E-పేపర్
ఏపీఎండిసి సంస్థ నందు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ & ట్రైనింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి!లేని పక్షంలో భారీ ఉద్యమానికి సిద్ధం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబుల్ పిలుపు రైల్వేకోడూరు డిసెంబర్ డిసెంబర్ పున్నమి ప్రతినిధి ఏపీఎండిసీ అవుట్ సోర్సింగ్ &ట్రైనీ కార్మికులను, రెగ్యులర్ చేయాలని, కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు జీవనోపాధిగా ఆధారపడుతున్న, వేలాది మందికి, జీవనోపాధిగా ఉన్న ఏపీఎండిసి సంస్థ ను పరిరక్షణ కోసం పోరాడాలని, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి ఓబుల్ గారు పిలుపునిచ్చారు. మంగళవారం, ఏపీఎండిసీ , కార్మికులతో, ఈరోజు ఉదయం ఏపీఎండీసీ నందు కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశం పోరాట కమిటీ జేఏసీ కన్వీనర్ ఆర్ వెంకటేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఓబులు గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం, ఉపాధి కోసం, ప్రజల అవసరాల కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పడిన ఏపీఎండీసీ సంస్థను నిర్వీర్యం చేసి వారి లాభాల కోసం, పాలకవర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. గత 17 సంవత్సరాలుగా సంస్థ కోసం ఇల్లు భూములు ఇచ్చిన, నిర్వాసితుల కార్మికులను గతంలో మాయమాటలు చెప్పి వారి ఇండ్లు, భూములు తీసుకుని వారిని రెగ్యులర్ చేయకుండా, అవుట్ సోర్స్&ట్రైనీ పేరుతో, దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టపకారం కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా యాజమాన్యం ఆపు చేయడం దుర్మార్గం అన్నారు. కార్మికులకు ఉపాధి కల్పించడానికి, సి అండ్ డి, కోటి టన్నుల నిలవలను ఏ గ్రేడ్ గా మార్చే బెనిఫిరికేషన్ ప్లాంట్ ను వెంటనే ఏపీఎండీసి సంస్థ ఏర్పాటు చేసి ఏపీఎండిసీ సంస్థ లో అవుట్ సోర్సింగ్ &ట్రైనీ కార్మికులుగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలన్నారు. చట్ట ప్రకారం ఇవ్వవలసిన గ్రాట్యూటీ ఇవ్వకుండా, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వకుండా, చనిపోయిన కార్మిక కుటుంబాలకు డెత్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయలు 8 మందికి చెల్లించకుండా, పెండింగ్ మెడికల్ బిల్లులను చెల్లించకుండా,మధ్యపానం సేవించారని సంవత్సరకాలంగా పక్కన పెట్టిన కార్మికులను ఉద్యోగంలోకి తీసుకోకుండా, ఏపీఎండీసీ యాజమాన్యం కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు, త్వరగా సమస్యలు పరిష్కరించకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి ఉద్యమాలు చేపడుతామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు. 140 సంవత్సరాల క్రితం సాధించుకున్న ఎనిమిది గంటల పనిని, 12 గంటల చేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఢిల్లీ రైతాంగ ఉద్యమస్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో సిఐటియు జాతీయ మహాసభలు ఈనెల 31 నుండి, జనవరి నాలుగో తేదీ వరకు, ఐదు రోజులపాటు, జరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా, అంతర్జాతీయం, గా ఉన్న కార్మిక నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు ఈ మహాసభలో ఏపీఎండిసి కార్మికుల సమస్యలపై తీర్మానం చేసి చర్చిస్తామని తెలియజేశారు. ఏపీఎండీసీ కార్మికులు, సంస్థ పరిరక్షణ కోసం, మరియు వారు చేసే పోరాటాలకు సిఐటియు రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ఇచ్చి వారి పోరాటంలో పాల్గొంటామని వారు యాజమాన్యం ను హెచ్చరించారి ఈ మహాసభల జయప్రదానికి ప్రతి ఒక్క కార్మికుడు తన వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్. ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్, జనరల్ సెక్రెటరీ, ఎం. శ్రీనివాసులు, వర్కర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ జ్యోతి నాగరాజు, జేఏసీ కో కన్వీనర్, అరుణావతి, మంగంపేట మైనింగ్ వర్కర్స్ యూనియన్, అధ్యక్ష కార్యదర్శులు, పులగంటి శ్రీనివాసులు, ముత్యాల శ్రీనివాసులు,ముఖ్య యూనియన్ నాయకులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.