లేదు!

ఊడిపోయిన దంతాల ప్లేస్లో కొత్తవి వచ్చే విధంగా దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు బయోయాక్టివ్ ప్యాచ్ను ఆవిష్కరించారు. ఇది కృత్రిమ దంతాలకు ప్రత్యామ్నాయంగా దవడలోని స్టెమ్ సెల్లను చురుకుగా మారుస్తుంది. ఇది పూర్తి దంత నిర్మాణాన్ని సహజంగా పెంచుతుంది. పన్ను పోయిన చోట ఈ ప్యాచ్ను అమర్చితే చిగుళ్లలోపలి నుంచి కొత్త పన్ను వస్తుంది. మానవులపై జరిపే క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే ఎంతో మందికి ఇది ఉపయోగపడనుంది.

తెలంగాణ

నల్గొండ కలెక్టరేట్ కు వచ్చిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను చేసినట్టు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాటి, నల్గొండ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలిగా నియమితులైన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కొర్రా లక్ష్మికి వివరించారు. గురువారం గ్రామపంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కొర్ర లక్ష్మీ నల్గొండ కలెక్టరేట్ కు రాగ జిల్లా కలెక్టర్ పూల మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల పరీశీలకురాలు కొర్ర లక్ష్మి, జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ లతో కలిసి నార్కెట్ పల్లి గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాన్ని, అనంతరం చిట్యాల మండలంలో వెలిమినేడు గ్రామ సచివాలయంలో ఏర్పాటుచేసిన క్లస్టర్ నామినేషన్ కేంద్రాలను అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు.

అన్నమయ్య

మహోత్సవానికి ముస్తాబైన దర్గా :- కుల మతాలకతీతంగా ఉరుస్ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే :- సయ్యద్ అమీర్

నాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని అరవపల్లి శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖాదర్‌వల్లి వాలి దర్గా షరీఫ్ లో ప్రతి సంవత్సరం భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఉరుస్ మహోత్సవం ఈ నెల 28, 29 నవంబర్ 2025 తేదీల్లో ఘనంగా జరగనుంది. మహోత్సవాన్ని పురస్కరించుకుని దర్గా పరిసరాలు పండుగ వాతావరణంలో ముస్తాబయ్యాయి. వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి దర్గా కమిటీ సభ్యుడు సయ్యద్ అమీర్ మాట్లాడుతూ, “ఈ పవిత్ర ఉరుస్ మహోత్సవం కులమతాలకి అతీతం.ప్రేమ,శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే ఈ దర్గా శరీఫ్‌కు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే.ఏ మతానికి చెందినవారైనా భక్తిశ్రద్ధలతో వచ్చి పాల్గొని దర్గా దీవెనలు పొందాలని కోరుతున్నాము” అన్నారు. మహోత్సవ కార్యక్రమాలు 28-11-2025 శుక్రవారం మహోత్సవ ప్రారంభం ప్రత్యేక ప్రార్థనలు గంధము కార్యక్రమము దర్గా వద్ద దువా 29-11-2025 శనివారం ఫతేహా సజ్జాదానషీన్ సంప్రదాయ కార్యక్రమాలు అన్నప్రసాదాల పంపిణీ భక్తులందరికీ ప్రత్యేక ప్రార్థనలు మహోత్సవానికి సంబంధించి వైద్య సేవలు, నీటి సదుపాయం,విద్యుత్, భక్తులకోసం ప్రత్యేక ఆసనాలు, పార్కింగ్ వంటి ఏర్పాట్లను స్థానిక కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు.పెద్దఎత్తున భక్తులు పాల్గొనే అవకాశముండడంతో భద్రతా ఏర్పాట్లు కూడా బలోపేతం చేసినట్లు కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షుడు కమల్ భాష మాట్లాడుతూ “మనందరం శాంతి, సామరస్యం,ప్రేమతో కూడిన సమాజ నిర్మాణానికి అంకితమైన వారము అని.ఈ ఉరుస్ మహోత్సవం కూడా అదే సందేశాన్ని అందిస్తుంది అని.అందువల్ల ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి తప్పకుండా పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేయాలి” అని తెలిపారు.

అన్నమయ్య

గుండ్లూరులో నిశ్చితార్థ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని గుండ్లూరు గ్రామంలో ముమ్మడి కృష్ణారెడ్డి కుమార్తె తేజస్వి నిశ్చితార్థ వేడుక బుధవారం ఘనంగా నిర్వహించారు.గ్రామంలో పండుగ వాతావరణాన్ని తలపించేలా కుటుంబ సభ్యులు,బంధువులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను రంగులద్దారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు.నూతన జీవితం ఆరంభిస్తున్న జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. అనంతరం గ్రామ ప్రజలతో ఆత్మీయంగా పలకరించారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు మదన్ మోహన్ రెడ్డి,మండెం నాగరాజు, టిడిపి దళిత నాయకుడు సాతపల్లి వెంకీ, పార్టీ కార్యకర్తలు,స్థానిక నాయకులు తదితరులు పాల్గొని వేడుకకు ప్రత్యేక శోభను తీసుకువచ్చారు.

అన్నమయ్య

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్‌ విడుదల – కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాల రూపకల్పనలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్‌ ఫార్మేషన్‌ ఆక్ట్‌, 1974 ప్రకారం విడుదల చేసిన ఫార్మ్–1 నోటిఫికేషన్ ద్వారా పలు మండలాల భౌగోళిక పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలు గెజిట్‌లో పేర్కొంది.ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి వేగవంతం చేసే లక్ష్యంతో కొత్త జిల్లా/రెవెన్యూ డివిజన్‌ల ఏర్పాటు మరియు కొన్ని మండలాల బదిలీలు ప్రతిపాదించబడుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోకి చేరనున్న మండలాలు గెజిట్‌ ప్రకారం వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి క్రింది మండలాలు అన్నమయ్య జిల్లాలోకి చేర్చేందుకు ప్రతిపాదించారు:అందులో 1 ఒంటిమిట్ట మరియు2. సిద్ధవటం ఉన్నాయి. మదనపల్లె కొత్త జిల్లా ప్రతిపాదన ప్రభుత్వం జారీ చేసిన షెడ్యూల్–II ప్రకారం మదనపల్లెను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసే ప్రతిపాదనను కూడా ప్రస్తావించింది. ఈ కొత్త జిల్లాలో కలుపబోయే మండలాలు:మదనపల్లె,రామసముద్రం,తంబల్లపల్లె,ములకలచేరువు, పెద్దమండ్యం,కురబలకోట,పెద్ది తిప్ప సముద్రం, బిరంగీ కోతకోట,చౌడేపల్లె, పుంగనూరు,సోదుం,సోమల, పీలేరు(కొత్త డివిజన్‌ హెడ్‌క్వార్టర్‌) ప్రతిపాదన)గుర్రంకొండ, కలకాడ,కలికిరి, కంభంవారి పల్లె,కల్లూరు,వాల్మీకి పురం,ఈ మండలాలులో కొన్నింటిని చిత్తూరు,పలమనేరు, రాయచోటి,అన్నమయ్య జిల్లాలకు పునర్విభజించే అంశాలు కూడా నోటిఫికేషన్‌లో ఉన్నాయి. అభ్యంతరాల ఆహ్వానం ఈ ప్రతిపాదనలపై జిల్లాలో నివసించే ప్రతి వ్యక్తి నుంచి అభ్యంతరాలు, సూచనలు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.అభ్యంతరాలు 30 రోజుల్లోగా ఆయా కలెక్టర్లను లిఖితపూర్వకంగా సంప్రదించాలని గెజిట్‌లో పేర్కొంది.ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ పునర్వ్యవస్థీకరణలు అమల్లోకి వస్తే,జిల్లాల పరిపాలన మరింత సమర్థవంతం అవుతుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కామారెడ్డి

ఆశీర్వదించండి….. అభివృద్ధి చేసి చూపెడుతా

కామారెడ్డి, 27నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి గ్రామంలో రాజకీయ రంగంలో నూతన సంచలనం ఎంపికైంది. యువ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షల పల్లకీలో తొలిసారి సర్పంచ్ బరిలో నిల పడుతున్న బండి ప్రవీణ్, తన వర్గం ప్రజలతో బారి ఎత్తున ఘనంగా నామినేషన్ వేసి, గ్రామ ప్రజలను ముందుంచి ఆయన సంకల్పం స్పర్శిస్తూ అందరి హృదయాలను వ్యాపింపజేశారు. ప్రతి గ్రామ అభి వృద్ధికి నేనే అందిస్తున్న వాగ్దానం..ప్రజల సమస్య ల పరిష్కారమే నా తొలి ధ్యేయం అని బండి ప్రవీణ్ గర్వంగా ప్రకటించారు. సర్పంచ్ గా ఎన్నికై తే గ్రామంలో ప్రగతికి నూతన రీతిని తీసుకురా నున్నట్టు,మాత్రమేగాక పోలిక నాయకత్వం చూపిం చి మంచి పరుపు పెట్టే బట్టి పంట లాతన సామ ర్థ్యాన్ని చాటుకునేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రక టించారు.ఈ తొలి అడుగులోనే ప్రజల విశ్వాసం గెలుచుకున్న ఆయన నా మాటలు వాగ్దానం మాత్ర మే కాదు, నమ్మకపు మూలస్తంభమే అనిచెబుతుం డడం, గ్రామ విధులను శీఘ్రమే మోడర్న్ మర్కెట్ సొల్యూషన్స్ తో మార్చేందుకు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ప్రతి వర్గానికీ స్వేచ్ఛ, సమ్మత, బలమైన ప్రతినిధిగా నిలబడే ధైర్యం ఆయన చూ పించి, రామారెడ్డిని జిల్లాలో అభివృద్ధి తుపాకీగా మారబోతున్న యువ నాయకుడిగా భావిస్తున్నా రు.ఈ నూతన రాజకీయ విజయం బండి ప్రవీణ్ కి మాత్రమే కాకుండా గ్రామ ప్రజలకు కొత్త ఆశావహా ల వెలుగులు నింపుతూ, రాజకీయాల్లో రాజకీయ కవచాల కదళికను తీసుకువస్తున్నట్లుగా ఈ ఉద్య మం గ్రామస్థాయిలో క్రాంతికారి మార్పును సూచి స్తోంది. రామారెడ్డి యువ నాయకుడు బండి ప్రవీణ్ అద్భుతంగా ఊరేగిన ఈ ప్రయత్నం అందరి అభి మానాన్ని అభిమానించుకుం టోంది.భవిష్యత్తులో సాధించబోయే విజయం ఈ సర్పంచ్ పోటీకి మాత్రమే పరిమితమవ్వదు, అది గ్రామాల అభివృ ద్ధికి మిగిలిన ప్రతి హృదయానికీ ప్రేరణగా నిలవ నుందని స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీ బండి ప్రవీణ్ నేతృత్వంలో రామారెడ్డి గ్రామాల్లో నూతన చైత న్యం పుట్టి, రైతు, యువకులు, మహిళల పక్షంలో అందరికీ ఆదర్శంగా నిలవబోతుంది. అనంతరం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాన్ని అందజేశారు

E-పేపర్

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి: డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 తేది 27-11-2025 పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలి: డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి హైదరాబాద్: నవంబర్ 27 : రాష్ట్రంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ బి. శివధర్ రెడ్డి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై గురువారం నాడు డిజిపి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనరేట్ మినహా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు మొదలుకొని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి శ్రీ బి. శివధర్ రెడ్డి మాట్లాడుతూ… పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికలను నిస్పాక్షికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని,ఆరోపణలకు ఆస్కారం ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో శాంతి భద్రతల అదనపు డిజిపి శ్రీ మహేష్ ఎం భగవత్, మల్టీ జోన్ 2 అడిషనల్ డిజిపి శ్రీ డి.ఎస్. చౌహాన్, మల్టి జోన్ 1 ఐ.జి.పి. శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, ఏఐజీ శ్రీ రమణ కుమార్, లీగల్ అడ్వైజర్ శ్రీ ఇ. రాములు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

దుర్గమ్మ సేవలో జనసేన నేతలు అలయానికి ₹1.16 లక్షల విరాళం

నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డు సభ్యురాలు తంబళ్ళపల్లి రమాదేవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఐటీ చైర్మన్ మిర్యాల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పాటు కుమార్తె సంహిత, అల్లుడు సాత్విక్‌తో కలిసి మంగళవారం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మను దర్శించారు. అమ్మవారి దర్శనా నంతరం వేదపండితులు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వ చనాలు అందించారు. అనంతరం ఆలయ అభివృద్ధి నిమిత్తం ₹1,16,000 విరాళాన్ని సాత్విక్–సంహితలు రమాదేవి సమక్షంలో దేవస్థాన అధికారు లకు అందజేశారు.

కాకినాడ

నన్నయలో ఆల్ ఇండియా బెస్ట్ ఫిజిక్ మెన్ ఛాంపియన్షిప్

డిసెంబర్ 27 నుండి 30 వరకు పోటీలు బ్రోచర్ ఆవిష్కరించిన వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ కాకినాడ జిల్లా, కాకినాడ సిటీ, పున్నమి ప్రతినిది:ఆదికవి నన్నయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ మెన్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ తెలియజేశారు.గురువారం యూనివర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్ ను వీసీ ఆవిష్కరించి వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ సహకారంతో నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ మెన్ పోటీలుకు ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వేదిక అవుతుందన్నారు.డిసెంబర్ 27వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఈ పోటీలను నిర్వహించేందుకు కార్యాచరణ ప్రారంభించామన్నారు. దేశం నలుమూలల నుండి బెస్ట్ ఫిజిక్ పోటీలకు క్రీడాకారులు హాజరవుతారని, పోటీలలో పాల్గొనే క్రీడాకారులు డిసెంబర్ 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. ప్రతిభవంతులైన క్రీడాకారులకు నన్నయ విశ్వవిద్యాలయం చక్కని వేదిక అవుతుందని,విశ్వవిద్యాలయం ప్రతిష్టను పెంచే ఈ జాతీయ స్థాయి పోటీలను సమష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ ను సంప్రదించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్, సెక్రటరీ స్పోర్ట్స్ బోర్డ్ ఆచార్య కె.వి.స్వామి, అసోసియేట్ సెక్రటరీ డా.ఎం.వి.ఎస్.ఎస్.మూర్తి, ప్రిన్సిపాల్స్,విశ్వవిద్యాలయ అధికారులు,ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.