Tuesday, 17 March 2026

Blog

అన్నమయ్య

KCGF శ్రీ తిరునామల కుమార్ గారికి పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ రైల్వేకోడూరు

*వాసవియన్ KCGF శ్రీ తిరునామల కుమార్ గారికి పుట్టినరోజు సందర్భంగా వాసవి క్లబ్ రైల్వేకోడూరు కుటుంబ సభ్యులందరి తరఫున “హార్దిక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి *జన్మదిన వేడుకలు* మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీరికి వీరి కుటుంబానికి *మన కుల దైవం వాసవి మాత, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చల్లని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము**వాసవి క్లబ్, రైల్వే కోడూరు*

Others

మార్గశిరమాస పౌర్ణమి సందర్భంగా మన కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు రాత్రి 8:00గంటలకి అమ్మవారికి “ఉంజల్ సేవ” వైభవంగా

గురువారము మార్గశిరమాస పౌర్ణమి సందర్భంగా మన కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు రాత్రి 8:00గంటలకి అమ్మవారికి “ఉంజల్ సేవ” వైభవంగా జరుగుతుంది. మార్గశిర మాస పౌర్ణమి ఉంజల సేవకు గాను అమ్మవారికి శాశ్వత పట్టు చీర సమర్పించిన వారు” శ్రీ చిన్ని వెంకటేశ్వర్లు వీరి ధర్మపత్ని కీర్తిశేషులు ప్రబలాంబ వీరి కుమారులు శివకుమార ధర్మపత్ని ప్రసన్నలక్ష్మి & సన్స్ ,లోకేష్ వీరి ధర్మపత్ని వసుధ & సన్. ఉంజలసేవ ఉభయదారులు:1. శ్రీ కామిశెట్టి వెంకటేశ్వరరావు వీరి ధర్మపత్ని అనిల & సన్ 2. శ్రీ గుణిశెట్టి సుబ్బారావు వీరి ధర్మపత్ని నాగభూషణమ్మ & సన్స్ 3. శ్రీ జలదంకి వెంకట సుబ్బారావు వీరి ధర్మపత్ని ధనలక్ష్మి & సన్ 4. శ్రీ వాకచర్ల మల్లికార్జున వీరి ధర్మపత్ని కళావతి & డాటర్స్ 5. శ్రీ బైసాని కిరణ్ కుమార్ వీరి ధర్మపత్ని చైతన్య శ్రీ & సన్. ఇట్లు: శ్రీ ఆర్యవైశ్య సంఘం రైల్వేకోడూరు.🙏

Others

మార్గశిరమాస పౌర్ణమి సందర్భంగా మన కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు రాత్రి 8:00గంటలకి అమ్మవారికి “ఉంజల్ సేవ”

రైల్వేకోడూరు డిసెంబర్ పున్నమి ప్రతినిధి గురువారము మార్గశిరమాస పౌర్ణమి సందర్భంగా మన కన్యకాపరమేశ్వరి దేవస్థానం నందు రాత్రి 8:00గంటలకి అమ్మవారికి “ఉంజల్ సేవ” వైభవంగా జరుగుతుంది. మార్గశిర మాస పౌర్ణమి ఉంజల సేవకు గాను అమ్మవారికి శాశ్వత పట్టు చీర సమర్పించిన వారు” శ్రీ చిన్ని వెంకటేశ్వర్లు వీరి ధర్మపత్ని కీర్తిశేషులు ప్రబలాంబ వీరి కుమారులు శివకుమార ధర్మపత్ని ప్రసన్నలక్ష్మి & సన్స్ ,లోకేష్ వీరి ధర్మపత్ని వసుధ & సన్. ఉంజలసేవ ఉభయదారులు:1. శ్రీ కామిశెట్టి వెంకటేశ్వరరావు వీరి ధర్మపత్ని అనిల & సన్ 2. శ్రీ గుణిశెట్టి సుబ్బారావు వీరి ధర్మపత్ని నాగభూషణమ్మ & సన్స్ 3. శ్రీ జలదంకి వెంకట సుబ్బారావు వీరి ధర్మపత్ని ధనలక్ష్మి & సన్ 4. శ్రీ వాకచర్ల మల్లికార్జున వీరి ధర్మపత్ని కళావతి & డాటర్స్ 5. శ్రీ బైసాని కిరణ్ కుమార్ వీరి ధర్మపత్ని చైతన్య శ్రీ & సన్. ఇట్లు: శ్రీ ఆర్యవైశ్య సంఘం రైల్వేకోడూరు.🙏

అన్నమయ్య

ప్రతినెలా 1వ తేదీన ఇంటి వద్దకే పెన్షన్: పంతగాని నరసింహ ప్రసాద్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిన విజయమిది – నాగవరంలో పెన్షన్ పంపిణీ చిట్వేల్, డిసెంబర్ 1: పున్నమి ప్రతినిధి ప్రతి నెల మొదటి తేదీన ఇంటి వద్దకే పెన్షన్ పంపిణీ చేయడం తమ ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ స్పష్టం చేశారు. చిట్వేల్ మండలం, నాగవరం గ్రామంలో సోమవారం జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాధించిన ఘన విజయమని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ వాన, వరద, తుఫాను వంటి ప్రకృతి విపత్తులు ఏవి వచ్చినా ఆగదని ఆయన స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతినెలా నిర్ణీత తేదీన పెన్షన్ డబ్బులు అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

E-పేపర్

రోడ్లపై చెత్త వేస్తే కఠిన చర్యలు కమిషనర్ హెచ్చరిక

కాకినాడ జిల్లా,కాకినాడ సిటీ,పున్నమి ప్రతినిధి:నగరంలో కాలువల్లో,రోడ్లపై చెత్త వేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్‌ వి‌ వి సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం ఉదయం జగన్నాధపురం ప్రాంతంలోని 25వ డివిజన్ పరదేశమ్మపేట, నాగరాజుపేటలలో శానిటేషన్ నిర్వహణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి టీ స్టాల్ వద్ద టీ గ్లాసులు రోడ్డుపైన పడేయడం గమనించిన కమిషనర్ సత్యనారాయణ టీ షాప్ యజమానిని పిలిపించి తక్షణమే గ్లాసులు తొలగించాలని ఆదేశించారు.ఇకముందు కూడా చెత్తను రోడ్డుపై పడేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డివిజన్‌లో ప్రజలను పలకరించిన ఇంచార్జ్ కమిషనర్,పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజూ చెత్త సేకరణకు వస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పౌరులు పురమిత్ర యాప్‌ను వినియోగించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం చాలా అవసరం అన్నారు.నగర ప్రజలకు క్లీన్ సిటీపై అవగాహన కల్పించి వారిని స్వచ్ఛ నగరంలో తీర్చి దిద్దడంలో భాగస్వామ్యం చేస్తామని కమిషనర్ సత్యనారాయణ చెప్పారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్,హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దళే పృథ్వి చరణ్, వాటర్ వర్క్స్ డీఈ లక్ష్మీనారాయణ,శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు,శానిటేషన్ ఇన్స్పెక్టర్ అప్పారావు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా పెద్దాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నిర్మూలనకై అవగాహన భారీ ర్యాలీ

పున్నమి న్యూస్ పెద్దాపురం, 01 డిసెంబర్. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మెడికల్ సూపర్నెంట్ డి ఉమామహేశ్వరి గారి ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయ కు చెందిన విద్యార్థి విద్యార్థుల మరియు NCC క్యాడెక్స్ సామాజిక సేవ దృక్పథంతో స్కూల్లో ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి కొత్తపేట గుర్రాల సెంటర్ వరకు 150 మంది విద్యార్థిని విద్యార్థులు, హాస్పిటల్ డాక్టర్స్ సిబ్బంది, ఇతర నర్సింగ్ సిబ్బంది, ఆశా వర్కర్స్ తో భారీ ర్యాలీ జరిగింది గుర్రాల సెంటర్ వద్ద హాస్పటల్ సిబ్బంది నవోదయ విద్యార్థి విద్యార్థులతో మానవహారం నిర్వహించి ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించడం గూర్చి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజకుమార్, డాక్టర్ ఏ శ్రీనివాస్, డాక్టర్ గోపి, డాక్టర్ అనుష రాయ్, హెడ్ నర్స్ రమాదేవి, జవహర్ నవోదయ విద్యార్థుల అసోసియేట్, ఎన్సిసి ఆఫీసర్ లెఫ్ట్నెంట్ ఎస్ సూర్యనారాయణ, నవోదయ ప్రిన్సిపాల్ శ్రీమతి డి సీతాలక్ష్మి, టీచర్స్ వి ప్రేమలత, లైబ్రేరియన్ శ్రీమతి రాజ్యలక్ష్మి, శ్రీమతి మధుబాల, కృష్ణవేణి, బి నగేష్, ఐసిటిసి, కౌన్సిలర్ బి శ్రీనివాసరావు, ఎల్ టి O శ్రీనుబాబు, స్టాఫ్ నర్స్ పి సుగంది, ఎస్ ఎస్ ఎన్ స్టాఫ్ బి రోజా, పి వసంత, హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ న్ అప్పలకొండ, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ వంగలపూడి సతీష్ పాల్గొన్నారు

విశాఖపట్నం

హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ సోమవారం సాయంత్రం విశాఖలో భవ్య సేవా కార్యక్రమం

విశాఖపట్నం, డిసెంబర్ 1: అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో నివసిస్తున్న ప్రవాస ఆంధ్రులు తమ స్వస్థల పట్ల మమకారాన్ని మరోసారి చాటుకుంటున్నారు. వారి సహకారంతో, Houston Helping Hands ఆధ్వర్యంలో నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ఈ సాయంత్రం విశాఖలోని నిరాశ్రయుల టి ఎస్ ఆర్ కాంప్లెక్స్‌లో సాయంత్రం 7 గంటలకు జరుగనుంది. ముఖ్య అతిథులు కార్యక్రమానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీ శంఖభ్రత బాగ్చి, ఐపీఎస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయనుండగా, 4వ టౌన్ సీఐ శ్రీ ఉమాకాంత్ గారు గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. వారి సమక్షంలో నిరాశ్రయులకు దుప్పట్లు అందించనున్నారు. ప్రవాసాంధ్రుల సేవా మనసు హ్యూస్టన్‌లో స్థిరపడినా, తమ ఊరుపై ప్రేమను మరువని పలువురు ప్రవాసాంధ్రులు— రాపర్తి శ్రీను, సలపు బాలరాజు, నాయుడు, దౌలూరు సోలమన్, రాపేటి సత్య, కర్ణం వరహాలు, పెంటకోట రమణ, కంబాల సూర్యప్రకాశ్, బోడీ కృష్ణ, పలిక రమణ, మొక శ్యాం, కడియాల సురేష్, గోటిముక్కల మౌలేశ్వరరావు, వడేగోర గణేష్, మద్ది వెంకట గురునాధరావు— ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కీలకంగా సహకరించారు. వారు అమెరికాలో నుంచే సమన్వయం చేస్తూ, తమ ప్రతినిధుల ద్వారా ఈ సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. చలికాలంలో ప్రాణాలకు రక్ష తీవ్రమవుతున్న చలికాలంలో ఒక దుప్పటి కూడా ప్రాణాలను కాపాడగలదన్న అవగాహనతో, శతాదిక నిరుపేదలకు దుప్పట్లు అందించే ఏర్పాట్లు చేశారు. పోలీసు అధికారుల సమక్షంలో పంపిణీ జరగడం వలన కార్యక్రమానికి మరింత విశ్వసనీయత, పారదర్శకత లభించనుంది “మన హృదయం ఎప్పుడూ మన ప్రజలతోనే” — నిర్వాహకులు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ: “మనకు ఎక్కడ ఉన్నా, మన ఊర్లో ఎవరికైనా అవసరం ఉంటే సహాయం చేయడం మన కర్తవ్యం. అమెరికాలో ఉన్నా మన హృదయం మన ప్రజలతోనే ఉంటుంది. చలిలో వణుకుతున్న నిరాధారులకు ఈ దుప్పటితో కొంత భరోసా కలిగించగలిగితే అదే మా ఆనందం” అని తెలిపారు. మీడియాకు ఆహ్వానం ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరినీ కార్యక్రమాన్ని కవర్ చేయవలసిందిగా హ్యూస్టన్ హెల్పింగ్ హాండ్స్ కోరింది. వారి హాజరు ఈ సేవా చర్యకు మరింత విలువను తెస్తుందని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. సామాజిక సేవను ధ్యేయంగా పెట్టుకున్న హ్యూస్టన్ ప్రవాసాంధ్రుల ఈ కార్యక్రమం స్థానికులకు ప్రేరణగా నిలుస్తుందని విశాఖలోని సేవాసంస్థలు అభినందించాయి.

ఆంధ్రప్రదేశ్

మహాత్మా జ్యోతిరావు ఫూలే: ప్రాథమిక విద్య నుండి సామాజిక విప్లవం వరకు

మహాత్మా జ్యోతిరావు ఫూలే 1827లో పూణేలో జన్మించారు. చిన్నతనం నుంచి సమాజంలో ఉన్న వివక్షలను గమనించిన ఆయన, స్కాటిష్ మిషనరీ పాఠశాలలో ప్రాథమిక విద్యను పొందుతూ సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకున్నారు. యౌవనంలో సావిత్రీబాయి ఫూలేతో కలిసి మహిళా విద్య, అణగారిన వర్గాల uplift కోసం పాఠశాలలను స్థాపించారు. బ్రాహ్మణిక వ్యవస్థలో నెలకొన్న అసమానతలను ఎదిరించి, సమానత్వం, న్యాయం కోసం నిరంతరం పోరాడారు. బాల్యదశలో ప్రారంభమైన ఆయన ఆలోచనలు భారతీయ సమాజంలో శాశ్వత మార్పులు తీసుకొచ్చిన గొప్ప సామాజిక విప్లవానికి దారితీశాయి.

ఆంధ్రప్రదేశ్

పట్టణ శాలివాహన కుమ్మర్ల సంఘం అధ్యక్షులుగా – జమ్మిశెట్టి రామకృష్ణ

పిడుగురాళ్ల పట్టణం పోలీస్ స్టేషన్ ఎదురుగ ఉన్న శివ టెంట్ హౌస్ నందు ఈరోజు శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.అధ్యక్షులుగా జమ్మిశెట్టి రామకృష్ణ,ప్రధానకార్యదర్శి రాజవరపు రాఘవేంద్రరావు,కోశాధికారి చీరాల వెంకటేశ్వర్లు,మీడియా కన్వీనర్ నడికుడి వెంకటేశ్వరావు,వర్కింగ్ ప్రెసిడెంట్ శాత్రాసుపల్లి శ్రీనివాసరావు,ఉపాధ్యక్షులు గా మొగిలిచర్ల కోటేశ్వరరావు,సిరికొండ శేషగిరిరావు,మద్దిగుంట్ల శివశంకర్,దొంతుల శ్రీనివాసరావు,చల్లగిరి సాంబయ్య,మద్దిగుంట్ల కోటేశ్వరరావు,ఇల్లూరి కోటేశ్వరరావు,కార్యనిర్వాహణ కార్యదర్శిలు గా గుమ్మడిదల సైదులు,బాడిశా కోటయ్య,తోగటి రామకృష్ణ,నారాయపురం వీరయ్య,కార్యవర్గ సభ్యులు గా గుమ్మడిదల నారాయణ,యడవల్లి వెంకటనారాయణ,తోగటి గోపీచంద్,నడికుడి ముక్కటేశ్వరావులను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పట్టణ అధ్యక్షులు జమ్మిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ నన్ను నమ్మి నాకు పట్టణ అధ్యక్షులు గా బాధ్యతలు అప్పగించిన కుమ్మర శాలివాహన సంఘం పెద్దలకు పేరు పేరున ధన్యవాదములు తెలిపారు.నాకు అప్పగించిన బాధ్యత ను సక్రమంగా నిర్వహిస్తానని సంఘం అభివృద్ధికీ తమవంతు కృషి చేస్తానని తెలిపారు.ఇవే కాకుండా రానున్న రోజుల్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సంఘం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ శ్రీ వెంకటేశ్వర సాయి శాలివాహన కుమ్మర్ల సంఘం పెద్దలు తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*తుఫాన్ సైతం లెక్కచేయకుండా పెన్షన్ పంపిణీ చేసిన మంత్రి నారాయణ*

* మేనిఫెస్టోలో చెప్పినవన్నీ 100 శాతం అమలు చేసి తీరుతాం మంత్రి నారాయణ రాష్ట్రంలో ఒకేరోజులో 90% పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఘనత ఒక్క కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు.. నెల్లూరు నగరంలోని 11 డివిజన్లో తుఫాను సైతం లెక్కచేయకుండా ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు ..జోరు వానలో సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న నారాయణను లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.. ఈ సందర్భంగా పెన్షన్ దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు..*అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు* ప్రతినెల ఒకటో తేదీ రాష్ట్ర పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు.. ఉదయాన్నే ఆరు గంటల నుండి పెన్షన్ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.. 68 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్ దారులకు పెన్షన్ పెంచడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు.. దాదాపు 34 వేల కోట్ల రూపాయలు పెన్షన్ను అందజేస్తున్నామని .. ఇవ్వని హామీలను కూడా ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు..భారతదేశంలో కూడా ఎక్కడ ఇంత మొత్తంలో పెన్షన్ ఇవ్వడం లేదన్నారు.. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా సీఎంకు ఉన్నటువంటి ఆపారమైన అనుభవంతో హామీలు అమలు చేస్తున్నామన్నారు… కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 90% పూర్తయ్యాయని మంత్రి తెలిపారు… అదేవిధంగా మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని. జూన్ 12వ తారీకు నుంచి 67 లక్షల మందికి తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. రైతులకు 20,000 అందించామని .. ఆగస్టు నుండి మహిళలకు కూడా ఉచిత బస్సు అమలు చేశామని మరోసారి గుర్తు చేశారు.. ఇప్పటికే 200 అన్న క్యాంటీన్లో 100 రోజులు పూర్తి చేసామన్నారు.. మరో వంద అన్న క్యాంటీన్లో సిద్ధం చేస్తున్నామని.. అభివృద్ధి సంక్షేమం రెండు కల్లుగా ముందుకు సాగుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ వందకు వంద శాతం అమలు చేస్తామని కంఠాపదంగా చెప్పారు.. అనంతరం *నుడ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మీడియాతో మాట్లాడారు..* మంత్రి నారాయణ గారు క్రమశిక్షణకు మారుపేరని జోరు వానలో సైతం లెక్కచేయకుండా సమయానికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం అందులో మంత్రిగా నెల్లూరు నగర ఎమ్మెల్యే కావడం నియోజవర్గ వాసుల అదృష్టమని పేర్కొన్నారు స్కూల్స్ పార్కుల అభివృద్ధి కాలువల పూడికతీత పనులకు మంత్రి పెద్దపీట వేశారన్నారు కార్యకర్తల సంక్షేమమే పరమావధిగా ముందుకు సాగుతున్న గొప్ప వ్యక్తి మంత్రి నారాయణ అని.. ఒక విజన్ తో ప్రణాళిక బద్ధంగా నగరాభివృద్ధికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్,డివిజన్ అధ్యక్షుడు గొడ్డేటి నాగేంద్ర..ప్రధాన కార్యదర్శి నారాయణ..ఉపాధ్యక్షుడు రాంబాబు, కొక్లస్టర్ ఆవుల శ్రీనివాసులు,227 బూత్ ఇంచార్జ్ ఏకుల నాగార్జున,గోతం బాలకృష్ణ, టిడిపి ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.