Tuesday, 17 March 2026

Blog

E-పేపర్

విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేసిన యువకుడు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేసిన యువకుడు సరూర్‌నగర్ పీఎస్ పరిధిలోని కొత్తపేట్ చౌరస్తా వద్ద ఘటన కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి దాడి చేసిన యువకుడు కానిస్టేబుల్ తన ఫోన్ లాక్కొని పగలగొట్టాడని, బండి లాక్కున్నాడని తెలిపిన యువకుడు యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు

విశాఖపట్నం

దాతృత్వానికి మారుపేరు కందుల*

*దాతృత్వానికి మారుపేరు కందుల* *అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు* *పదివేల మందికి చీరలు దుప్పట్లు పంపిణీ* *విందు భోజనాలు.. పసందైన కానుకలు* *ఘనంగా సత్కరించిన పీలా వంశీకృష్ణ శ్రీనివాస్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * ప్రముఖ సంఘ సేవకులు ..జనసేన పార్టీ నాయకులు.. 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు దాతృత్వానికి మారుపేరుగా నిలిచారని జనసేన పార్టీ నాయకులు విశాఖ దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు.. ఆదివారం కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు నేరెళ్ల కోనేరు జంక్షన్ లో ఉన్న ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ నగర మేయర్ పీలా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నిరుపేదలకు నిరంతరం సేవ చేయాలనే మంచి సంకల్పంతో కందుల అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.. పేదలకు అండగా నిలవడంతో పాటు తన పరిధి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయాలుగా నిలుస్తున్నారన్నారు.. నిరుపేదలకు నిత్యవసరాలు.. తోపుడు బండ్లు.. నవవధువులకు నూతన వస్త్రాలు మంగళ సూత్రాలు.. అలాగే వివిధ రకాల శుభకార్యాలకు పట్టుచీరలు దేవాలయాలకు వివిధ రకాల వెండి.. బంగారు వస్తువులు ఇలా లెక్కలేనన్ని సహాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కందుల నాగరాజు కే దక్కుతుందన్నారు. సేవలకు చిరునామాగా నిలిచిన డాక్టర్ కందుల .భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వీరు ఆకాంక్షించారు..32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన పరిధి మేరకు విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.. కులాలకు.. మతాలకు అతీతంగా దక్షిణ నియోజకవర్గం పరిధిలో సాయం కోరేవారందరికీ ఏదో ఒకటి చేయాలనే మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా తన ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.. అలాగే తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించిన ప్రజల ఆకాంక్షల మేరకు తన వార్డు ను పూర్తిస్థాయిలో రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్నట్లు నాగరాజు చెప్పారు.. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని వాటిని కూడా పూర్తి చేసేందుకు సహకరించాలని అతిధులను కోరారు. *10,000 మందికి చీరలు..దుప్పట్లు పంపిణీ* కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఈ ఏడాది అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రధానంగా 10000 మంది నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే తోపుడు బండ్లు అందజేశారు. అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కానుకలు అందజేశారు.. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ఈ పుట్టినరోజు వేడుకలకు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ..జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షత వహించగా కెఎన్ఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు కందుల బద్రీనాథ్ కేదార్నాథ్ పలువురు కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లు.వార్డ్ అధ్యక్షులు.. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు.. అనేకమంది స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు పాల్గొని కందుల నాగరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కందుల దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు..

విశాఖపట్నం

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం .

సోమవారం జివిఎంసి లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం . -విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. -జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * : మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోను, అన్ని జోనల్ కార్యాలయాలలోనూ “ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( Public Grievance Redressal system-PGRS )కార్యక్రమం” 2025 డిసెంబర్ 1 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించబడునని విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పత్రికా ప్రకటన ద్వారా ఆదివారం తెలిపారు. కావున, నగరంలో పారిశుద్ధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, నీటి సరఫరా, వీధి దీపాలు,హారికల్చర్, రెవిన్యూ, యు సి డి, ఇంజినీరింగ్ మొదలగు జీవీఎంసీ విభాగాలకు సంబంధించిన సమస్యలపై డిసెంబర్ 1 వ తేదీ సోమవారం ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో నగర ప్రజలు అర్జీల ద్వారా సమస్యలను తెలియపరుచుకోవచ్చునని నగర ప్రజలకు విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ తెలియచేశారు.

విశాఖపట్నం

దిత్వా తుపానుపై సచివాలయంలో ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుంచి హోంమంత్రి అనిత సమీక్ష.

*అమరావతి (విశాఖ పున్నమి ప్రతినిధి):-* దిత్వా తుపానుపై సచివాలయంలో ఆర్టీజీఎస్ స్టేట్ సెంటర్ నుంచి హోంమంత్రి అనిత సమీక్ష. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు,అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. పాల్గొన్న ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, సీఈఓ ప్రఖర్ జైన్, ఉన్నతాధికారులు. ఈరోజు, రేపు అధికారులు మరింత అలెర్ట్ గా ఉండాలి. క్షేత్రస్థాయిలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. ప్రాణనష్టం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిది. సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు వచ్చే కాల్స్ కు వెంటనే స్పందించాలి. ప్రమాద స్పాట్ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులను నియమించాలని ఆదేశం. జన జీవనానికి అడ్డంకులు కలిగించే విరిగిన కొమ్మలు, హార్డింగ్స్ వంటివి వెంటనే తొలగించే ఏర్పాట్లు చేయాలి. విద్యుత్ అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరణ చేయాలి : హోంమంత్రి అనిత అన్ని ముందస్తూ చర్యలు తీసుకున్నామని తెలిపిన కలెక్టర్లు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏర్పాట్లు చేశామని తెలిపిన కలెక్టర్లు.

విశాఖపట్నం

దాతృత్వానికి మారుపేరు కందుల*

*దాతృత్వానికి మారుపేరు కందుల* *అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు* *పదివేల మందికి చీరలు దుప్పట్లు పంపిణీ* *విందు భోజనాలు.. పసందైన కానుకలు* *ఘనంగా సత్కరించిన పీలా వంశీకృష్ణ శ్రీనివాస్* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* ప్రముఖ సంఘ సేవకులు ..జనసేన పార్టీ నాయకులు.. 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు దాతృత్వానికి మారుపేరుగా నిలిచారని జనసేన పార్టీ నాయకులు విశాఖ దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కొనియాడారు.. ఆదివారం కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు నేరెళ్ల కోనేరు జంక్షన్ లో ఉన్న ఆయన నివాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుట్టినరోజు వేడుకల్లో శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ నగర మేయర్ పీలా శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ నిరుపేదలకు నిరంతరం సేవ చేయాలనే మంచి సంకల్పంతో కందుల అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.. పేదలకు అండగా నిలవడంతో పాటు తన పరిధి మేరకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయాలుగా నిలుస్తున్నారన్నారు.. నిరుపేదలకు నిత్యవసరాలు.. తోపుడు బండ్లు.. నవవధువులకు నూతన వస్త్రాలు మంగళ సూత్రాలు.. అలాగే వివిధ రకాల శుభకార్యాలకు పట్టుచీరలు దేవాలయాలకు వివిధ రకాల వెండి.. బంగారు వస్తువులు ఇలా లెక్కలేనన్ని సహాయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కందుల నాగరాజు కే దక్కుతుందన్నారు. సేవలకు చిరునామాగా నిలిచిన డాక్టర్ కందుల .భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని వీరు ఆకాంక్షించారు..32 వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు మాట్లాడుతూ తన పరిధి మేరకు విస్తృత సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.. కులాలకు.. మతాలకు అతీతంగా దక్షిణ నియోజకవర్గం పరిధిలో సాయం కోరేవారందరికీ ఏదో ఒకటి చేయాలనే మంచి సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా తన ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.. అలాగే తనపై నమ్మకం ఉంచి కార్పొరేటర్ గా గెలిపించిన ప్రజల ఆకాంక్షల మేరకు తన వార్డు ను పూర్తిస్థాయిలో రోల్ మోడల్ గా అభివృద్ధి చేస్తున్నట్లు నాగరాజు చెప్పారు.. ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని వాటిని కూడా పూర్తి చేసేందుకు సహకరించాలని అతిధులను కోరారు. *10,000 మందికి చీరలు..దుప్పట్లు పంపిణీ* కందుల నాగరాజు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా ఈ ఏడాది అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ప్రధానంగా 10000 మంది నిరుపేదలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే తోపుడు బండ్లు అందజేశారు. అందరికీ విందు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కానుకలు అందజేశారు.. అలాగే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.. ఈ పుట్టినరోజు వేడుకలకు సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు ..జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షత వహించగా కెఎన్ఆర్ ట్రస్ట్ డైరెక్టర్లు కందుల బద్రీనాథ్ కేదార్నాథ్ పలువురు కార్పొరేటర్లు.. మాజీ కార్పొరేటర్లు.వార్డ్ అధ్యక్షులు.. పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు.. అనేకమంది స్వచ్ఛంద సంస్థల అధ్యక్షులు పాల్గొని కందుల నాగరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కందుల దంపతులను గజమాలతో ఘనంగా సత్కరించారు..

అన్నమయ్య

టంగుటూరులో 469వ ఉరుసు మహోత్సవనీకి ముఖ్యఅతిథిగా పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు నవంబర్ 30, (ఎల్లో సింగం ప్రతినిధి) టంగుటూరు గ్రామంలోని శ్రీ హజరత్ ఖాదర వల్లి దర్గా ప్రాంగణంలో 469వ ఉరుసు మహోత్సవం ఆదివారం నాడు అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డిని గ్రామస్తులు,ఉరుసు కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.గ్రామ వీధులు ఆహ్వాన నినాదాలతో మార్మోగగా,బాణసంచా, బ్యాండ్‌బాజాలు,శాల్వతో సత్కరించి గజమాల వేసి మేడా విజయ శేఖర్ రెడ్డికి ఘన సత్కారం అందించారు. గ్రామం మొత్తం పండుగ వాతావరణంతో కళకళలాడింది.మేడా విజయ శేఖర్ రెడ్డి అడుగు పెట్టిన ప్రతి చోట ప్రజలు భారీ సంఖ్యలో చేరి అభినందనలు తెలియజేశారు.ఆయనతో పలకరించేందుకు గ్రామస్థులు ఎగబడి,తమ సమస్యలు, అభిప్రాయాలు వివరించగా, మేడా ఆత్మీయంగా ప్రతి ఒక్కరినీ వినడం ప్రత్యేకతగా నిలిచింది.అనంతరం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన మేడా విజయ శేఖర్ రెడ్డి,దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,ఆంధ్రప్రదేశ్ పురోగతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాష్ట్ర అభివృద్ధిలో ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్న మంత్రి నారా లోకేష్,ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో మరిన్ని విజయాలు చేకూరాలని ఖాదర్ వల్లీ దయను కోరుతూ ప్రార్థనలు చేశారు.ప్రాంతం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు మహోత్సవానికి తరలివచ్చి పాల్గొన్నారు.టంగుటూరు దర్గా చరిత్ర,ఉరుసు ప్రత్యేకతలపై కమిటీ సభ్యులు వివరించగా, శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ ఉరుసు సామరస్యానికి, సౌహార్దానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందలూరు మండల మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీ నరసయ్య, టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, టిడిపి నాయకులు గుజ్జుల ఈశ్వరయ్య, టిడిపి మహిళా నాయకురాలు షేక్ షర్మిల, ఎం.ఎస్ ఖాదర్ వల్లీ,చుక్క వెంకటేష్,నీటి సంఘం మాజీ అధ్యక్షుడు అల్లబకాష్,ముస్లిం కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ నిజాం,ఓబిలి ముస్లిం కమిటీ సెక్రటరీ ఖాదర్ వలీ,బక్షు సాబ్, గౌస్ పీర్,ఎంఆర్పిఎస్ నందలూరు మండల అధ్యక్షుడు కొండయ్య, ఎల్లమ్మరాజుపల్లి శ్రీనివాసులు రెడ్డి,టిడిపి దళిత నాయకుడు సాతపల్లి వెంకీ, టంగుటూరు హరి,టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు,అభిమానులు పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.

విశాఖపట్నం

మన్ననలను పొందిన ది క్రైమ్ మినీ మూవీ – సామాజిక చైతన్యం ఇతివృత్తం – ప్రశంసలు పొందిన దర్శకులు గీతా ప్రసాద్

సామాజిక చైతన్యం పంచిన ది క్రైమ్ లఘు చిత్రం దర్శకుడు గీతా మోహన్ ( గీతా ప్రసాద్) ను అతిథులు ప్రశంసల్లో ముంచెత్తారు. రాంనగర్ లయన్స్ క్లబ్ ప్రాంగణం లో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రీమియర్ షో ఆహుతుల మన్ననలను అందుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్య నారాయణ, రైటర్స్ అకాడమీ ఛైర్మన్ వి.వి. రమణ మూర్తి, వి.డిజిటల్ బ్యూరో చీఫ్ ఎం.ఎస్.ఆర్ ప్రసాద్,స్టీల్ ప్లాంట్ జనరల్ మేనేజర్ చిట్టిబాబు లు పాల్గొని మాట్లాడారు. స్థానిక కళాకారులతో నిర్మించిన చిత్రం లో సమాజానికి సందేశం ఇచ్చిందన్నారు. నిర్లక్ష్యం అనేది ఎన్ని జీవితాలను ప్రభావితం చేస్తుందనేది చిత్రంలో నటీనటులు ప్రదర్శించి మెప్పించారన్నారు. ఒక గంట నిడివి లో తీసిన ద క్రైమ్ లఘు చిత్రం మంచి సందేశాన్ని ఇచ్చిందన్నారు. సాంకేతికంగా లైటింగ్ వంటి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి స్థాయిలో మరింత గౌరవం పొందుతున్నారు. ఇమంది ఈశ్వరరావు వ్యాఖ్యానం తో జరిగిన కార్యక్రమం లో ద క్రైమ్ లఘు చిత్రం లో కొండపల్లి శ్రీనివాసరావు, రవితేజ కళా తృష్ణ, తేలు వెంకట రమణ మూర్తి, గరికిన రాజు, సూర్య కుమారి,షరీఫ్, కోటేశ్వరరావు, ప్రదీప్ రాజు, సాహితీ, దాక్షాయణి, ఎం. టి రాజు, రాజు వంగలా, సూర్య కుమార్, శాంతి, సునీత, శ్యాం, వెంకటేష్ తదితరులు నటించారు. ఆరిలోవ శ్రీనివాస్ మేకప్, కృష్ణం రాజు ప్రొడక్షన్ మానేజర్, చింతాడ ఉదయ్ కుమార్ సహాయ దర్శకుడు, డైలాగ్స్ ను అందించారు. హీరోయిన్ షన్ను తదితరులు సారధ్యం వహించిన కార్యక్రమంలో సర్వ శివ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ లఘు చిత్రం కు కథ, కథనం, మాటలు, కెమెరా, దర్శకత్వం వహించిన గీతా మోహన్ ( గీతా ప్రసాద్) మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే ఇతివృత్తాలను అందిస్తామన్నారు. భవిష్యత్తులో మరిన్ని అంశాలను అందిస్తామన్నారు.

రంగారెడ్డి

* అయ్యప్ప స్వామి మహా పడిపూజల్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 30 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో పోచం భాయి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన 18వ మెట్టు మహా పడిపూజ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప గురుస్వాములు ఆమెకు ఆశీర్వచనాలు అందించి, అయ్యప్ప స్వామి కృప ఎల్లప్పుడూ ప్రజలపై మరియు ఎమ్మెల్యే పై ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామీడి రామిరెడ్డి పెద్దబావి ఆనంద్ రెడ్డి గురుస్వామి భీమిడి జంగారెడ్డి స్వప్న జంగారెడ్డి, శోభ ఆనంద్ రెడ్డి, పెద్దబావి మహేందర్ రెడ్డి, కర్రె బల్వంత్, నందినేని నరేందర్ రెడ్డి, సామ సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ రాజ్ గట్టు మహిపాల్, జూకంటి సురేష్ గౌడ్ మరియు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*మహేశ్వరం నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ అడ్రస్ గల్లంతు: కే ఎల్ ఆర్ * –కిచ్చెన్న ఆధ్వర్యంలో భారీగా కాంగ్రెస్ లో చేరికలు –త్వరలో హస్తం గూటికి బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకులు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 30 : వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.మహేశ్వరం నియోజకవర్గం మెహబత్ నగర్, సిరిగిరిపురం గ్రామాల నుంచి బీఆర్ఎస్ నాయకులు భారీగా కాంగ్రెస్ లో చేరారు. తుక్కుగూడ కార్యాలయంలో మూడురంగుల కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కె ఎల్ ఆర్ అనంతరం కందుకూరు మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా కిచ్చెన్న మాట్లాడుతూ… కొత్తగా వచ్చిన ఇతర పార్టీల నాయకులకు సముచిత స్థానం ఇస్తామన్నారు. కొత్త- పాత నాయకులు కలిసి కట్టుగా పని చేసి సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థులను గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు.వచ్చే స్థానిక ఎన్నికల్లో బి ఆర్ ఎస్ అడ్రస్ గల్లంతు ఖాయమని కె ఎల్ ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ కి సరైన నాయకత్వం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జనాకర్షక పథకాలు పేదలకు అమలు అవుతున్నాయని… తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమానికి పల్లె ప్రజలు అండగా నిలవాలని కిచ్చెన్న కోరారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం, కందుకూరు మండలాల నాయకులు సహా అన్ని విభాగాల నాయకులు, నాయకురాళ్లు, గ్రామకమిటీలు పాల్గొన్నాయి.

రంగారెడ్డి

* సామాజిక సేవలో వికలాంగులకు ట్రై సైకిల్లు అందజేసిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) నవంబర్ 30 : మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నంది హిల్స్‌కు చెందిన జూలూరు సైదులు, లెనిన్ నగర్‌కు చెందిన పుల్లయ్య, నేదునూరుకు చెందిన దేవరకొండ అంజయ్యలకు ట్రై సైకిళ్లను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అందజేశారు.వికలాంగులకు సహాయ సహకారాలు అందించడం బాధ్యత మాత్రమే కాక సామాజిక బాధ్యత కూడా అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యలు, అవసరాలను గుర్తించి సేవ చేయడం కొనసాగుతుందని ఆమె తెలిపారు.ఈ కార్యక్రమంలో బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్, శీను నాయక్, మహిళా అధ్యక్షురాలు సునీత బాలరాజ్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు రజాక్, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సాంబశివ, రాళ్లబండి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.