Tuesday, 17 March 2026

Blog

వనపర్తి

గజిటెడ్ ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్

*ఘనంగా పదవీ విరమణ మహోత్సవం* *పున్నమి ప్రతినిధి, 3 /12/ 2025* *దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అనేకమంది విద్యార్థులను భవిష్యత్ తరాలకు అందించిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన శ్రీ మద్దిలేటి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనాపూర్ గారికి జిల్లా నలుమూలల నుంచి వారి శిష్య బృందం ఉపాధ్యాయ బృందం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది వారితోపాటు విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగింది*

వనపర్తి

గజిటెడ్ ప్రధానోపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్

*ఘనంగా పదవీ విరమణ మహోత్సవం* *పున్నమి ప్రతినిధి, 3 /12/ 2025* *దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అనేకమంది విద్యార్థులను భవిష్యత్ తరాలకు అందించిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన శ్రీ మద్దిలేటి గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మదనాపూర్ గారికి జిల్లా నలుమూలల నుంచి వారి శిష్య బృందం ఉపాధ్యాయ బృందం వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ మెమొంటో, శాలువాతో ఘనంగా సత్కరించడం జరిగింది వారితోపాటు విద్యార్థులు ఘనంగా సన్మానించడం జరిగింది*

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వివాహిత ఆత్మహత్య

దుత్తలూరు Date:03-12-2025 దుత్తలూరు మండలం నందిపాడు గ్రామం లో షైక్ కుబ్రా (18) అనే మహిళా ఆత్మహత్య చేసుకుంది, సమాచారం అందుకున్న దుత్తలూరు SI ఆదిలక్ష్మి కేసు నమోదు చేసివిచారణ చెప్పట్టారు. సంఘటనకి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది,

అన్నమయ్య

చిట్వేల్‌లో 09 ఎస్జీటీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

-ఒప్పంద ప్రాతిపదికన అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ నియామకం – రేపు సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేయాలి: ఎంఈఓ ఖాజా మొహిద్దీన్ చిట్వేల్, డిసెంబర్ 3: పున్నమి ప్రతినిధి చిట్వేల్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 09 స్కూల్ అసిస్టెంట్ (ఎస్జీటీ) పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యా శాఖాధికారి (ఎంఈఓ) ఖాజా మొహిద్దీన్ తెలిపారు. సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) నిధుల నుండి ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులను తాత్కాలికంగా భర్తీ చేయనున్నారు. -పోస్టుల వివరాలు, వేతనం ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు పది వేల రూపాయలు (రూ. 10,000/-) గౌరవ వేతనంగా చెల్లించబడుతుంది. మండలంలో ఖాళీగా ఉన్న 09 ఎస్జీటీ పోస్టులు ఉన్న పాఠశాలల వివరాలు కింద ఇవ్వబడ్డాయి: పాఠశాల పేరు పాఠశాల రకం పోస్టుల సంఖ్య ఎంపీపీఎస్ మాలే మార్పురం ప్రాథమిక 1 ఎంపీపీఎస్ చెన్నమ రాజు పోడు ప్రాథమిక 1 జడ్పీపీహెచ్ఎస్ కె. కందులవారిపల్లి ఉన్నత 1 ఎంపీపీఎస్ గట్టుమీద పల్లి ప్రాథమిక 1 ఎంపీపీఎస్ చెర్లో పల్లి ప్రాథమిక 1 జడ్పీహెచ్ఎస్ వెంకటరాజు పల్లి ఉన్నత 1 ఎంపీపీఎస్ తుమ్మకొండ అగ్రహారం ప్రాథమిక 1 ఎంపీపీఎస్ సీఎం రాచ పల్లి ప్రాథమిక 1 జడ్పీహెచ్ఎస్ నాగవరం ఉన్నత 1 మొత్తం 09 -దరఖాస్తు విధానం ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ఫారం, అందుకు అవసరమైన అర్హత గల సర్టిఫికెట్లను జతపరిచి రేపు (డిసెంబర్ 4, గురువారం)సాయంత్రం 05:00 గంటలలోపుచిట్వేల్ మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయంలో అందజేయాలని ఎంఈఓ ఖాజా మొహిద్దీన్ గారు కోరారు.

E-పేపర్

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో గుండెపోటుతో ఎస్ఐ సంజయ్ సావంత్(58) మృతి

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో గుండెపోటుతో ఎస్ఐ సంజయ్ సావంత్(58) మృతి రాత్రి పీఎస్ బ్యారక్‌లో పడుకొని, నిద్రలోనే గుండెపోటుకు గురైన ఎస్ఐ సంజయ్ సావంత్ ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని సిబ్బంది గమనించి కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించిన డాక్టర్లు 1989 బ్యాచ్ కానిస్టేబుల్ నుండి 2011లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2020లో ఏఎస్ఐగా, 2023లో ఎస్ఐగా పదోన్నతి పొందిన సంజయ్ సావంత్

అన్నమయ్య

రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రాష్ట్ర స్థాయి అవార్డు

-ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ నుండి ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్’ అవార్డు – మంత్రి సత్య కుమార్ చేతుల మీదుగా డాక్టర్ ప్రేమలతకు ప్రదానం చిట్వేల్, డిసెంబర్ 3: పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ నియంత్రణ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. -విజయవాడలో అవార్డు ప్రదానం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి వారి కళాక్షేత్రంలో జరిగిన బహుమతుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును అందించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం చేతుల మీదుగా కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ. ప్రేమలత అవార్డును స్వీకరించారు.లెర్నింగ్ మాడ్యూల్ పై బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఐఈసీ యాక్టింగ్’ క్రింద ఈ అవార్డు కళాశాలకు దక్కింది. -ప్రిన్సిపాల్ హర్షం ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తమ కళాశాలకు రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రావడానికి నిరంతరం కృషి చేసిన కో-ఆర్డినేటర్ డాక్టర్ ఇ. ప్రేమలత గారిని, ఆమె కష్టపడి ప్రతి కార్యక్రమం నిర్వహించడం వల్లే ఈ గుర్తింపు వచ్చిందని కొనియాడారు. ప్రిన్సిపాల్‌తో పాటు అధ్యాపకులు సైతం డాక్టర్ ప్రేమలతను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి దాసరి మోషే, ఐక్యూఏసీ కో-ఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, కెమిస్ట్రీ లెక్చరర్ కె.పి. కృష్ణమూర్తి, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

కామారెడ్డి

కామారెడ్డి జిల్లా పల్లెపోరు వేడి వేడి పీక్‌లో.. ‘విత్‌డ్రా నో సై!’

డ్రామాతో గ్రామాలు మండుతున్నాయి! కామారెడ్డి, 03డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) : రాజకీయ గూండాగిరి, బెదిరింపులు, ఒత్తిడులతో అభ్యర్థులు ఉపసంహరణలకు లొంగుతున్నారు. తెలంగాణ ఎన్నికల కమిషన్ కఠిన ఆదేశాలు జారీ చేసినా, ప్రధాన పార్టీల మధ్య ఏకగ్రీవ ఆధిపత్య పోరు ఊపందుకుంది. గ్రామాల్లో బాయ్‌ కాట్ రచ్చ, మల్లుపల్లి, సదాశివనగర్, పోసానిపేటలో గ్రామస్తు లు నామినేషన్లు బాయ్‌కాట్ చేసి రోడ్ల మీదుగా పడిపోయారు. రోడ్లు, బ్రిడ్జ్‌లు లేకపోవడం, సర్పంచ్ పదవి ప్రయోజనం లేకపోవడంపై ఆగ్రహం.. రామా రెడ్డి మండలంలో పోటీకి సై చెప్పాలని గ్రామవా సులు మొరపెట్టుకున్నారు. మహిళల ఓటు బలం (3,32,209) పురుషుల కంటే ఎక్కువగా ఉండటం తో అభ్యర్థులు అమ్మలక్కలను ప్రసన్నం చేసుకుం టున్నారు.కమిషన్ కొట్టుకొట్టి చూపులుఎన్నికల కమిషన్ బెదిరింపులు ఆపాలని, ఉపసంహార ణలకు రాతపూర్వక ప్రకటనలు తప్పనిసరి అని డైరెక్టర్లు. తప్పులేదంటే ఎన్నికలు రద్దు, పోలీస్ కేసులు ఖాయం. కానీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ 80% పంచాయతీల్లో తమ బలపరిచినవారినే గెలిపిస్తామని ఘోషణ. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒత్తిడి తెచ్చి ఉపసంహరణలు చేయిస్తున్నారని ఆరోపణలు.మూడు విడతల్లో పోలింగ్ వేడి డిసెంబర్ 11,14,17 తేదీల్లో 532 పంచాయతీలు, 4656 వార్డులకు పోలింగ్. నామినేషన్లు డిసెంబర్ 2 వరకు, ఉపసంహరణలు 6వ తేదీ. రిజర్వేషన్లు ఖరారై, మహిళల ఓటు బలంతో పోరు ఊపు పెరి గింది. రామారెడ్డి, మాచారెడ్డి మండలాల్లో యువ కులు, రైతులు పోటీలో దూసుకొచ్చారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

విద్యుత్ ప్రాజెక్టులకు 60 రోజుల్లో కార్యాచరణ

రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సమస్యలుంటే పరిష్కరించి అనుమతులు ఇవ్వాలని అన్నారు. విద్యుత్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు. విద్యుత్ సంస్థలు తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్ని, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పోలవరం కనెక్టివిటీ పనుల కోసం ₹542.85 కోట్లు విడుదల

పోలవరమ్ ప్రాజెక్టు కనెక్టివిటీ పనుల కోసం భారీగా ₹542.85 కోట్లు ప్రభుత్వం ఆమోదించింది. ఆమోదించబడిన ముఖ్య పనులు: కుడి వైపు కనెక్టింగ్ రోడ్లు నిర్మాణం పోలవరం గ్రామం నుంచి స్పిల్ వే, టన్నెల్స్ వరకు రహదారుల కోసం ₹117.80 కోట్లు. ఎడమ వైపు కనెక్టింగ్ రోడ్లు (Gap-I నుంచి PIPLMC వరకు 21 km) ద్వారా మెరుగైన రాకపోకల కోసం ₹217.55 కోట్లు. పురుషోత్తపట్నం వద్ద గండి పోషమ్మ తల్లి ఆలయ రక్షణ పనులు ₹207.50 కోట్లు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎకనామిక్ కారిడార్గా అమరావతి

ఎకనామిక్ కారిడార్గా రాజధాని అమరావతి రూపుదిద్దుకుంటోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అమరావతి ఎకనామిక్ జోన్లో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, త్వరలో ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలుంటాయి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.