Tuesday, 17 March 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నేడు తూర్పు గోదావరిజిల్లాలో సీఎం పర్యటన

తూర్పు గోదావరిజిల్లా నల్లజర్లలో నేడు సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నల్లజర్ల గ్రామంలో నిర్వహించనున్న రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. నవంబర్ 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ఇందులో పాల్గొనే రైతులకు.. రైతులకోసం రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న పనుల గురించి వివరించనున్నారు. రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేయనున్నారు.

E-పేపర్

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వివిద గ్రామాలకు బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల రెండవ జాబితాను 26 మంది అభ్యర్థులతో నియోజక వర్గ ఇన్ ఛార్జి శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించారు.

పున్నమి ప్రతినిధి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థుల రెండవ జాబితా* ———————————————- ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వివిద గ్రామాలకు బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల రెండవ జాబితాను 26 మంది అభ్యర్థులతో నియోజక వర్గ ఇన్ ఛార్జి శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి ప్రకటించారు. మిగిలిన అభ్యర్థులను బుధవారం ఉదయం ప్రకటిస్తామని తెలిపారు. *అబ్దుల్లాపూర్ మెట్ మండలం* ———————————————- 1. బండరావిరాల -కందికంటి విజయకుమార్ 2. ⁠బలిజగూడ – తంగడిపల్లి రాణి వెంకటేశ్ 3. ⁠బాటసింగారం – యెర్రవెల్లి గౌరీశంకర్ 4. ⁠లష్కర్ గూడ – సీక సాయికుమార్ గౌడ్ *ఇబ్రహీంపట్నం మండలం* —————————————— 5. ఉప్పరిగూడ – బోసుపల్లి శ్రీవాణి నందకుమార్ 6. ⁠పోల్కంపల్లి – పూల శ్రీనివాస్ ముదిరాజ్ 7. ⁠నెర్రెపల్లి – బొడ్డు లక్ష్మి శ్రీకాంత్ రెడ్డి 8. ⁠నాగన్ పల్లి – దుర్గని సమీనా రాజు *యాచారం మండలం* ———————————— 9. చౌదర్ పల్లి – జుట్టు శ్రీశైలం 10. ⁠కొత్తపల్లి – చిక్కుడు స్వాతినా గుండాలు 11. ⁠మల్కీజ్ గూడెం – డేరంగుల శంకర్ 12. ⁠నల్లవెల్లి – జాటోత్ లచ్చిరాం నాయక్ 13. ⁠నానక్ నగర్ – సంగెం కవిత మహేందర్ 14. ⁠తక్కల్లపల్లి – కొండోజు భవాని భూషణ్ 15. ⁠తక్కల్లపల్లి తండా – రమావత్ కౌసల్య అంతిరామ్ నాయక్ 16. ⁠తాడిపర్తి – బైకని జయమ్మ జంగయ్య యాదవ్ 17. ⁠యాచారం – చండూరి మౌనిక జయరాజ్ *మంచాల మండలం* ———————————— 18. మంచాల – గడ్డం పుష్పలత మైసయ్య 19. ⁠నోముల – బత్తుల శృతి కరుణాకర్ రెడ్డి 20. ⁠సత్యంతండా – కొర్ర సాగర్ నాయక్ 21. ⁠చీదేడ్ – పంతం నవనీత వెంకటయ్య యాదవ్ 22. ⁠దాద్ పల్లి – నెనావత్ శాంతి రాజు నాయక్ 23. ⁠పటేల్ చెరువు తండా – మెగావత్ నిఖిత గణేష్ నాయక్ 24. ⁠తిప్పాయిగూడ – వొట్టి జంగమ్మ మల్లేష్ యాదవ్ సం/- *సత్తు వెంకటరమణారెడ్డి* జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ , రంగారెడ్డి జిల్లా

E-పేపర్

ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

అక్రమ నిర్మాణాలు కూల్చివేత ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేసిన కట్టడాలను ఇబ్రహీంపట్నం రెవెన్యూ అధికారులు కూల్చివే శారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఇబ్రహీంపట్నం మండలం, ఖానాపూర్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 80లో గ్యాప్ ఏరియా కింద ఉన్న ప్రభుత్వ భూమిలో గతంలో ఇది “ప్రభుత్వ భూమి” అని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ మరుసటి రోజే అందులో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం ఆ బోర్డులను తొలగిం చిన విషయం తెలిసిందే. తాజాగా మళ్ళీ ఇదే ప్రభుత్వ భూమిలో సుమారు 1000 గజాల వరకు స్థలాన్ని గురునా నక్ కాలేజ్ యాజమాన్యం ఆక్రమించి, అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. అందులో పిల్లర్స్ ను ఏర్పాటు చేయగా.. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు మంగళ వారం ఉదయం జేసీబీతో కూల్చివేతలు చేశారు. ఈ కార్యక్ర మంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సువర్ణ, సర్వేయర్ సాయి కృష్ణ రెడ్డి, గ్రామ పాలన అధికారులు శ్రీనివాస్, రాజు, మణికు మార్, వీఆర్ఎ మహేష్ పాల్గొన్నారు.

అన్నమయ్య

రాజంపేట జిల్లా కేంద్ర సాధనకై భారీ ర్యాలీ ​రాజకీయాలకతీతంగా పాల్గొనాలని చిట్వేలి జేఏసీ పిలుపు

రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ (గురువారం) మధ్యాహ్నం 1:30 గంటలకు శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నట్లు రాజంపేట జిల్లా కేంద్ర సాధన జేఏసీ ప్రకటించింది. స్థానిక పాత బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగనుంది. ​చిట్వేలి మండల వాసులకు పిలుపు: ​ఈ చారిత్రక పోరాటంలో చిట్వేలి మండలం నుంచి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని చిట్వేలి జేఏసీ ప్రత్యేకంగా పిలుపునిచ్చింది. రాజకీయాలకు అతీతంగా, ఏ పార్టీకి సంబంధం లేకుండా, మండలంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు, యువత, మేధావులు, విద్యావంతులు మరియు వ్యాపారస్తులు అధిక సంఖ్యలో హాజరై తమ మద్దతును తెలియజేయాలని కోరింది. ​చేయి చేయి కలుపుదాం: ​”సోదరులారా రండి, తరలిరండి! చేయి చేయి కలుపుదాం, మన భవిష్యత్తు కోసం పోరాడుదాం” అంటూ జేఏసీ నాయకులు ఉద్ఘాటించారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా సాధించడం కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన అంశం కాదని, ఇది ఈ ప్రాంత ప్రజలందరి భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విషయమని వారు స్పష్టం చేశారు. ​జై చిట్వేల్ జే.ఏ.సీ.

తూర్పు గోదావరి

బిక్కవోలులో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి “షష్ఠి” మహోత్సవం ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. బిక్కవోలు, 2 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) : బిక్కవోలు మండలం బిక్కవోలులో ప్రసిద్ద పుణ్యక్షేత్రం అయిన శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి “షష్ఠి” మహోత్సవం ముగింపు సందర్బంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అనంతరం శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి “షష్ఠి” మహోత్సవం ముగింపు సందర్బంగా విశిష్ట సేవలు అందించిన రెవిన్యూ సిబ్బందిని, మండల ప్రజా పరిషత్ సిబ్బందిని, పోలిస్ వారిని, దేవాదాయ శాఖ సిబ్బందిని, బిక్కవోలు పంచాయతీ సిబ్బందిని, ఆలయ కమిటీ సభ్యులను, గ్రామస్థులను సత్కరించి, జ్ఞాపికను అందచేసిన అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ ఆర్టీజీఎస్* *ఈ నెలాఖరు నుంచి డేటాలేక్ ద్వారా సమాచార విశ్లేషణ*

*శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ ఆర్టీజీఎస్* *ఈ నెలాఖరు నుంచి డేటాలేక్ ద్వారా సమాచార విశ్లేషణ* *ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మెరుగ్గా పౌరసేవలు* *ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం* *అమరావతి, విశాఖ పున్నమి ప్రతినిధి:-:* ప్రభుత్వ శాఖలన్నిటికీ కామన్ డేటా సెంటర్ గా ఆర్టీజీఎస్ వ్యవహరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నుంచి ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం అంతా క్రోడీకరించి డేటా లేక్ ద్వారా విశ్లేషించనున్నట్టు వెల్లడించారు. మంగళవారం సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజల్లో సానుకూల దృక్పథం పెరిగేలా మెరుగ్గా పౌరసేవలు అందించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజల నుంచి వస్తున్న సమాచారాన్ని విశ్లేషించి సేవలను సులభతరం చేయాలని ఆదేశించారు. సమాచార మాధ్యమాల్లో వచ్చిన వివిధ అంశాలపై స్పందించి చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రజలకు సంబంధించిన అంశాల్లో ఎక్కడా రాజీపడొద్దని వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 175 నియోజకవర్గాల్లోని స్వర్ణాంధ్ర విజన్ యూనిట్ల ద్వారా విస్తృత ప్రచారం జరగాలని అన్నారు. వ్యవసాయం, నీటి భద్రత, మార్కెటింగ్ తదితర, డిమాండ్ డ్రివెన్ పంటలు లాంటి అంశాలపై రైతన్నా…మీకోసం పేరిట రైతుల వద్దకు వెళ్లామని అన్నారు. ఏపీలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వివిధ సంస్థలు, కాంట్రాక్టర్లు నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించేలా డేటాను విశ్లేషించాలని సీఎం ఆదేశించారు. డిసెంబరు నెలాఖరులోగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన 794 సర్వీసులు వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక ప్రతీ నెలా జీఎస్డీపీ సహా ఎకనమిక్ ఇండికేటర్లను పరిశీలించనున్నట్టు తెలిపారు. కేంద్రానికి పంపే నివేదికలు కూడా కీ పెర్ఫార్మెన్సు ఇండికేటర్ల ఆధారంగానే ఉంటాయని,,, ఆ మేరకు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు సామర్ధ్యాలు పెంచుకోవాలని సూచించారు. ప్రజావసరాలకు అనుగుణంగానే పనులు చేపట్టాలని సీఎం సూచించారు.

తెలంగాణ

హాస్పిటల్ ను ఆకస్మికంగా తనిఖి చేసిన : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి ) నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనఖి చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ప్రసుతి వార్డులో పురుషులు ఉండడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేయాలని సూపరిండెంట్ ను కలెక్టర్ ఆదేశించారు.

తెలంగాణ

రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్ల పై వచ్చిన ఆప్పిళ్ల ను పరిశీలించిన: కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా నల్గొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్లపై వచ్చిన ఆప్పిళ్ల ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో పరిశీలించారు. నల్గొండ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో రిటర్నింగ్ అధికారులు తీరస్కరించిన నామినేషన్ల పై 19 ఆప్పిళ్ళు రాగా, అప్పిళ్లపై నిబంధనల ప్రకారం ఆర్ వో ల సమక్షంలో పరిశీలించి, ఆర్డీవో రూపొందించిన జాబితాను తీసుకొన్న నిర్ణయాలను ఆమె పరిశీలించారు. వచ్చిన 19 అప్పిళ్ల లో, 15 తిరస్కరణకు గురికాగా, నాలుగు అప్పిళ్ళు అంగీకరించినట్టు ఆర్డీవో అశోక్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

తెలంగాణ

అనధికార లేఅవుట్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదన్న : కలెక్టర్

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) లే అవుట్లకు సంబంధించిన భూసేకరణ అనుమతులను జాగ్రత్తగా పరిశీలించాలని, అనధికార లేఔట్లను, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. భూ రికార్డులు, డ్రైనేజీ, రోడ్లు వెడల్పులు, నీటిపారుదల మార్గాలన్నీ, శాస్త్రీయ పద్ధతిలో ఉండాలని చెప్పారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని అత్యవసర కాలువలు ఫుల్ ట్యాంక్ లెవెల్(ఎఫ్ టీ ఎల్) పరిరక్షణపై రాజీ పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.

విశాఖపట్నం

జి వి ఎం సి 3 జోన్ లో డిసెంబర్ 09న బహిరంగ వేలం

జి వి ఎం సి 3వ జోన్ లో డిసెంబరు 09న బహిరంగ వేలం *విశాఖపట్నo పున్నమి ప్రతినిధి:-* మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 3వ జోన్ (ఆశీలు మెట్ట) పరిధిలో ఖాళీగా వున్న షాపు రూములు, కమ్యూనిటీ హాల్ లకు డిసెంబరు 09న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం నిర్వహించబడునని 3వ జోనల్ కమిషనర్ కె.శివప్రసాద్ మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. 3వ జోన్ పరిధిలో గల యం.వి.పి కాలనీ వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.10,11,12,13,14,15&16 లకు, డైమండ్ పార్క్ వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.08 , 09 లకు, జగ్గారావు బ్రిడ్జి వాణిజ్య సముదాయములో షాప్ రూమ్ నెం.06 నకు మరియు బి.టి.ఆర్ కాలనీ, రెల్లివీధి లో గల కమ్యూనిటీ హాల్ లకు 3 సంవత్సరముల కాలమునకు గుత్తలకు ఇచ్చుటకు గాను తేది: 09-12-2025 న ఉదయం 11 గంటలకు జీవీఎంసీ జోన్-3 ఆశీలు మెట్ట జోనల్ కార్యాలయంలో బహిరంగ వేలం నిర్వహించబడునని, ఆసక్తి గల పాటదారులు పూర్తి వివరాలకు 3వ జోనల్ కమిషనర్ కార్యాలయం లోని పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలియజేశారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.