Tuesday, 17 March 2026

Blog

విశాఖపట్నం

విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలకు రెడీ

విశాఖలో కాగ్నిజెంట్ కార్యకలాపాలకు రెడీ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* కాపులుప్పాడ లో 22.19 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత భవనాలు నిర్మాణానికి ఈ నెల 12న భూమి పూజ వేర్వేరు సర్వే నంబర్లలో 22.19 గుర్తించి కాగ్నిజెంట్ కు అప్పగించిన ఏపీఐఐసీ రుషికొండ ఐటీ సెజ్ లోని మహతి బిల్డింగ్ లో తాత్కాలిక క్యాంపస్ నిర్వహణకు సన్నద్ధం రూ. 1600 కోట్ల పెట్టుబడులతో ప్రారంభించి 10, 000 వేల మందికి 2029 నాటికి జాబ్ ఇచ్చేలా ప్రణాళికలు 2029 నాటికి విశాఖలో కాగ్నిజెంట్ పూర్తిస్థాయి ఆపరేషన్స్ నిర్వహణకు ప్లాన్ విశాఖలో ఇప్పటికే ఇన్ఫోసిస్ కార్యకలాపాలు, త్వరలో టీసీఎస్ ఆపరేషన్స్, ఇక కాగ్నిజెంట్ కూడా సన్నద్ధం దిగ్గజ ఐటీ కంపెనీలు ఆపరేషన్స్ చేపడుతుండటంతో విశాఖలో ఐటీ జోష్

విశాఖపట్నం

విశాఖ బాలోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించిన విఎంఆర్డిఏ కమీషనర్

విశాఖ బాలోత్సవం పోస్టర్ ను ఆవిష్కరించిన విఎంఆర్డిఏ కమీషనర్ గారు *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* డిసెంబర్ 9 నుండి 11 వరకూ సెయింట్ ఆంథోనీ ఓల్డ్ తెలుగు ప్రైమరీ స్కూల్ లో జరిగే “విశాఖ బాలోత్సవం 3వ మెగా చిల్డ్రన్స్ ఫెస్టివల్” యొక్క పోస్టర్ ను ఈ రోజు గౌరవనీయ విఎంఆర్డిఏ కమీషనర్ శ్రీ ఎన్. భరత్ తేజ్ గారి చేతులమీదుగా కమీషనర్ గారి కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమీషనర్ గారితో బాటు , బాలోత్సవం ప్రధాన కార్యదర్శి శ్రీ జి.ఎస్. రాజేశ్వరరావు, ఆహ్వానసంఘం ఉపాధ్యక్షులు శ్రీ పి. లచ్చిరాజు, శ్రీ జి. వి. రమణ గార్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్యదర్శి రాజేశ్వరరావు మాట్లాడుతూ ఈసారి బాలోత్సవాన్ని విశాఖ వ్యాలీ రోటరీ తో కలిసి సెయింట్ ఆంథోనీ స్కూల్ లో నిర్వహిస్తున్నామని , బాలోత్సవం యొక్క బుక్ లెట్స్ ను, కార్యకర్తలు 400 స్కూల్స్ కు తీసుకు వెళ్లి అందించడం జరిగిందని, స్కూల్స్ నుండి ఎంట్రీఫారాలు నింపి తిరిగి పంపే ప్రక్రియ ప్రారంభమయ్యిందని, స్పందన చాలా బాగుందని తెలియజేసేరు. గత సంవత్సరం బాలోత్సవంలో 8000 మంది పిల్లలు పాల్గొన్నారని,ఈసారి బాలోత్సవంలో ఇంకా ఎక్కువ స్కూళ్ల నుండి పిల్లలు పాల్గొనే అవకాశం వుందని తెలిపారు. డిసెంబర్ 9న జరిగే ప్రారంభ సభ కు గాని 11 న జరిగే ముగింపు సభ కు గాని ముఖ్య అతిధిగా హాజరు కావాల్సిందిగా ప్రతినిధివర్గం కమీషనర్ గారిని కోరింది. ఇందుకు కమీషనర్ గారు సానుకూలంగా స్పందిస్తూ స్కూల్ పిల్లలకు అకాడమిక్ అండ్ కల్చరల్ ఈవెంట్లలో పోటీలు నిర్వహించడం ఎంతో ముదావహమని, అందుకు విశాఖ బాలోత్సవాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. గతంలో తాను రాజమండ్రి బాలోత్సవానికి హాజరు అయ్యానని ఈసారి విశాఖ బాలోత్సవానికి కూడా వీలు చూసుకుని హాజరవడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. అందుకు ప్రతినిధివర్గం ధన్యవాదములు తెలియజేసింది

విశాఖపట్నం

విద్యుత్ కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయాలి,సిపిఎం*

*విద్యుత్ కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రోస్టర్ పద్దతిలో భర్తీ చేయాలి,సిపిఎం* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* ఆంధ్రప్రదేశ్ ఈస్టు పవర్ డిస్టు బ్యూసన్ కంపెనీలో (APEPDCL) ఔట్సోర్సింగి ఉద్యోగాలను రోస్టర్ పద్దతిలో ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా భర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న డిమాండ్ చేసారు మంగళవారం అయిన ఓప్రకటన విడుదల చేసారు అనంతరం అయిన మాట్లాడారు నర్సిపట్నం డివిజన్ పరిదిలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) పరిధిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న మరియు కొత్తగా 33/11 కెవి సబ్ స్టేషన్లలో ఖాళీలను భర్తీకై నిబంధనల ప్రకారం ఎటువంటి అవక తవకలకు అవకాశం లేకుండా ఎస్సి ఎస్టీ బ్లాక్ లాగ్ పోస్టులు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించి భర్తీ చేయాలని కోరారు ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు అదికార కూటమి పార్టీ కూటమి నాయకులు ఉద్యోగాలను అమ్మకాలకు పెట్టారని దీని వలన ధళితులు గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు ఈపీడీసీఎల్ పరిధిలో ఇప్పటికే ఖాళీగా ఉన్న మరియు కొత్తగా నిర్మాణం చేపట్టిన 33/11 కెవి సబ్ స్టేషన్ లో ఖాళీలను కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీకై నిబంధనలకు అనుగుణంగా అధికారులు చేపట్టడం లెదన్నారు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే రూపొందించిన నిబంధనల ప్రకారం పత్రికల ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు స్వీకరణ, ఖాళీలు వివరాలు ప్రకారం ఎస్సీ, ఎస్టీ బీసీ ఇతర రిజర్వేషన్లు ఎంపిక, రోస్టర్ విధానం అమలు, మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థులు ఎంపిక పారదర్శకంగా జరిగే విధంగా విద్యుత్ శాఖ అధికారులు కాంట్రాక్టర్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎటువంటి అవతవకులు జరగకుండా ఎంపికైన అభ్యర్థులకు టెండర్ స్పెసిఫికేషన్స్ ప్రకారం వేతనాలు అమలు,ఇతర సౌకర్యాలు కల్పించాలని వెంకన్న డిమాండ్ చేసారు వారు చేశారు.

అన్నమయ్య

రాజంపేట జిల్లా కేంద్రంపై సీఎంకు వినతి

-రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ముక్కా రూపానంద రెడ్డి భేటీ – ప్రజల మనోభావాలను వివరించిన నాయకులు చిట్వేల్, డిసెంబర్ 2: పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాజంపేటగా మార్చాలనే స్థానిక ప్రజల డిమాండ్‌ను రాష్ట్ర ప్రభుత్వ విప్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానంద రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతిలో ముఖ్యమంత్రి కలిసిన ఈ ఇద్దరు కీలక నాయకులు, రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిన అవసరాన్ని, అందుకు గల అన్ని మౌలిక వసతులను వివరించారు. ఈ ప్రాంత ప్రజల బలమైన మనోభావాలను అలాగే రాజంపేట అనుకూలతలను సీఎం తెలియజేశారు. రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటైతే కలిగే పరిపాలనా సౌలభ్యం, భౌగోళిక అనుకూలతలు, అన్ని వర్గాల ప్రజల సులభతర రవాణా వంటి అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని నాయకులు ముఖ్యమంత్రిని కోరారు.

విశాఖపట్నం

మార్గశిర మాసోత్సవం సందర్బంగా భక్తులకు కల్పించే ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*మార్గశిర మాసోత్సవం సందర్బంగా భక్తులకు కల్పించే ఏర్పాట్లును పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* * ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఉత్సవ కమిటీ కి పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే * రెండో గురువారం అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి విచ్చేయుచున్న నేపథ్యంలో మరిన్ని సౌకర్యాల కల్పనకు కృషి * ప్రసాదాల కౌంటర్, సామాన్య భక్తుల సదుపాయాలు మరియు ఇతర అంశాలపై ఆరా తీసిన ఎమ్మెల్యే మార్గశిర మాసవత్సవం సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో భక్తులకు కలిగే ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక ప్రజలను, భక్తులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉత్సవ కమిటీ మరియు ఆలయ సిబ్బంది సహకారంతో అత్యంత వైభవోపేతంగా మొదటి గురువారం భక్తులకు దర్శనాలు కల్పించిన సంగతి తెలిసిందే. రానున్న రెండో గురువారం దృష్టిలో పెట్టుకుని పలు సదుపాయాలు కల్పనపై ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు స్థానిక పోలీస్ సిబ్బంది, ఆలయ సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించారు. భక్తుల అధిక రద్దీ నేపద్యంలో స్థానిక సిబ్బంది సమన్వయంతో మరిన్ని ఏర్పాట్లు కల్పించే విధంగా చర్యలకు పలు సూచనలును ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అమ్మవారి మార్గశిర మహోత్సవాలలో భక్తులకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి, ఏఈఓ ఆనంద్ కుమార్ ,రాజేంద్ర, ఈ ఈ రమణ, సిఐ ప్రసాద్ గారు, బిజెపి , టీడీపీ, జనసేన నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు….

విశాఖపట్నం

స్క్రబ్ టైఫస్” ప్రాణాంతకం కాదు*

*స్క్రబ్ టైఫస్” ప్రాణాంతకం కాదు* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* విశాఖపట్నం డా.పి.జగదీశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, వారు పత్రికా ముఖంగా తెలియచేయునది ఏమనగా “స్క్రబ్ టైఫస్” ప్రాణాంతకం కాదు దీని గురించి ప్రజలెవరూ భయాందోలనలు చెందనవసరం లేదని తెలియచేసారు. ఈ జీవి కుట్టినప్పుడు కనపడే లక్షణాలు జ్వరం, తలపోటు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, శోషరస కణుపుల వాపు, వినికిడి తగ్గుదల, దగ్గు మరియు శ్వాస ఆడకపోవడం మొదలగు లక్షణాలు కనపడుట, చికిత్స డాక్షిసైక్లిన్, ఎజిత్రోమైసిన్ వంటి మందులు వాడటం ద్వారా నివారించవచ్చు. నివారణ మరియు జాగ్రతలు: ఇంట్లో ఎలుకలు రాకుండా/లేకుండా చూసుకోవడం మరియు యాంటీ ఇన్సేక్టిసైడిస్, స్ప్రేలు వాడటం ద్వారా ఎలుకలు రాకుండా చూసుకోవచ్చు. ఈ వ్యాది విశాఖపట్నం జిల్లాలో 2023 లో 12 పాజిటివ్ కేసులు, 2024 లో 11 పాజిటివ్ కేసులు, 2025 లో 11 పాజిటివ్ కేసులు సంబవించాయి. వీటిలో ఒక్క మరణం కూడా సంభవించలేదు. కనుక ప్రజలెవరూ కూడా ఈ వ్యాది గురించి ఆందోళన చెందనవసరం లేదు, నల్లటి కురుపు, లింప్ నోడ్స్ వాయుట మరియు జ్వరం వచ్చినచో సమీప ఆరోగ్య కేంద్రమునకు వెళ్లి వైద్యుని సంప్రదించి తగు చికిత్స పొందవలెనని డా.పి.జగదీశ్వర రావు వారు తెలియచేసారు.

విశాఖపట్నం

విశాఖపట్నం వద్ద దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఖరారు!

విశాఖపట్నం వద్ద దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఖరారు! *న్యూఢిల్లీ విశాఖ పున్నమి ప్రతినిధి:-* ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి విమానయాన మరియు రక్షణ రంగాల హబ్గా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ఢిల్లీలో విమానాశ్రయాల రూపకల్పన, నిర్వహణలో అంతర్జాతీయంగా పేరెన్నికగన్న జీఎంఆర్ (GMR) సంస్థ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో విశాఖపట్నం వద్ద దేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ అభివృద్ధి ప్రణాళికను ఖరారు చేశారు. ఈ భారీ ప్రాజెక్టును జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయనున్నారు. ఈ చారిత్రక చర్చలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొనడం ప్రాజెక్ట్ యొక్క జాతీయ ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. విశాఖ ప్రాంతంలో ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ అభివృద్ధి ద్వారా విమానయాన, అంతరిక్ష, రక్షణ రంగాల విద్య, శిక్షణలకు హబ్‌గా మారుతుంది. ఇందుకోసం ప్రత్యేక నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తీసుకురానున్నారు. ఈ ఎడ్యుసిటీ ఏర్పాటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి గేమ్ ఛేంజర్గా మారడంతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ క్లస్టర్ అభివృద్ధిని వేగవంతం చేయనుంది. ప్రాజెక్ట్ అంచనా: పరిమాణం, ప్రభావం & డిమాండ్‌ ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక విద్యా సంస్థకు పరిమితం కాదు, ఇది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కేంద్రంగా సువిశాలమైన ఏరో-సిటీ క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటుంది. సువిశాలమైన ఏరో-క్లస్టర్: భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరియు దాని అనుబంధ అభివృద్ధి ప్రాంతాలు కలిసి 4,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండే అవకాశం ఉంది. ఈ విస్తీర్ణంలో ఎయిర్‌పోర్ట్‌తో పాటు విద్య, శిక్షణ, MRO (Maintenance, Repair, and Overhaul) యూనిట్లు, పరిశోధనా కేంద్రాలు, లాజిస్టిక్స్ హబ్‌లు అభివృద్ధి చెందుతాయి. ఈ అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్టులో తొలి దశలో వేల కోట్ల రూపాయల పెట్టుబడిని జీఎంఆర్ మరియు అనుబంధ సంస్థలు పెట్టనున్నాయి. విమానయాన రంగంలో దేశవ్యాప్త నైపుణ్య లోపాన్ని (Skill Gap) దృష్టిలో ఉంచుకుని, ఈ కేంద్రం వేల సంఖ్యలో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. పైలట్లు, ఇంజనీర్లు, ఏవియానిక్స్ టెక్నీషియన్లు, గ్రౌండ్ స్టాఫ్‌ వంటి నిపుణులకు రాష్ట్రంలోనే శిక్షణ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. విదేశీ విశ్వవిద్యాలయాలను తీసుకురావడం ద్వారా, ఆంధ్రప్రదేశ్ ఏరోస్పేస్ టాలెంట్ హబ్గా మారి, జాతీయ, అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షిస్తుంది. ఇది ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక వృద్ధికి, పట్టణీకరణకు మరియు అనుబంధ పరిశ్రమల (ఐటీ, లాజిస్టిక్స్) వృద్ధికి బలమైన పునాది అవుతుంది. దేశీయ విమానయాన రంగం రాబోయే సంవత్సరాలలో 1,700 కంటే ఎక్కువ కొత్త విమానాలను ఆపరేట్ చేయనుంది. దీనికి అనుగుణంగా, రాబోయే 15-20 ఏళ్లలో భారతదేశానికి సుమారు 30,000 మంది కొత్త పైలట్లు మరియు అదే స్థాయిలో విమాన ఇంజనీర్లు, నిర్వహణ నిపుణులు అవసరమని అంచనా. ప్రస్తుత శిక్షణా మౌలిక సదుపాయాలు ఈ డిమాండ్‌ను తీర్చలేకపోతున్నాయి. విశాఖ ఏవియేషన్ సిటీ ఈ డిమాండ్-సరఫరా అంతరాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐటీ కోర్సులతో పాటు, అధిక ఆదాయం, నైపుణ్యం అవసరమయ్యే ఏరోస్పేస్, ఏవియేషన్ రంగాలలో ప్రత్యేక శిక్షణ పొంది, సుస్థిరమైన ఉపాధి పొందే అవకాశం ఉంది. ​విమానయాన మరియు రక్షణ రంగాలలో మానవ వనరులు, పరిశోధనలు, తయారీ కార్యకలాపాలకు ఆంధ్రప్రదేశ్ ఒక ప్రాధాన్య కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

విశాఖపట్నం

మహిళను Instagram మరియు WhatsApp వేదికగా చేసుకొని వేధిస్తున్న ముద్దాయిని పట్టుకున్న విశాఖపట్నం సిటీ పోలీస్

మహిళను Instagram మరియు WhatsApp వేదికగా చేసుకొని వేధిస్తున్న ముద్దాయిని పట్టుకున్న విశాఖపట్నం సిటీ పోలీస్ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు, సైబర్ క్రైమ్ పోలీసు, విశాఖపట్నం సిటి వారు, Instagram లో పరిచయం పెంచుకొని, పర్సనల్ ఫొటోస్ ని తీసుకొని తరువాత డబ్బులకు ఆశపడి ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేస్తానని వివిధ రకాల WhatsApp మరియు Instagram వేదికగా వేధిస్తున్న ముద్దాయిపై కేసు నమోదు చేసి, సాంకేతిక సహాయంతో గుర్తించి, రిమాండ్ కి పంపించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు వివరాలోకి వెళితే: నగరానికి చెందిన ఒక మహిళకు instagram ద్వారా పరిచయమైన ముద్దాయి ఆమెను ప్రేమిస్తున్నానని, NEET seat ఇప్పిస్తానని పరిచయం పెంచుకుని సాధారణ ఫోటోలను సేకరించి, NEET seat కావాలంటే 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి, దానికి నిరాకరించినందుకు, గతంలో సేకరించిన సాధారణ ఫోటోలను న్యూడ్ గా morph చేసి దొంగతనం చేసినసెల్ ఫోన్లు మరియు SIM Card లను ఉపయోగించి create చేసిన whatsapp అకౌంట్స్ నుండి పిర్యాదికి పంపించి, డబ్బు కోసం బెదిరింపు మెసేజెస్ చేయడంతో అవి చూసి భయానికి లోనైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించిన పోలీసులు బాధితురాలికి instagram ద్వారా పరిచయం అయిన వ్యక్తి డబ్బు కోసం వేదింపులకు పాల్పడినట్లు, గుర్తించి సదరువ్యక్తి గతంలో కూడా ఇలాంటి నేరానికి పాల్పడి నగరానికి చెందిన ఒక మహిళ వద్ద నుండి 3,50,000 రూపాయలు మోసగించినట్లు దర్యాప్తులో బయటపడటంతో, దర్యాప్తు ప్రక్రియలో ముద్దాయి గుంటూరు జిల్లా, చెందిన Madinapati Nagulmeera నే వ్యక్తి గా గుర్తించారు. అనంతరం, 29-11-2025 న అతడిని అరెస్ట్ చేసి, చట్టపరమైన ప్రక్రియలతో రిమాండ్ కు తరలించడం జరిగింది. హెచ్చరిక: ఎవరికైన అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ నందు రిక్వెస్ట్ వచ్చిన యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని, అలానే మన సోషల్ మీడియా ఎకౌంటు లను ప్రైవేటు లో పెట్టుకోవాలి అని మరియు అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో సాంగత్యం పనికి రాదని, తెలియని లింక్ పై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసువారు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 లేదా శ్రీ కమిషనర్ ఆఫ్ పోలీస్: 7995095799 వారికి కాల్ చేసి ఫిర్యాదు చేయగలరని తెలిపారు.

విశాఖపట్నం

పంట పాడైపోతుంద‌నే దిగులు లేదు… ద‌ళారులు మోస‌గిస్తారే భ‌యం లేదు…*

*పంట పాడైపోతుంద‌నే దిగులు లేదు… ద‌ళారులు మోస‌గిస్తారే భ‌యం లేదు…* *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* *అమ్మిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే రైతుల‌ ఖాతాల్లో జ‌మ‌వుతున్న ధాన్యం డ‌బ్బులు *ప్ర‌త్యేక‌ కొనుగోలు కేంద్రాల ద్వారా 10 వేల టన్నులు సేక‌రించేందుకు చ‌ర్య‌లు *ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న జిల్లాలోని గ్రామీణ మండ‌లాల‌ రైతులు *సాధార‌ణ ర‌కం క్వింటాకు రూ.2,369, స‌న్న ర‌కం ధాన్యానికి రూ.2,389 చెల్లింపులు విశాఖ‌ప‌ట్ట‌ణం, డిసెంబ‌ర్ 02 ః ఇప్ప‌టికే రైతుల ప‌క్ష‌పాతిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టింది. వారికి ద‌గ్గ‌ర్లోనే కొనుగోలు కేంద్రాలు పెట్టి.. సిబ్బందిని అక్కడే అందుబాటులో ఉంచి ధాన్యం కొనుగోలు ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తోంది. పండిన పంట‌ను వెనువెంట‌నే అమ్మ‌కునేలా క్షేత్ర‌స్థాయిలో అధికార యంత్రాంగాన్ని స‌న్న‌ద్ధం చేయ‌టంతో పాటు గంట‌ల వ్య‌వ‌ధిలోనే రైతుల ఖాతాల్లో డ‌బ్బులు జ‌మ చేస్తూ అన్న‌దాత‌ల‌ మ‌న్న‌న‌లు పొందుతోంది. ప్ర‌భుత్వం తీసుకున్న సానుకూల నిర్ణ‌యాల వ‌ల్ల‌ స్థానిక రైతు సేవా కేంద్రం ప‌రిధిలోనే సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. తేమ శాతం చూడ‌టంతో పాటు, ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా షెడ్యూల్ కూడా ఇస్తున్నారు. జీపీఎస్ అనుసంధాన‌మైన వాహ‌న ఏర్పాటు చేయ‌టంలో, ఎఫ్.టి.వో.లు జ‌న‌రేట్ చేయ‌టంలో కాల‌యాప‌న చేయ‌కుండా క్షేత్ర‌స్థాయి సిబ్బంది స‌హ‌కారం అందిస్తున్నారు. ధాన్యం అమ్మిన కొన్ని గంట‌ల స‌మ‌యంలోనే డ‌బ్బులు జ‌మ అవుతుండ‌టంతో రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. *ప్ర‌త్యేక కేంద్రాల ద్వారా ప‌దివేల ట‌న్నుల ధాన్యం కొనుగోలు* జిల్లాలోని గ్రామీణ మండ‌లాల ప‌రిధిలో ప‌ది వేల ట‌న్నుల ధాన్యం సేక‌రించేలా ప్ర‌భుత్వం లక్ష్యంగా పెట్టింది. దీనికి గాను అధికారులు ప‌ద్మ‌నాభం మండ‌ల ప‌రిధిలో 5, భీమిలి మండ‌లంలో 2, ఆనంద‌పురం మండ‌లంలో 1, పెందుర్తి మండ‌ల ప‌రిధిలో 2 కేంద్రాలు.. మొత్తం 10 ఏర్పాటు చేశారు. గ‌తేడాది ఐదు వేల ట‌న్నులు ల‌క్ష్యం కాగా.. 5,600 ట‌న్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఈ ఏడాది ప‌దివేల ట‌న్నులు సేక‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. జిల్లాలోని బ్యాంక్ గ్యారెంటీలు స‌మ‌ర్పించిన ఆరు మిల్లుల‌ను గుర్తించి లావాదేవీలు కొన‌సాగిస్తున్నారు. గ‌తేడాది సాంబా మ‌సూరి ధాన్యం కొనుగోలు చేయ‌లేదు. ఈ ఏడాది స్వర్ణ‌, 1121 వంటి స‌న్న‌ర‌కంతో పాటు సాంబా మసూరి కూడా తీసుకోవ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వం సాధార‌ణ ర‌కం ధాన్యానికి రూ.2,369, సన్న ర‌కాల‌కు రూ.2,389 చెల్లింపులు చేస్తోంది. గ‌తేడాదితో పోల్చితే ఈ సారి రూ.69 క్వింటాకు అద‌నంగా చెల్లిస్తోంది. జిల్లాలో సుమారు 11,700 ఎక‌రాల్లో ధాన్యం పండిస్తుండ‌గా.. 27వేల ట‌న్నుల దిగుబ‌డి వ‌స్తోంద‌ని వ్య‌వ‌సాయ శాఖ అధికారులు తెలిపారు. *రైతు సేవా కేంద్రాల‌ను సంప్ర‌దిస్తే చాలు.. సేవ‌ల‌న్నీ అందుతాయి* ధాన్యం పండిన రైతులు స్థానికంగా ఉన్న రైతు సేవా కేంద్రాల‌ను సంప్ర‌దిస్తే చాలు అన్ని ర‌కాల సేవ‌లు ల‌భ్య‌మ‌వుతాయి. ముందుగా పండిన ధాన్యాన్ని టెక్నిక‌ల్ అసిస్టెంట్ ప‌రిశీలిస్తారు. తేమ‌శాతం ఇత‌ర వివ‌రాల‌ను అంద‌జేస్తారు. త‌ర్వాత రైతు సేవా కేంద్రంలో సంబంధిత అగ్రిక‌ల్చ‌ర్ అసిస్టెంటు వివ‌రాల‌ను న‌మోదు చేసి సంబంధిత రైతుకు షెడ్యూల్ ఇస్తారు. జిల్లాలో నిర్ణయించిన ఆరు మిల్లుల్లో ఏదొక మిల్లులో ధాన్యం అమ్ముకునేలా స‌మ‌చారం అందిస్తారు. జీపీఎస్ అనుసంధాన‌మైన వాహ‌నం ద్వారా ధాన్యాన్ని మిల్లుకు త‌ర‌లిస్తారు. ఒక‌వేళ రైతులే జీపీఎస్ అనుసంధాన‌మైన వాహ‌నం తెచ్చుకున్న‌ట్లయితే సంబంధిత న‌గ‌దును ప్ర‌భుత్వం చెల్లించేస్తుంది. ఈ విధంగా సోమ‌వారం (డిసెంబ‌ర్ ఒక‌టో తేదీ)నాటికి పెందుర్తి మిన‌హా మిగిలిన మూడు మండ‌లాల ప‌రిధిలో 167 మంది రైతుల నుంచి 821.52 మెట్రిక్ ట‌న్నుల‌ ధాన్యం కొనుగోలు చేసింది. 24-48 గంట‌ల వ్య‌వ‌ధిలోనే రూ.1.95 కోట్ల చెల్లింపులు జ‌ర‌గ‌టం విశేషం. 1. *ద‌ళారుల బెడ‌ద త‌గ్గింది… ధ‌ర గిట్టుబాటు అయ్యింది..* ః బోణి గోవింద‌, బోణి గ్రామం, ఆనంద‌పురం మండ‌లం ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయ‌టం వ‌ల్ల ద‌ళారుల బెడ‌ద త‌గ్గింది. వాళ్ల‌యితే త‌క్కువ ధ‌ర‌కు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేవారు. నేను 1121 స‌న్న‌ర‌కం బియ్యం అమ్మాను. క్వింటాకు రూ.2,389 చెల్లించారు. అదే ద‌ళారులైతే రూ.1800 గానీ రూ.1900 గానీ ఇచ్చేవారు. వారికైతే త‌రుగు కింద‌ క్వింటాకు ఐదు కేజీల ధాన్యం ఎక్కువ‌గా ఇవ్వాల్సి వ‌చ్చేది. నేను 174 బ‌స్తాల ధాన్యం విక్ర‌యించాను. నాకు 24 గంట‌ల్లో డ‌బ్బులు వ‌చ్చేశాయి. నాతో పాటు అమ్మిన వారికి కూడా న‌గ‌దు జ‌మ అయ్యింది. 2. *అధికారులు, సిబ్బంది బాగా స్పందిస్తున్నారు…* ః మ‌ద్దిల ప్రకాశ్, బోణి గ్రామం, ఆనంద‌పురం మండ‌లం మా ప్రాంతంలో బోణి గ్రామంలోనే ముందుగా కోత‌లు మొద‌ల‌య్యాయి. ఇక్క‌డ అధికారులు, సిబ్బంది స్పంద‌న బాగుంది. మేము ఏం అడిగినా ఓపిగ్గా చెబుతున్నారు. వాళ్లే కంప్యూట‌ర్లో వివ‌రాలు న‌మోదు చేస్తున్నారు. ఎప్పుడు ధాన్యం తేవాలో చెబుతున్నారు. దాని ప్ర‌కారం నేను ఒక సారి ఐదు ట‌న్నులన్న‌ర‌, ఇంకొక సారి ఐదు ట‌న్నులు క‌లిపి మొత్తం 180 బ‌స్తాల‌ ధాన్యం అమ్మాను. ఒక రోజు దాట‌గానే డ‌బ్బులు అకౌంట్లో ప‌డ్డాయి. 3. *అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియజేసుకుంటున్నాను* ః బోణి అప్ప‌ల‌రాజు, బోణి గ్రామం, ఆనంద‌పురం మండ‌లం ముందుగా అంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ఎక్క‌డా ఇబ్బంది లేకుండా అన్ని ర‌కాలుగా సాయ‌మందించారు. నేను 1121 స‌న్న ర‌కం ధాన్యం పండించాను. 11 ట‌న్నులు అమ్మాను. డ‌బ్బులు రెండో రోజు ప‌డ్డాయి. మా ఊరులోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయ‌టంతో కోత అయిన వెంట‌నే ధాన్యం అమ్ముకోగ‌లిగాను. ద‌ళారులైతే ఏవేవో చెప్పి బోలెడు కోత‌లు వేసేస్తారు. కానీ ఇక్క‌డ అలాంటిదేమీ లేదు. అంతా బాగానే జ‌రిగింది. 4. *చాలా సంతోషంగా ఉంది…* ః ఉప్ప‌లాల ఉద‌య భాను, బోణి గ్రామం, ఆనంద‌పురం మండ‌లం వ‌ర్షాలు ప‌డిపోతాయ‌ని అంద‌రం ఆందోళ‌న చెందాం. మా ఊరులో కాస్త ముందుగానే కోత‌లు అయిపోవ‌టంతో ఊపిరి పీల్చుకున్నాం. అక్క‌డ‌క్క‌డ శివారు పొలాల వారు ఇంకా కోస్తున్నారు. చాలా మంది ధాన్యం వెంట‌వెంట‌నే కొనుగోలు కేంద్రం ద్వారా విక్రయించేస్తున్నారు. మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎక్క‌డా ఎలాంటి ఇబ్బందీ ప‌డ‌కుండా ధాన్యం అమ్ముకోగ‌లిగాం. 190 బ‌స్తాల ధాన్యాన్ని అమ్మాను. *రైతుల‌కు ఇబ్బంది రాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాం* *ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, జిల్లా క‌లెక్ట‌ర్, విశాఖ‌ప‌ట్ట‌ణం* ధాన్యం పండించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌ట్టాం. సాగు వివ‌రాల ఆధారంగా గ్రామీణ మండ‌లాల ప‌రిధిలో 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జీపీఎస్ కు అనుసంధాన‌మైన వాహ‌నాల ద్వారా ధాన్యం మిల్లుల‌కు త‌ర‌లించ‌టం ద్వారా అవ‌క‌త‌వ‌క‌ల‌కు వీలులేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. జిల్లాలో ఆరు మిల్లుల‌ను గుర్తించాం. రైతులు వారికి ఇష్ట‌మైన మిల్లుకు ధాన్యం విక్ర‌యించుకొనేలా వెసులుబాటు క‌ల్పించాం. వ‌ర్షాలు కార‌ణంగా న‌ష్టం వాటిల్ల‌కూడ‌ద‌నే ముందు చూపుతో కాస్త ముందుగానే కొనుగోలు కేంద్రాల‌ను ప్రారంభించాం. ప్ర‌క్రియ అంతా స‌జావుగానే జ‌రిగిపోతోంది. ఎక్క‌డా ఎలాంటి స‌మ‌స్య‌లు లేవు. *రైతులు ప్ర‌భుత్వ‌ కొనుగోలు కేంద్రాల‌ను ఆశ్ర‌యించాలి* రైతుల సౌక‌ర్యార్థం వారికి ద‌గ్గ‌ర‌లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేశాం. అంద‌రూ వాటిని స‌ద్వినియోగం చేసుకోవాలి. రైతులు ద‌ళారుల‌ను ఆశ్ర‌యించ‌కుండా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నాం. మ‌ధ్య‌వ‌ర్తుల‌ను ఆశ్రయిస్తే క‌మీష‌న్ల రూపంలో దోచుకుంటారు. ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి గంట‌ల వ్య‌వ‌ధిలోనే డ‌బ్బు అందిస్తున్నాం. సివిల్ స‌ప్లైస్ కార్పొరేష‌న్ అధికారుల స‌హాయంతో ప్ర‌క్రియ‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్నాం. ఏమైనా స‌మ‌స్య‌లున్న‌ట్ల‌యితే స్థానిక రైతు సేవా కేంద్రాల ద్వారా త‌మ దృష్టికి తీసుకొస్తే వెనువెంట‌నే ప‌రిష్క‌రిస్తాం.

విశాఖపట్నం

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు* రోడ్ సేఫ్టీ మీటింగులో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

*రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు* రోడ్ సేఫ్టీ మీటింగులో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-* జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, హైవేలో జీబ్రా క్రాసింగ్ వద్ద సోలార్ బ్యాంకర్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ సమావేశ మందిరంలో నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చితో కలసి రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత సంవత్సరం విశాఖ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల వివరాలను, వారికి ప్రభుత్వం తరపున అందజేసిన వివరాలు గూర్చి అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గుర్తు తెలియని వాహనాల ద్వారా ప్రమాదానికి గురైన బాధితులకు అందుతున్న పరిహారం గురించి సమావేశంలో చర్చించారు. ఈ సందర్బంగా ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యల గూర్చి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మేజర్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, పాఠశాల, కళాశాలల పరిసర ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయవలసిందిగా జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. రోడ్ల పై జీబ్రా మార్కింగ్, రోడ్డుకు ఇరువైపులా మార్కింగ్ లు ఏర్పాటు చేయాలన్నారు. పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్ ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలన్నారు. అవసరమైన చోట బస్ షెల్టర్ల ఏర్పాటుతో పాటు భారీ వాహనాలు నిలిపేందుకు ట్రక్-బేలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫుట్ పాత్ లు ఆక్రమణలకు గురి కాకుండా ప్రజలు వినియోగించుకునేలా పోలీస్, జీవీఎంసీ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన కూడళ్లతో పాటు అవసరమైన చోట సిసి కెమోరాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు మధ్యలో ఉన్న చెట్ల వల్ల రోడ్లపై వాహనదారులకు లైటింగ్ ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పోలీస్ కమిషనర్ పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా అధికారి ఆర్.సి.హెచ్. శ్రీనివాస్ గత సమావేశంలో చర్చించిన అంశాలను చేపట్టిన పురోగతిని సభ్యులకు వివరించారు. కార్యక్రమంలో పోలీసు, వైద్యారోగ్య శాఖ అధికారులు, జీవీఎంసీ అధికారులు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.