Wednesday, 18 March 2026

Blog

విశాఖపట్నం

దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి అనిత సమీక్ష*

*దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం మంత్రి అనిత సమీక్ష* *అమరావతి ( విశాఖ పున్నమి ప్రతినిధి):- *:- నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు (శనివారం) సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రతను బట్టి ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రభావిత జిల్లాలను అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలకు ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించాలన్నారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉందని హోంమంత్రికి అధికారులు వివరించారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లతో అనిత ఫోన్లో మాట్లాడారు. ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాను సమాచారాన్ని ఎప్పటికప్పుడు కిందిస్థాయి అధికారులకు, ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్‌లను 24/7 కొనసాగించాలని ఆదేశించారు. విపత్తుల సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రందించాలని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్ళల్లో ఉండే వారిని గుర్తించి ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.అవసరమైతే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. విరిగిన చెట్లు తొలగించడం , విద్యుత్తు అంతరాయం జరిగితే పునరుద్ధరణ పనులు వెంటనే జరిగేలా ఏర్పాటు చేయాలని తెలిపారు. భారీ వర్షాలు కురుస్తున్నపుడు వీలైనంత వరకు ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని హోంమంత్రి సూచనలు చేశారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బలమైన ఈదురుగాలుల వీచేప్పుడు చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండవద్దని ప్రజలు హోంమంత్రి అనిత కీలక సూచనలు చేశారు.

విశాఖపట్నం

KGH లో కార్డియాలజీ విభాగం నందు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసి* *కార్డియాలజీ విభాగంను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*

*KGH లో కార్డియాలజీ విభాగం నందు ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసి* *కార్డియాలజీ విభాగంను సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* *సమాచారం తెలిసిన వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * *ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాము, షార్ట్ సర్క్యూట్ కారణమయి ఉండవచ్చు* *ఎవరికి ఎటువంటి ప్రమాదం లేదు* *భవిష్యత్ లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటాము*. ఈరోజు కార్డియాలజీ విభాగంలో షార్ట్ సర్క్యూట్ జరిగే నేపద్యంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. స్థానిక అధికారులతో మాట్లాడి జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఏదైనా ప్రమాదంలో లోటుపాట్లు ఉంటే తమ దృష్టి కి తీసుకురావాలని సంబంధిత వైద్యాదికారి వాణి గారికి తెలిపారు. వైద్యులు గానీ, సిబ్బంది గానీ నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. వైద్య రంగానికి అనేక విధాలుగా కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తున్నప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలియజేశారు. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమాల్లో స్థానిక నియోజకవర్గ నేతలు జీకే గారు, వార్డు అధ్యక్షురాలు యజ్ఞశ్రీ గారు ఏఎంసీ ప్రిన్సిపాల్ సంధ్యాంగారు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు….

విశాఖపట్నం

పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత*

*పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత* *ఆటోనగర్, మ‌ధుర‌వాడ పార్కుల్లో బ‌స్టాప్ ల‌ ఏర్పాటుకు చ‌ర్య‌లు *డీఐఈపీసీ స‌మావేశంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- పారిశ్రామిక ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చి చ‌ర్య‌లు తీసుకోవాలని, ఆటోన‌గ‌ర్, మ‌ధుర‌వాడ ఇండ‌స్ట్రియ‌ల్, ఐటీ పార్కుల్లో ప‌ని చేసే కార్మికుల సౌక‌ర్యార్థం బస్టాప్ లు ఏర్పాటు చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. శ‌నివారం ఉద‌యం కలెక్టరేట్ మీటింగు హాలులో జ‌రిగిన‌ జిల్లా ఇండస్ట్రియల్ ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశంలో ఆయ‌న ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు. స‌మావేశంలో భాగంగా గతంలోని అజెండా అంశాల‌పై తీసుకున్న చర్యల గురించి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ వి. ఆదిశేషు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లో నెల‌కొల్పిన పారిశ్రామిక ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు, ప‌వ‌ర్ లైన్లు త‌దిత‌ర వ‌స‌తులు క‌ల్పించాల‌ని, వాహ‌నాల ర‌ద్దీ నియంత్ర‌ణ‌కు పోలీసు శాఖ అధికారుల స‌హాయంతో చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. గాజువాక, ఆటోనగర్ వద్ద గల రోడ్ ఓవర్ బ్రిడ్జి(ఆర్.వో.బి.) ప‌నుల్లో వేగం పెంచాల‌ని, జూన్ తొలివారం నాటికి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని ఆర్ & బి అధికారుల‌ను ఆదేశించారు. ఆటోన‌గ‌ర్ బి, డి, బ్లాకుల్లో ప్ర‌మాద‌క‌రంగా కింద‌కు వేలాడుతున్న‌ విద్యుత్ తీగల‌ను స‌రిచేయాల‌ని చెప్పారు. కంచ‌ర‌పాలెం ఇండ‌స్ట్రియ‌ల్ ఎస్టేట్ లో తాగునీటి వ‌స‌తి కోసం ఐలా ఛైర్మ‌న్ నివేదించ‌గా త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జీవీఎంసీ అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. పీఎంఈజీపీలో భాగంగా ఎక్కువ ప్రాజెక్టులు అమ‌ల‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, కొత్త‌గా ప్ర‌వేశ‌పెట్టిన నిబంధ‌న‌ల మేర‌కు ఎల‌క్ట్రిక్ ఆటోలు ఇచ్చే అంశంపై యువ‌తలో ప్ర‌చారం క‌ల్పించాల‌ని, స్వ‌యం ఉపాధి పొందేందుకు దోహ‌ద‌ప‌డాల‌ని ప‌రిశ్ర‌మ‌ల శాఖ అధికారుల‌కు సూచించారు. ఇప్ప‌టికే భూ కేటాయింపులు జ‌రిగిన ప్రాంతాల్లో ఆరు నెల‌ల లోపు ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పాల‌ని, లేదంటే నోటీసులు జారీ చేయాల‌ని ఏపీఐఐసీ అధికారుల‌ను ఆదేశించారు. పీఎం విశ్వకర్మ యోజన పథకం తదితర అంశాలపై సుదీర్ఘంగా చ‌ర్చించిన ఆయన ప‌లు అంశాల‌పై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. నానోపార్కు, ఎంఎస్ఎంసీ పార్కుల‌ ఏర్పాటులో చురుగ్గా వ్య‌వ‌హ‌రించాల‌ని, ఇటీవ‌ల సిన‌ర్జీ అనే కంపెనీలో అనుకోని కార‌ణాల వ‌ల్ల ఉద్యోగాలు కోల్పోయిన బాధితుల‌కు ఎం.ఎస్.ఎం.ఈ. పార్కుల్లో ఉపాధి క‌ల్పించేలా అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. సమావేశంలో ప‌రిశ్ర‌మ‌ల శాఖ జీఎం ఆదిశేషు, ఏపీఐఐసీ జ‌డ్.ఎం. సింహాచ‌లం, ఐలా ప్ర‌తినిధులు, పారిశ్రామ‌క‌వేత్త‌లు, ఇత‌ర విభాగాల‌ జిల్లా అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వార్డు ఆక్సిజన్ టవర్స్ వద్ద కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న – శ్రీ కె.కె రాజు ..*

*విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వార్డు ఆక్సిజన్ టవర్స్ వద్ద కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న – శ్రీ కె.కె రాజు ..* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి * ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 24 వార్డు పరిధి ఆక్సిజన్ టవర్స్ వద్ద SEC మెంబర్ శ్రీ సతీష్ వర్మ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ జరిగింది.ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు..* పాల్గొని విద్యార్థులు, మేధావులు, ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పి. బాలరాజు గారు 24 వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ శ్రీ మతి సాడి పద్మ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెడడా రమణి కుమారి అలంపల్లి రాజుబాబు, పేరాల విజయ్ చంద్ర, శ్రీదేవి వర్మ,24 వార్డు అధ్యక్షుడు అశోక్ రెడ్డి, మరియు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది*

*అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది* – *ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * దక్షిణ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు అయ్యేవిధంగా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలిపారు ఈరోజు జోన్ – 4 కార్యాలయంలో క్షేత్రస్థాయిలో అధికారులు , బ్యాంక్ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ప్రసంగించారు .ఈ సందర్భంగా ఇళ్ల లబ్ధిదారులు బ్యాంక్ అధికారులతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలు సూచనలు చేశారు. బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకు సహకరించి ఋణాలు మంజూరు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపిడి పద్మ, స్థానిక కూటమి నేతలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు….

తిరుపతి

కల్తీ నెయ్యి కేసులో సిట్‌ విచారణ వేగవంతం.

*తిరుమల ( విశాఖ పున్నమి ప్రతినిధి ) తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్‌ విచారణ వేగవంతం.* *తిరుపతి దివ్యదర్శిని న్యూస్* *మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్‌ మెమో దాఖలు.. 11 మంది నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులు.* *2019-24 మధ్య టీటీడీ కొనుగోలు విభాగంలో పనిచేసిన జీఎంలపై కేసు.. జీఎంలతో పాటు సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లపై కేసు నమోదు.* *జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణపై కేసు.. ఎస్వీ గోశాల పూర్వ డైరెక్టర్‌ హరినాథ్‌రెడ్డిపైనా కేసు నమోదు.*

విశాఖపట్నం

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద ప్రజలకు తీవ్ర నష్టం

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద ప్రజలకు తీవ్ర నష్టం – ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయడం వలన పేద ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కో – కన్వీనర్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీన విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం హాలులో ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం వివిధ రాజకీయ పార్టీల, పౌర సంఘాల నేతలతో జరిగింది. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా ఆరోగ్య హక్కును వ్యాపార వస్తువుగా మార్చే ప్రమాదం ఉందన్నారు. ఈ పీపీపీ విధానం వాస్తవానికి ప్రైవేటీకరణకు కొత్త ముసుగు అన్నారు. ఇది అమలు అయితే ప్రజల జీవితం, ఆరోగ్యం, విద్య లాభ వ్యాపారాల బందీలుగా మారిపోతాయన్నారు. పీపీపీ విధానంలో ఉద్యోగుల నియామకాలలో రిజర్వేషన్లు అమలు కావని, సామాజిక న్యాయానికి తిలోద కాలిస్తారని, ఉద్యోగుల నియామకాలలో ప్రభుత్వ పాత్ర ఉండదన్నారు. 10 మెడికల్ కళాశాలలకు చెందిన దాదాపు 600 ఎకరాలు భూమి కొన్ని లక్షల చదరపు అడుగుల నిర్మాణం బడా వైద్య సంస్థలకు అప్పనంగా ఇస్తారని, కేవలం 3 లక్షల ఫీజుతో 66 సంవత్సరాలు మెడికల్ కళాశాలలను ప్రభుత్వ ఆసుపత్రిని ఇస్తారన్నారు. ప్రజల ఆరోగ్యం కార్పొరేట్ లాభాల బానిస అవుతుందన్నారు. ఆరోగ్య వ్యవస్థ మానవత నుంచి వ్యాపార ధోరణికి మారుతుందన్నారు. రాష్ట్రంలో కలిసి వచ్చే రాజకీయ పార్టీలను, పౌర సంస్థలను, విద్యార్థి యువజన సంఘాలను కలుపుకుని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ వి. బాల మోహన దాస్ ప్రసంగిస్తూ విద్య, వైద్యం పూర్తిగా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రజల హక్కు అని చట్టపరంగా ప్రకటించాలన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వ వైద్య రంగానికి కేటాయింపులు పెంచాలని కోరారు. వైద్యరంగం ను వ్యాపార దోపిడి నుండి కాపాడాలన్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రుల కృషి అమోఘమని, ప్రైవేట్ ఆసుపత్రులు ధనార్జన కేంద్రాలుగా మారినాయని గుర్తు చేశారు. దాతల సహకారంతో 10 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టవచ్చునని ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. సిపిఎం సీనియర్ నేత, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరశిoగారావు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ లో గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వ విద్యను, ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. 3లక్షల 50 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 5 వేల కోట్లు 10 ప్రభుత్వ వైద్య కళాశాలలకు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. యోగాంధ్ర లాంటి ఈవెంట్స్ లకు వేలాది కోట్లు ఖర్చు చేస్తుందని, అభివృద్ధి పేరుతో బడా కంపెనీలకు వందలాది ఎకరాలు 99 పైసలకే ధారాదత్తం చేస్తుందన్నారు. పేదలు ఋణ గ్రస్థులవడానికి వైద్యం వ్యయం పెరగడం ఒక కారణమన్నారు. గత 17 నెలలుగా ప్రభుత్వ ఆస్తులను, భూములను, సహజ వనరులను బడా కంపెనీలకు అప్పనంగా ఇవ్వడానికి నేటి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రమేష్ కుమార్, సిపిఐ పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి షేక్ రహమాన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్. సుధాకర్, సిపిఐ (ఎంఎల్) ప్రజా పోరు నేత కె. మహిత, లయన్స్ క్లబ్ పూర్వ గవర్నర్ డా. ఎన్. వి. యన్. దుర్గా ప్రసాదరావు, ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. కామేశ్వరరావు, పౌర గ్రంథాలయ పరిరక్షణ సమితి నేత బి ఎల్ నారాయణ, పీపుల్స్ ఫర్ ఇండియా నేత ఏవి ఆర్.కె మూర్తి, కుల వివక్షత పోరాట సమితి నేత చిరంజీవి, ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి డి. రమణ,విశాఖ జిల్లా నివాస్ అధ్యక్షులు పి. నారాయణ మూర్తి తదితరులు ప్రసంగించారు.

విశాఖపట్నం

విద్యను,వైద్యాన్ని వ్యాపారం చేయొద్దు..*

విద్యను,వైద్యాన్ని వ్యాపారం చేయొద్దు..* *సామాన్య ప్రజలకు ఉచిత వైద్యాన్ని దూరం చేయొద్దు..* *వై.యస్.ఆర్.సి.పి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు..* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * విశాఖపట్నం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో *విశాఖపట్నం వై.యస్.ఆర్ పార్కు ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద – కోటి సంతకాల సేకరణ కార్యక్రమం* జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కెకె రాజు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ దొంగ దెబ్బ కొట్టే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసే విధంగా ప్రజాభిప్రాయం లేకుండా ఒక కుట్రపూరిత నిర్ణయము ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది .. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ కూటం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా శాంతియుత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని అన్నారు ఈ ఉద్యమంలో భాగంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కోటిసంతకాల సేకరణ కార్యక్రమం మహా ఉదృతంగా జరుగుతుంది అని అన్నారు.. ఈ కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి విద్యను ,వైద్యన్ని ,వ్యాపారం చేయొద్దని సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం దూరం చేసే విధంగా వ్యవహరించవద్దని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యురాలు వరుదు కళ్యాణి , సమన్వయకర్తలు మోల్లి అప్పారావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు తైనాల విజయకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ, రాష్ట్ర అనుబంధ విభాగ అధ్యక్షుడు పేర్ల ఖాదర్ భాషా , పేర్ల విజయ్ చందర్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకుటి రామచంద్రరావు , యువజన విభాగం జోన్ అధ్యక్షులు అంబటి శైలేష్, యువజన విభాగం ప్రధాన కార్యదర్శి దొడ్డి కిరణ్, యువజన విభాగం అధికారి మహమ్మద్ ఇమ్రాన్, అనుబంధ విభాగం అధ్యక్షులు పేడాడ రమణి కుమారి , ఏం సునీల్ , పీలా ప్రేమ్ కిరణ్. నీలి రవి, బొండా ఉమా మహేశ్వర్ , పార్టీ నాయకులు అల్లంపల్లి రాజాబాబు, పల్లా దుర్గ, శ్రీనివాస్ గౌడ్, మువ్వల సంతోష్, తుళ్ళి చంద్రశేఖర్, ఉమ్మడి కళ్యాణ్, జగదీశ్ రెడ్డి, భవాని శంకర్. మౌళి , బొట్టారాజు , గాలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

జనసేన అధినేత , శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*జనసేన అధినేత , శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * నేవీ డే ముందస్తు కార్యక్రమంలో భాగంగా సర్గమ్- ఇండియన్ నావల్ సింఫనిక్ ఆర్కెస్ట్రాకు ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు విశాఖ నగరానికి విచ్చేసిన జనసేన పార్టీ అధినేత , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం విమానాశ్రయంలో జనసేన పార్టీ విశాఖపట్నం నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, రూరల్ అధ్యక్షులు ,పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ రమేష్ బాబు గారు, ఇతర ఎమ్మెల్యేలు , జనసేన నేతలు, వీర మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం సముద్రిక లో జరిగిన కార్యక్రమాల్లో గౌరవ డిప్యూటీ సీఎం గారితో పాల్గొన్నారు….

విశాఖపట్నం

గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరగకుండా చూడ వలసిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది పై ఉందని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ అన్నారు.

*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* గర్భిణీ స్త్రీలు ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరగకుండా చూడ వలసిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు,సిబ్బంది పై ఉందని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరీంధిర ప్రసాద్ అధ్యక్షతన మాతృ మరణాల పై డిస్ట్రిక్ట్ మెటర్నిటీ డెత్ సర్వేలేన్స్ మరియు రెస్పాన్స్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2025 నెలలో జరిగిన 2 మాతృ మరణాలు, కణితి ప్రాధమిక ఆరోగ్యకేంద్ర పరిదిలో 1 మాతృ మరణం, నక్కవానిపాలెం పట్టణ ఆరోగ్యకేంద్ర పరిదిలో 1 మాతృ మరణం పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఇకపై మాతృ మరణాలు సంభవిస్తే సంబంధిత అధికారుల పై చర్యలు తీసు కొంటామన్నారు. హై రిస్క్ గర్భిణీలు ప్రసవానికి వస్తే కాలయాపన చేయకుండా వెంటనే వైద్య సహాయం అందించాలని, అవసరమైతే KGH కి గాని VGH కి గాని రిఫర్ చేయాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా .జగదీశ్వరరావు మాట్లాడుతూ ANM, ఆశా కార్యకర్తలు ఆడపిల్లలకు కౌమారదశ నుండి జరిగే మార్పులపై అవగాహన కల్పించాలని, గర్భిణీ స్త్రీలకు గర్బాధారణ నుండి అవగాహన కల్పించాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ముందుగానే గుర్తించి వారికి సమయానికి టీకాలు, పోషకాహారం మొ’’ ఆరోగ్య సేవలను అందేటట్లు చూడాలని తెలియచేశారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీలకు బర్త్ ప్లానింగ్ సక్రమంగా చేయాలని మరియు ఆయా గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య స్థితి పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశoలో డా.శంకర్ ప్రసాద్, DCHS, APVVP, డా.ఉషాప్రసాద్, సూపరింటెండెంట్, VGH, డా.సౌమిని, గైనకాలజిస్ట్, HOD, KGH, డా.ఎన్.వి.సమత, విమెన్ హెల్త్ ఆఫీసర్, డా.రాదాకృష్ణ, జనరల్ మెడిసిన్, KGH, డా.బి.శ్రీనివాసరావు, అనస్తీసియా, డా.షర్మిల, గైనకాలజిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, డా.టివిఎస్ నాయుడు, బ్లడ్ బ్యాంకు, KGH, డా.టి.అప్పారావు, ఎన్టీఆర్ వైద్య సేవ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, శ్రీమతి ఎం.సత్యవతి, DPHNO, ప్రాధమిక, సామజిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.