Tuesday, 17 March 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

కృష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాల వాలీబాల్ టోర్నమెంట్ విజేతగా నిలిచిన శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల

కృష్ణ యూనివర్సిటీ వాలీబాల్ మహిళా జట్టు విజేత శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళ కళాశాల….. 3. 12. 2025 వ తేదీన జరిగిన కృష్ణ యూనివర్సిటీ అంతర్ కళాశాల వాలిబాల్ పోటీలు శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించడం జరిగినది. ఈ టోర్నమెంటులో శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల వాలీబాల్ జుట్టు విజేతగా నిలిచినది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం కుమార్ గారు తెలిపారు. సిద్ధార్థ మహిళా కళాశాల ప్రథమ స్థానంలోనూ, పద్మావతి మహిళా కళాశాల(మచిలీపట్నం) ద్వితీయ స్థానంలోనూ …మేరీస్ స్టెల్ల కళాశాల (విజయవాడ), తృతీయ స్థానంలోనూ…. పిబి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నాలుగవ స్థానంలోనూ నిలిచాయి. P. అంకిత (థర్డ్ బిఎ). S. సంజన S. దీప్తి D .దీవెన . D. దివ్య (SECOND BA) N. మహేశ్వరి వి. తనుశ్రీ లను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి కుమార్ గారు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమ ,కోచ్, మరియు యాజమాన్యం. .. కళాశాల సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమ మాట్లాడుతూ చెన్నై లో డిసెంబర్ 15వ తేదీ నుంచి 19.2025 వరకు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరగబోయే సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొనబోతున్నారని తెలియజేశారు ఈ సందర్భంగా ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ హేమాను, వాలీబాల్ టీం ను ….సిబ్బందిని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు.

కడప

సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్:: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల సాధక బాధకాలు తెలుసుకొనేందుకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారు 4-12- 2025 న ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు నియోజకవర్గం లో ఉండే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టి కి తావాలని,ఎవరైనా అధికారులు ప్రజలని ఇబ్బంది పెడుతుంటే స్వయంగా ఆయనకే ఫోన్ చేసి తెలియచేయాలని అన్నారు అందరూ ఈ ప్రజా దర్బార్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన తెలియజేశారు

తూర్పు గోదావరి

గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.

తూర్పు గోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి ✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు న్యూస్ రిపోర్టర్. అనపర్తి, 4 డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) : బుధవారం ఉదయం గం. 11:30 లకు తూర్పుగోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల రైతు సేవా కేంద్రంలో “రైతన్నా… మీకోసం” వర్క్ షాప్ లో పాల్గొనడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలికిన అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, యువ నాయుకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి.

విశాఖపట్నం

జీవీఎంసీ నూతన జోనల్ కార్యాలయాలను పరిశీలించిన కమిషనర్.

జీవీఎంసీ నూతన జోనల్ కార్యాలయాలను పరిశీలించిన కమిషనర్. *విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలక సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెండు జోనల్ కార్యాలయాలను మంజూరు చేసిన నేపథ్యంలో 51 వ వార్డు మాధవధార వుడా లేఔట్ లో నిర్మాణ దశలో ఉన్న జీవీఎంసీ నార్త్ జోన్ కార్యాలయాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఆ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన నార్త్ జోన్ కార్యాలయంలో అన్ని సదుపాయాలతో విధులు కార్యాచరణకు సిద్ధం చేయాలని , వార్డు నెంబర్ 85 లో రాజీవ్ గాంధీ కల్యాణ మండపం లో తాత్కాలికంగా అగనంపూడి జోనల్ కార్యాలయాన్ని ఏర్పాటుకు డిసెంబర్ 15 తేదీ నాటికి పూర్తి చేసి సిద్ధం చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణరాజును ఆదేశించారు. బుధవారం ఆయన మాధవధార వుడా లేఅవుట్ లో తాత్కాలికంగా సిద్ధం చేసిన నార్త్ జోన్ కార్యాలయాన్ని, అగనంపూడి లో తాత్కాలికంగా అగనంపూడి జోనల్ కార్యాలయం ఏర్పాటుకు సూచించిన రాజీవ్ గాంధీ కళ్యాణమండపాన్ని అదనపు కమిషనర్ డివి రమణమూర్తి, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉత్తర్వుల మేరకు ప్రస్తుతమున్న మహా విశాఖ పట్నం నగరపాలక సంస్థ 8 జోన్లకు బదులుగా 10 జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అందులో నార్త్ జోన్ ఏర్పాటు చేయుటకు వార్డ్ 51 నందు మాధవధార వుడా లేఔట్ లో నిర్మాణ దశలో ఉన్న మూడంతస్తుల భవనాన్ని పరిశీలించి భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధాన ఇంజనీర్ కు ఆదేశించారు. ఆ సమీపంలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన నార్త్ జోన్ కార్యాలయంలో అన్ని విభాగాలను , నియమించిన అధికారులు, ఉద్యోగుల కేటాయింపును పరిశీలించి , విధులకు కావలసిన ఫర్నిచర్, స్టేషనరీ, లైటింగ్ ,ఫ్యాన్స్ ,నేమ్ బోర్డ్స్, ఎంట్రెన్స్ గ్లో సైన్ బోర్డ్ ,కంప్యూటర్ సిస్టమ్స్, టేబుల్స్, చైర్స్ ,వీడియో కాన్ఫరెన్స్ సిస్టం, పార్కింగ్ స్పేస్ ,ల్యాండ్ స్కేప్ తదితర అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి కార్యాచరణకు సిద్ధం చేయాలని ప్రధాన ఇంజనీర్ కు, జోనల్ కమిషనర్ బి.రాము కు ఆదేశించారు. అనంతరం ఎన్.ఎ.డి. కొత్త రోడ్డు సమీపంలో వెస్ట్ జోన్ కార్యాలయం ( ప్రస్తుతం జోన్ 5 జ్ఞానాపురం కార్యాలయం) శాశ్వతంగా ఏర్పాటు చేసుకునేందుకు అనువైన స్థల పరిశీలన చేయాలని జోనల్ కమిషనర్ బి. రాముకు ఆదేశించారు. అనంతరం 85వ వార్డులో రాజీవ్ గాంధీ కళ్యాణ మండపాన్ని పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన అగనంపూడి జోన్ కార్యాలయాన్ని తాత్కాలికంగా స్టేడియంలో ఏర్పాటు చేసేందుకు పెయింటింగ్ వేసి,అన్ని మౌలిక సదుపాయాలతో డిసెంబర్ 15 నాటికి జోనల్ కార్యాలయం కార్యాచరణకు సిద్ధం చేయాలని పర్యవేక్షక ఇంజనీరు గోవిందరావుకు కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు, జోనల్ కమిషనర్ బి.ఆర్.ఎస్ శేషాద్రి, పర్యవేక్షక ఇంజనీరు సంపత్ కుమార్, కార్యనిర్వాహక ఇంజనీర్లు పద్మావతి, తారా ప్రసన్న ,దిలీప్ , ఎం.ఆర్.ఎస్. అప్పారావు, ఉపకార్య నిర్వహక ఇంజనీరు భరణి కుమార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వెంకట్రావు, సహాయక వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్, ఏపీడి పుణ్యవతి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప‌రిష్కారంలో ప్ర‌త్యేక చొర‌వ చూపాలి*

*ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప‌రిష్కారంలో ప్ర‌త్యేక చొర‌వ చూపాలి* *స‌ఫాయి క‌ర్మ‌చారీల‌కు ఉపాధి శిక్ష‌ణ ఇవ్వాలి, పారిశుద్ధ్య కార్మికులకు తోడ్పాటు అందించాలి *జిల్లా విజిలెన్స్ అండ్ మాన‌ట‌రింగ్ క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ *విశాఖపట్నం నవంబర్ 3 పున్నమి ప్రతినిధి:-* ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల ప‌రిష్కారంలో అధికారులు, పోలీసులు ప్ర‌త్యేక చొర‌వ చూపాల‌ని, ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ల సాయం తీసుకొని త్వ‌ర‌గా ఫ‌లితాలు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హరేంధిర ప్ర‌సాద్ సూచించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో బుధ‌వారం సాయంత్రం జ‌రిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మాన‌ట‌రింగ్ క‌మిటీ స‌మావేశంలో ఎమ్మెల్సీ పండుల ర‌వీంద్ర‌బాబు, సీపీ శంఖ‌బ్ర‌త బాగ్చీలతో క‌లిసి ఆయ‌న పాల్గొన్నారు. గ‌త స‌మావేశంలో చ‌ర్చించిన అంశాలు, తీసుకున్న చ‌ర్య‌ల‌పై అధికారుల‌ను ఆరా తీశారు. విచార‌ణ పూర్త‌యిన కేసుల్లో పీపీల సాయం తీసుకొని ముందుకు సాగాల‌ని, విచార‌ణ ద‌శ‌లో ఉన్న‌వాటిలో వేగం పెంచాల‌ని సూచించారు. విచార‌ణ‌ ద‌శ‌లో 113, పెండింగ్ ట్ర‌యిల్ లో 689 కేసుల విష‌యంలో అధికారులు, పీపీలు స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. బాధితుల‌కు నిర్ణీత కాలంలో న‌ష్ట‌ప‌రిహారం అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల విచార‌ణ‌, ద‌ర్యాప్తు విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని, బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌ని పేర్కొన్నారు. *స‌ఫాయి క‌ర్మ‌చారీల‌కు, వారి కుటుంబ స‌భ్యుల‌కు ఉపాధి శిక్ష‌ణ‌* స‌ఫాయి క‌ర్మ‌చారీలుగా ప‌ని చేసిన వారికి, వారి కుటుంబ స‌భ్యుల‌కు ఉపాధి శిక్ష‌ణ అందించాల‌ని, త‌ద్వ‌రా స్వ‌యం ఉపాధి లేదా కంపెనీల్లో ఉద్యోగావ‌కాలు క‌ల్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. వీరిని గుర్తించేందుకు ఇప్ప‌టికే నిర్వ‌హించిన స‌ర్వే వివ‌రాల‌ను ప‌రిశీలించిన ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేశారు. త్వ‌రిత‌గ‌తిన వీరంద‌రికీ సెమ్స్, జిల్లా నైపుణ్య సంస్థ‌ల ద్వారా శిక్ష‌ణ ఇప్పించాల‌ని సూచించారు. రైల్వే సంస్థలో ప‌ని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల స్థితిగ‌తుల‌పై ప్ర‌త్యేక ప‌రిశీల‌న చేయాల‌ని చెప్పారు. రుణ స‌దుపాయం క‌ల్ప‌న‌లో, గృహ నిర్మాణ ప‌థ‌కాల్లో ప్రాధాన్య‌త ఇచ్చి స‌హ‌క‌రించాల‌న్నారు. ప‌ని ప్రాంతాల్లో వారికి ప్ర‌త్యేక వ‌స‌తులు క‌ల్పించాల‌ని చెప్పారు. రైల్వే ప‌రిధిలో స‌ఫాయి క‌ర్మ‌చారీల స‌మ‌స్య‌ల‌పై స‌భ్యులు కొన్ని స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌గా సానుకూలంగా స్పందించి చ‌ర్య‌ల‌కు ఉప క్ర‌మించాల‌ని క‌లెక్ట‌ర్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. 37వ వార్డులో సుల‌భ్ కాంప్లెక్స్ నిర్వ‌హ‌ణ అధ్వానంగా ఉంద‌ని, నీరు లేద‌ని క‌మిటీ స‌భ్యుడు క‌లెక్ట‌ర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఆయ‌న న‌గ‌ర ప‌రిధిలోని అన్ని సుల‌భ్ కాంప్లెక్సుల‌ను ప‌రిశీలించాల‌ని, ర‌న్నింగ్ వాట‌ర్ ఏర్పాటు చేయాల‌ని జీవీఎంసీ అధికారుల‌కు సూచించారు. ఎస్సీ, ఎస్టీ వ‌స‌తి గృహాల్లో మ‌రుగుదొడ్ల నిర్వ‌హ‌ణ‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. స‌మావేశాల్లో పండుల ర‌వీంద్ర‌బాబు, పోలీస్ క‌మిష‌న‌ర్ శంఖ‌బ్ర‌త బాగ్చీ, డీసీపీలు మణికంఠ‌, మేరీ ప్ర‌శాంతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కె. రామారావు, ఇన్ఛార్జి డీఆర్వో స‌త్తిబాబు, విశాఖ ఆర్డీవో సుధాసాగ‌ర్, ప‌లువురు ఏసీపీలు, వివిధ విభాగాల అధికారులు, క‌మిటీ స‌భ్యులు శ్రీ‌నివాస‌రావు, రాంబాబు, ఆంజ‌నేయ‌, మాల‌తి త‌దిత‌రులు పాల్గొన్నారు.

అమరావతి

గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు:పవన్*

*గ్రామస్థాయిలో ఐదుగురితో జనసేన కమిటీలు:పవన్* అమరావతి పున్నమి ప్రతినిధి:- పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. తమ ప్రాంత అభివృద్ధి, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకెళ్లామని పవన్ దిశానిర్దేశం చేశారు. జనసేన కమిటీల నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయిలో ఐదుగురితో కమిటీని నియమించాలని.. గ్రామాభివృద్ధిలో వారు భాగమయ్యేలా చేద్దామన్నారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలకు ఐదుగురు చొప్పున సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. నామినేటెడ్ పదవులపైనా పవన్ సమీక్షించారు. రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు జనసేన పొందిన పదవుల వివరాలను పవన్ పరిశీలించారు. మిగిలిన పదవుల భర్తీపై ఆయన పలు సూచనలు చేశారు. కూటమి ధర్మాన్ని అనుసరించి ముందుకెళ్లడంతో పాటు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన వారికి వివిధ దశల్లో గుర్తింపు, బాధ్యతలు అందించే దిశగా ప్రయాణిస్తున్నామని చెప్పారు. పార్టీ అంతర్గత వ్యవహారాలకు సంబంధించి నెలకొనే అంశాలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన కాన్స్ట్ఫిక్ట్ మేనేజ్మెంట్ విభాగాన్ని కేంద్ర కార్యాలయం నుంచే పర్యవేక్షించాలని పవన్ స్పష్టం చేశారు. ఈ విభాగంలో 11 మంది వరకూ సభ్యులను నియమించాలని నిర్ణయించారు. ఇకపై ప్రతి కమిటీలో మహిళలకు స్థానం కల్పించాలన్నారు. అయిదుగురు సభ్యులు ఉండే కమిటీలో తప్పనిసరిగా ఒకరు, గరిష్ఠంగా ఇద్దరు వీర మహిళలు సభ్యులుగా ఉండాలని చెప్పారు. 11మంది సభ్యులు ఉండే కమిటీలో ముగ్గురు వీర మహిళలకు స్థానం కల్పించాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీతారామపురం మండలం రంగనాయుడుపల్లిలో గ్రామంలో బెట్టింగ్ యాప్ కు యవకుడు బలి

సీతారామపురం మండలం రంగనాయుడుపల్లిలో గ్రామంలో ఆన్లైన్ బెట్టింగ్ లో రూ.26 లక్షలు పోగొట్టుకొని ఉరివేసుకొని వల్లేపు ప్రతాప్ అనే యువకుడు మృతి చెందాడు వివరాలు మేరకు సీతారామపురం మండలం రంగనాయుడుపల్లిలో జరిగింది గ్రామానికి చెందిన వల్లెపు ప్రతాప్ గ్రామస్తుల వద్ద అప్పులు చేసి రెండు నెలల నుంచి ఊరు వదిలి ఇతర ప్రాంతాల్లో ఉన్నాడు ఈ కార్యక్రమంలో మంగళవారం దుత్తలూరు లోనీ తన సోదరుడు ఇంటికి వచ్చి బుదవారం ఊరి వేసుకొని చనిపోయారు దుత్తలూరు ఎస్ ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విశాఖపట్నం

పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ సర్కిల్ -3 ఏ.ఎస్.వో టీ.

పది వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డ సర్కిల్ -3 ఏ.ఎస్.వో టీ. విశాఖపట్నం నవంబర్ 3 పున్నమి ప్రతినిధి:- ఆరు నెలల క్రితం రేషన్ బియ్యంతో పట్టుబడిన రెండు ఆటోలని పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు వాటిని సీజ్ చేశారు. పట్టుబడిన ఆటోలను విడుదల చేయమని హైకోర్టు ఆదేశాలు అనుసరంగా జిల్లా జాయింట్ కలెక్టర్ కూడా భాధితుల పక్షాన ఆటోలు విడుదలకి సర్కిల్ -3 ఏ.ఎస్.వో కృష్ణకి ఆదేశాలు జారీ చేశారు. రెండు ఆటోలు విడుదలకి నెల రోజులగా ఏ. ఎస్. వో కృష్ణ చుట్టు బాధితులు తిరుగుతున్నారు. ఆటోలు విడుదలకి 10 వేలు డిమాండ్ చేయగా లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితులు ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేయగ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకి ఏ. ఎస్. వో కృష్ణ పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి ఏసీబీ డిఎస్పీ రమణ మూర్తి దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో యువతి ఆత్మహత్య

దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో షేక్ కుబ్రా18 అనే వివాహిత అత్మహత్యకు.పాల్పడింది ఏడు నెలల క్రితం నందిపాడుకు చెందిన మహ్మద్ రఫీ అనే యువకుడితో వివాహం జరిగినట్టు సమాచారం ఈ మేరకు దుత్తలూరు ఎస్ఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది.

తెలంగాణ

మండల విహాన్ ప్రబోధ్ జన్మదిన సందర్భంగా బద్దిపడగ అంగన్వాడి కేంద్రానికి బహుమతిగా సీలింగ్ ఫ్యాన్ ఇవ్వడం జరిగింది

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలోని అంగన్వాడీ పాఠశాలకు మండల గణేష్ కళ్యాణి గారు తమ కుమారుడు మండల విహాన్ ప్రబోధ్ జన్మదిన సందర్భంగా అంగన్వాడి కేంద్రానికి సీలింగ్ ఫ్యాన్ బహుమతిగా ఇవ్వడం జరిగింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.