Wednesday, 18 March 2026

Blog

తెలంగాణ

ఎన్నికలలో ఏ చిన్న నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలన్న : కలెక్టర్

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని, ఎన్నికలలో ఏ చిన్న నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్గొండ మండలంలోని దండంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు మొదటి విడత నామినేషన్ల స్వీకరణకు శనివారం చివరి గడువు అయినందున ఐదు గంటల లోపు నామినేషన్ కేంద్రంలోకి వచ్చిన వారికి అనుమతి ఇవ్వాలన్నారు. 5 గంటల తర్వాత ఎలాంటి నామినేషన్లను అనుమతించవద్దని నామినేషన్ల సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు.

E-పేపర్

చెడ్డోడు : చెడ్డోడు కదా ఓటు వేయకూడదు అని అనుకోకండి చెడ్డోడైన మంచి చేస్తాడు ఆలోచించి ఓటు వేయండి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 మనోడా : మనోడే కదా ఓటేద్దాం గెలిపిద్దాం అని అనుకోకండి మనోడు చెడు చేస్తాడు, అట్లా అని ఓటు వేయకుండా ఉండకండి ఆలోచించండి . ఆలోచించి ఓటు వేయండి చెడ్డోడు : చెడ్డోడు కదా ఓటు వేయకూడదు అని అనుకోకండి చెడ్డోడైన మంచి చేస్తాడు ఆలోచించి ఓటు వేయండి *చెడు ,మంచి రెండు పక్కన పెడితే మనకు ఓటు కల్పించి రాజ్యాంగం కోసం ప్రాణాలు అర్పించి రాజ్యాంగాన్ని రాసిన వారు మొదటి వ్యక్తి అంబేద్కర్ తర్వాత (అతని సభ్యులు ఉన్నారు ) అలాంటి వారి కోసం ఆలోచించి ఓటు వేసి మన భవిష్యత్తు మనమే కాపాడుకోవాలి *సారా ప్యాకెట్లకు బిర్యానీ బీర్లకు ఆశపడకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి ఓట్లు వేయండి

తెలంగాణ

ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన: కలెక్టర్

నకిరేకల్ : నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృశ్య ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 17 వరకు గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని అప్పటివరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని అందువలన జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

హైకోర్టు ఆదేశాల మేరకు నెల్లూరులో పారా లీగల్ వాలంటీర్లకు శిక్షణ శిబిరం నిర్వహణ

నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి) తేదీ 29/11/2025న హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం నెల్లూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గౌరవనీయులైన జి శ్రీనివాస్ గారు ఈరోజు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ నందు పారా లీగల్ వాలంటరీ లేదా న్యాయ సేవా సహాయకులు మీరు ప్రజలకు సహాయాన్ని అందించడంలో సహాయపడే శిక్షణ పొందిన వాలని తీర్లు ప్రజలకు మరియు న్యాయ సేవలు సంస్థలకు మధ్య వారదులుగా పనిచేస్తారు. పారా లీగల్ వాలంటరీ అంటే ప్రజలకు న్యాయ సహాయం అందించడానికి మరియు న్యాయ సేవలు సంస్థలకు మధ్య గుర్తులుగా పనిచేసే వ్యక్తి వీరు చట్టపరమైన శిక్షణ పొంది సామాన్యులకు న్యాయ సలహాలు ఇస్తారు చట్టపరమైన సహాయం అందజేస్తారు మరియు న్యాయం పొందటంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తారు. మధ్యవర్తులుగా వ్యవహరించి సామాన్న ప్రజలకు మరియు న్యాయ సేవల సమస్యలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి న్యాయం పొందడంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని భావిస్తారు ముఖ్య విధులు 1. సామాన్య ప్రజలకు మరియు న్యాయ సేవలు సంస్థలకు మద్య వారధిగా పనిచేయటం 2. ప్రజలకు చట్టపరమైన సహాయం గురించి అవగాహన కల్పించడం 3. న్యాయం పొందడంలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో సహాయం చేయడం. 4. శరీర మార్గ నిర్దేశం చేయడం ద్వారా న్యాయాన్ని పొందడంలో సహాయం చేయడం. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కే వాణి గారు పారా లీగల్ వాలంటరీ కి ఎలా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముఖ్యపాత్ర వహించాలో వాటి గురించి విసిదీకరించినారు అలాగే ఈ కార్యక్రమంలో అడ్వకేట్ గోపాల్ రెడ్డి గారు కావలి లోకాదాలత్ నెంబర్ ఎం మాలకొండ రెడ్డి గారు వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించినారు.

కామారెడ్డి

సర్పంచ్‌గా కేతావత్ మోహన్ ఏకగ్రీవ విజయం..

కామారెడ్డి, 29 నవంబర్, ( పున్నమి ప్రతినిధి ) : .రామారెడ్డి మండలం గూగుల్ తండాలోయూనియ న్ మాస్ ఏకగ్రీవం ప్రస్తుతం పెండింగ్‌గా ఉంది. ఈయూనియన్ మాస్ అంటే గ్రామంలోని వివిధ కార్మిక సంఘాలు, రైతు సమాఖ్యలు, ఇతర సామూహిక వర్గాలు సమాగమించి వారి హక్కులు, వేతనాలు, సంక్షేమ సమస్యలపై చర్చించే పెద్ద సమావేశం. ఈ సమావేశం ఆలస్యం అవ్వడంలో ప్రధాన కారణం గూగుల్ తండా మరియు సమీప తండాల పెద్దమందుల మనస్పర్థలు, వర్గీయ ఆసక్తుల మిశ్రమం కావడం.ఈ ప్రధాన పెద్దలు, స్థానిక నాయకులు, వర్గాల మధ్య మధ్య సమన్వ యంగాకపోవడంతో సమిష్టిగా ఎలుగెత్తాల్సిన యూనియన్ మాస్ కలుసుకోవడంలో అంతరా యం ఏర్పడింది. దీనివల్ల పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. గ్రామంలోని పేద రైతులు, కార్మికులు దీనివల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామ పెద్దలు తమ స్వంత అభిప్రా యాలు, హితసంబంధాల కారణంగా సమాఖ్య సమావేశాల నిర్వహణలో విరోధ భావాలతో ఉండటం, సమస్యల సమగ్ర పరిష్కారానికి వీలుకావడం లేదంటే స్థానిక వర్గాల అగ్రనేతలు చెబుతున్నారు. అయితే, అందరి కలసి చర్చించి, రైతు సంక్షేమం, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం త్వరగా ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవా ల్సి ఉంది.స్థానిక అధికారులు, పంచాయతీ కార్య దర్శి ఈ మనస్పర్థలను మోటివేట్ చేసి సమన్వ యం సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో యూనియన్ మాస్ ఏకగ్రీవ సమావేశం జరగాలని ప్రజలకు హామీలు ఇచ్చారు.ఇలా గ్రామ పెద్దల మనస్పర్థల వల్ల ఆందోళనకు కారణమైన యూనియన్ సమావేశాలు ఆలస్యం అయినా, త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశ చేస్తున్నారు. దీనితో గూగుల్ తండా గ్రామంలో సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ముందుకు సాగే అవకాశం కలుగుతుంది.

విజయనగరం 

చీపురుపల్లి అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ 33వ జన్మదిన వేడుకలు ఘనంగా

శనివారం చీపురుపల్లి పట్టణంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ 33వ జన్మదిన వేడుకలు వివిధ సేవా కార్యక్రమాలతో, పార్టీ నాయకుల సాన్నిహిత్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం గరివిడిలోని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, రాష్ట్ర శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) కుమార్తె, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డా. బొత్స అనూష ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. తరువాత విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎసి కమిటీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) కార్యాలయంలో, అభిమానులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేకులను కట్ చేశారు. ఆపై బాపూజీ వృద్దాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చీపురుపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారు: చీపురుపల్లి మండల పార్టీ అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాస నాయుడు చీపురుపల్లి పట్టణ పార్టీ నాయకులు ఇప్పిలి గోవిందరావు, మంగళగిరి సుధారాణి, శ్రీనివాసరావు, ఇప్పిలి తిరుమల, కోసిరెడ్డి రమణ చీపురుపల్లి పంచాయతీ కార్యవర్గ సభ్యులు, ఎంపీటీసీలు యువసేన సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెదబాబు కార్యాలయ సిబ్బంది కార్యక్రమం మొత్తం ఉత్సాహభరితంగా జరిగింది.

వనపర్తి

ప్లాస్టిక్ నిషేధం పర్యావరణహితం సెమినార్ లో పాల్గొన్న జిల్లా విద్యాధికారి గని గారు

*ప్లాస్టిక్ నిషేధం.. పర్యావరణహితం… పై సెమినార్* *విద్యార్థులు పర్యావరణ ప్రేమికులుగా భవిష్యత్ తరాలని కాపాడాలి జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘని గారు వెల్లడి* *పున్నమి ప్రతినిధి వనపర్తి జిల్లా తేదీ 29 /11/ 2025* *జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మహాత్మ జ్యోతిరావు బాపూలే చిట్యాల యందు రెండవ రోజు జిల్లా విద్యాధికారి గారు మహమ్మద్ అబ్దుల్ ఘని గారు ప్రారంభిస్తూ విద్యార్థులు ప్లాస్టిక్ ని నిషేధించి భవిష్యత్ తరాలను కాపాడాలని సెమినార్లో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ ఇక్కడ పాల్గొన్న విద్యార్థుల్లో ప్రథమ ద్వితీయ బహుమతులు పొందిన వారిని రాష్ట్రస్థాయిలో పంపడం జరుగుతుందని అందరూ సద్వినియోగం చేసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జడ్జెస్ గా వి శ్రీనివాసులు రిటైర్డ్ ఎంఈఓ పానగల్, శంకరయ్య రిటైర్డ్ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ,ఎంఎన్ విజయకుమార్ సీనియర్ హిందీ పండితులు, గిరి రాజా చారి తెలుగు పండితులు, వ్యవహరించారు, డీఎస్ఓ శ్రీనివాసులు ,సీఎంవో*ప్రతాప రెడ్డి గారు పాల్గొన్నారు*

తూర్పు గోదావరి

దేవోక్తి ఛారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వీల్ చైర్స్ పంపిణీ..

పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు లో దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ వారి సహాయ సహకారములతో కొవ్వూరు లో 80శాతం శరీరం చచ్చుపడిపోయి, నడవలేక పోతున్న రుద్ర వేణి అనే అమ్మాయి కి వీల్ ఛైర్ అందించడం జరిగింది..ఈ కార్యక్రమంలో దేవోక్తి ఛారిటబుల్ సంస్థ చైర్మన్ ప్రత్తి పాటి నాగరాజు, సభ్యులు జోడాల వెంకట్, వీ.టి విల్సన్ రాజు మరియు వై . కే. శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ప్రత్తిపాటి నాగరాజు మాట్లాడుతూ ఆపన్నులకు అవసరమైన సహాయ సహకారములు అందించడానికి దేవోక్తి ఛారిటబుల్ సంస్థ ఎప్పుడూ సన్నద్ధమేనని, ఇప్పటివరకూ 250 మందికి ఆర్టిఫిషియల్ లింబ్స్ ఉచితంగా అందించడం జరిగిందన్నారు..కుత్రిమ అవయవాలు కావలసినవారు తమ సంస్థను సంప్రదించిన వారికి 9391089381 ఉచితముగా అందించడం జరుగుతుంది..

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల NSS ప్రత్యేక శిబిరం ముగింపు….

కంకిపాడు ,పునాదిపాడు గ్రామంలో ఎన్.ఎస్.ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, విజయవాడ ,ఎన్.ఎస్.ఎస్ యూనిట్స్ -1,2 29-11 -2025 వ తేదీన పునాదిపాడు గ్రామంలో అను మై బేబీ హాస్పిటల్, విజయవాడ. గైనిక్ -డాక్టర్. ఎన్. మౌనిక మరియు pediatrician డాక్టర్ రేవంత్ . స్త్రీలకు సంబంధించిన పాప్స్ మేయర్ టెస్టులు ,గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించడం, క్యాన్సర్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించే విధంగా ర్యాలీని,క్లీన్ అండ్ గ్రీన్, సానిటరీ న్స్ అవగాహన కల్పించేలా చెప్పడం, Menstrual Hygien మీద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పునాదిపాడు హైస్కూల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఆరోగ్యం పట్ల, పరిశుభ్రత పట్ల, అవగాహన కల్పించేలా సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ .కె.సరళ శ్రీమతి .టి .నాగరాణి పర్యవేక్షించారు.

జోగులాంబ గద్వాల

గద్వాల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ జోరు ఏకగ్రీవలతో ఫుల్ జోష్ తో ఉన్న గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్లు

గద్వాల్ నియోజకవర్గం లో కాంగ్రెస్ జోరు ఏకగ్రీవలతో ఫుల్ జోష్ తో ఉన్న గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్లు రోజు రోజుకు జిల్లాలో BRS పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితి పోటీ చేయడానికి అభ్యర్థులు లేక అల్లాడి పోతున్న BRS పార్టీ…పోటీ చేసే అభ్యర్థుల కోసం వెతుకులాట మండల స్థాయి లీడర్లు పట్టించుకోకపోవడంతో కార్యకర్తలలో గందరగోళం పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా అధిష్టానం స్పందించి గద్వాల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటున్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.