Monday, 16 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విద్యార్థుల భవిష్యత్‌కు తల్లిదండ్రుల పాత్ర కీలకం: చిన్నా జనసేన”

మర్రిపాడు మండల కేంద్రంలోని జెడ్పి ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ – మెగా 3.0 కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ చిన్నా జనసేన పాల్గొని తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల భాగస్వామ్యం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంత కీలకమో వివరించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సమగ్ర ప్రగతికి తల్లిదండ్రుల సహకారం అవసరమని ఆయన సూచించారు. ఉపాధ్యాయులతో కలిసి పనిచేస్తే పాఠశాల ర్యాంకులు మరింత మెరుగవుతాయని చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిల్లల భవిష్యత్ కోసం చేతులు కలిపిన తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు”

అనపర్తి, డిసెంబర్ 5 (పున్నమి ప్రతినిధి): శ్రీ రామారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 ఘన విజయవంతమైంది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పులగం వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అనపర్తి నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ & డిప్యూటీ కలెక్టర్ శ్రీ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన, తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల మధ్య సమన్వయం బలపడితేనే విద్యార్థుల పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమావేశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి కారణం పిల్లల శ్రేయస్సు, భవిష్యత్ బలోపేతమని చెప్పారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు పూర్తిస్థాయి సహకారం అందించాలని ఆయన సూచించారు. ఎంఆర్ఓ శ్రీ అనిల్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాశాఖల అందరి ఉమ్మడి లక్ష్యమని తెలిపారు. మాక్ అసెంబ్లీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థి జీవీవీ సతీష్ ను స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేకంగా అభినందించారు. తదుపరి పాఠశాలలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం ను ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ–II శ్రీ నల్లమిల్లి సత్తిరెడ్డి, మామిడి శెట్టిశ్రీను, ధర్మాసుల సతీష్, రాయి పెద్దిరాజు, లోవరాజు, శ్రీను, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సముద్రతీర సేవలకు చిరస్మరణం – ఝాన్సీ రాణి సత్కారం”

నెల్లూరు, డిసెంబర్ 5 (పున్నమి ప్రతినిధి): వైద్య–ఆరోగ్యశాఖలో 37 ఏళ్లపాటు ప్రజలకు సమర్పణతో సేవలందించిన రామతీర్థం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పబ్లిక్ హెల్త్ నర్స్ శ్రీమతి కొండా ఝాన్సీ రాణి గారి రిటైర్మెంట్ మహోత్సవాన్ని ఏపీ ఎన్జీ జివో హోమ్, ఎం.జి.బి మాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు, గౌరవాధ్యక్షురాలు శ్రీమతి ఆర్. ఇందిర పాల్గొని ఝాన్సీ రాణిని సన్మానించారు. మైపాడు, రామతీర్థం వంటి సముద్ర పరివాహక ప్రాంతాలలో ఎక్కువకాలం పనిచేసిన ఆమె వేలాది మంది మహిళలకు సురక్షిత ప్రసవాలు, చిన్నారులకు టీకాలు అందించడంలో కీలక పాత్ర పోషించినట్టు వక్తలు కొనియాడారు. సేవా మూర్తిగా, పేదల ఆరోగ్య దేవతగా ప్రజల్లో విశేష గౌరవం సంపాదించిన ఝాన్సీ రాణి తోటి ఉద్యోగులకు వెన్నుదన్నుగా నిలుస్తూ మంచి నాయకత్వం చూపినట్టు తెలిపారు. ఆమె భర్త, స్వర్గీయ బాలసుబ్రమణ్యం కూడా హెల్త్ సూపర్వైజర్‌గా సేవలందించి పేదల డాక్టర్‌గా పేరు గాంచిన విషయాన్ని స్మరించారు. కార్యక్రమానికి విచ్చేసిన వారి కుమార్తె జయశ్రీ దుర్గ, అల్లుడు శివకుమార్ ప్రత్యేకంగా ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆమె సేవల వీడియో ప్రదర్శనను చూపించారు. ఈ సందర్భంగా ఏపీ మెడికల్ & హెల్త్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపకులు ఏ.హరిబాబు, డాక్టర్ సులోచనమ్మ, సాయిరాం హాస్పిటల్ అధినేత డాక్టర్ కె.లలితా షిర్డీషా, అసోసియేషన్ జిల్లా సెక్రటరీ కల్పం శ్రీనివాసులు, జనవిజ్ఞాన వేదిక స్టేట్ ప్రెసిడెంట్ నమ్మి స్వరాజ్యలక్ష్మి, కొండా కనకరాజు, పి.ఎల్.రావు, రిటైర్డ్ నాయకులు ప్రపుల్ల, భవాని, వసంత, అరుణా రాణి, ఏపీ హంస సిటీ సెక్రెటరీ మంజరి, రూరల్ తాలూకా వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీకాంతమ్మ తదితరులు ప్రసంగిస్తూ ఝాన్సీ రాణి సేవలను శ్లాఘించారు.

తెలంగాణ

పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరు పై సమీక్ష నిర్వహించిన : కలెక్టర్

నకిరేకల్ : డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) ప్రతి విద్యార్థి ఉపకార వేతనం పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆమె మండల విద్యాశాఖ అధికారులు, సంక్షేమ శాఖల అధికారులతో, పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్ల మంజూరు పై సమీక్ష నిర్వహించారు. వచ్చే శుక్రవారం నాటికి జిల్లాలో స్కాలర్షిప్ల దరఖాస్తులు 30% దాటాలని ఆమె లక్ష్యాన్ని విధించారు.

తెలంగాణ

డిసెంబర్ 7న : సాయుధ దళాల దినోత్సవం

నకిరేకల్ :డిసెంబర్ ( పున్నమి ప్రతినిధి ) డిసెంబర్ 7న నిర్వహించనున్న సాయుద దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి త్రివిధ దళాలకు బాసటగా డొనేషన్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ త్రివిధ దళాలు ఎల్లవేళలా దేశాన్ని సంరక్షిస్తున్నందునే అందరూ ప్రశాంతంగా ఉన్నామని, అలాంటి సైనికులకు సహకారం అందించడంలో ప్రతి ఒక్కరు బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.

విశాఖపట్నం

గానగంధర్వులు ఘంటసాల . 13వ జయంతి.

విశాఖ డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) సందర్భంగా మాధవధార vu డా కాలనీ ఈస్ట్ పార్కు నందు కేఎన్ఆర్ ఫ్రెండ్స్ మరియు మస్తాన్ ఆర్కెస్ట్రా విజయనగరం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల సినీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని జెడి ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్. కారుముడి అను. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా కేత నాగేశ్వరరావు మరియు ఇతర గాయకులు ఘంటసాల . సినీ గేయాలను అద్భుతంగా ఆలపించారు ఈ కార్యక్రమానికి వి గోవిందరాజు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ ఘంటసాల . పాటలను ఆలపించారు. కార్యక్రమం ఆద్యంతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

విశాఖపట్నం

పాత్రికేయులు పట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదు : జాప్ విశాఖ జిల్లా అధ్యక్షులు కే ఎం కీర్తన్.

విశాఖ డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం : పాత్రికేయుల పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీవ్ర నిర్లక్ష్య వైఖరి పై జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా శాఖ అధ్యక్షులు కేఎం కీర్తన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయులకు అక్రిడేషన్ల మంజూరులో విధిస్తున్న షరతులకు నిరసనగా నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జాప్ విశాఖ ఆధ్వర్యంలో పాత్రికేయులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీర్తన్ మాట్లాడుతూ ఇప్పటికే ఏడాదిన్నరకు పైగా అక్రిడేషన్ కార్డులను పొడిగిస్తూ రావడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. పాత్రికేయులకు అక్రిడేషన్ కార్డుల మంజూరు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఒంటెద్దు పోకడలపై విరుచుకుపడ్డారు. ప్రధానంగా చిన్న పత్రికల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తూర్పారబెట్టారు. ఎక్కడ ప్రింటింగ్ డిక్లరేషన్ ఎక్కడ ఉంటే ఆ జిల్లాలో మాత్రమే అక్రిడేషన్లు మంజూరు చేసే యోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉమ్మడి జిల్లాలో గతంలో మంజూరు చేసినట్లుగానే ఈ ఏడాది అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరు చేసేందుకు విధి విధానాలు రూపొందిస్తే ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టుల సలహాలను తీసుకోవాలని కీర్తన్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాన్ని నిర్వహించే కార్యక్రమాలు, పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడంలో చిన్న పత్రికలు కీలకపాత్ర పోషిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాత్రికేయుల పట్ల నిర్లక్ష్యపు ధోరణి విడనాడాలన్నారు. అక్రిడేషన్ కార్డుల మంజూరులో అన్యాయం జరిగితే ఆందోళన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని కీర్తన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. జర్నలిస్టులను దారిద్యరేఖకు దిగువున ఉన్నవారిగా గుర్తించి వారికి ఇళ్ల స్థలాలు లేదా పక్కా గృహాలు మంజూరు చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పలు రాష్ట్రాలు ఇస్తున్న మాదిరిగా పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో జాప్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి జే వి కేఅప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

నామినేషన్‌కు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

పున్నమి ప్రతినిధి నిర్మల్ డిసెంబర్ 5: ముధోల్ మండలంలోని ముద్గల్ గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ పదవీకి పిరైవాడ్ లావణ్య విట్టల్ ఈ రోజు నామినేషన్ వేసారు.ప్రజలు నన్ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నారు.గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తా అని నామకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని.అలాగే నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని కొరారు.ఈ కార్యక్రమంలో నరేష్ అమృత్ సాయిచంద్ విట్టల్ మరియు తాడితరులు పాల్గొన్నారు

అన్నమయ్య

డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసు కార్యాలయ ప్రారంభంలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు

రాష్ట్రవ్యాప్తంగా నూతన డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసుల ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.చిత్తూరు జిల్లాలో డీడీవో కార్యాలయాన్ని స్వయంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.అదే తరహాలో రాజంపేట మండలంలో డివిజనల్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఐఏఎస్ వివిధ శాఖల అధికారులు,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాస రాజు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీనివాస రాజు గ్రామీణ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ చేపట్టిన నిర్ణయాలు ఎంతో దిశానిర్దేశకంగా ఉన్నాయి.గ్రామాల్లో రహదారులు,తాగునీటి సౌకర్యాలు,ఆరోగ్య సేవలు, అన్ని మౌలిక వసతులను మెరుగుపరుస్తూ ముందుకు సాగుతున్న ప్రభుత్వంలో భాగం అవ్వడం నా అదృష్టం. ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, మాజీ జెడ్పిటిసి షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూబకర్ మండెం,అల్లం సుబ్రహ్మణ్యం, శంకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం వారి కార్వింగ్ సందడి…..

ఇవాళ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం **ఫలాలు మరియు కూరగాయల చెక్కింత (కార్వింగ్) కార్యక్రమం** నిర్వహించింది. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ, వಾಟర్‌మెలన్‌తో అందమైన డిజైన్లు రూపొందించారు. టొమాటోలను ఉపయోగించి **హంసలు, నెమళ్లు** వంటి ఆకర్షణీయమైన ఆకృతులను తయారు చేశారు. ఈ పోటీలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, తమ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి.వి సుబ్రహ్మణ్యకుమార్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సైన్సు విద్యార్థులు ఫుడ్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్.A. అన్నపూర్ణ.. అధ్యాపకులు Ch. Gayathri, సిహెచ్ గాయత్రి తెహమేనా, T. కుందన పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.